Jump to content

rk09

Members
  • Posts

    1,461
  • Joined

Everything posted by rk09

  1. Matchumarri - almost dead storage level lo kuda lift cheyyotchu - into KC canalBut only two pumps - 350 or 700 cusecs
  2. బొట్టు బొట్టూ కీలకమే.. కృష్ణా డెల్టాను ఆదుకుంటున్న పట్టిసీమ ఇప్పటికే 15 టీఎంసీల నీరు ఎత్తిపోత ఇక.. వరుణుడిపైనే భారం భారీవర్షాల హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు ఈనాడు, అమరావతి గత రెండేళ్ల నుంచి డెల్టా రైతులను ఆదుకుంటున్న పట్టిసీమ జలాలు.. ఈ సారి కూడా అక్కరకొస్తున్నాయి. కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతంలో ఎక్కడా చుక్క నీరు లేదు. కృష్ణా డెల్టా పరిధిలోని నాలుగు జిల్లాల రైతాంగానికి సాగునీటి భరోసా ఇచ్చేందుకు గత ఏడాది చివరలో ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. తుపాన్లు వచ్చే సరికి ఇంటికి దిగుబడులు తెచ్చుకునేందుకు దీని వల్ల అవకాశం కలుగుతుంది. గోదావరి నదిలో 14 అడుగులు పైన ఉన్న నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు ఎత్తిపోస్తున్నారు. గోదావరిలో పుష్కలంగా నీరు ఉండడంతో వాటిని 24 మోటార్ల ద్వారా నీటిని కృష్ణా బ్యారేజీకి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా జూన్‌లోనే ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేశారు. 26న తూర్పు కాలువకు, 28న.. పశ్చిమ కాలువకు నీటిని వదిలారు. ఫలితంగా 13 లక్షల ఎకరాలకు నీరు ముందుగానే అందుతోంది. దీంతో రైతులు నాట్లు వేసుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటి వరకు డెల్టా పరిధిలో ఎక్కడా సరిగా వర్షాలు పడకపోవడంతో ఆందోళన నెలకొంది. రెండు రోజుల్లో భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ విభాగం అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానిక వాగుల నుంచి ఇన్‌ఫ్లో ఎంత వచ్చే అవకాశం ఉందో పరిశీలిస్తున్నారు. ఒకవేళ వర్షాలు ఆశించిన మేర పడకపోతే ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. వెలవెలబోతున్న జలాశయాలు కృష్ణా పరివాహక ప్రాంతంలోని జలాశయాలు వెలవెలబోతున్నాయి. జులై, 16 వచ్చినా ఇంతవరకు చిరుజల్లులు మినహా.. భారీ వర్షాల జాడే లేదు. ఈ ప్రభావం బ్యారేజీకి వచ్చే ఇన్‌ఫ్లోపై పడుతోంది. ఎగువున ఉన్న ప్రాజెక్టులు వట్టిపోతున్నాయి. ఖరీఫ్‌కు సాగునీరు ఇవ్వాలంటే.. కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి 700 టీఎంసీల మేర వరద నీరు వస్తేనే సాధ్యమవుతుంది. తాజా గణాంకాలను పరిశీలిస్తే.. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,705 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,682.09 అడుగులు ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 1,700.13 అడుగులు ఉంది. పులిచింతల 175 అడుగులు. ప్రస్తుతం 114.17 అడుగుల మేర నీటి మట్టం ఉంది. గత ఏడాది ఈ సమయానికి 113.35 అడుగుల మేర నమోదైంది. నాగార్జున సాగర్‌ నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 501 అడుగులు, గత సంవత్సరం 503.9 అడుగులు ఉంది. నారాయణపూర్‌లో పూర్తి నీటి మట్టం 1,615 అడుగులు కాగా.. ఇప్పటికి 1,593.77 అడుగులు ఉంది. గత ఏడాది 1,597.6 అడుగులు నమోదైంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 779.4 అడుగులు ఉంది. గతేడాది ఇదే సమయానికి 788.4 అడుగులు ఉంది. ఇలా ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లో ఈసారి కంటే గత సంవత్సరమే మెరుగైన నిల్వలు ఉన్నాయి. కీలకమైన తరుణమిదే.