Jump to content

rk09

Members
  • Posts

    1,461
  • Joined

Posts posted by rk09

  1. in CNN, see the 4th pic 

    https://www.cnn.com/style/article/mbr-solar-park-dubai-desert-intl/index.html

    Kurnool Ultra Mega Solar Park

    4 / 21 -With over 4.5 million photovoltaics and a 1,000-megawatt capacity, Kurnool was, for a time, the largest operational solar power station in 2017. India is investing heavily in solar power with its National Solar Mission. By the end of 2018, national on-grid capacity stood at just over 26,000 megawatts, per the Ministry of New and Renewable Energy

     

    - Ananthpur

    NP Kunta Ultra Mega Solar Park google earth

    14 / 21 -Also known as the NP Kunta Ultra Mega Solar Park, the 7,180-acre project will have a capacity of 1,500 megawatts when completed. Local news reported the start of power generation in May 2016.Google Earth

     

     

    The other two from India are

    - Pavagada, KA and Rewa (MP)

    TG lo vunnadi missing

  2. https://www.eenadu.net/elections-2019/fullstory.php?date=2019/04/09&newsid=80847&secid=3607&title=

     

     

    డెల్టా పండింది.. సీమ మురిసింది

    కృష్ణాడెల్టా కరవు తీర్చిన పట్టిసీమ
    లక్షలాది ఎకరాలకు సకాలంలో సాగునీరు
    రాయలసీమకు అందిన కృష్ణాజలాలు
    దశాబ్దాలుగా నిండని చెరువులకు పునర్జీవం
    సీమలో భూగర్భ జలాలూ మెరుగు
    బొమ్మరాజు దుర్గాప్రసాద్‌
    ఈనాడు - అమరావతి

    పట్టిసీమా.. అదొక ప్రాజెక్టా..?
    అన్న వెటకారాలు విన్నాం..
    కరెంటు ఖర్చు తప్పితే దక్కేదేముందన్న
    విమర్శలూ చూశాం..
    ఈ వెటకారాలు.. ఎద్దేవాల మధ్యే..
    ఒక అద్భుతం పూర్తయింది!
    చెక్కుచెదరని చంద్రబాబు సంకల్పం
    ముందర విమర్శలన్నీ వీగిపోయాయి.
    ఒక్క ఆలోచనతో..
    డెల్టా మళ్లీ జలకళ సంతరించుకుంది
    సీమ చెరువులన్నీ జీవం పుంజుకున్నాయి!!

    ఇసుక మేటలు వేసిన కృష్ణమ్మ ఒడిలో..
    వరద ఉరకలెత్తుతుందని అనుకున్నామా..!!
    సాగు నీరు లేక ఒట్టిపోయిన డెల్టాలో..
    పంట కంకులు వేస్తుందని ఊహించామా..!!
    సాగరంలో వృథాగా కలిసే గోదారి నీళ్లు..
    కృష్ణానదిలో పవిత్రసంగమం అవుతాయని ఆశించామా..!!
    కరవు కరాళనృత్యం చేసే సీమ బీడు భూముల్లో..
    కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుందని కలగన్నామా..!!

    ఒక్క ఆలోచన.. అన్నింటికీ సమాధానం చెప్పింది..
    కోస్తాంధ్ర మెరిసేలా.. రాయలసీమ మురిసేలా చేసింది.

