బందరు పోర్టుకు భూమిని సమీకరించడానికి త్వరలోనే నోటిఫికేషన్
15 మంది డిప్యూటీ కలెక్టర్ల నియామకం
మచిలీపట్నం పోర్టుకు అవసరమైన 12 వేల ఎకరాల భూమిని సమీకరించడానికి త్వరలోనే నోటిఫికేషన జారీ చేయనున్నట్లు బీసీ సంక్షేమం, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. రెండు నెలల్లో భూ సమీకరణ పూర్తి చేసి నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని సోమవారం హైదరాబాద్‌లో చెప్పారు. 15 మంది డిప్యూటీ కలెక్టర్లను దీని కోసం కేటాయించామని ఆయన తెలిపారు.
మచిలిపట్నం పోర్టుకు అవసరమైన 12 వేల ఎకరాల భూమిని సేకరించడానికి త్వరలోనే నోటిఫికేషన జారీ చేయనున్నట్లు బీసీ సంక్షేమం, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, రెండు నెలల్లో భూసేకరణ పూర్తిచేసి నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. 15 మంది డిప్యూటీ కలెక్టర్లను దీనికోసం కేటాయించామన్నారు.
మచిలిపట్నం రేవును కంటైనర్ పోర్టుగా అభివృద్ధి చేయడానికి సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను తయారుచేసి ఇప్పటికే పోర్టు అథారిటీకి సమర్పించామన్నారు. ఆఽధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నవ యుగ సంస్థ ఈ పోర్టు నిర్మాణ పనులను చేపడుతుందన్నారు. దుబాయ్‌లోని జభలాలీ పోర్టును పరిశీలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అలీ అండ్ సన్స్ ఆఫ్ షోర్ మెరైన సాంకేతిక నిపుణుల బృందంతో సమావేశమై పలు అంశాలను చర్చించినట్లు తెలిపారు.
పోర్టు నిర్మాణం, నౌకల తయారీ, మరమ్మతులు, జెట్టీల నిర్మాణం, షిప్ లిప్ట్‌లు, ఎగుమతులు, మెరైన సర్వీసులు తదితర అంశాలకు సంబంధించి వారి సహాయ సహకారాలను కోరామని చెప్పారు. త్వరలోనే వారు ఇక్కడకు వచ్చి మచిలీపట్నం పోర్టును సందర్శించనున్నారని మంత్రి వెల్లడించారు.