Jump to content

‘పటాస్‌’ చిన్నోడికి హ్యాపీ బర్త్‌డే


Ramesh39

Recommended Posts

5brk-kram1a.jpg

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘నాకు నచ్చితే ఎంత రిస్క్‌ అయినా చేస్తా’’ ఇది ‘అతనొక్కడే’ చిత్రంలో కల్యాణ్‌రామ్‌ డైలాగ్‌. ఇది ఆయనకు అతికినట్లు సరిపోతుంది. విభిన్న పాత్రలను ఎంచుకుని ప్రతీ సినిమాలోను తనలోని ఓ కొత్త కోణాన్ని చూపిస్తూ కథానాయకుడిగా రాణిస్తున్న నందమూరి వారసుడు కల్యాణ్‌రామ్‌. తాతయ్య నందమూరి తారకరామారావు పేరుతో సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించి అటు నటుడిగా ఇటు నిర్మాతగా మంచి గుర్తింపు పొందారు. మంగళవారం కల్యాణ్‌రామ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెపుతూ.. 

తొలి అడుగు బాలకృష్ణతో.. 

నటుల కుటుంబం కావటంతో కల్యాణ్‌రామ్‌కు చిన్నతనంలోనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘బాలగోపాలుడు’ చిత్రంలో బాల నటుడిగా తెరంగ్రేటం చేశారు. అయితే తర్వాత చదువుపైనే పూర్తి శ్రద్ధ పెట్టారు. అమెరికాలో మాస్టర్స్‌ చేసిన కల్యాణ్‌రామ్‌ ఏడాది పాటు ఉద్యోగం కూడా చేశారు. అయితే నటనపైన ఉన్న మక్కువే తనను సినిమా రంగానికి వచ్చేలా చేసిందంటారు. 

నటుడు+నిర్మాత.. 

కల్యాణ్‌రామ్‌ 2003లో ‘తొలి చూపులోనే’ చిత్రంతో హీరోగా కెరీర్‌ను ప్రారంభించారు. ఈ చిత్రంతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చేసిన ‘అభిమన్యు’ చిత్రం కూడా కల్యాణ్‌రామ్‌కు సక్సెస్‌ అందించలేకపోయింది. అయితేనేం.. తనకు నచ్చిన, తాను నమ్మిన కథతో, కొత్త దర్శకుడితో, తానే హీరోగా సొంతంగా చిత్రం నిర్మించే సాహసం చేశారు. అదే ‘అతనొక్కడే’. ఈ చిత్రం బాక్సాఫీస్‌ మంచి విజయాన్ని అందుకుంది. అక్కడి నుంచి ఓ వైపు హీరోగా మరో వైపు నిర్మాతగా ద్విపాత్రాభినయాన్ని సమర్థంగా నిర్వర్తించి సక్సెస్‌ సాధించారు.

ఆ తర్వాత అసాధ్యుడు, లక్ష్మీకల్యాణం, హరే రామ్‌, జయీభవ, కత్తి, ఓం త్రీడీ, చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్యాణ్‌రామ్‌ 2013లో పోలీసు పాత్రలో నటించిన ‘పటాస్‌’ చిత్రం ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. రవితేజ కథానాయకుడిగా నటించిన ‘కిక్‌-2’ చిత్రానికి కల్యాణ్‌రామ్‌ నిర్మాతగా వ్యవహరించారు. తాను నటించిన చిత్రానికి కాకుండా వేరే హీరోతో తెరకెక్కించిన చిత్రానికి నిర్మాతగా ఆయన వ్యవహరించడం ఇదే తొలిసారి.

5brk-kram1b.jpg బాబాయ్‌తో సినిమా! 

కల్యాణ్‌రామ్‌ నిర్మాతగా బాలకృష్ణ కథానాయకుడిగా ఓ చిత్రాన్ని అనుకున్నారట. ఇందులో హరికృష్ణ కీలక పాత్ర పోషించేవారట. తాను, తారక్‌ కలిసి ఓ సన్నివేశంలో నటించేందుకు ప్రణాళిక కూడా వేశారట. అయితే చిత్రం స్క్రిప్ట్‌ దశలోనే ఆగిపోయింది. మల్టీస్టారర్‌ సినిమా చేయాల్సి వస్తే.. తన తండ్రి హరికృష్ణతో సినిమా చేస్తానని, తాతగారి సినిమాల్లో రీమేక్‌ చేయాల్సి వస్తే యుగంధర్‌, బాబాయ్‌ చిత్రాల్లో అయితే భైరవద్వీపం చేస్తానని చెపుతుంటారు. ఇక రాజమౌళి, వి.వి.వినాయక్‌లాంటి దర్శకులతో చిత్రం చేసే అవకాశం వస్తే రాత్రి, పగలైనా పనిచేయడానికి సిద్ధమే అంటారు కల్యాణ్‌రామ్‌. 

పూరి దర్శకత్వంలో ‘ఇజం’ 

ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘ఇజం’ అనే చిత్రంలో నటిస్తున్నారు కల్యాణ్‌రామ్‌. ఇది వరకు కనిపించిన చిత్రాల్లో కన్నా ఇందులో స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా కల్యాణ్‌రామ్‌ తన సొంత బ్యానర్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ‘‘డబ్బు సంపాదించడం ప్రధానం కాదు. మంచి పేరు పొందడమే లక్ష్యం’ అనే కల్యాణ్‌రామ్‌కు ఆల్‌ ద బెస్ట్‌ చెబుతూ మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...