Jump to content

Kiriti

Members
  • Posts

    2,494
  • Joined

  • Last visited

Posts posted by Kiriti

  1. 1 hour ago, LuvNTR said:

    hyd lo mostly failure avuthayi. AP lo kaadu. AP govt does't blindly give land. They also provides guidance by hiring peer veterans in the sector and markets them to own usage. Lokesh vochaka antha maripoyindi ippudu. ikkada emo lokesh meeda doubts paduthunnaru. akkada ayana chinchi istharaku esthunnadu bhayamkaram ga policy changes techi. i hear that any private company can own land (direct registration title transfer) but they have to give back 2% in profits every year to govt. it is one option. most companies are going for this now:D

    Excellent One.

  2.  

    బాబు కట్టిన అమరావతికి టికెట్‌ ఇవ్వండి!

    26-07-2017 02:39:36
     
    • బస్‌ కండక్టర్‌ను అడిగిన రైతు
     
    అమరావతి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): సచివాలయానికి వచ్చి తమ కష్టాలపై వినతిపత్రం ఇచ్చేందుకు ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రైతు విజయవాడ వచ్చారు. విజయవాడ బస్టాండ్‌లో దిగి... పంచారామాల్లో ఒకటైన ‘అమరావతి’కి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఎక్కడికి వెళ్లాలి అని కండక్టర్‌ అడగ్గానే... ‘అమరావతికి ఒక టికెట్‌’ అని రైతు వందనోటు తీసిచ్చారు. 35 రూపాయల టికెట్‌తోపాటు 65 చిల్లరను కండక్టర్‌ ఇచ్చారు. ‘అదేమిటి... అమరావతి టికెట్‌ 26 రూపాయలే కదా’ అని రైతు ప్రశ్నించారు. కాదు... 35 అని కండక్టర్‌ అన్నారు.
     
    ‘లేదయ్యా! మా ఊళ్లో వాళ్లు చెప్పారు. విజయవాడ నుంచి అమరావతికి టికెట్‌ 26 రూపాయలే’ అని ఆ రైతు గట్టిగా చెప్పారు. కండక్టర్‌ కొంత అయోమయంలో పడ్డారు. ‘ఇంతకీ ఏ అమరావతికి వెళ్లాలి?’ అని ప్రశ్నించడంతో... ‘అదేనయ్యా... చంద్రబాబు కట్టిన అమరావతికి’ అని రైతు బదులిచ్చారు. కండక్టర్‌కు అసలు విషయం అర్థమైంది. ‘‘మీరు వెళ్లాల్సింది వెలగపూడికి. అక్కడే సచివాలయం ఉంది. అక్కడికైతే టికెట్‌ 26 రూపాయలే’’ అని రైతుకు వివరంగా చెప్పారు. డిజైన్లు, నమూనాలు, సర్కారు వారి ప్రకటనలతో ‘అమరావతి’ సామాన్య ప్రజల్లోకి బలంగా వెళ్లిందనేందుకు ఇదో నిదర్శనం. అమరావతిపై ఏర్పడిన అంచనాలకూ ఈ సంఘటన అద్దం పడుతోంది!

     

     

    Super.

  3. ee situation (above 845 ft) lo Mutchumarri no use

     

    Sunkesula full - so No issue for KC canal

    HNSS - Malyala pumps can start above 835 ft

    Pothireddypadu - 40k above 854 ft

     

    HNSS expansion works jaruguthunnayi -and also 8 stages lo vunna lifts lo motors kuda add cheyyali - may be in a year or two it will be a reality

     

    Idhi emiti ? Above 810 ft lo Mutchumarri comfortable kadha.

  4. All these tv channels and 'news' papers (not just sakshi) are obviously operating with blatant agenda to undermine everything TDP does (except may be AJ). I'm sure CBN/TDP knows this. Lower level leaders (constituency level, mla) need to take active part in taking these programs further. CBN anni chusukoledu.

     

    Lower level leaders baga dull ga vunnaru brother. Evaru active part theesukovatamu ledhu except here and there. Gadde Rammohan lanti vaallaku Ministry ivvakapoyina, ituvanti responsibilities isthe chakkaga handle chestharu.

  5. copied from Facebook-- just last two lines.

    .......

    చివరగా -

    కృష్ణ నదిలో కృష్ణ నీరు ... బ్రహ్మ సృష్టి !

    కృష్ణ నదిలో గోదావరి నీరు ... చంద్రబాబు ప్రతి సృష్టి !!(భువన్ మాగంటి)

     

     

    Super Kick ante idhi.

  6. Sometimes these things matters a lot.. I have seen cases where people struggling to find a vehicle to carry dead Modies.. Last minute lo chalaa pathetic anipisthaay alaanti situations..

