Jump to content

Koduri

Members
  • Posts

    9,060
  • Joined

  • Last visited

  • Days Won

    1

Everything posted by Koduri

  1. లోకేష్‌ జనాధారణకి వారి చిర్నవ్వుల్లే సాక్ష్యం టిడిపి యువనేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర 174వ రోజున 2,300 కిమీ మైలురాయికి చేరుకొంది. ఈ సందర్భంగా నారా లోకేష్‌ వినుకొండ నియోజకవర్గంలోని కొండ్రముట్ల బొల్లాపల్లి మండలంలో శిలాఫలకం ఆవిష్కరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరికపూడిశెల ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టుని పూర్తిచేస్తానని నారా లోకేష్‌ ఇచ్చిన హామీని దానిలో వ్రాయించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పల్నాడు జిల్లాలో సుమారు 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. త్రాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బొల్లాపల్లి మండలవాసులకు ఆ సమస్య కూడా శాస్వితంగా పరిష్కారం అవుతుంది. నారా లోకేష్‌ పాదయాత్రలో వృద్ధులు, మహిళలు, రైతులు… ఇలా అన్ని వర్గాల ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు. వినుకొండలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఓ చోట వృద్ద మహిళలు నిలబడి ఉండటం చూసి నారా లోకేష్‌ వారివద్దకు వెళ్ళి ఆప్యాయంగా పలకరించగా, వారిలో ఓ వృద్ధురాలు నారా లోకేష్‌ చేతిమీద ముద్దుపెట్టుకొని ఆశీర్వదించింది. నారా లోకేష్‌ వారి సమస్యలు అడిగి శ్రద్దగా విని వారు చెప్పిన కొన్ని విషయాలను నోట్ చేసుకొన్నారు. మరోచోట గ్రామీణ మహిళలు ఆయనకు ఎదురేగి కల్మషం లేని చిర్నవ్వులతో స్వాగతం పలికారు. ఎప్పటిలాగే వారిలో చాలా మంది నారా లోకేష్‌ చేతులు పట్టుకొని ఆప్యాయం మాట్లాడుతుండగా, నారా లోకేష్‌ అక్కడే ఉన్న ఓ మహిళ చేతిలో పిల్లాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ‘మీ అబ్బాయిని నాతో తీసుకుపోతున్నా…’ అంటూ ఆ బాబు చేత తల్లికి టాటా చెప్పిస్తుంటే, ఆమెతో సహా అక్కడున్న మహిళలందరూ కూడా ఆనందంతో మురిసిపోతూ ‘అలాగే..’ అన్నట్లు చేతులు ఊపి టాటా చెప్పారు. ఆ పసిపిల్లాడు ఒక్క క్షణంలోనే నారా లోకేష్‌ భుజం మీద ఆదమరిచి నిద్రపోతుండటం చూసి ఆ పిల్లాడి తల్లి, అక్కడున్న మహిళలు మనసారా నవ్వుకొన్నారు. కొందరు ఆ అపురూప దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసుకొన్నారు. నారా లోకేష్‌ చాలా కాలంగా రాజకీయాలలో ఉన్నారు కనుక రాష్ట్ర ప్రజలందరికీ ఆయన సుపరిచితుడే. కానీ ఆయన గురించి ప్రజలకు తెలిసింది చాలా తక్కువ. యువగళం పాదయాత్ర ప్రారంభించిన తర్వాతనే నారా లోకేష్‌ పరిపూర్ణ వ్యక్తిత్వం ఆవిష్కృతమైంది. అన్ని వర్గాల ప్రజల ఆదరణ, ఆప్యాయత, ఆయనపై వారి నమ్మకం చూస్తున్నప్పుడు నారా లోకేష్‌ ప్రజల మనసులలో ఎంతగా చోటు సంపాదించుకొన్నారో అర్దవుతోంది. ఈ చిన్న వీడియో క్లిప్ చూస్తే ఓ రాజకీయ నాయకుడికి ఇంతకంటే గొప్ప గౌరవం ఏముంటుందని అనిపించకమానదు.
