Jump to content

నా రియల్‌లైఫ్‌కు దగ్గరగా ఉన్న ‘కత్తి


VRS@Tarak

Recommended Posts

KATHI16_11_10_0562.jpg

 

సినిమా సినిమాకు వైవిధ్యాన్ని చూపెట్టాలని తపనపడుతున్నారు కథానాయకుడు నందమూరి కళ్యాణ్‌రామ్. అందుకు తగ్గట్టుగానే కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు ఈ యువ హీరో. ఆ ఆశయంలో భాగంగా తాజాగా ఓ విభిన్నమైన కథాంశంతో పదునైన ‘కత్తి’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కళ్యాణ్‌రామ్. ఇటీవల విడుదలైన ఈ కత్తితో తను ఎలా రణం సాగించాడో ‘సాక్షి’కి వివరించారు కళ్యాణ్‌రామ్. ఆ విశేషాలు ...

ఆ కొత్తదనమే నచ్చింది...

 

మొదట్నుంచీ ఈ సినిమాపై మాకున్న నమ్మకమే నేడు నిజమైనందుకు ఆనందంగా వుంది. ఇప్పటి వరకు నేను చేసిన చిత్రాల్లోకి పూర్తి భిన్నమైన కథాంశంతో, సరికొత్త కేరక్టరైజేషన్‌తో చేసిన సినిమా ఇది. అంచనాలకు మించిన స్పందన ప్రేక్షకుల నుంచి లభిస్తోంది. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించడం సంతోషంగా వుంది. కథా రచయిత వంశీ, దర్శకుడు మల్లి ఇద్దరూ వచ్చి నాకు ఈ కథ చెప్పినప్పుడు సింగిల్ సిట్టింగ్‌లో ఓకే చేశాను. అంతగా నన్ను ఈ కథ ఆకట్టుకుంది.

 

ఇప్పటి వరకు అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో వచ్చిన ఏ చిత్రం కూడా ఫెయిల్ కాలేదనే సెంటిమెంట్ కూడా నన్ను ఈ సినిమా చేయడానికి కారణమైంది. ముఖ్యంగా ఇప్పటి వరకు అన్నాచెల్లెళ్ళ నేపథ్యంలో ఎన్ని కథలు వచ్చినా ఈ చిత్రంలో సమ్‌థింగ్ స్పెషల్ వుందనిపించింది. ఇలాంటి కథలో వుండే చెల్లెలు సమస్య ఈ చిత్రంలో కొత్తగా అనిపించింది. ఆ సమస్యను అన్నయ్య పరిష్కరించే విధానం కూడా కొత్తగా అనిపించి ఈ చిత్రాన్ని చేశాను. నా నిజజీవితానికి దగ్గరగా వుండే పాత్రను ఈ చిత్రంలో చేశాను. ఇక ఈ చిత్రాన్ని చూసిన అభిమానులు కత్తి లాంటి సినిమా చేశారు అని అభినందిస్తున్నారు.

 

‘డాన్స్‌లు ఇరగదీశావ్’ అన్నాడు తారక్

 

ఈ చిత్రాన్ని చూసిన తమ్ముడు తారక్ (ఎన్టీఆర్) ‘అన్నయ్యా..! డాన్స్‌లు ఇరగదీశావ్, ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు’ అన్నప్పుడు ఎంతో సంతోషంగా అనిపించింది. అంతేకాదు.. సెకండాఫ్‌లో మరో పవర్‌ఫుల్ డైలాగ్ పెట్టి వుంటే బాగుండేది అనే సలహాను కూడా ఇచ్చాడు. ఇటీవల ఓ అభిమాని... బాలయ్య ‘సింహా’, ఎన్టీఆర్ ‘బృందావనం’ ఇప్పుడు మీ ‘కత్తి’ హిట్ అయ్యాయి. ఈ 2010 నందమూరి నామ సంవత్సరంగా చెప్పుకొవచ్చు అనగానే హ్యాపీగా అనిపించింది. ముఖ్యంగా ఈ చిత్రం విషయంలో కమర్షియల్ సక్సెస్‌తో పాటు నటుడిగా కూడా మంచి సంతృప్తి లభించింది. ప్రతి ఒక్కరూ ఈ చిత్రంలో మీ నటన బాగుంది అంటున్నారు.

రిస్క్ చేయడం ఇష్టం

 

‘వరుసగా మీ సొంత బేనర్‌లోనే సినిమాలు ఎందుకు చేస్తున్నారు? అని...’ నన్ను ఈ మధ్య కొందరు అడిగారు. నాకు బయటి సంస్థల నుంచి మంచి ఆఫర్లే వస్తున్నాయి. కానీ నాకు నచ్చిన కథతో, బడ్జెట్ పరిమితులు లేకుండా చేయాలంటే నా సంస్థలోనే చేయడం కరెక్ట్ అనిపిస్తుంది. అనవసరంగా వేరే నిర్మాతలను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రిస్క్ అనుకున్న ప్రాజెక్ట్‌లను నా సంస్థలోనే చేస్తున్నాను. అందులో ఒకటి, రెండు చిత్రాలు కమర్షియల్‌గా పే చేయకపోయినా అన్ని సినిమాలు నటుడిగా, నిర్మాతగా నాకు సంతృప్తినే ఇచ్చాయి. ఇక నా తదుపరి చిత్రం తప్పకుండా బయటి సంస్థలోనే వుంటుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన కథా చర్చలు కూడా కొనసాగుతున్నాయి. వాటి వివరాలను త్వరలోనే తెలియజేస్తాను.

Link to comment
Share on other sites

  • 4 weeks later...
  • 5 months later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...