Jump to content

chandra babu fire on Goverment@ Guntur


kethineni

Recommended Posts

రాష్ట్రంలో అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కరవుకోరల్లో నెట్టి రాక్షసానందాన్ని పొందుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. రైతు పోరుబాటలో భాగంగా చంద్రబాబునాయుడు చిలకలూరిపేట మండలంలోని కమ్మవారిపాలెం, గోవిందాపురం, కోమటినేనివారిపాలెం, కావూరు, లింగంగుంట్ల గ్రామాలమీదుగా 16కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బాబు పాదయాత్ర ప్రారంభించిన కమ్మవారిపాలెంలో వేలాదిమంది రైతులు ఆయనకు స్వాగతం పలికి ఆయనను అనుసరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు రైతులనుద్దేశించి మాట్లాడుతూ తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల నడుమ వ్యవసాయం సంక్షోభంలో పడినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై కనికరం లేకుండా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులు అష్టకష్టాలు పడుతుంటే ఎసి రూముల్లో భోగభాగ్యాలను అనభవిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పాలించే అర్హత లేదని అన్నారు. రైతుల వద్దకు వచ్చి కష్టసుఖాలు తెలుసుకుని, రైతుల కన్నీళ్లు తుడవాల్సిన సిఎం కుర్చీ కాపాడుకునేందుకు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ఏడున్నరేళ్ల పాలనలో 16వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. కేంద్రప్రభుత్వాన్ని రాష్ట్రం 42వేల కోట్ల రూపాయలు కరవు సాయం కోరితే 2 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాంగ్రెస్ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని 32మంది కాంగ్రెస్ ఎంపిలున్నా వారంతా దద్దమ్మలుగా తయారయ్యారని, రైతులు ముందుకువచ్చి నిలబడే అర్హత, ధైర్యం వారికి లేదన్నారు. స్వామినాథన్, హుడా కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా కేంద్రప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ఎంతోమంది ఆత్మహత్యలకు కారణమవుతోందని చంద్రబాబునాయుడు ఆరోపించారు. వరి, వేరుశనగ పంటలకు 10 వేలు, పత్తి, పొగాకు, మిర్చి పంటలు నష్టపోయిన బాధిత రైతులకు 20 వేల రూపాయల నష్టపరిహారాన్ని అందజేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులు రోడ్డెక్కి పోరాడాలని, సిగ్గుమాలిన అసమర్థ ప్రభుత్వంపై రైతులు తిరగబడాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ ఖర్చులు నానాటికీ పెరిగిపోతుంటే మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నాయని, రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి నెలకొన్నా పట్టించుకునే నాథుడే లేడని బాబు వాపోయారు. వ్యవసాయం లాభసాటిగా మారేవరకు తాము పోరాటం సాగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్నికలెప్పుడొచ్చినా కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని చంద్రబాబు రైతులకు పిలుపునిచ్చారు. కిరణ్ సర్కార్ రూపాయి బియ్యం పథకం అంటూ ఊరేగుతూ పురుగుల బియ్యాన్ని పేదలకు అందిస్తున్నారని ఆరోపించారు. పేదరికం లేని సమాజమే తన జీవతాశయమని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు చివరి రక్తపు బొట్టు వరకూ పోరాడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...