     

    I personally liked this move..

     

     

    Innallu mana govts asalu ee service provide cheyyalekapovatam too bad., sarele late aina okati plan chesaru..

     

     

    Very good initiative ...much appreciated 

  7.  

    4,781 కోట్లు తక్షణం చెల్లించండి

     

    • తెలంగాణ జెన్కోకు తుది నోటీసు
    • నేడు అందజేయనున్న ఏపీ జెన్కో
    అమరావతి, మే 23 (ఆంధ్రజ్యోతి): తీసుకున్న విద్యుత్తునకు అసలు, వడ్డీ కలిపి వెంటనే చెల్లించాల్సిందిగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం తుది తాఖీదు ఇవ్వనుంది. ‘‘రాష్ట్ర విభజన నాటినుంచి రాష్ట్ర విద్యుత్కేంద్రాల నుంచి ఉత్పత్తి అవుతున్న కరెంటులో 53.89 శాతం తెలంగాణకు అందిస్తున్నాం. దానికిగాను ఇప్పటిదాకా ఏపీ జెన్కోకు రూ.4,781 కోట్లను చెల్లించాల్సిఉంది. ఇంత పెద్ద బకాయిని రాబట్టుకోలేకపోవడం వల్ల ఏపీ జెన్కో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. ఏపీ ట్రాన్స్‌కో నుంచి అడపాదడపా సర్దుబాటు మొత్తాలను తీసుకోవాల్సి వస్తోంది. భారీ స్థాయిలో తెలంగాణ నుంచి బకాయిలు రాకపోవడం వల్ల బొగ్గు సరఫరా దారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి, వెంటనే రూ.4,781కోట్లను చెల్లించండి. లేదంటే..ఈ నెలాఖరు నుంచి కరెంటు సరఫరాను బంద్‌ చేస్తాం’’ అంటూ తెలంగాణ జెన్కోకు అందించడానికి ఏపీ జెన్కో లేఖని సిద్ధం చేసింది. ఈ లేఖ కాపీలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌కు అందజేసిన ఏపీ జెన్కో అధికారులు, బుధవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌సీ సింగ్‌, తెలంగాణ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శికి, తెలంగాణ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావుకు అందజేసేందుకు సమాయత్తమవుతున్నారు.

     

     

    Good Decision  atlast..

  8. Ippudochi money waste somaripotulu avtaru adi idi ani cheppakandi. Ilantivi cheyakapote votlu veyaru so cheyali.

     

     

    Good step by government.... At least government is now taking liability for unemployment and sure now governments will focus more on creating employment opportunities more and more to come out of the liabilities... Good job by CBN sir

  9.  

    నిరుద్యోగ భృతి

     

    636237544048226860.jpg
    • ఈ బడ్జెట్‌లోనే నిధుల కేటాయింపు 
    • డిగ్రీ, ఆపైన చదివిన యువతకు లబ్ధి
    • విద్యార్హతను బట్టి నెలకు
    • వెయ్యి నుంచి రూ. 2 వేలు చెల్లింపు
    • సమాజ సేవ చేయిస్తూ చేయూత
    • కులాల వారీ కార్పొరేషన్లకు సెలవు
    • అన్ని వర్ణాల పేదలకూ సహాయం
    • ఈ బడ్జెట్‌లోనే నిధుల కేటాయింపు
    • కొత్తవి, పాతవి కలిపి 10 లక్షల ఇళ్లు
    • ఒకేసారి ఎన్నికల నిర్వహణకు మొగ్గు
    • మూడంచెల ‘పంచాయతీ’ మేలు
    • మార్పు కోసం కేంద్రానికి లేఖ రాస్తా
    • ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనలు
    • టీడీపీ పొలిట్‌ బ్యూరో కీలక నిర్ణయాలు
    • పెండింగ్‌ హామీల అమలుపై దృష్టి
    అమరావతి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యను అభ్యసించి, ఉపాధి దొరకని యువతకు శుభవార్త! విద్యావంతులైన నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విద్యార్హతను బట్టి రూ.1000 నుంచి 2వేల వరకు నిరుద్యోగ భృతి ఇస్తామన్న టీడీపీ ఎన్నికల హామీని అమలు చేయనున్నట్టు ప్రకటించారు. ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ అంశాన్ని సీఎం స్వయంగా లేవనెత్తారు. టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను, ఇప్పటివరకు అమలు చేసిన పథకాలను వివరిస్తూ... ‘అమలు చేయాల్సిన హామీల్లో ముఖ్యమైనది నిరుద్యోగ భృతి’ అని తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే అమలు చేద్దామని సీఎం చెప్పారు. డిగ్రీ, ఆ పైన చదువుకున్న యువతకు... ఉపాధి సంపాదించుకునేంతవరకు భృతిని ఇవ్వాలని సీఎం ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తామని... 2017-18 రాష్ట్ర బడ్జెట్‌లోనే నిరుద్యోగ భృతి కోసం నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఈ నిర్ణయానికి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ‘‘నిరుద్యోగ భృతి చాలా కీలకమైన అంశం. భృతి పేరిట నెలనెలా ఊరికే డబ్బు ఇచ్చినట్టు కాకుండా, వారి చేత సామాజిక సేవ చేయించాలని భావిస్తున్నాం.’’ అని సీఎం తెలిపారు. భృతి అందుకునే వారితో గామ్రాల్లో పిల్లలకు చదువు చెప్పించడంవంటి కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు.
     

