Jump to content

Guntur Town Rigging - YSRCP


RKumar

Recommended Posts

నల్లచెరువు, బృందావన్‌గార్డెన్స్‌లో ఉద్రిక్తత
 

 వైకాపా రిగ్గింగ్‌ను అడ్డుకున్న తెదేపా
 మోహరించిన మూడు ప్రధాన రాజకీయ పక్షాలు
నీ పోలీసుల లాఠీఛార్జి

amr-gen2a_121.jpg

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని నల్లచెరువు, బృందావన్‌గార్డెన్స్‌లో గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నల్లచెరువులోని మూడు పోలింగ్‌ కేంద్రాల్లో వైకాపా నాయకులు రిగ్గింగ్‌ చేస్తున్నారని తెదేపా నాయకులకు సమాచారం అందింది. పోలింగ్‌ గడువు ముగిశాక దొంగ ఓట్లు వేసేందుకు ఓటర్ల స్లిప్పులు వైకాపా పంపిణీ చేసి లోపలకు పంపుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆరోపిస్తూ తెదేపా నాయకులు ఆందోళనకు దిగారు. విషయాన్ని తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌, పశ్చిమ అభ్యర్థి మద్దాళి గిరిధర్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకుని వెళ్లారు. రిగ్గింగ్‌ జరుగుతుండటం వల్ల పోలింగ్‌ను నిలిపివేయాలని కోరారు. అయినప్పటికీ ఏ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల తెదేపా నాయకులు, కార్యకర్తలు ఎన్నికల అధికారులు, కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలింగ్‌ కేంద్రం వద్ద ధర్నా చేపట్టారు. వైకాపా నాయకులు ఓటర్లకు నగదు పంపిణీ చేసి రిగ్గింగ్‌ చేయిస్తున్నారని ఆరోపించారు. దీనికి పోలీసులు, అధికారులు సహకరించారని విమర్శించారు. తెదేపా నాయకులు రీపోలింగ్‌ జరపాలని, వైకాపా నాయకులు పోలింగ్‌ కొనసాగించాలని నినాదాలు చేశారు. ఇంతలో తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్‌, గుంటూరు పశ్చిమ అభ్యర్థి మద్దాళి గిరిధర్‌, పార్టీ నాయకులు కోవెలమూడి రవీంద్ర, చుక్కపల్లి రమేష్‌లు అక్కడకు చేరుకున్నారు. గడువు ముగిశాక ఏవిధంగా లోపలకు అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. పోలింగ్‌ను నిలిపివేయాలని కోరారు. ఇంతలో వైకాపా గుంటూరు ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి, జనసేన అభ్యర్థి బోనబోయిన శ్రీనివాసయాదవ్‌, వైకాపా నాయకులు లేళ్ళ అప్పిరెడ్డి కూడా అక్కడకు పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి అధికారులతో మాట్లాడారు. పోలింగ్‌ కేంద్రం లోపల పోటీలో ఉన్న అభ్యర్థులు ఉండగా.. వెలుపల మూడు పార్టీల నాయకులు మోహరించారు. ఆందోళన విరమించాలని పోలీసులు చెప్పినా వినలేదు. పోలింగ్‌ ముగించే వరకు ఇక్కడ నుంచే కదిలేది లేదని తెదేపా నాయకులు భీష్మించుకుని కూర్చున్నారు. వైకాపా నాయకులు పోలింగ్‌ కొనసాగించాలని పట్టుబట్టడంతో పరిస్థితి చేయిదాటుతుందని గమనించిన పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో ఆందోళనకారులు ఎటువాళ్లు అటు పారిపోయారు. అంతకుముందు బృందావన్‌గార్డెన్స్‌లోని దివ్యాంగుల వసతి గృహం వద్ద తెదేపా, వైకాపా నాయకులు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలింగ్‌ ఏజెంట్‌ ఒకరు చుక్కా ఏసురత్నం అని పేరు ఉండటం దీనికి కారణమైంది. అర్థం పర్థం లేకుండా ఆ పేరు ఎందుకు పెట్టారని ఇరుపార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వైకాపా నాయకులు.. తెదేపా నాయకులు ఉన్న ఇంటి వైపు దూసుకొచ్చారు. దీనిని తెదేపా నాయకులు అడ్డుకున్నారు. పోలీసులు ఇరువర్గాల వారిని ప్రతిఘటించారు. ఈ రెండు వ్యవహారాల్లో పోలీసులు తీరు ఏకపక్షంగా ఉందని తెదేపా నాయకులు ఆరోపించారు. నల్లచెరువులో పోలింగ్‌బూత్‌ల్లో 690 వరకు దొంగ ఓటర్ల స్లిప్పులు ఇచ్చి రిగ్గింగ్‌ చేయించారని విమర్శించారు. దొంగ ఓట్లు పోలైనందున ఇక్కడ రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. దొంగ స్లిప్పులపై ఓట్లు వేయనిస్తారా.. చెప్పాలని నిలదీశారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదన్నారు. ఎన్నికల కమిషన్‌ స్పందించి రీపోలింగ్‌ జరపాల్సిందేనని తెదేపా నాయకులు పట్టుబడుతున్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు సిరిపురపు శ్రీధర్‌, ముత్తినేని రాజేష్‌, రావిపాటి సాయికృష్ణ, దామచర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

6-7 madyalo oka saari godava ayyindi, Modugula bayata nunchi rowdys ni teesuku vachhadu town ki for rigging in these booths.

TDP cadre were there, almost kottukune situation vachhindi. DSP vachhi mothham laathi charge chesi pampinchesaadu.

10PM taruvaatha YCP vaallu malli rigging try chesaru, enni donga votes poll chesaro. Don't know if any TDP agents present or not.

Ayina police department ela help chesthondi for YCP that too in town?

Link to comment
Share on other sites

29 minutes ago, RKumar said:

6-7 madyalo oka saari godava ayyindi, Modugula bayata nunchi rowdys ni teesuku vachhadu town ki for rigging in these booths.

TDP cadre were there, almost kottukune situation vachhindi. DSP vachhi mothham laathi charge chesi pampinchesaadu.

10PM taruvaatha YCP vaallu malli rigging try chesaru, enni donga votes poll chesaro. Don't know if any TDP agents present or not.

Ayina police department ela help chesthondi for YCP that too in town?

"10PM taruvaatha YCP vaallu malli rigging try chesaru, enni donga votes poll chesaro. Don't know if any TDP agents present or not."

Yesterday nenu cheppindhi dheeni gurinche....

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...