    గోదావరి, కృష్ణా జలాలను అనుసంధానం చేసిన పథకం పట్టిసీమ. అంతేకాదు శ్రీశైలానికి చేరిన జలాలను రాయలసీమ జిల్లాలకు పరుగులెత్తించే అవకాశం కల్పించింది. ఏటా వృథా అవుతున్న వేల టీఎంసీలు సద్వినియోగం చేసుకునే వీలు కలిగింది. దాదాపు రూ.1600కోట్లతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపట్టినప్పుడు సీఎం చంద్రబాబువి ఉత్తమాటలని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఆ విమర్శలకు 161రోజుల్లోనే సమాధానం చెప్పింది ప్రభుత్వం. చంద్రబాబు ముఖ్యమంత్రిలా కాకుండా ముఖ్యఇంజినీర్‌లా మారి ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించి రైతాంగం కళ్లలో ఆనందం నింపారు. గుత్తేదారులకు దోచిపెట్టేందుకు అంటూ విపక్షాలు చేసిన విమర్శలకు సమాధానం చెబుతూ పట్టిసీమ జలాలు కృష్ణాడెల్టాలో వేల కోట్ల విలువైన పంట సకాలంలో చేతికి అందుతోంది.

    229 టీఎంసీల తరలింపు
    గోదావరి నుంచి ఏటా దాదాపు 2500 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల నిర్మించి 2015 నుంచి ఇప్పటివరకూ 263 టీఎంసీల నీటిని ఉపయోగించుకోగలిగాం. ఇందులో పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీ (మధ్యలో కొంత నీరు వినియోగించున్నది పోగా) 229 టీఎంసీలు చేరాయి. మూడు జిల్లాల్లో 13.07 లక్షల ఎకరాల్లో సాగు, ఆక్వా రంగానికి నీటిని అందించారు.

    ఇక్కడ మొదలైంది భగీరథ ప్రయత్నం

    8election13a.jpg

    పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమలో గోదావరి నదిపై 24 పంపులతో భారీ ఎత్తున నిర్మించిన ఎత్తిపోతల పంప్‌హౌస్‌

    ఇలా పోటెత్తుతోంది ప్రవాహం

    8election13o.jpg

    పంప్‌హౌస్‌ ఎత్తిపోసిన గోదావరి జలాలు పైపుల ద్వారా 4 కి.మీ. ప్రవహించి పోలవరం కుడికాలువలోకి పోటెత్తుతున్నాయి.

    8election13f.jpg

    పట్టి సీమ..

    ఇది 24 పంపుల ద్వారా రోజుకు 8500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్న బృహత్తర పథకం.మొత్తం రికార్డు సమయంలో 12 నెలల్లోనే పూర్తయింది.

    దశలుగా..
    ప్రాజెక్టు ప్రయోజనాలు ముందే దక్కేందుకు వీలుగా..
    * ముందు ఒక్క పంపు పూర్తి చేసి 161 రోజుల్లోనే గోదావరి నీరు ప్రకాశం బ్యారేజికి తెప్పించారు.
    * 2015 డిసెంబర్‌ నాటికి 4 పంపులు పూర్తి చేసి కృష్ణా డెల్టాకు తడులు అందించారు.
    * 2016 మార్చి చివరికల్లా మొత్తం 24 పంపులూ పూర్తయ్యాయి.

    పట్టిసీమ ఎత్తిపోతల పథకమే లేకపోతే ప్రకాశం బ్యారేజీ వద్ద నేను నిల్చునే పరిస్థితే ఉండేది కాదు. ఈ రోజు విజయవాడకు తాగునీళ్లు దక్కుతున్నాయంటే అది పట్టిసీమ పుణ్యమే.

    - ఓ సందర్భంలో సీఎం చంద్రబాబు అన్న మాటలివి
     

    అనుసంధాన ఘట్టం

    8election13m.jpg

     

    విజయవాడ శివారు పవిత్రసంగమం దగ్గర కృష్ణా నదిలో గోదావరి నీటిని కలుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

     

    ‘పట్టి’ తెచ్చావులే పంటల్ని మాకు

    8election13n.jpg

     

    చంద్రబాబుకు రైతులు వేశారు.. పట్టిసీమ జలాలతో పండిన వరికంకుల హారం

     

    బంగారు పంటలే పండినాయి

    8election13j.jpg

     

    పట్టిసీమ తెచ్చిన నీటితో కృష్ణా డెల్టా పచ్చగా కళకళ లాడింది. ఇది కృష్ణాజిల్లా పెదపులిపాక లోని దృశ్యం

