Jump to content

సీఎం రోశయ్య తుమ్మితే ఊడే ముక్కు లాంటి వారు: అంబటి


Sravanlokesh

Recommended Posts

గుంటూరు: కడప ఎంపీ వైయస్ జగన్ కే ప్రాంతాలకు అతీతంగా పార్టీని ఏకతాటిపై నడిపించే సత్తా ఉందని కాంగ్రెసు బహిష్కృత నేత అంబటి రాంబాబు అన్నారు. రోశయ్యను తప్పించి జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే భ్రమలో తాము లేమని ఆయన చెప్పారు. 2014వరకు మాత్రం ముఖ్యమంత్రిగా రోశయ్య ఉండబోరని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కె రోశయ్య తుమ్మితే ఊడే ముక్కు అని అంబటి వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పుడే ముఖ్యమంత్రి మార్పు ఉండదని, డిసెంబర్ 31వ తేదీన శ్రీకృష్ణ కమిటీ నివేదికను బట్టి మార్పులు ఉంటాయని ఆయన మీడియా సమావేశంలో అన్నారు. కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతగల కార్యకర్తగా సుదీర్ఘకాలం పనిచేసిన చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పీసీసీ క్రమశిక్షణ సంఘం సస్పెండ్ చేయడం, పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసి బయటకు నెట్టడం వెనుక కొందరు పెద్దల కుట్ర దాగుందని ఆయన అన్నారు. జగన్ వ్యతిరేకవర్గంగా ఏర్పడిన వీహెచ్ హనుమంతరావు, కె.కేశవరావు, మధుయాష్కీ, డీఎస్ తదితరుల కుట్ర ఫలితంగానే భాస్కరరెడ్డిపై చర్యలు చేపట్టినట్లు తెలుస్తోందన్నారు.

 

ఓదార్పుపై ఏఐసీసీ స్పందించకున్నా, పీసీసీ మాత్రం దివంగత వైఎస్‌ఆర్‌ను స్మరిస్తున్న నేతలను, జగన్‌కు తోడుగా ఉంటున్న వారిని ప్రత్యేకంగా వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. గ్రూప్-1 పరీక్షలప్పుడు ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఉద్యమకారులతో కలిసి కళాశాలల్లోకి దౌర్జన్యంగా వెళ్లి పేపర్‌లను బయటకు తేవడం ప్రభుత్వ వ్యతిరేక చర్య కాదా..? అని ఆయన అంబటి ప్రశ్నించారు. ఎంపీ మధుయాష్కీ నేరుగా గవర్నర్‌పై విమర్శలు చేసినా, రాష్ట్రపార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీపై దామోదర్‌రెడ్డి ఆరోపణలు చేసినా అధిష్టానం మౌనం వహించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సొంత పార్టీ మంత్రి పొన్నాలపైనే అవినీతి ముద్ర వేస్తూ గవర్నర్‌ను కలిసిన వారిపై కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు చర్యలు చేపట్టదని నిలదీశారు. అధిష్టానం చెవులు పెద్దవి, కళ్లు చిన్నవిగా చేసుకుని వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. ఏఐసీసీ ప్లీనరీకి మారెప్ప, కొండా సురేఖలకు ఆహ్వానం పంపకపోవడంలో వ్యూహం నడిపిన పెద్దలెవరో తమకు తెలుసన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...