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ చివరి ఆయకట్టు భూములకూ సాగునీటిని ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మొత్తం 24 మోటార్ల ద్వారా రోజుకు 3,500 క్యూసెక్కుల మేర నీటిని బ్యారేజీకి ఎత్తిపోస్తున్నారు. తిరిగి అక్కడి నుంచి కేఈబీ, బందరు, ఏలూరు, రైవస్‌, తూర్పు ప్రధాన, పశ్చిమ ప్రధాన కాలువలకు అన్నింటికీ కలిపి 8వేల క్యూసెక్కుల మేర నీటిని ఆయకట్టుకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని రైతులు నాట్లు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అన్నదాతలు సాగునీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. పైగా అవసరమైనంతగా నీటిని వాడుకుంటేనే మంచి దిగుబడి వస్తుందని నీటి రంగ నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది ఖరీఫ్‌లో ప్రభుత్వం అవసరమైనంత మేర నీటిని విడుదల చేసింది. దీంతో రికార్డు స్థాయిలో ఎకరాకు 40 బస్తాల నుంచి 50 బస్తాల వరకు ధాన్యం పండింది. ఈ దఫా కూడా ప్రతి బొట్టును జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంది. ఈ దిశగా రైతాంగాన్ని జలవనరుల శాఖ సిబ్బంది, సాగునీటి సంఘాలు అప్రమత్తం చేయాలి. తూర్పు ప్రధాన కాలువ కింద నాట్లు వేయడం పూర్తి అయిన తర్వాతే పశ్చిమ కాలువకు నీటిని అధికంగా వదులుతారు. ఈ నేపథ్యంలో నాలుగు జిల్లాల రైతులు ఇప్పటి నుంచి పొదుపుగా వాడుకంటే.. చివరి తడులకు సాగునీటి ఇబ్బందులు తప్పుతాయి. వంతుల వారీగా రైతులే పరస్పరం అవగాహనతో వ్యవహరించాల్సి ఉంది. వర్షాలు ఆదుకుంటేనే..: జులైలో పెద్దగా వర్షాలు కురవలేదు. ఇప్పటికి పలు సార్లు వర్ష సూచనలు చేసినా వాన జాడే లేదు. గత 20 రోజులుగా నిరంతరాయంగా పట్టిసీమ నీటిని కాలువలకు నీటిని వదులుతున్నారు. దీంతో కృష్ణా బ్యారేజిలో ప్రస్తుతం నీటిమట్టం 9.8 అడుగులకు పడిపోయింది. దీని పూర్తి సామర్థ్యం 12 అడుగులు. రెండు రోజుల్లో భారీ వర్ష సూచన ఉండడంతో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈమేరకు వర్షాలు పడితే పట్టిసీమ మోటార్లను ఆపేయనున్నారు. రెండు రోజుల క్రితం 6 మోటార్లను నిలిపారు. బ్యారేజీలో నీటి మట్టాన్ని 11 అడుగులకు తీసుకురావాలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఆదేశాలతో మళ్లీ పూర్తి స్థాయిలో గోదావరి నీటిని ఎత్తిపోస్తున్నారు. మరో వైపు.. అనుకున్న రీతిలో వర్షాలు పడితే స్థానిక వాగులైన మున్నేరు, పాలేరు, కొండవీడు, తదితర వాగుల ద్వారా వచ్చే నీటిని వృథా పోనీయక నాట్లు వేసుకునేందుకు ప్రయోజనం కలుగుతుంది. దీని వల్ల తక్కువ నీటితో నాట్లు దశను పూర్తి చేసుకోవచ్చు. అనంతరం బ్యారేజీలో నిల్వ ఉండే నీటిని అవసరమైన సందర్భాలలో తడులు ఇచ్చేందుకు ఉపయోగపడతాయి. ఖరీఫ్‌ ప్రణాళిక ఇదీ.. కృష్ణా డెల్టాలో తూర్పు కాలువ కింద కృష్ణా, పశ్చిమగోదావరి, పశ్చిమ కాలువ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. మొత్తం డెల్టాలో 13.07 లక్షల ఎకరాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరిలో 57 వేలు, కృష్ణా జిల్లాలో 6.79 లక్షలు, గుంటూరు జిల్లాలో 4.99 లక్షలు, ప్రకాశంలో 72 వేలు ఎకరాల మేర ఆయకట్టు ఉంది. ఈ ఖరీఫ్‌కు డెల్టాకు మొత్తం 130 టీఎంసీల నీరు అవసరమని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. పట్టిసీమ ద్వారా 131 రోజులకు.. రోజుకు 5,500 క్యూసెక్కులు చొప్పున మొత్తం 61.78 టీఎంసీలు తీసుకురావాలన్నది ఆలోచన. బ్యారేజికి ఇతర మార్గాల ద్వారా 30 టీఎంసీల మేర వస్తుందని అంచనా వేస్తున్నారు. మిగిలిన 38.22 టీఎంసీల పరిమాణాన్ని నాగార్జున సాగర్‌, స్థానిక వాగుల ద్వారా తీసుకురావచ్చని లెక్కలేశారు. గత నెల నుంచి ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా బ్యారేజీకి 15 టీఎంసీల నీటిని తరలించారు.
