balajik Posted October 21, 2016 Share Posted October 21, 2016 20 October 2016Hyderabad నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం `ఇజం`. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ నిర్మించింది. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో నందమూరి కల్యాణ్‌రామ్ విలేకరులతో మాట్లాడారు. * `ఇజం` గురించి చెప్పండి?-`ఇజం` అనేది సిద్ధాంతం. ఒక సిద్ధాంతాన్ని ఒకరుగానీ, కొంతమంది గానీ ఫాలో కావచ్చు. ఆ సిద్ధాంతం వల్ల సమాజానికి మంచి జరగవచ్చు. ఈ సినిమాలో నా పాత్ర కూడా సమాజానికి మంచి చేసేదే. * సమాజాన్ని గురించి ఇప్పటిదాకా చాలా చిత్రాలే వచ్చాయి.. ఇది స్పెషల్ ఎలా అవుతుంది?- సమస్య గురించి చెబుతూ చాలా సినిమాలు వచ్చాయి. అయితే సమస్యకు పరిష్కారం చెబుతూ ముగింపునిచ్చారు. ఈ సొల్యూషన్ అదేదో ఎవరికీ అందనట్టు ఉండదు. ఆమోదయోగ్యంగానే ఉంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. * జర్నలిస్టుకి, సిక్స్ ప్యాక్‌కి సంబంధం ఏంటి?- మన మెంటల్ ఫిట్నెస్ను చాలా వరకు ఫిజికల్ ఫిట్నెస్ ప్రతిబింబిస్తుంది. అందుకే చేశాను. * సిక్స్ ప్యాక్ ప్రాసస్ గురించి చెప్పండి?- నాలుగు నెలల్లో 12 కిలోలు తగ్గా. ఎక్కువగా ఫిష్ తిన్నాను. మామూలుగా నాకు ఫిష్ నచ్చదు. Kalyan Ram interview gallery * పూరి వర్కింగ్ స్టైల్ వేరు, మీ స్టైల్ వేరు.. ఎలా బ్యాలన్స్ చేశారు?- నన్ను నాలాగే ఉండమన్నారు పూరిగారు. నేను ఎలా ఉండాలో ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఎంత స్పీడ్‌గా చేసినా ఆయన పర్ఫెక్ట్ గా చేసేవారు. అందుకే ఆయనతో పనిచేయడం నాకు చాలా ఇష్టంగా అనిపించింది. * మీ రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాను చేసినట్టున్నారు?- అవునండీ. నా నుంచి ఇకపై ఇలాంటి చిత్రాలే వస్తాయి. డిఫరెంట్‌గా చేయకపోతే ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. అందువల్ల డిఫరెంట్‌గా చేయాలని ఫిక్స్ అయ్యాను. * టీజర్‌కి పదింతలు గొప్పగా సినిమా ఉంటుందని అన్నారు. నమ్మొచ్చా?- వెయ్యి శాతం నమ్మండి. సినిమాలో పదో వంతు కూడా టీజర్లో ఉండదు. సినిమా మొత్తం అంత బావుంటుంది. థియేటర్లో సినిమాను చూసిన షాకవుతారు. * ఇంకేం హైలైట్స్ ఉంటాయి?- లవ్ స్టోరీ, జర్నలిజంతో పాటు హీరో ఫ్యామిలీ కూడా ఉంటుంది. మూడు లేయర్లున్న చిత్రం. పూరిగారు చాలా బాగా చేయించారు. ఈ సినిమాకు నాకు అవార్డు వస్తే పూరిగారికి ఇచ్చేయాలి. * సాయిధరమ్‌తేజ్‌తో మీ సినిమా ఎప్పుడు ఉంటుంది?- స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. * మీ తదుపరి చిత్రాలేంటి?- త్వరలోనే చెబుతాను. 20 October 2016 Hyderabad నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం `ఇజం`. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ నిర్మించింది. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో నందమూరి కల్యాణ్‌రామ్ విలేకరులతో మాట్లాడారు. * `ఇజం` గురించి చెప్పండి? -`ఇజం` అనేది సిద్ధాంతం. ఒక సిద్ధాంతాన్ని ఒకరుగానీ, కొంతమంది గానీ ఫాలో కావచ్చు. ఆ సిద్ధాంతం వల్ల సమాజానికి మంచి జరగవచ్చు. ఈ సినిమాలో నా పాత్ర కూడా సమాజానికి మంచి చేసేదే. * సమాజాన్ని గురించి ఇప్పటిదాకా చాలా చిత్రాలే వచ్చాయి.. ఇది స్పెషల్ ఎలా అవుతుంది? - సమస్య గురించి చెబుతూ చాలా సినిమాలు వచ్చాయి. అయితే సమస్యకు పరిష్కారం చెబుతూ ముగింపునిచ్చారు. ఈ సొల్యూషన్ అదేదో ఎవరికీ అందనట్టు ఉండదు. ఆమోదయోగ్యంగానే ఉంటుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. * జర్నలిస్టుకి, సిక్స్ ప్యాక్‌కి సంబంధం ఏంటి? - మన మెంటల్ ఫిట్నెస్ను చాలా వరకు ఫిజికల్ ఫిట్నెస్ ప్రతిబింబిస్తుంది. అందుకే చేశాను. * సిక్స్ ప్యాక్ ప్రాసస్ గురించి చెప్పండి? - నాలుగు నెలల్లో 12 కిలోలు తగ్గా. ఎక్కువగా ఫిష్ తిన్నాను. మామూలుగా నాకు ఫిష్ నచ్చదు. Kalyan Ram interview gallery * పూరి వర్కింగ్ స్టైల్ వేరు, మీ స్టైల్ వేరు.. ఎలా బ్యాలన్స్ చేశారు? - నన్ను నాలాగే ఉండమన్నారు పూరిగారు. నేను ఎలా ఉండాలో ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఎంత స్పీడ్‌గా చేసినా ఆయన పర్ఫెక్ట్ గా చేసేవారు. అందుకే ఆయనతో పనిచేయడం నాకు చాలా ఇష్టంగా అనిపించింది. * మీ రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాను చేసినట్టున్నారు? - అవునండీ. నా నుంచి ఇకపై ఇలాంటి చిత్రాలే వస్తాయి. డిఫరెంట్‌గా చేయకపోతే ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. అందువల్ల డిఫరెంట్‌గా చేయాలని ఫిక్స్ అయ్యాను. * టీజర్‌కి పదింతలు గొప్పగా సినిమా ఉంటుందని అన్నారు. నమ్మొచ్చా? - వెయ్యి శాతం నమ్మండి. సినిమాలో పదో వంతు కూడా టీజర్లో ఉండదు. సినిమా మొత్తం అంత బావుంటుంది. థియేటర్లో సినిమాను చూసిన షాకవుతారు. * ఇంకేం హైలైట్స్ ఉంటాయి? - లవ్ స్టోరీ, జర్నలిజంతో పాటు హీరో ఫ్యామిలీ కూడా ఉంటుంది. మూడు లేయర్లున్న చిత్రం. పూరిగారు చాలా బాగా చేయించారు. ఈ సినిమాకు నాకు అవార్డు వస్తే పూరిగారికి ఇచ్చేయాలి. * సాయిధరమ్‌తేజ్‌తో మీ సినిమా ఎప్పుడు ఉంటుంది? - స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. * మీ తదుపరి చిత్రాలేంటి? - త్వరలోనే చెబుతాను. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.