    అన్ని వర్ణాల పేదలకు సాయం

    అగ్రవర్ణ పేదలకు (ఈబీసీ) ఆర్థిక సాయం అందించాలని పొలిట్‌ బ్యూరోలో కీలకనిర్ణయం తీసుకున్నారు. ఇందుకు 2017-18 బడ్జెట్‌లోనే నిధులు కేటాయించనున్నట్టు సీఎం చెప్పారు. ఈ అంశం పొలిట్‌బ్యూరోలో చర్చకు వచ్చినప్పుడు... ఇకపై కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయరాదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఎన్టీఆర్‌ ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల నుంచి ఇప్పుడు చంద్రబాబు ఏర్పాటు చేసిన బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్ల వరకు.. ఆయా వర్గాలకు చేయూతనిస్తున్నాయని సభ్యులు ప్రశంసించారు. అయితే, ఒక్కో కులానికి ఒక్కో సంస్థ ఏర్పాటు చేస్తూ పోతే... ‘విభజన’ భావన కనిపిస్తుందని పేర్కొన్నారు. దీంతో... కులాలకు అతీతంగా, అన్ని వర్గాల్లోని పేదలకు (ఈబీసీ) సాయం చేద్దామని సీఎం చెప్పారు. ఆడపిల్ల పుట్టినప్పుడు రూ. 30వేలు డిపాజిట్‌ చేసి, యుక్త వయసు వచ్చాక రెండు లక్షల రూపాయలను డ్రా చేసి ఇవ్వాలన్న ఎన్నికల హామీని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. విధి విధానాలను ఖరారు చేశాక దీనిపై ప్రకటన చేస్తామని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ ఎంఈ)ను ప్రోత్సహించడం కోసం ఒక అథారిటీని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో త్వరలో ఎన్టీఆర్‌ అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేక విత్తన చట్టాన్ని తేనున్నట్టు సీఎం వెల్లడించారు. ఇక... చంద్రన్న బీమా పథకాన్ని పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రశంసించారు. 2.5 కోట్ల మంది పేదల జీవితాలకు ఈ పథకం భరోసా కల్పిస్తోందని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే మంజూరై వివిధ దశల్లో ఉన్నవి, కొత్తగా మంజూరు చేయబోయేవి కలిపి మొత్తం 10 లక్షల గృహాలను 2018లోగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్రం లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలకే గృహ అవసరం ఉందని, అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో 50 లక్షల కుటుంబాలకు ఉన్నట్టు చూపించారని, ఇది వాస్తవాలను ప్రతిబింబించడంలేదని చెప్పారు. ఈ ప్రమాణాలను మార్చాల్సిందిగా కేంద్రాన్ని కోరతామని, మోదీకి లేఖ రాస్తానని సీఎం తెలిపారు.
     

    ఇన్‌పుట్‌ సబ్సిడీకి 1600 కోట్లు

    కరువుపై టీడీపీ పొలిట్‌బ్యూరో సుదీర్ఘంగా చర్చించింది. ఈ ఏడాది ఇన్‌పుట్‌ సబ్సిడీ... కేంద్రం నుంచి వచ్చేదిగానీ, రాష్ట్రంలో కేటాయించేది కానీ రూ.1600 కోట్లు ఉంటుందని సీఎం చెప్పారు. ఈ వేసవిలో మంచి నీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత నివారించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే ఉపాధి హామీకి 150 పని దినాలు కల్పించనున్నట్టు సీఎం చెప్పారు.
     