    రూ.44 వేల కోట్ల ప్రయోజనం

    కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ప్రకాశం బ్యారేజీ నీటిపై దాదాపు 13.07 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. 2015లో పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కేవలం 8.99 టీఎంసీల నీళ్లు తరలించడంతో అఖరి రోజుల్లో తడికి అవసరమైన నీటిని ఇచ్చారు. మరుసటి ఏడాది నుంచి గోదావరి నీటిపై భరోసాతో జూన్‌లోనే ఖరీఫ్‌కు నీరిచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. పైగా గోదావరి నీరు వస్తుండటంతో సారవంతమైన మన్నూ వచ్చి చేరుతోందని రైతులు చెబుతున్నారు. దీనివల్ల ఎకరాకు 40 బస్తాలు పండించిన రైతులూ ఉన్నారు. గడిచిన నాలుగేళ్లలో రూ.20 వేలకోట్ల విలువైన పంట ఉత్పత్తులు సాధించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2016 తర్వాత ఆక్వా రంగానికి నీరివ్వడం ప్రారంభించారు. చేపల ఉత్పత్తితో రూ.19 వేల కోట్లు, రొయ్యల ఉప్పత్తితో దాదాపు రూ.5000 కోట్లు ప్రయోజనం కలిగినట్లు అధికారులు చెబుతున్నారు.

    8election13h.jpg

    తడారిన భూముల్లో సిరుల పంట పండించింది..
    సాగునీటికి రైతన్నల ఎదురుచూపులు తీర్చింది..

    సీమను కరవు కోరల నుంచి బయట పడేసింది..

    వట్టిపోయిన చెరువులకు కొత్త జీవం తెచ్చింది..

    చీనీ తోటల్లో పచ్చదనం చిగురించి ఫలసాయం అందించింది..

    వలసజీవులను సొంతూళ్లకు..

    అయినవాళ్లకూ దగ్గర చేసింది...

    పట్టిసీమ!

    8election13g.jpg

    పట్టిసీమతో భరోసా
    - డి.శ్రీనివాసరావు, రైతు, చల్లపల్లి, కృష్ణాజిల్లా

    8election13l.jpgపదేళ్ల నుంచి కాల్వల్లో నీళ్లు రాక ఇబ్బందులు పడ్డాం. బోర్ల కింద, వర్షాధారంతో పంటలు సాగు చేసి సరిగా దిగుబడులు రాక నష్టపోయాం. పట్టిసీమ ఎత్తిపోతల రాకముందు నీళ్లు వస్తాయో.. లేవో తెలియదు. కొన్నాళ్లు వంతుల వారీగా 15 రోజులకోసారి నీళ్లు ఇచ్చేవాళ్లు. ఇంజిన్లు పెట్టి తోడేసరికి ఒక్కో తడికి రూ.500 ఖర్చయ్యేది. పట్టిసీమతో సమస్యలన్నీ తీరాయి. జులై నెలకే కృష్ణా డెల్టాకు నీళ్లు ఇస్తారనే నమ్మకం వచ్చింది. నాకు ఘంటసాల మండలం, మోపిదేవి మండలంలో భూములున్నాయి. మొదటి పంట వరి, రెండో పంటగా మినుములు వేశాను. ఎకరానికి 40 బస్తాల దిగుబడి సాధించా. ఏటా పంటకు భరోసా ఏర్పడింది.

    రెండు పంటలు పండించాం
    - దేవిశెట్టి సంజీవరాయుడు, బుక్కపట్నం, అనంతపురం జిల్లా

    8election13k.jpgపదేళ్ల నుంచి కరవు చూస్తున్నాం. బుక్కపట్నం చెరువుకు నీళ్లు వచ్చిందే లేదు. హంద్రీనీవా పథకంతో చెరువుకు రెండేళ్ల నుంచి నీళ్లు ఇస్తున్నారు. కృష్ణా జలాలు చెరువుకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. దీనివల్ల భూగర్భజలాలూ పెరిగాయి. రెండు పంటలు పండించాం. పదేళ్ల కిందట వలసలు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ సమస్య లేదు.

