Search the Community
Showing results for tags 'amtz'.
-
ఏపీ సిగలో కలికితురాయి.. విశాఖ పార్క్ దేశంలోనే తొలిసారి వైద్యపరికరాల తయారీ కేంద్రం 75 నుంచి వందలోపు సంస్థలు వచ్చే అవకాశం వైద్య పరికరాల ధరలు తగ్గే అవకాశం ఈనాడు - హైదరాబాద్ వైద్య పరికరాల తయారీ పార్క్ ఆంధ్రప్రదేశ్ సిగలో కలికితురాయిగా మారనుంది. ఇప్పటివరకూ వివిధ రకాల వస్తు తయారీకి వేదికగా ఉన్న ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలిసారి వైద్యపరికరాల తయారీ కేంద్రంగా అవతరించనుంది. విశాఖ సమీపంలో సుమారు 200 ఎకరాల్లో నిర్మించనున్న దీనికి జూన్‌లో శంకుస్థాపన చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 75 నుంచి వందలోపు పరికరాల తయారీ సంస్థలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అనంతపురంలో ఎలక్ట్రానిక్స్ అనుబంధ వైద్య పరికరాల తయారీకి ప్రత్యేకంగా పార్కు రానుంది. ఈ రంగానికి సంబంధంలేని పరికరాలు విశాఖలో ఏర్పడబోయే పార్కులో తయారుకానున్నాయి. ఇప్పటివరకూ దేశంలో ఇలాంటి పరిశ్రమ లేనందున వైద్య పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీనివల్ల వైద్యసేవల ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. రోగులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో తొలిసారి విశాఖపట్నం సమీపంలో వైద్య పరికరాల తయారీ పార్క్‌ను రూపొందించేందుకు ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ఈ సమయంలోనే 50 కంపెనీలు విశాఖకు వచ్చేందుకు ఆసక్తి చూపాయి. భారీ మూలధనంతో ముడిపడిన ఈ పార్క్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే దేశీయంగా వైద్య పరికరాల ధరలు 40-50% తగ్గుతాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ‘ఈనాడు’కు తెలిపారు. దీనివల్ల రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ దేశంలో వైద్య పరికరాల తయారీ కేంద్రం లేనందున ఏ చిన్న పరికరం కావాలన్నా విదేశాలవైపే చూడాల్సి వస్తోంది. రైలు, రోడ్డు, జల, వాయుమార్గాలు అందుబాటులో ఉన్న విశాఖపట్నంలో ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నందున భవిష్యత్తులో ఇక్కడి ఉత్పత్తుల రవాణా ఖర్చుకూడా తగ్గనుంది. విశాఖ జిల్లాలో 200 ఎకరాల్లో పార్కు రూపొందనుంది. ఒక్కో తయారీ సంస్థకు ప్రభుత్వం ఒకటి నుంచి రెండెకరాల స్థలాన్ని కేటాయించనుంది. దేశానికే తలమానికం కానున్న ఈ పార్కులో 50 ఎకరాల్లో 1.కాంపొనెంట్ టెస్టింగ్ సెంటర్ 2. ఎలెక్ట్రో-మాగ్నెటిక్ ఇంటర్‌ఫేస్ లేబోరేటరీ 3. మెడికల్ గ్రేడ్ లోవాక్యూమ్ మోల్డింగ్, కేబినెట్ మోల్డింగ్, ఇంజెక్షన్ మోల్డింగ్ సెంటర్స్ 4. 3డీ డిజైనింగ్ అండ్ ప్రింటింగ్ 5. స్టెరిలైజేషన్ అండ్ టాక్సిసిటీ టెస్టింగ్ సెంటర్ 6. రేడియేషన్ టెస్టింగ్ సెంటర్ 7. గామా ఇర్రేడియేషన్ 8. రాపిడ్ ప్రొటోటైపింగ్ సెంటర్ 9. ఇండస్ట్రియల్ ఆర్ అండ్ డీ సెంటర్ 10. ఇంక్యుబేషన్ సెంటర్ 11. వేర్‌హౌసింగ్ 12. రెగ్యులేటర్ ఆఫీస్ 13. వైద్యపరికరాల తయారీకి అవసరమైన ఇతర ఉమ్మడి సౌకర్యాల్ని కల్పించనున్నారు. 200 ఎకరాల భూ అభివృద్ధి, ఉమ్మడి అవసరాలకు అనువైన భవనాల నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక ప్రయోజన వాహకం (స్పెషల్ పర్పస్ వెహికిల్) ద్వారా చూసుకుంటుంది. ఇందులో ఏర్పాటు చేసే వ్యక్తిగత యూనిట్లకయ్యే ఖర్చునంతా ఆయా సంస్థలే భరిస్తాయి. ఈ పార్కు ఏర్పాటుకు సంబంధించిన పాలకమండలి డైరెక్టర్ల సమావేశం ఈ నెల 18న విజయవాడలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ తరువాత నుంచి క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.