    ఒకేసారి ఎన్నికలకు సై: పార్లమెంటుకు, రాష్ట్రాల శాసన సభలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రతిపాదనతో టీడీపీ ఏకీభవించింది. ప్రధాని మోదీ పదేపదే చేస్తున్న ఈ సూచన మంచిదే అని అభిప్రాయపడింది. లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరగడంవల్ల కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీల దృష్టి మొత్తం ఆవైపే ఉంటోందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి ఏటా ఎన్నికల వల్ల కేంద్రంలో పరిపాలన కుంటుపడుతోందని అభిప్రాయపడ్డారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రకటించిన ప్యాకేజీ అమలు తీరునే ఇందుకు ఉదాహరణగా ప్రస్తావించారు. ‘‘కేంద్రం ఇచ్చిన హామీలలో కొన్నింటికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం అవసరం. ఆ ప్రక్రియ వాయిదా పడుతోంది. ఇతర హామీల అమలూ నెమ్మదిగానే ఉంది. పార్లమెంటు ఎన్నికలు జరిగిననాటి నుంచి ప్రతి సంవత్సరమూ రాష్ట్రాల ఎన్నికలు వస్తున్నాయి. గత ఏడాది మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే... ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. వచ్చే ఏడాది కర్ణాటక సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 3 నుంచి 4 నెలలు రాషా్ట్రల ఎన్నికల చుట్టూ తిరుగుతోంది. పార్లమెంటు ఎన్నికలకు ఓసారి కోడ్‌... రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినప్పుడల్లా కోడ్‌ అమలు... ఇలా అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాల్లోనూ పరిపాలనకు ఆటంకం కలుగుతోంది.
     
    అలా కాకుండా ఒకేసారి అన్ని ఎన్నికలూ జరిగితే మిగిలిన కాలమంతా అభివృద్ధిపై కేంద్రీకరించవచ్చు’’ అని సీఎం వివరించారు. కేంద్రం దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన విధానాన్నే రాష్ట్రంలోనూ అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం పొలిట్‌బ్యూరోలో వ్యక్తమైంది. ప్రస్తుతం జరగాల్సిన మునిసిపల్‌ ఎన్నికలు మినహా మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం అసెంబ్లీ ఎన్నికలకు దగ్గరగానే ఉన్నాయని, ఆ విషయంలో రాష్ట్రం కొంచెం మెరుగని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలోనూ అన్ని రకాల ఎన్నికలను అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆరు నెలలకే పూర్తి చేస్తే మిగిలిన నాలుగున్నరేళ్లు అభివృద్ధిపైనే దృష్టి పెట్టవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏకకాలంలో ఎన్నికల ప్రతిపాదనకు పొలిట్‌బ్యూరో సభ్యులంతా ఆమోదం తెలిపారు.
     
    మూడంచెల ‘పంచాయతీ’

    పంచాయతీరాజ్‌ వ్యవస్థలో ఐదంచెల వ్యవస్థకు బదులు మూడంచెల వ్యవస్థ ఉంటే బాగుంటుందని సీఎం చెప్పారు. ‘‘ ప్రస్తుతం సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్‌పర్సన్లు ఉన్నారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు నామ్‌కేవాస్తేగా ఉన్నారు. వారికి విధులేవీ లేవు. ఆ రెండంచెలను రద్దు చేసి... సర్పంచ్‌లు, మండలాధ్యక్షులు, జడ్పీ చైర్‌పర్సన్లతో వ్యవస్థను నడిపించవచ్చు’’ అని వివరించారు. దీనిపై కేంద్రానికి కూడా లేఖ రాస్తానని చెప్పారు. అమరావతి నిర్మాణం నుంచి అమెరికాలో తెలుగువారిపై దాడుల వరకు అనేక అంశాలపై టీడీపీ పొలిట్‌బ్యూరోలో చర్చించారు. ఉమ్మడి అంశాలు, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినవి 15 ఉండగా... తెలంగాణకు ప్రత్యేకించిన మరో రెండు అంశాలపైనా చర్చ జరిగింది. సమావేశం తర్వాత ముఖ్యమైన నిర్ణయాలను పొలిట్‌ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాలవ శ్రీనివాసులు, రావుల చంద్రశేఖరరెడ్డి సంయుక్తంగా విలేకరులకు వెల్లడించారు.

     

     

     

    Idhi kanuka chesthe Super. Asalu కులాల వారీగా vunna corporations ni remove cheyyali.

  10. Asalu maza June-2017 lo untundi.... when we start transferring water from Godavari to Krishna early

     

     

    Appdu Srisailam nunchi Rayalaseema ku kuda earlygane Water release start cheyyavachhu anukunta. Andaru smiles tho vuntaru. Good.

  11. Krishna delta got 64+ tmc this year.

     

    Andulo major share will be credits to pattiseema because all knows when there is no water in krishna pattiseema saved krishna delta this year.

     

    Godavari delta only given 104+ tmc this year through canals.

     

    Ante difference between Krishna delta and Godavari delta is only 40% difference which is a major acheivement of CBN because krishna delta didn't seen this much water in last 3-4 years after 2011 floods

    Good achievement.

×
×
  • Create New...