    రాయలసీమ కరవు తీర్చిన కృష్ణమ్మ..

    8election13e.jpg

    పట్టిసీమ నిర్మాణానికి ముందు కృష్ణనీటిపైనే ఆధారపడి డెల్టాలో పంటలు పండేవి. వరద జలాల ఆధారంగా నిర్మించిన హంద్రీనీవా, గాలేరు నగరి, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలకు నీళ్లు తీసుకునే అవకాశం లేదు. అందుకే వీటిని పూర్తి చేసే విషయాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పట్టిసీమ కారణంగా కృష్ణాడెల్టాకు నీరివ్వడం ప్రారంభించాక.. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లు తరలించడం సులభమైంది. హంద్రీనీవా ఎత్తిపోతల రెండో దశ పూర్తి చేసుకుంటూ ఒక్కో జలశయాన్ని నింపుతూ.. నీటిని ప్రస్తుతం మదనపల్లిని దాటించారు. అటు పుంగనూరు బ్రాంచి కాలువ, కుప్పం కాలువ వైపు నీళ్లు ప్రవహిస్తున్నాయి. మరోవైపు గాలేరు నగరి తొలిదశ పనులు కొలిక్కి వస్తున్నాయి. అవుకు టన్నెల్‌ తవ్వకంలో వచ్చిన సమస్యలను చక్కదిద్ది, గోరకల్లు సమస్యలను పరిష్కరించుకుంటూ గండికోట జలాశయంలో నీటి నిల్వలు పెంచగలిగారు. పులివెందుల నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చారు. కుప్పం కన్నా ముందుగానే పులివెందులకు నీళ్లు ఇస్తామని తాను ఎప్పుడో చెప్పి మాట నిలబెట్టుకున్నానని చంద్రబాబునాయుడు తరచూ చెబుతున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని రైతులు సైతం తమ భూముల్లో పచ్చదనం కనిపిస్తోందని చెబుతున్నారు. కుప్పం కాలువ పనులు కొలిక్కి వచ్చాయి. కుప్పం బ్రాంచి కాలువకు ముఖ్యమంత్రి నీళ్లు వదిలారు.

    5 ఏళ్లలో  451 టీఎంసీలు

    పట్టిసీమ ప్రభావం రాయలసీమపై ఎంతో ఉంది. ప్రాజెక్టు నిర్మాణానికి ముందు నాలుగేళ్లలో 314 టీఎంసీలు ఇవ్వగా గడిచిన ఐదేళ్లలో 451 టీఎంసీలు నీళ్లు ఒక్క శ్రీశైలం జలాశయం నుంచే ఇచ్చారు. తుంగభద్ర జలాశయం నుంచి సీమ జిల్లాలకు ఇచ్చిన నీరు అదనం. ఇది 250 టీఎంసీలు ఉందని లెక్కలు కట్టారు. అంతకుముందు ఐదేళ్లలో హంద్రీనీవా నుంచి కేవలం 11.13 టీఎంసీలు ఇవ్వగా ఈ ఐదేళ్లలో 119.97 టీఎంసీలు ఇవ్వగలిగారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా 6.66 టీఎంసీలు సరఫరా చేశారు.

    గండికోట జలాశయంలో నీటి నిల్వలు పెంచారు. అక్కడి నుంచి మైలవరం, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ జలాశయం, వామికొండ, సర్వారాయసాగర్‌, పైడిపాలెం జలాశయాలకు నీటిని అందించారు. కడప జిల్లాలో కొంత ఆయకట్టు స్థిరీకరించారు. మైలవరం జలాశయం కింద ఉత్తరకాల్వ, దక్షిణ కాల్వల పరిధిలో 72 వేల ఎకరాల ఆయకట్టు పరిధిలో 1999 తర్వాత 2018లోనే సాగు చేయగలిగారు. మరోవైపు కుందూ ద్వారా పెన్నాకు అక్కణ్నుంచి సోమశిలకు నీరు తరలించారు.