  3. Oh. That's good. Cm dash board lo zero choopisthe -
  4. Good for Nagavali basin. Thotapalli may fill soon. 2 tmc capacity
  5. copied from Facebook-- just last two lines. ....... చివరగా - కృష్ణ నదిలో కృష్ణ నీరు ... బ్రహ్మ సృష్టి ! కృష్ణ నదిలో గోదావరి నీరు ... చంద్రబాబు ప్రతి సృష్టి !!(భువన్ మాగంటి)
  6. From Eenadu: తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు విడుదలతాళ్లపూడి: మండలంలోని తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా జలవనరులశాఖ అధికారులు సోమవారం సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈఈ శంకరరావు మాట్లాడుతూ... రైతుల అవసరాల మేరకు గత ఏడాదికంటే ముందుగానే సాగునీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది 1.53లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని... ఈ ఏడాది అదనంగా మరో 90వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘నీరు-చెట్టు’ పథకం కింద 81కిలోమీటర్ల మేర కాలువల పూడికతీత పనులు చేపట్టినట్లు తెలిపారు. గోదావరిలో నీటి లభ్యత బాగానే ఉందని ఆయన వివరించారు. కార్యక్రమంలో డీఈలు ధనుంజయ, రామకృష్ణ, శ్రీనివాసరెడ్డి, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
  7. ide mana vallalo vunna problem anni okesari ayipovali antaru/anukuntaru mundu Godavari delta then krishna delta annaru - alage chesthundi govt. lekapothe eepatiki retcha kotte varuga - but pattiseema tho, krishna dt. lo oka change ayithe vatchinidi- last year digubadulatho - ee year kavulu ki full giraki - polam maku ivvandi ante maku ani - two years back full reverse -
  8. @AbbaiG, mana valla matti panulu gurinchi meeku teliyanida, varshalu vasthunnayi ante hadavidi chestharu mundu entha cheppina pattinchukoru nirudu meeru krishna dt lo kalva katta lu choodali, gatti varshalu levu gani ee year konchem better , kani konni places lo still same gaja gaja until end of Sep
  9. Once Polavarm gets better shape, you will hear good news on Kovvada, jelleru, Yerra kalava and Sagar left canal's chivari ayukattu in krishna dt. Inkoti kuda edho vundali small or medium reservoir in that upper region. around 100+m pump cheyyali total ga ekkado, Annagaru kuda rasaru veeti gurinchi
  10. For Jalleru and Erra kalava - the solution is going to be Chintalapudi 2nd stage
  11. Gutala lift - 2,500 acres Polavaram lift - 550 acres - in worst case (technical issues) - they should get mobile pumps As per Eenadu - Taadipudi lift will start in 2 days. Looks like Pushkara will start soon 10న తాడిపూడి ఎత్తిపోతల నీటి విడుదల దేవరపల్లి, న్యూస్‌టుడే: తాడిపూడి ఎత్తిపోతల పథకం నీటిని ఈ నెల 10వతేదీ ఉదయం విడుదల చేస్తామని ఆ పథకం పర్యవేక్షక ఇంజినీరు శ్రీనివాసయాదవ్‌ తెలిపారు. శనివారం పథకంపై సమీక్షకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాడిపూడి ఎత్తిపోతలపథకం ప్రధానకాలువలో పూడిక తీయాల్సి ఉన్నందున నీటి విడుదలలో జాప్యం జరిగిందన్నారు. జాప్యం చేయడంలో ప్రభుత్వ ప్రమేయం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. తాజా ధరల ప్రకారం రూ.930 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. వారం రోజుల్లో ప్రభుత్వం నుంచి మంజూరు ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందన్నారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి పథకాన్ని పూర్తి చేయాలన్న కృతినిశ్చయంతో ఉన్నామని తెలిపారు. ఈ ఏడాది అయిదో ఉపలిఫ్ట్‌తో కలిపి 1.64 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 2018కల్లా పూర్తిచేయాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నామని తెలిపారు. పథకానికి రూ.3200 కోట్లు మంజూరయ్యాయని, పనులను చేపట్టేందుకు టెండర్లు పిలిచామని వివరించారు.
