Jump to content

బాలయ్య న్యూ లుక్‌!


AnuSri

Recommended Posts

(20 Apr) నందమూరి బాలకృష్ష, త్రిష, రాధిక ఆప్టే నటీనటులుగా సత్యదేవ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం 'లయన్‌'. ఎస్‌ఎల్‌వి సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శనివారంతో పూర్తవ్వడంతో గుమ్మడికాయ కొట్టారు. మే నెల ప్రారంభ చిత్రంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ జవ్వాజి రామాంజనేయులు. చిత్రం ప్రోగ్రెస్‌ గురించి నిర్మాత వివరిస్తూ ' మా హీరో బాలకృష్ణగారు ఈ సినిమాలో కొత్త లుక్‌తో కనిపిస్తారు. విభిన్న కోణాలు కలిగిన ఓ పవర్‌ఫుల్‌ కేరెక్టర్‌ను ఆయన అత్యద్భుతంగా పోషించారు. నందమూరి అభిమానులను అలరించే రీతిలో సినిమా ఉంటుంది. త్రిష, రాధికా ఆప్టే, ప్రకాశ్‌రాజ్‌, జయసుధ సహా 40 మంది ప్రముఖ తారాగణం ఈ చిత్రంలో నటించారు. అత్యాధునిక సాంకేతిక విలువలు కలిగిన ఈ సినిమా చిత్రీకరణకు 130 రోజులు పట్టింది. చిత్రంలో గ్రాఫిక్‌ వర్క్‌కి ఎంతో ప్రాధాన్యం ఉంది. రెండు ప్రముఖ సంస్థలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రాఫిక్స్‌ పనిలో నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ శరవేగంతో జరుగుతోంది. ఇటీవల విడుదలైన ఆడియోతో సినిమా మీద భారీ అంచానాలు ఏర్పడ్డాయి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...