    బీడువారిన చెరువుల్లో కొత్త జలం.. జీవం!

    8election13d.jpg

    8election13b.jpg

    ‘సీమ’లో సిరుల పంట
    ‘మా చిన్నతనంలో హంద్రీనీవా కాలువకు సర్వే చేరి రాళ్లు పాతారు. కలలో కూడా ఊహించని విధంగా నీళ్లు మా ఊరికి వచ్చాయి’ అని చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన రైతు గంగిరెడ్డి ‘ఈనాడు’తో అన్నారు. మదనపల్లి పట్టణానికీ తాగునీటి సమస్య తీరిందని స్థానికులు ఆనందపడుతున్నారు. ‘ఈనాడు ప్రతినిధి’ రాయలసీమ జిల్లాల్లో పర్యటించినప్పుడు కాలువల్లో నీరు చూసిన ఆనందం వారిలో కనిపించింది. కడప జిల్లా సింహాద్రిపురం, లింగాల ప్రాంతాల్లో చీనీ తోటలు పచ్చదనంతో కళకళలాడుతూ ఫలసాయం అందిస్తున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం కాలువలోకి నీళ్లు ప్రవహించాయి. చెరువుల్లో నీరు నింపడం, కాలువల్లో నీటి ప్రవాహాలతో భూగర్భజలాలు సుసంపన్నమయ్యాయని స్థానికులు చెబుతున్నారు.

    * ఏళ్ల తరబడి సాగుకు దూరమైన పొలాల్లో వరి సిరులు పండాయి. పనులు లేక, వ్యవసాయం సాగక బెంగళూరు వంటి నగరాలకు వలసపోయిన రైతులు సొంతూళ్లకు తిరిగొచ్చి అరకపట్టారు. అనంతపురం జిల్లా ధర్మవరం చెరువు 1922 ఎకరాల విస్తీర్ణం. వర్షాలు పడక పదేళ్లకోసారి నిండేది. అలాంటిది కృష్ణా జలాలతో చెరువు నింపడంతో 3000 ఎకరాల్లో వరి సాగు చేసి ఎకరానికి 40కుపైగా బస్తాల దిగుబడిని రైతులు సాధించారు. బుక్కపట్నం చెరువు నింపడంతో సమీప బోరు బావుల్లో నీళ్లు సమృద్ధిగా చేరాయి.

    * గొల్లపల్లి, జీడిపల్లి, మారాల, చెర్లోపల్లి జలాశయాలకు శ్రీశైలం నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి సాయంతో నీటిని మళ్లించారు. ధర్మవరం, కొత్తచెరువు, రాప్తాడు పెద్ద చెరువులను నింపారు. దాదాపు వందల కిలోమీటర్ల మేర హంద్రీనీవా కాలువలో నీళ్లు ప్రవహిస్తున్నాయి.

    8election13c.jpg

    8election13i.jpg

     ఫొటోలు: ఈనాడు ఫొటోగ్రాఫర్ల యంత్రాంగం

  3. సెకనుకో మొబైల్‌ చేస్తారు!

    ఎం.ఐ, వన్‌ప్లస్‌, నోకియా, అసూస్‌, జియానీ, ఐఫోన్‌... మనదేశంలో 60 శాతం మంది వాడే సెల్‌ఫోన్‌ బ్రాండ్లు ఇవి! బ్రాండ్లు వేరైనా ఈ సెల్‌ఫోన్‌లన్నింటినీ ‘ఫాక్స్‌కాన్‌’ సంస్థే తయారుచేస్తుంది. వాటిలోనూ ఎక్కువభాగం మన తెలుగుప్రాంతంలోనే ఉత్పత్తవుతాయి. అంతేకాదు, వీటి తయారీలో పాలుపంచుకునేవారిలో 90 శాతం మహిళలే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీలో 40 శాతం వాటాని సొంతం చేసుకున్న ఫాక్స్‌కాన్‌ తన ఫ్యాక్టరీ ఉన్న ప్రతిచోటా దీన్నో పాలసీగానే అనుసరిస్తోంది!

