Jump to content

ముఖ్యమంత్రిని మార్చాల్సిందే: సీమాంధ్ర ఎంపీల నివేదిక!


Sravanlokesh

Recommended Posts

రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను మార్చాల్సిందేనని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పార్లమెంట్ సభ్యులు పార్టీ అధిష్టానానికి కోరినట్టు సమాచారం. ఇందుకోసం వారు ఒక రహస్య నివేదికను సైతం ఇచ్చినట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

 

బహుళార్థసాధక ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే వ్యవహారంపై బుధవారం రాత్రి న్యూఢిల్లీలో సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం జరిగింది. రాజ్యసభ సభ్యుడు జేడీశీలం నివాసం దీనికి వేదికగా నిలిచింది. ఇందులో పాల్గొనేందుకు పలువురు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు వచ్చినప్పటికీ.. వారు సమావేశం ప్రారంభానికి ముందే వెళ్లిపోయారు.

 

కానీ, ఇదే ప్రాంతానికి చెందిన కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు నంది ఎల్లయ్య, ఎం.ఎ.ఖాన్‌‌లు మాత్రం ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ పరిణామం తెలంగాణ ఎంపీలకు ఆందోళన కలిగించింది. ఇందులో పోలవరం అంశంతో పాటు రాష్ట్ర పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. ప్రధానంగా ముఖ్యమంత్రి మార్పుపై ఎక్కువ చర్చించినట్టు వినికిడి.

 

డిసెంబరు 31వ తేదీ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు శాంతియుతంగా ఉండాలన్నా.. అన్ని సమస్యలు చక్కబడాలన్నా రోశయ్యను మార్చడమే ఏకైక మార్గమని పలువురు ఎంపీలు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. అదేసమయంలో రోశయ్య వారసునిగా వివాదాస్పద నేతగా ముద్రపడిన కేంద్ర మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి పేరును ప్రతిపాదించేందుకు సీమాంధ్ర ఎంపీలంతా అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.

 

అందుకే తెలంగాణ ఎంపీలు ఎవరూ కూడా హాజరుకాకపోయినప్పటికీ.. జైపాల్ రెడ్డి మాత్రం ఈ సమావేశానికి హాజరయ్యారు. తద్వారా తాను అన్ని ప్రాంతాలకు చెందిన వ్యక్తినని రుజువు చేశారు. ఇదే అంశంపై పార్టీ హైకమాండ్‌కు సీమాంధ్ర మంత్రులు ఒర రహస్య నివేదికను సమర్పించినట్టు తెలుస్తోంది.

 

ఇందులో రాష్ట్ర పరిస్థితులు చక్కబడాలంటే ముఖ్యమంత్రిని మార్చడమే ఏకైక మార్గమని వారు అందులో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. పేరుకుమాత్రం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధన అంశంపై సమావేశమైనప్పటికీ ఇది పూర్తిగా రాష్ట్ర పరిస్థితులపై సమీక్ష జరిపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...