  12. ఈనాడు, ఏలూరు ముంచుకొచ్చినా మందగమనమే పోలవరం కుడికాలువ పనుల్లో సాగదీత పూర్తికాని 2, 4, 5 ప్యాకేజీల్లో పనులు 14 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం నాలుగైదు రోజుల్లో పట్టిసీమ ద్వారా నీరు ఎత్తిపోతకు అవకాశం పశ్చిమ సాగు అవసరాలకు నీరివ్వడం, కాలువలు కూడా నిండుగా ప్రవహిస్తుండటం, మరోవైపు గోదావరిలో నీటి మట్టం పెరగడంతో రాబోయే నాలుగైదు రోజుల్లో పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పట్టిసీమ నీరు ప్రవహించే పోలవరం కుడికాలువలో పనులను ఎక్కడివక్కడ నిలుపుదల చేసి యంత్రాలను పైకి రప్పించనున్నారు. ఈ సంవత్సరం వంద టీఎంసీలు నీటిని పట్టిసీమ ద్వారా తీసుకెళ్లాలని భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా చేయాల్సిన పనుల వల్ల ఏమైనా అవాంతరాలు ఏర్పడతాయా? అనేది తెలియదు. ఇంత భారీస్థాయిలో నీటిని తీసుకెళ్లే సమయం ఇదేకావడంతో 24 మోటార్లు ఒకేసారి పనిచేయించి నీటిని వదిలితే కాలువ సామర్థ్యం ఎంతమేర ఉంటుందో రోజువారీ గంటలవారీ తెలుసుకుని ఆమేరకు నీటి కోటాను పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పోలవరం కుడికాలువ పనుల సాగదీత ధోరణి వల్ల ఈ సంవత్సరం కూడా పట్టిసీమ ద్వారా ప్రభుత్వం అనుకున్న లక్ష్యం మేర నీరు ముందుకు సాగే పరిస్థితులు కనిపించడం లేదు. ఆఖర్లో హడావుడి చేసిన అధికారులు ఆదిలో అంతగా పనులపై దృష్టిపెట్టక పోవడంతో తాజాగా ఎక్కడివక్కడ నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా గోదావరి నుంచి నిర్దేశిత పరిమాణంలో నీరు రావడంతో కొద్దిరోజుల్లోనే పట్టిసీమ నుంచి నీటిని తోడే పని ప్రారంభించనున్నారు. జిల్లాలో పోలవరం నుంచి ప్రారంభమైన ప్రధాన కాలువ పనులు 174 కిలోమీటర్ల మేర సాగి కృష్ణా డెల్టా వద్ద ముగుస్తాయి. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించాకా పోలవరం కుడికాలువ తవ్వకం పనులు వేగంగా ముందుకు సాగించారు. ఎట్టకేలకు కాలువ వెడల్పున 80 మీటర్లు మేర తవ్వాల్సిఉండగా 30 మీటర్లు మేర తవ్వకం చేపట్టి యుద్ధప్రాతిపదికన నీటిని కృష్ణాకు అనుసంధానం చేశారు. ఈ సమయంలో పట్టిసీమ ద్వారా నీటిని తోడి కృష్ణాడెల్టాలో పంటలకు సమస్య లేకుండా సాగునీరు అందించగలిగారు. మిగిలిన పనులను