    ఒకప్పుడు వ్యవసాయపు పనులు తప్ప మరో ఉపాధి ఎరగని మహిళలు వాళ్లు. ఒక్కో ఏడాది వర్షాభావంతో సాగుపనులు ఆగిపోతే పక్కనుండే పట్టణాలకు భవన నిర్మాణ కార్మికులుగా వెళ్తుంటారు! కానీ గత మూడేళ్లుగా వాళ్ల ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. ఒక్కొక్కరూ తక్కువలో తక్కువగా నెలకి 15 వేల రూపాయల వరకూ జీతం తీసుకుంటున్నారు! శ్రీసిటీలోని ఫాక్స్‌కాన్‌ సంస్థలో వీళ్లు సెల్‌ఫోన్‌ అసెంబ్లింగ్‌ పనులు చేస్తున్నారు. ఈ యూనిట్‌లో మొత్తం పదమూడువేలమంది ఉద్యోగులుంటే వాళ్లలో 90 శాతం మహిళలే! వీళ్లంతా చిత్తూరు జిల్లా సత్యవేడు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తడ, సూళ్ళూరుపేట మండలాల్లోని పల్లెలకి చెందినవాళ్లు. మనం వాడుతున్న ఫోన్లలో ఎక్కువ వీళ్ల చేతుల్లో అసెంబుల్‌ అవుతున్నవే! వీళ్ల చేత సెకనుకో మొబైల్‌ తయారుచేయిస్తోంది ఫాక్స్‌కాన్‌.

    ఇదే అతిపెద్దది... 
    యాపిల్‌ ఐ ఫోన్లూ, ఇంటెల్‌ కంప్యూటర్లూ, అమెజాన్‌ కిండిల్‌, ఎకో స్పీకర్లూ, గూగుల్‌ స్మార్ట్‌ ఫోన్లూ, సోనీ సంస్థ ప్లే స్టేషన్‌... వీటన్నింటినీ ఆయా సంస్థలు డిజైన్‌ మాత్రమే చేస్తాయి. వాటిక్కావాల్సిన విడి భాగాల ఉత్పత్తీ, వాటి అసెంబ్లింగ్‌లను బయటి సంస్థలకి అప్పగిస్తాయి. ఆ పనుల్ని చేసిపెట్టే సంస్థల్నే ‘కాంట్రాక్ట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌’ కంపెనీలని అంటారు. అలాంటివాటిల్లో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ కంపెనీ ఫాక్స్‌కాన్‌! ఐటీ సంసల్లో రెవెన్యూ పరంగా యాపిల్‌, శాంసంగ్‌, అమెజాన్‌ తర్వాతి స్థానం ఈ సంస్థదే. గూగుల్‌ కూడా దీని తర్వాతే. అంతేకాదు, ఆ నాలుగు సంస్థల మొత్తం ఉద్యోగులు దాదాపు పదకొండు లక్షలమంది ఉంటే... ఒక్క ఫాక్స్‌కాన్‌ సంస్థలోనే 13 లక్షలమంది పనిచేస్తున్నారు. చైనాలో అత్యధికంగా ఉద్యోగావకాశాలిస్తున్న ప్రైవేటు కంపెనీ కూడా ఇదే! 1974లో తైవాన్‌-లో ఓ చిన్న ఎలక్ట్రికల్‌ వస్తువుల తయారీ సంస్థగా మొదలైంది ఫాక్స్‌కాన్‌. టెర్రీ గౌ దీని వ్యవస్థాపకుడు. 2001 వరకూ చైనాకే పరిమితమై ఉండేది. ఆ ఏడాది ఇంటెల్‌ సంస్థ తన మదర్‌బోర్డుల తయారీ కాంట్రాక్ట్‌ని ఇవ్వడంతో దాని దశ మారింది. తరవాత యాపిల్‌, గూగుల్‌, సోనీ వంటి బడా సంస్థలూ వరసకట్టాయి. ఆ ఊపుతో ఈ సంస్థ మిగతా దేశాల్లోనూ విస్తరించింది ఫాక్స్‌కాన్‌. 2006లో భారత్‌లో అడుగుపెట్టింది.

