జైత్ర బ్రదర్ .... చెప్పాలా నిష్ఠురంగా ఉన్నా నిజమొకటి ! ....తిలా పాపం తలా పిడికెడు ....బీజేపీ మాట మారుస్తుంది కథలు చెప్తుంది, యుద్ధ భేరి మోగించాలి, తెలుగు ప్రజను సిద్ధం చెయ్యాలి అనే సమయం చాలా సార్లు వచ్చింది గత మూడేళ్ళలో , నీళ్లు చల్లి చల్లార్చారు పదేపదే ... రాధాకృష్ణ లేడా ఈ ఆట లో, వెంకయ్య నాయుడుతో అప్పటికప్పుడు స్మూతింగ్స్,ఇంటర్వ్యూలు జనాల్లో ఉద్రేకం రాకుండా...ప్రత్యేక హోదా అవసరం లేదు ఇంకోటి వేరేది దానికంటే మంచిది ఇస్తున్నారు ..ఇంకా భూస్థాపితం చేస్తది బీజేపీ కి ఎదురు తిరిగి పోరుకి సిద్ధం అయితే ...శల్య సారధ్యం, పిరికిమందు అడుగడుగునా .....
అస్సలు వాళ్ళనీ వీళ్ళనీ అనాల్సిన పని లేదు జాతి లో సత్తువ, తెగింపు లేదు...ఆత్మ విశ్వాసం లేకపోతే ఎవరూ లెఖ్ఖ పెట్టరు, అది లోకరీతి, మాట మరచేవాళ్ళు ఎక్కువుంటారు, మర్యాద రామన్నలు అరుదు లోకంలో ... అన్నాయ్ చెప్పిన నీతి మర్చిపోయింది తెలుగుజాతి, దబాయించి తీసుకోకపోతే ఇవ్వరు.. ..ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ తో పాసివ్ యాంగర్ వచ్చింది వేసిన తప్పటడుగులతో ... పుంజుకోవాలంటే చెయ్యాల్సింది - అంతర్మథనం, ఆత్మవిమర్శ ....