Jump to content

ఈనెల12 నుంచి మార్కెట్లోకి భారత్‌ బాండ్ ఇష్యూ....


KING007

Recommended Posts

ఈనెల12 నుంచి మార్కెట్లోకి భారత్‌ బాండ్ ఇష్యూ

ఈనెల12 నుంచి మార్కెట్లోకి భారత్‌ బాండ్ ఇష్యూ

దిల్లీ: ప్రభుత్వం తొలిసారి తీసుకొస్తున్న భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ డిసెంబర్‌ 12 నుంచి మార్కెట్లోకి రానుంది. చాలా ప్రభుత్వ రంగ సంస్థలు ఈ బాండ్‌ ద్వారా నిధులను సేకరించనున్నాయి. ఇప్పటికే 12న విడుదల చేయడానికి మార్కెట్‌ రెగ్యూలేటరీ సెబీ అనుమతులు మంజూరు చేసింది. దీనికి సంబంధించిన న్యూఫండ్‌ ఆఫర్‌ డిసెంబర్‌ 12న మొదలై 20న ముగుస్తుంది. ఈ ఆఫర్‌ విలువ రూ.7,000 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. యూనియన్‌ కేబినెట్‌ ఈ నెల 4న ఈ బాండ్లను మార్కెట్లోకి తీసుకురావడానికి అనుమతులు మంజూరు చేసింది.  

విషయం.. బాండ్ల ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌

ఏమిటిది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసే బాండ్లతో ఒక సూచీ రూపొందించి ఎక్స్ఛేంజీలో ట్రేడింగ్‌కు వీలు కల్పిస్తారు.

ప్రారంభం ఎప్పుడు.. ‘భారత్‌ బాండ్‌’ ఈటీఎఫ్‌ తొలి విడత ఇష్యూ ఈ 12వ తేదీన. 

కనీస పెట్టుబడి.. రూ.1000

బాండ్ల రేటింగ్‌.. కాలపరిమితి  ‘ఏఏఏ’ రేటింగ్‌తో 3 ఏళ్లు, 10 ఏళ్ల కాలపరిమితి ఉన్న బాండ్లు మాత్రమే ఈటీఎఫ్‌ల్లో ఉండనున్నాయి.

ఇప్పటివరకు ఈక్విటీ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌లు (ఈటీఎఫ్‌) మాత్రమే మనకు సుపరిచితం. ఇక నుంచి డెట్‌ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్‌లూ అందుబాటులోకి రానున్నాయి. బాండ్ల ఈటీఎఫ్‌ రూపకల్పన, జారీకి గతవారం కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ‘భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌’ పేరుతో మొదటి విడత ఇష్యూ ఈనెల 12వ తేదీన ప్రారంభం అవుతుంది. 

చిన్న మదుపర్లకు చేరువగా..

బాండ్లలో పెట్టుబడులకు ఇప్పటికీ చిన్న మదుపర్లు దూరంగా ఉన్నారు. వారిని కూడా బాండ్ల విపణికి చేరువ చేసేందుకు ఈ బాండ్ల ఈటీఎఫ్‌ తోడ్పడనుంది. కనీస పెట్టుబడి రూ.1000 కావడంతో బాండ్లలో రిటైల్‌ మదుపర్ల భాగస్వామ్యం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ పీఎస్‌యూలవి ఉండొచ్చు

జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఎన్‌టీపీసీ, ఎగ్జిమ్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ లాంటి కొన్ని పీఎస్‌యూలు జారీ చేసిన బాండ్లు ప్రతిపాదిత ఈటీఎఫ్‌ల్లో ఉండొచ్చు.

ఇదే మొదటిది : భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ దేశంలో మొట్టమొదటి కార్పొరేట్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ కానుంది. ప్రస్తుతమున్న ఈక్విటీ ఈటీఎఫ్‌లకు తోడు బాండ్ల మార్కెట్‌ను విసృత్తం చేసేందుకు బాండ్ల ఈటీఎఫ్‌ను అందుబాటులోకి తేనున్నట్లు బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగానే ఈ బాండ్ల ఈటీఎఫ్‌ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపిందని సీతారామన్‌ చెప్పారు.  ప్రతి ఆరు నెలలకోసారి ఈటీఎఫ్‌ల ఇష్యూ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

పీఎస్‌యూలకు నిధుల వనరు

ప్రతిపాదిత బాండ్ల ఈటీఎఫ్‌ను ఎడెల్‌వీజ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహించనుంది. ‘రిటైల్‌ మదుపర్లు సులువుగా బాండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదిత ఈటీఎఫ్‌లు వీలు కల్పిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థలకు అదనపు నిధుల వనరుగా ఉపయోగపడటంతో పాటు రుణ వ్యయాలు తగ్గించేందుకు ఉపయోగపడతాయి. కార్పొరేట్‌ బాండ్ల మార్కెట్లలో నిధుల లభ్యతను పెంచుతుంద’ని ఎడెల్‌వీజ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సీఈఓ రాధికా గుప్తా తెలిపారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...