సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ (Republic) చిత్రం అనంతరం దేవాకట్టా (Deva Katta) కాస్త సమయం తీసుకుని రూట్ మార్చి మయసభ (Mayasabha) అనే రాజకీయ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ను త్వరలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఫ్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సిరీస్ నుంచి కొన్ని కొత్త ఆసక్తికర అప్డేట్స్ బయటకు వచ్చాయి.
తెలుగు రాజకీయాల్లో దిగ్గజ వ్యక్తులైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Y. S. Rajasekhara Reddy), ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) జీవితాల చుట్టూ ఈ వెబ్ సిరీస్ రూపొందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆది పినిశెట్టి (Aadhi Pinisetty), చైతన్య రావు (Chaitanya Rao) చంద్రబాబు నాయడు, రాజశేఖర్ రెడ్డిలుగా లీడ్ రోల్స్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే.. 2020లోనే చంద్రబాబు, వైఎస్ఆర్ ల స్నేహంపై ఇంద్రప్రస్థం పేరుతో ఓ ప్రాజెక్టు ను దేవా కట్టా (Deva Katta) ఎనౌన్స్ చేశారు.. మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ తరువాత దాని గురించి ఎలాంటి సమాచారం లేక మరుగున పడి పోయింది. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సిరీస్‌ను రెండు మూడు సీజన్లుగా రూపొందించాలని చూస్తుండగా మయసభ (Mayasabha) మొదటి సీజన్‌ను ఈ ఏడాది చివరిలో సోని లీవ్ ఓటీటీలో తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్ట్రీమింగ్‌కు తీసుకు వస్తున్నట్లు వినికిడి. మరికొద్ది రోజుల్లో ఈ వార్తలపై అధికారిక ప్రకటన రానుంది.