మరుసటి సంవత్సరం పూర్తిచేస్తామని ప్రకటించిన అధికారులు ఆ తర్వాత వీటిని తూతూమంత్రంగా చేపట్టారని విమర్శలు ఉన్నాయి. జిల్లా పరిధిలో నాలుగున్నర ప్యాకేజీలు, కృష్ణా పరిధిలో మరికొంత పని మిగిలి ఉండగా వీటిని వేసవిలో ప్రారంభించారు. అయితే ఏప్రిల్‌, మేలలో అనుకున్న స్థాయిలో జరిగితే ఈ పాటికే పనులు పూర్తయ్యేవి. కానీ గుత్తేదార్లు వేగంగా పనులు చేయక పోవడం వల్ల వేసవి పూర్తయినా కూడా పనులు చివరి దశకు చేరుకోని స్థితి ఏర్పడింది. రెండు ప్యాకేజీల్లో అత్యంత నెమ్మది... పోలవరం కుడికాలువ నుంచి పెదపాడు మండలం వరకూ అయిదు ప్యాకేజీలు ఉండగా వీటిలో ఒకటి, మూడు ప్యాకేజీ పనులు పూర్తిచేశారు. రెండో ప్యాకేజీలో వివిధ రకాల నిర్మాణాలు 31 నిర్మించాల్సి ఉండగా వీటిలో 17 పూర్తిచేశారు. మరో 13 ప్రగతిలో ఉన్నాయి. 27,296 క్యూబిక్‌ మీటర్లు పని చేయాల్సి ఉండగా 12400 చేశారు. 5.10 కిలోమీటర్లు లైనింగ్‌ పనికోసం 52,692 క్యూబిక్‌మీటర్లు కాంక్రీటు పని చేయాల్సి ఉంది. దీనిలో 26,433 క్యూబిక్‌మీటర్లు పూర్తిచేశారు. నాలుగో ప్యాకేజీలో 44 నిర్మాణాలకుగానూ 34 పూర్తికాగా మరో పది ప్రగతిలో ఉన్నాయి. ఇక్కడ 15 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పనికిగానూ 12 వేల క్యూబిక్‌మీటర్ల వరకూ చేశారు. 11.94 కిలోమీటర్ల లైనింగ్‌ పనికిగానూ 1.18 లక్షలు క్యూబిక్‌మీటర్లు కాంక్రీటు పని చేయాల్సి ఉండగా దీనిలో 56 వేల క్యూబిక్‌మీటర్లు పూర్తయింది. అయిదో ప్యాకేజీలో 23 నిర్మాణాలకుగానూ 10 పూర్తికాగా, మరో 13 ప్రగతిలో ఉన్నాయి. వీటిలో 27041 క్యూబిక్‌మీటర్లు కాంక్రీటు పనికిగానూ 12,852 క్యూబిక్‌ మీటర్లు పూర్తిచేశారు. 8.05 కిలోమీటర్లు లైనింగ్‌ చేయాల్సిఉండగా దీనిలో 60,983 క్యూబిక్‌మీటర్లు కాంక్రీటు పని చేయాల్సి ఉంది. దీనిలో 37389 క్యూబిక్‌మీటర్లు పని పూర్తయింది. ఈ పని మొత్తం పూర్తికావాలంటే కచ్చితంగా మరో సీజన్‌ వరకూ ఆగాల్సిందే. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ పనుల్లో కీలకమైన జానంపేట వద్ద తమ్మిలేరుపై నిర్మిస్తున్న అక్విడెక్టు పని మొత్తం పూర్తిచేయడం ద్వారా ప్రధాన ఆటంకం తొలగినట్లయింది. పట్టిసీమ ద్వారా త్వరలోనే నీటి ఎత్తిపోత పట్టిసీమ ద్వారా నీరు తోడాలంటే మరో నెలరోజులు ఆగాల్సి వస్తుందని అధికారులు తొలుత అంచనా వేశారు. అయితే గోదావరిలో నీటిమట్టం భారీగా పెరగడంతో నీరు ఎత్తిపోయడానికి అవకాశం ఏర్పడింది. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా నీరు తోడాలంటే గోదావరిలో నీటిమట్టం 14 అడుగులు ఉండాలి. ఈనేపథ్యంలో ఇక్కడ శనివారం సాయంత్రానికి ఆ మేరకు నీటిమట్టం పెరిగింది. అయితే గోదావరి జిల్లాల్లో సాగు ఉద్ధృతంగా సాగుతున్న నేపథ్యంలో అక్కడ నీటి అవసరాలు తీరాయని శివారు వరకూ నీరు వెళ్లిందని నిర్థారణ అయ్యాకే నీటిని పట్టిసీమ ద్వారా ఎత్తిపోయాలని అనుకుంటున్నారు. ఏదేమైనా కృష్ణాడెల్టాలో ముందుస్తు సాగుకు పట్టిసీమ ద్వారా తొలి అడుగు పడింది. దీనిపై పోలవరం కుడికాలువ ఎస్‌ఈ శ్రీనివాస్‌యాదవ్‌ ‘ఈనాడు’తో మాట్లాడుతూ జిల్లాలో పోలవరం కుడికాలువ పనులు చాలావరకూ పూర్తిచేశామన్నారు. గోదావరిలో సాగు అవసరాలు తీర్చాకే పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోస్తామన్నారు. ఎప్పుడు ఎత్తిపోతలను ప్రారంభించాలనేది ఇంకా నిర్ణయించలేదన్నారు.
  13. From Eenadu - WG district edition పట్టిసీమ ద్వారా త్వరలోనే నీటి ఎత్తిపోత పట్టిసీమ ద్వారా నీరు తోడాలంటే మరో నెలరోజులు ఆగాల్సి వస్తుందని అధికారులు తొలుత అంచనా వేశారు. అయితే గోదావరిలో నీటిమట్టం భారీగా పెరగడంతో నీరు ఎత్తిపోయడానికి అవకాశం ఏర్పడింది. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా నీరు తోడాలంటే గోదావరిలో నీటిమట్టం 14 అడుగులు ఉండాలి. ఈనేపథ్యంలో ఇక్కడ శనివారం సాయంత్రానికి ఆ మేరకు నీటిమట్టం పెరిగింది. అయితే గోదావరి జిల్లాల్లో సాగు ఉద్ధృతంగా సాగుతున్న నేపథ్యంలో అక్కడ నీటి అవసరాలు తీరాయని శివారు వరకూ నీరు వెళ్లిందని నిర్థారణ అయ్యాకే నీటిని పట్టిసీమ ద్వారా ఎత్తిపోయాలని అనుకుంటున్నారు. ఏదేమైనా కృష్ణాడెల్టాలో ముందుస్తు సాగుకు పట్టిసీమ ద్వారా తొలి అడుగు పడింది. దీనిపై పోలవరం కుడికాలువ ఎస్‌ఈ శ్రీనివాస్‌యాదవ్‌ ‘ఈనాడు’తో మాట్లాడుతూ జిల్లాలో పోలవరం కుడికాలువ పనులు చాలావరకూ పూర్తిచేశామన్నారు. గోదావరిలో సాగు అవసరాలు తీర్చాకే పట్టిసీమ ద్వారా నీటిని ఎత్తిపోస్తామన్నారు. ఎప్పుడు ఎత్తిపోతలను ప్రారంభించాలనేది ఇంకా నిర్ణయించలేదన్నారు.