  2. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర చరిత్ర సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో జరుగుతున్న పాదయాత్ర ఊహించని ప్రజాదరణతో సాగుతోంది. నియోజవర్గంలో ఓటర్లలో సగం మంది లోకేష్ పాదయాత్రకు తరలి రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ అద్దంకిలో అది కనిపించింది. కుప్పంలో ప్రారంభమైనప్పుడు … లోకేష్ పై చాలా మంది వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ , పోలీసులు ఆటంకాలు, వైసీపీ సోషల్ మీడియా ప్రచారాలు చేసి … పాదయాత్ర ఎప్పుడైనా ఆపేస్తారేమోనన్న అనుమానం కూడా కల్పించారు. జనం లేనే లేరనే ప్రచారాల సంగతి చెప్పాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు పాదయాత్ర జరుగుతున్న విధానం చూసి.. కామెంట్లు చేసిన వారంతా నాలిక్కరుచుకుంటున్నారు. లోకేష్ పాదయాత్ర సందర్భంగా సెల్ఫీల కార్యక్రమం పెట్టుకున్నారు. ఆయనతో సెల్ఫీలు దిగడానికి… కనీసం వెయ్యి మంది క్యూలో ఉంటున్నారంటే అది చిన్న క్రేజ్ కాదు. పైగా అంత సేపు ఓపికగా సెల్ఫీలు ఇవ్వడం అంటే. .. యువనేత సహనానికి సాక్ష్యంగా మారింది. పక్కా స్ట్రాటజీలతో … వ్యూహాత్మకంగా పాదయాత్ర చేస్తున్నారు. అన్ని వర్గాలను కలిసేందుకు వారికి భ రోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ నేతలు లోకేష్ పాదయాత్రను సీరియస్ గా తీసుకున్నారు. నిజానికి లోకేష్ పార్టీ అధ్యక్షుడు కాదు.. సీఎం అభ్యర్థి కాదు. అయినా సరే.. ఆయన పాదయాత్రకు ఈ రేంజ్ లో స్పందన రావడం టీడీపీ నేతల్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది. స్టాన్ ఫర్డ్ లోకేష్… నీట్ షేవ్ లోకేష్ ను చూపించి.. బాగా చదువుకున్నోడు.. ఏపీ రాజకీయాల్లో ఇమడలేడు.. ఇక్కడంతా రౌడీయిజమే నడుస్తుందన్న అభిప్రాయాన్ని కొంత మార్చారు.. తాను కొంత మారాడు. లోకేష్ వేషభాషలు మారాయి. మాటకు మాట సమాధానం ఇస్తున్నారు. ఆయనకు ఉన్న సబ్జెక్ట్ గురించి అందరికీ స్పష్టత వచ్చింది. జగన్ రెడ్డికి .. కనీసం నమస్కారం అనే మాట కూడా సొంతంగా చెప్పలేని పరిస్థితి వచ్చింది. కానీ లోకేష్ .. లోతైనా సబ్జెక్ట్స్ నుంచి చూడకుండా మాట్లాడుతున్నారు. అందరికీ వివరణ ఇస్తున్నారు. ఆయన కు విషయ పరిజ్ఞానం సామాన్యులను ఆశ్చర్య పరుస్తోంది. కాలానికి తగ్గట్లుగా మారే నాయకుడ్ని చూస్తున్నారు. వైసీపీ నేతలకు మాటలతో సమాధానం ఇస్తున్నారు. రాజకీయ వ్యూహాల ప్రకారం స్పందిస్తున్నారు. ఈ ఆరు నెలల్లో … ఓటర్లు ఓట్లేసిన మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో భారీ విజయం సాధించారు. ఆ ఉత్సాహంతో.. యువగళం మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. ముందు ముందు చరిత్రలో నిలిచిపోయే పాదయాత్రల్లో ఒకటిగా మిగిలే అవకాశం కనిపిస్తోంది.
×
×
  • Create New...