Jump to content

SRI RAMA RAJYAM antey............


vasu4tarak

Recommended Posts

తెలుగు సినిమాకి పునర్వైభవం

 

 

భారీ ఎత్తున సినిమాలను తీయడమేకాదు అందులో విషయం కూడా ఉందా లేదా అనేది చూస్తున్నాడు తెలివైన సగటు ప్రేక్షకుడు. సినిమా నిర్మాణం అనేది ఈ రోజుల్లో కత్తిమీద సాములాంటిది. ఒక జూదం మాదిరిగా తయారయింది. ఇంత హంగామా చేసి సినిమా విడుదల చేయడం, దానికి ప్రచారం కల్పించడం సినిమా నిర్మాణం కన్నా కష్టసాధ్యమైపోయింది. తీరా అన్నీ ఏర్పాట్లు పూర్తిచేసుకుని విడుదల చేశాక పైరసీ సీడీలు మర్నాడే ప్రత్యక్షం అవుతున్నాయి. డిజిటల్‌ టెక్నాలజీతో దానిని కొంతవరకూ అరికట్టగలిగాము. ఇప్పుడు తాజాగా విడుదలయిన ‘దూకుడు’, ‘ఊసరవెల్లి’, ‘శ్రీరామరాజ్యం’ కలెక్షన్లు మళ్లీ భారీ చిత్ర నిర్మాతలకు కొత్త ఊపిరి పోశాయని చెప్పవచ్చు.

 

ఇదే ఊపు కొనసాగితే భవిష్యత్‌లో మరిన్ని భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని చెప్పవచ్చు. నిర్మాణ ఖర్చులు పెరిగిపోయి ఒక్కో సినిమాకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టవలసి వస్తోంది. అయితే అంత భారీ ఎత్తున ఒక సినిమాకు పెట్టుబడిగా పెట్టి తిరిగి రాబట్టగలమా అనే ప్రశ్నలకు ఇటీవల విడుదలైన పెద్ద సినిమాల కలెక్షన్లే చెబుతున్నాయి. అయితే ఊరికే భారీ సెట్టింగులు పెట్టి అనవసర ఖర్చులతో తీసిన సినిమాలు ప్రేక్షకుల ఆదరణకు నోచుకోక బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని నిర్మాత అందులో విషయం ఉందా లేదా అని ముందుగానే బలమైన కథ, సన్నివేశాలతో ప్రేక్షకులను మెప్పిస్తే అది భారీ చిత్రామా లేక చిన్న చిత్రమా అని ఆలోచనలేకుండా ప్రేక్షకులు వాటికి బ్రహ్మరథం పడతారు.

 

బాపు-రమణల అపురూప దృశ్యకావ్యంగా మలచబడిన ‘శ్రీరామరాజ్యం’ విడుదలై అఖండ విజయం సాధించడం ఇండస్ట్రీ గర్వించదగ్గ అంశం. ఈ రోజుల్లో పౌరాణికాలు చూస్తారా? అని విమర్శించిన వాళ్ల నోళ్లకు ఈ చిత్ర విజయం తాళం వేసింది. త్వరలో శ్రీరామరాజ్యం చిత్రాన్ని తమిళంలో డబ్‌ చేస్తున్నారని సమాచారం. ఇంత చక్కని చిత్రాన్ని ఏ భాషలోనైనా డబ్‌ చేసి విడుదల చేయవచ్చు. విదేశాలలో కూడా ఈ చిత్రానికి చక్కని స్పందలు వస్తున్నాయి. తెలుగుదనాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించగలిగే అద్భుత దృశ్యకావ్యం అందించిన నిర్మాత యలమంచిలి సాయిబాబు చిరస్మరణీయుడు అని తెలుగునాట ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘శ్రీరామరాజ్యం’ ఇచ్చిన సరికొత్త ప్రోత్సాహంతో మరికొన్ని తెలుగుదనం పరిమళించే తేటతెలుగు చిత్రాలను ఆదరిద్దాం. మళ్లీ గతించిపోయిన మన తెలుగుదనాన్ని తిరిగి మన చేతుట్లోకి తెచ్చుకుందాం.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...