  14. From Eenadu - 18 June 2017: తిరుపతిలో ‘సెల్‌’పువ్వు! ఎలక్ట్రానిక్స్‌ హబ్‌లో తొలి కంపెనీ 22న సీఎం చేతుల మీదుగా ప్రారంభం అమరావతి: తిరుపతి సిగలో ‘సెల్‌’ పువ్వు ఫూయనుంది. త్వరలో అత్యాధునిక ఫోన్ల తయారీకి కేంద్రంగా అవతరించనుంది. ఈ నెల 22న రేణిగుంట విమానాశ్రయంవద్ద నిర్మించిన సెల్‌కాన్‌ మొబైల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. సెల్‌కాన్‌ సంస్థ ఇక్కడి నుంచి నెలకు 4 లక్షల మొబైల్‌ ఫోన్లను తయారు చేయనుంది. వాటిని దేశీయ, విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయనుంది. ఆ తర్వాత మరో మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీలు రానున్నాయి. రేణిగుంట విమానాశ్రయానికి సమీపంలో రెండు ‘ఎలక్ట్రానిక్స్‌ తయారీ క్లస్టర్లను’ (ఈఎంసీ) ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర మొబైల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట ఒక స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. 120 ఎకరాల విస్తీర్ణంలో ఈఎంసీ-1 హబ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో ‘సెల్‌కాన్‌’, ‘లావా’, మైక్రోమ్యాక్స్‌, కార్బన్‌ కంపెనీలు తమ మొబైల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నాలుగు కంపెనీలు కలిపి భారీగా పెట్టుబడి పెట్టనున్నాయి. ఇందులో శరవేగంగా యూనిట్‌ నిర్మాణం పూర్తి చేసి తయారీకి సిద్ధమైన తొలి కంపెనీ ‘సెల్‌కాన్‌’. 2015 నవంబరులో ఈఎంసీ-1కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఏడాది క్రితం సెల్‌కాన్‌ కంపెనీ రూ.150 కోట్ల పెట్టుబడితో యూనిట్‌ నిర్మాణ పనులు ప్రారంభించి ఇటీవలే పూర్తి చేసింది. ఈ నెల 22న ఈ యూనిట్‌ను లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. మరోవైపు రేణిగుంటకు సమీపంలోని వికృతమాల వద్ద 500 ఎకరాల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ మరో ‘ఈఎంసీ-2’ను అభివృద్ధి చేస్తోంది. 40 వేల మందికి ఉద్యోగావకాశాలు సెల్‌కాన్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసిన ఈఎంసీ-1 ప్రాంతంలో వచ్చే మొబైల్‌ కంపెనీలన్నింటిద్వారా మొత్తం 40వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఎలక్ట్రానిక్స్‌ తయారీ హబ్‌-1లో ఏర్పాటవుతున్న ఈ నాలుగు కంపెనీల నుంచి ఏటా 7 కోట్ల సెల్‌ఫోన్లు తయారు కానున్నాయి. దేశీయ మొబైల్‌ మార్కెట్‌లో ఈ నాలుగు కంపెనీల వాటా 45 శాతం. తిరుపతిలోని ఎలక్ట్రానిక్స్‌ హబ్‌లో ఈ కంపెనీలు పెట్టబోయే పెట్టుబడులు, వాటి వివరాలు... సెల్‌కాన్‌: దేశీయ మొబైల్‌ తయారీ సంస్థల్లో ఐదో అతిపెద్ద మార్కెట్‌ ఉన్న సంస్థ. 20 ఎకరాల విస్తీర్ణంలో యూనిటú నెలకొల్పింది. రూ.150 కోట్ల పెట్టుబడి. సెల్‌కాన్‌ ఇక్కడ యూనిట్‌ను మరింత విస్తరించనుంది. ఆరంభంలో 2500 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు కల్పించనుంది. 2020 కల్లా ఈ కంపెనీ యూనిట్‌ నుంచీ 10వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొబైల్‌ తయారీతోపాటు, వాటి పరికరాలను కూడా ఆ సంస్థ ఇక్కడి నుంచీ తయారు చేయనుంది. లావా: ఈ సంస్థ ఇక్కడ ‘సోజో’ మొబైల్‌ ఫోన్లను తయారు చేయనుంది. మొత్తం 20 ఎకరాల్లో తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. రూ.500 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఆరంభ దశలో నెలకు 5 లక్షల మొబైల్‌ ఫోన్లను ఇక్కడి నుంచి తయారు చేయనుంది. 12 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించనుంది. కార్బన్‌: 15 ఎకరాల విస్తీర్ణంలో మొబైల్‌ ఫోన్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పుతోంది. రూ.200 కోట్ల పెట్టుబడి పెడుతోంది. 2వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. నెలకు ఈ యూనిట్‌ నుంచీ 5 లక్షల మొబైల్‌ ఫోన్లను తయారు చేయనుంది. మైక్రోమ్యాక్స్‌: 20 ఎకరాల విస్తీర్ణంలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
×
×
  • Create New...