Jump to content

నారా రోహిత్‌ మరో చిత్రం


Cyclist

Recommended Posts

 

బాణం’ ఫేం నారా రోహిత్‌ హీరోగో సినిమా ఫిబ్రవరి 13న ప్రారంభం కానుంది. ‘యువత’, Nara.jpg‘ఆంజనేయులు’ చిత్రాల దర్శకుడు పరశు రామ్‌(బుజ్జి) ఈ సినిమాకి దర్శకుడు. ‘ఎస్‌.వి.కె సినిమా’ పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతదర్శకుడు. ఈ చిత్రం ప్రారంభ ప్రకటన సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వంశీ పైడిపల్లి, నారా రోహిత్‌, పరశురామ్‌, వంశీ కృష్ణ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి బేనర్‌ లోగో ఆవిష్కరించారు. అనంతరం నిర్మాత మాట్లాడుతూ ‘వైజాగ్‌ నా స్వస్థలం. షిప్పింగ్‌ రంగం నుంచి సినిమా ఆసక్తితో ఇక్కడికొస్తున్నా.

 

ఇది నా తొలి సినిమా. పరశురామ్‌ చెప్పిన కథ నచ్చింది. ఫిబ్రవరి 13న అన్నపూర్ణ స్టూడియోలో సినిమా ప్రారం భమౌతుంది. మార్చి 1నుంచి వైజాగ్‌లో తొలిషెడ్యూల్‌ జరుగుతుంది. రెండో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ఉంటుంది.చక్కని ప్రేమకథతో ఆకట్టుకునే సినిమా ఇది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇది 3వ ప్రయత్నం. రోహిత్‌ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తిండిపోయే సినిమా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా’ అన్నారు. రోహిత్‌ మాట్లాడుతూ ‘మంచి స్క్రిప్టు కోసం ఒకటిన్నరేళ్లుగా ఎదురు చూశా. బుజ్జి కథ నచ్చింది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంటుంది’ అన్నారు.

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...