Cyclist Posted May 7, 2021 Posted May 7, 2021 బిక్కజచ్చిన తెలుగు కళామతల్లి ఒకప్పుడు సామాజిక పరిస్థితులను తెరమీద చూపి చైతన్యం తెచ్చేది. అక్కడితో ఆగకుండా జనం ముందుకు జోలెపట్టుకొని వచ్చేది. జనాన్ని కాపాడేది. ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటేది. నేడు మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా అడపాదడపా ఓటీటీ లలో తళుక్కుమని కనిపిస్తున్నా.. థియేటర్ల మీద ఆశ చావక, అక్కడి ఆర్జన మీద ఆశ చావక, ముసుగేసుకొంది. ప్రేక్షకుడు మడిగట్టుకోడు కదా. సబ్ టైటిల్స్ తో & డబ్బింగ్ లతో ప్రపంచం అందిస్తున్న వినోదాన్ని ఆస్వాదిస్తున్నాడు. ప్రపంచంతో పోటీపడే ఓటిటి వినోదం దిశగా.. తెలుగు కళామతల్లి అడుగులు వెయ్యలేక గోళ్ళు కొరుక్కోవడంలో తీరికాలేకుండా వుంది. కనీసం శవాల దిబ్బగా మారుతున్న రాష్ట్రాల పట్ల చలనం లేకుండా.. పాలక పక్షవాతం మీద పల్లెత్తుమాట మాట్లాడలేని బానిసత్వంతో & భయంతో బిక్కజచ్చినది. సాయం విషయంలో స్పందించడానికి కూడా ముందుకు రాక, అస్తిత్వాన్ని కూడా కోల్పోయింది. కూటి కోసం కోటి విద్యలు తప్పులేదు. పైసల కోసం మౌనంలో తప్పులేదు. కాని జనం సామూహికంగా కాటికి వెళుతున్నా.. బిక్కజచ్చిన కళామతల్లికి ప్రగాఢ సానుభూతి. తెలుగు కళామతల్లి ఫక్తు కమర్షియల్ అయ్యి తెలుగువారి పట్ల కనీస కనికరం & స్పందన లేకుండా దూరంగా ప్రవర్తించినప్పుడు, తెలుగు ప్రేక్షకుడు కూడా అంతే దూరం పాటిస్తాడు. ప్రపంచ కుగ్రామ వినోదాన్ని తనదనుకొంటాడు. ఒక నాటి నాటకంలా తెలుగు వెండితెర కూడా ఎలైట్ కల్చర్ గా మారిపోనుంది. 5జి నాటికి సినిమా & సీరియల్ కోసం.. థియేటర్ కు కుటుంబం & ఇంట్లో టివి ముందు కుటుంబం మొత్తం కూర్చోదు. అరచేతిలో ఎవరికి నచ్చిన ఓటిటి సినిమాలా.. వెబ్ సిరీస్ లా పరిస్థితులు మారిపోతాయి. సమాజంలో సామూహిక వినోదం అనేది ప్రాణాంతకమయిన పరిస్థితులు మరింత ఆజ్యం పోస్తాయి. మల్టీ ఫ్లెక్స్ లలో వారం రోజులు రప్పించడానికి చేసే సర్కస్ లు ఇక గతం. మిథునం లాంటి చిన్న సినిమా అయినా.. స్పందింపజేస్తే ప్రపంచం ఆహ్వానిస్తుంది. అసలైన కళకు ఆదరణ అపూర్వంగా వుంటుంది. #చాకిరేవు
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.