నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో ఇటు వెండితెరపైనా.. అన్‌స్టాపబుల్ షోతో అటు ఓటీటీ వేదికపైనా అదరగొట్టేస్తున్నారు. తనకు ఎదురే లేదన్నట్లుగా దూసుకెళ్తున్నారు. అయితే ఇన్నేళ్లలో తన తండ్రి ఎన్టీఆర్, సోదరుడు హరికృష్ణతో తప్ప మరే ఇతర హీరోలతో కలిసి తెర పంచుకోని ఆయన.. ఇప్పుడు తొలిసారి ఓ పరభాషా కథానాయకుడితో కలిసి సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జైలర్ 2’. ఇది వీళ్లిద్దరి కలయికలోనే రూపొందిన విజయవంతమైన సినిమా ‘జైలర్’కు సీక్వెల్‌గా సిద్ధమవుతోంది. దీంట్లోనే బాలయ్య ప్రత్యేక పాత్రలో కనువిందు చేయనున్నట్లు సమాచారం. సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో వచ్చే తన పాత్ర కథకు కీలకంగా నిలవనుందని.. ఆయనకు రజనీకి మధ్య వచ్చే సీక్వెన్స్ ఆకర్షణగా నిలవనుందని ప్రచారం వినిపిస్తోంది. బాలయ్య త్వరలోనే ఈ చిత్ర సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది