Jump to content

సర్కార్ చేతిలో సత్యసాయి ఆస్తుల చిట్టా


Recommended Posts

satya-sai-trust1308897428.JPG

 

* సీల్డ్‌ కవర్‌లో అందజేసిన ట్రస్టీలు

* ఆస్తులు - అప్పుల జాబితా రెడీ

* పరిశీలించిన తరువాత స్పందిస్తామన్న సర్కార్‌

 

అవినీతి ఆరోపణలతో సతమతమౌతోన్న సత్యసాయి ట్రస్ట్‌ సభ్యులు ఎట్టకేలకు ఆస్తుల చిట్టాను ప్రభుత్వానికి సమర్పించారు. పది రోజుల్లో ట్రస్టు ఆస్తుల జాబితాను అందజేయాలంటూ గత నెల 27న ప్రభుత్వం ఆదేశించటంతో ట్రస్టీలు స్పందించారు. ఎండోమెంట్‌ సెక్రటరీ కెవీ రమణాచారికి సీల్డ్‌ కవర్లో వివరాలు అందించారు.

 

ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో బాబా మరణించిన తరువాత సత్యసాయి ట్రస్టును చుట్టుముట్టిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. ట్రస్టు ఆస్తులను దొడ్డి దారిలో తరలిస్తున్నారంటూ ట్రస్టీలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. బాబా అశ్రమం నుంచి బెంగుళూరు తరలిస్తోన్న 35 లక్షలు పోలీసులకు పట్టుబడటం భక్తుల్లో అనుమానాలను మరింత పెంచింది. బాబా సంపదను దోచుకు తింటోన్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన బాటపట్టారు.

 

దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ప్రభుత్వం సత్యసాయి ఆస్తుల వివరాలను 10 రోజుల్లో ఇవ్వాలని ట్రస్టీలను ఆదేశించింది. గత 4 దశాబ్దాలుగా ప్రభుత్వ జోక్యాన్ని ఎరుగని ట్రస్టీలు ఆస్తుల వివరాలు అందివ్వక తప్పలేదు. ట్రస్టుకు సంబంధించిన ఆస్తులు, అప్పులు, డిపాజిట్లు, ఖర్చులు తదితర ఆర్ధిక వివరాలను ప్రభుత్వానికి సమర్పించారు. ట్రస్టు కార్యకలాపాలన్నీ పారదర్శకంగానే జరుగుతున్నాయని అందులో చెప్పుకొచ్చారు.

 

ట్రస్టుకు సంబంధించి కీలక హోదాల్లో ఉన్న వారి వివరాలను కూడా ప్రభుత్వానికి అందజేశారు. అయితే.. ట్రస్టు సభ్యులు అందించిన వివరాలను పరిశీలించిన తరువాత ప్రభుత్వం స్పందిస్తుందని దేవాదాయశాఖ సెక్రటరీ రమణాచారి అంటున్నారు. అయితే.. ట్రస్టీలు సమర్పించిన బ్యాలెన్స్‌ షీట్‌పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది.

 

ట్రస్టీలు చెప్పిన లెక్కలకు సర్కార్‌ ఓకే చెబుతుందా..? లేక లెక్కల నిగ్గు తేల్చేందుకు ట్రస్ట్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందా అనే విషయం సస్పెన్స్‌గా మారింది. మరోవైపు ట్రస్టీలు సమర్పించిన జమా ఖర్చుల నివేదిక వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చెయ్యాల్సిందే..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...