Jump to content

murali@nbkfan

Members
  • Posts

    18,122
  • Joined

  • Last visited

  • Days Won

    1

Reputation Activity

  1. Like
    murali@nbkfan reacted to sonykongara in Prakasam Barrage Beautification   
    ప్రకాశం బ్యారేజీకి రూ. 9కోట్లతో 14గేట్లు
      వరదప్రవాహం, ఇతర అవసరాల కోసమే..  పూర్తికావస్తున్న అప్రానపనులు  పుష్కరాలలో తొక్కిసలాటకు అస్కారం లేకుండా..  15మి.వెడల్పుతో నూతన వంతెన  (ఆంధ్రజ్యోతి, విజయవాడ)
    ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. బ్యారేజీకి సంవత్సరాల కిందట ఏర్పాటుచేసిన పలుగేట్లను తీసివేసి, దాదాపు రూ. 9కోట్లతో 14నూతన గేట్లను అమర్చుతున్నారు. వీటిలో తాడేపల్లివైపు ఎనిమిది, ఇంద్రకీలాద్రివైపు ఆరుగేట్లు ఉండగా.. ఇప్పటి వరకు ఒకగేటును ఏర్పాటుచేశారు. దీంతోపాటు ప్రకాశం బ్యారేజీ దిగువన చేపడుతున్న అప్రానపనులు కూడా పూర్తికావచ్చాయి. దాదాపు రెండున్నర నెలల కిందట చేపట్టిన ఈ పనులు 70శాతం అయ్యాయి. పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న ఈ అప్రానపనుల్లో 15మి.వెడల్పు గల బ్రిడ్జి, అప్రాననుంచి ర్యాంపు నిర్మాణ పనులు నెలరోజుల్లో పూర్తిచేయనున్నారు.   రూ. 200కోట్లతో డెల్టా ఆధునికీకరణ పనులు
    డెల్టా ఆధునికీకరణ నిమిత్తం 2009లో రూ. 200కోట్లను కేటాయించారు. విజయవాడ నగర పరిధిలో ఉన్న కాలువలు, ప్రకాశంబ్యారేజి, లాకుల్లో మరమ్మతులు, అభివృదిఽ్ధ పనులను వీటితో చేపట్టాల్సి ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతం గేట్లను మార్చుతున్నారు. అయితే 2004లో బ్యారేజికి సంబంధించి మొత్తం 70 గేట్లను మార్చారు. అయితే ఈ బ్యారేజికి అమర్చిన గేట్లలో విజయవాడవైపు ప్రారంభంలో ఉన్న 6గేట్లను, తాడేపల్లి వైపు ప్రారంభంలో ఉన్న ఎనిమిదిగేట్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వరద సమయంలో కోతకు గురై వచ్చిన బురదమట్టి, ఇసుక, గుర్రపుడెక్క తదితర వాటిని కూడా ఈ గేట్ల ద్వారానే బయటకు పంపుతారు. అధిక వాడకం్ల, సక్రమంగా నిర్వహణ చేయకపోవటం వల్ల ఈ 14గేట్లు బాగా పాడైపోయాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఈ 14గేట్లను మార్చుతున్నారు.   పూర్తికావస్తున్న అప్రాన పనులు
    కృష్ణా పుష్కరాలు, భవిష్యత అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న రెండునెలల క్రితం బ్యారేజీ దిగువన చేపట్టిన అప్రానపనులు కూడా పూర్తికావస్తున్నాయి. దాదాపు రూ. 15కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టారు. దీంతోపాటు బ్యారేజీ దిగువ నుంచి జాతీయరహదారికి 10 మీటర్ల వెడల్పుతో ఒక ర్యాంపును నిర్మించబోతున్నారు. దీనికోసం ఇప్పటి వరకు 100మీటర్ల గోడను పూర్తిచేశారు. దీనిపక్కనే ఒక ర్యాంపు ఉన్నప్పటికీ, పుష్కరాల కోసం అత్యధిక జనం వచ్చే అవకాశం ఉండటంతో మరొకటి నిర్మిస్తున్నారు.
    త్వరలో పనులు పూర్తి
    ప్రస్తుతం బ్యారేజీకి సంబంధించిన పనులన్నీ చకచక జరుగుతున్నాయి. గేట్ల నవీకరణ పనులు త్వరలోనే పూర్తిచేస్తాం. ఇరిగేషన ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఈ పనులన్నింటిని త్వరగా చేయించేందుకు ఆదేశాలు జారీచేశారు. అప్రాన పనులు కూడా దాదాపు పూర్తికావొచ్చాయి. పుష్కరాల సమయంలో ఈ అప్రానపై షవర్స్‌ (జల్లుస్నానం) ఏర్పాటుచేయాల్సి ఉంది. ర్యాంపు పనుల్ని కూడా మొదలుపెట్టాం.
    - ఆర్‌. రవికిరణ్‌, ప్రకాశం బ్యారేజీ సూపర్‌వైజర్‌
×
×
  • Create New...