Jump to content

Minimum 2 weeks quarantine is required after recovery from COVID 19


Recommended Posts

లక్షణాలు నయమయ్యాకా కరోనా వైరస్‌ ఉండొచ్చు! 

లక్షణాలు నయమయ్యాకా కరోనా వైరస్‌ ఉండొచ్చు!

బీజింగ్‌: కొవిడ్‌-19 లక్షణాలు కనిపించడం మానేశాక వారిలో వైరస్‌ ఉంటుందా? అది ఇతరులకు వ్యాపిస్తుందా? అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి. అమెరికాలోని యేల్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు వీటికి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉండి తగ్గిపోయాక ఎనిమిది రోజుల వరకు వారిలో వైరస్‌ ఉంటుందని అంటున్నారు. అందుకే ఈ మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడం కష్టమవుతోందని వెల్లడిస్తున్నారు.
 

 

బీజింగ్‌లోని పీఎల్‌ఏ జనరల్‌ ఆస్పత్రిలో 2020 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 9 వరకు చికిత్స పొందిన 16 మందిపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు అమెరికా జర్నల్‌ ఆఫ్‌ రెస్పిరేటరీ, క్రిటికల్‌ కేర్‌ మెడిసిన్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనంలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త లోకేశ్‌ శర్మ సైతం పాలు పంచుకున్నారు.

పరీక్షల్లో రెండుసార్లు నెగెటివ్‌ వచ్చిన రోగుల గొంతుల్లోంచి నమూనాలను పరిశోధకులు రోజు విడిచి రోజు సేకరించారు. ‘రోగుల్లో సగం మందికి లక్షణాలు తగ్గాక కూడా వైరస్‌ కణాలు ఉంటున్నాయని మా అధ్యయనంలో తేలింది. తీవ్ర లక్షణాలు ఉన్న వారిలో ఇంకాస్త ఎక్కువ రోజులే ఉంటాయి. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, శ్వాస కష్టమైన వారి నమూనాలే సేకరించాం. ఎక్కువ మందిలో ఐదు రోజుల్లో లక్షణాలు కనిపిస్తే ఒక్కరిలో మాత్రం ఎనిమిది రోజులకు లక్షణాలు గుర్తించాం’ అని లోకేశ్‌ శర్మ తెలిపారు.

కరోనా లక్షణాలు కనిపించడం మానేసిన ఒకటి నుంచి ఎనిమిది రోజుల వరకు వారి నుంచి ఇతరులకు కొవిడ్‌-19 సోకే అవకాశం ఉందని ఈ అధ్యయనంలో తేలింది. ‘కొవిడ్‌-19 స్వల్ప లక్షణాలు కనిపించిన వ్యక్తి ఇంట్లోనే క్వారంటీన్‌ అయ్యాడనుకుందాం. వారు కోలుకున్నాక మరొకరికి వైరస్‌ సంక్రమించకుండా ఉండాలంటే కనీసం రెండు వారాలు క్వారంటైన్‌ అవ్వాలి’ చైనా పీఎల్‌ఏ జనరల్‌ ఆస్పత్రి వైద్యుడు లిషిన్‌ షీ తెలిపారు. దీనిపై ఇంకా కచ్చితమైన పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు.

Some people can be silent spreaders. Utmost responsibility is needed at this time. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...