    అందిపుచ్చుకున్న ఆంధ్రప్రదేశ్‌... 
    చెన్నైకి దగ్గర్లోని శ్రీపెరంబదూరులో నోకియా సంస్థ టెలికామ్‌ సెజ్‌ని ఏర్పాటుచేసింది. అక్కడే తన ఫోన్ల ఉత్పత్తి మొదలుపెట్టింది. దానికి అనుబంధంగా నోకియా విడిభాగాల తయారీని ప్రారంభించింది ఫాక్స్‌కాన్‌. దాదాపు రెండువేలమందికి ఉద్యోగాలిచ్చింది. 2014 వరకూ బాగానే సాగింది కానీ... నోకియా ఫోన్‌ల యాజమాన్యం మైక్రోసాఫ్ట్‌ చేతుల్లోకి వచ్చాక పరిస్థితి మారింది. కేంద్రప్రభుత్వానికి ఇవ్వాల్సిన కోట్ల రూపాయల పన్ను బకాయిపడ్డంతో నోకియా యూనిట్‌ ఉత్పత్తుల్ని ప్రభుత్వం రద్దు చేసింది. అది ఫాక్స్‌కాన్‌ లాభాలనీ దెబ్బతీసి 2015లో కంపెనీ మూతపడింది! మరోచోట యూనిట్‌ ఏర్పాటు కోసం ఫాక్స్‌కాన్‌ ప్రయత్నిస్తుండగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాన్ని తడ దగ్గర్లోని శ్రీసిటీ సెజ్‌లోకి ఆహ్వానించింది. పదేళ్లపాటు జీఎస్‌టీనీ, కేంద్ర అమ్మకం పన్నునీ మినహాయించింది. అంతేకాదు, ఈ సంస్థలో కొత్తగా చేరే ఉద్యోగులకి మొబైల్‌ అసెంబ్లింగ్‌లో శిక్షణ ఇవ్వడం కోసం... ఒక్కొక్కరి కోసం 10వేల రూపాయల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చింది. అలా ఇక్కడికొచ్చిన ఫాక్స్‌కాన్‌ సంస్థకి రెండేళ్లకిందట ఎమ్‌.ఐ స్మార్ట్‌ఫోన్ల ఉత్పత్తి సంస్థ షామీ తన భారత్‌ కాంట్రాక్టుని అప్పగించింది. ప్రస్తుతం వినియోగదారులు వాడుతున్న 95 శాతం షామీ ఫోన్లు తయారయ్యేదీ ఇక్కడే!

    ‘యాపిల్‌’ వచ్చేస్తోంది...! 
    యాపిల్‌ సంస్థ తన ఐఫోన్‌-ఎక్స్‌ రకం ఫోన్లని ఈ ఏడాది నుంచి ఫాక్స్‌కాన్‌ ద్వారా భారత్‌లోనే తయారుచేయబోతోంది. ఇందుకోసం ఫాక్స్‌కాన్‌ శ్రీపెరంబుదూరు యూనిట్‌లో సుమారు 2,500కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుందని అంచనా! కొత్త ఐఫోన్‌ల తయారీ కోసం సిబ్బంది సంఖ్యని దాదాపు పాతికవేల మందికి పెంచుకుంటామనీ అంటోంది ఫాక్స్‌కాన్‌. అంటే... ఇకమీద ప్రపంచంలోనే అతిఖరీదైన ఐఫోన్‌-ఎక్స్‌ మొబైల్‌ ఫోన్‌లు కూడా మన మహిళల చేతుల్లోనే రూపుదిద్దుకుంటాయన్నమాట! 

    - గెడి మణిప్రతాప్‌, న్యూస్‌టుడే, సత్యవేడు

  4. 16 minutes ago, sskmaestro said:

    Pattiseema, purushottama patnam stage 1 and 2, Muchu marri, chintalapudi 

     

    i think TDP completed these lifts in last 4 years right? Did I miss any?

    Pattiseema, purushottama patnam stage 1 and 2, Muchu marri

    Gandikota nunchi CBR ki  (5 stages)

    Gandikota nunchi Paidipalem which goes to Lingala and pulivendula branch canals

    Jeedipalli to Hindupur,  (HNSS stage 2)

    Jeedipalli, to Penugonda branch canal, (HNSS stage 2)

    Jeedipalli to Puttaparthi branch canal and Punganur branch canal (recent ga oka rendu reservoirs nimparu - Marala and something) (HNSS stage 2)

    inka konni vunnayi

    HNSS - phase 2 lo 

     

    Chintalapudi still on going

  5. 7 minutes ago, katti said:

    shearwall tech lo walls are build in the factories and brought anukunta. Diagrid tech ante they will use iron bars on the outside of the building for support. Internally there would not be any pillars.

    - Shear wall: its like concrete walls. Ex: NGO buidings

    - Prefab: built some where as per design and assembles oniste. Ex: CRDA office buiding

     

  6. దక్షిణ కోస్తాకు తీవ్ర వాయు‘గండం’ 
    శనివారం నుంచి భారీ.. అతిభారీ వర్షాలు 
    6 మీటర్ల ఎత్తులో అలలు.. 

     

    ఈనాడు, అమరావతి, విశాఖపట్నం: దక్షిణ కోస్తాకు తీవ్ర వాయుగుండం పొంచి ఉంది. దీని కారణంగా ఈ నెల 15 నుంచి ప్రకాశం, నెల్లూరు చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం అలాగే కొనసాగుతోందని.. దానికి అనుబంధంగా 5.8 కి.మీ.ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోంది. రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇది మరింత తీవ్రమై.. తదుపరి 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి.. దక్షిణ కోస్తా ఆంధ్ర, ఉత్తర తమిళనాడు వైపు ప్రయాణించే అవకాశం ఉందని వివరించింది. గురు, శుక్రవారాల్లో కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది.

    అల్లకల్లోలంగా సముద్రం.. తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ఇన్‌కాయిస్‌ సూచించినట్లు విపత్తు నిర్వహణ శాఖ, ఆర్టీజీఎస్‌ వర్గాలు వెల్లడించాయి. ‘నెల్లూరు జిల్లా దుగరాజపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా బారువా వరకూ అలలు 3 నుంచి 6.5 మీటర్ల వరకు ఎగసి పడతాయి. తీరం వెంట 70 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ నెల 14 నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని’ హెచ్చరికలు జారీ చేశాయి.

  7. 8 hours ago, kishbab said:

    Nene land ammutha ani cheppindi correct.

    BTW CBN  made me to drop this idea forever with sagar canal linking

    Ma father ki nina phone chesthe urlo antha manchi vupu mida unnaru sagar linking gurinchi...jeeplu matldkoni vellatarta urlo farmers antha meeting manake kada water  vachedi ani.

    Good decision! 

    Nice gesture 

     

  8. 9 hours ago, kishbab said:

    sattenapalli lo atu vypu vastundi bypass..any idea...oka vypu mavi inkovypu naa katnam land(maa athaagru pettinavi) unnay.

    meere anukunta kada okasari post chesaru. Polalu vunchukovalo ammalo ani?

    my guess on bi-pass is towards Madala side unless if land rates are too high. 

    in any case, ee madya govt. reasonable amount pay chesthundi. All the best.

     

×
×
  • Create New...