Jump to content

పేదవారికి అందనున్న ఉచిత దయాలసిస్‌ సేవలు.


Kiriti

Recommended Posts

మూత్రపిండ బాధితులకు దయాలసిస్‌

నంద్యాల జిల్లా ఆసుపత్రిలో కేంద్రం ఏర్పాటు

పది పడకలతోపాటు అత్యాధునిక వసతులు

పేదవారికి అందనున్న ఉచిత సేవలు

నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులతో నూతనంగా కిడ్నీ డయాలసిస్‌ కేంద్రం ప్రారంభం కానుంది. ఈ కేంద్రాన్ని సుమారు రూ.10 కోట్లతో పది పడకలతో నిర్మించారు. ఇప్పటివరకు డయాలసిస్‌ కోసం రోగులు కర్నూలు వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో నెఫ్రోప్లస్‌ వారి అనుబంధంతో త్వరలో ఈ కేంద్రం అందుబాటులోకి రానుంది.

- న్యూస్‌టుడే, నంద్యాల పాతపట్టణం

పేద ప్రజలకు కిడ్నీ చెడిపోయి డయాలసిస్‌ చేయించుకోవాలంటే వారానికి రూ.10 వేలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక డయాలసిస్‌ కేంద్రాన్ని నెఫ్రోప్లస్‌ వారి అనుబంధంతో 13 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లా ఆసుపత్రిలో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఒక రోగికి ఒకరోజుకు నెఫ్రోప్లస్‌ వారికి రూ.960 చెల్లించనున్నది. ఈ కేంద్రాన్ని త్వరలో మంత్రి కామినేని శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించడానికి సిద్ధం చేశారు.

ఒక రోగికి రూ.40 వేలు ఆదా

రోగి ఒకసారి కిడ్నీ డయాలసిస్‌ చికిత్స తీసుకుంటే ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చు అవుతుంది. ఒక రోగి వారానికి రెండుసార్లు డయాలసిస్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే నెలకు ఇలా ఎనిమిదిసార్లు చేయించుకుంటే రూ.40 వేలు ఖర్చు వస్తుంది. పేద ప్రజలు రోజుకు అంత ఖర్చు భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయడంతో ఉచితంగా చికిత్స చేయించుకోగలరు.

అందుబాటులో పరికరాలు

* హిమో డయాలసిస్‌ యంత్రం

* ఆర్‌వో ప్లాంటు (శుద్ధిజల కేంద్రం)

* అత్యవసర చికిత్సకు వెంటిలేటర్‌ సౌకర్యం

* ఆధునిక పడకల ఏర్పాటు

నిరంతరం చేయించుకోవాల్సి ఉంటుంది

విజయ్‌కుమార్‌, ఆసుపత్రి పర్యవేక్షకుడు

డయాలసిస్‌ అనేది ఒకరోజు, ఒక వారంతో పోయేది కాదు. ప్రతి వారానికి రెండుసార్లు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్‌ కేంద్రం ఉండటం వల్ల పేద వారికి కొంత కాలంపాటు ఆర్థిక భారం పడకుండా చికిత్స తీసుకోవచ్చు. రోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం.

అత్యాధునిక వసతులు

రామకృష్ణ, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త

నంద్యాలలో జిల్లాలో ఎక్కడా లేని విధంగా కిడ్నీ డయాలసిస్‌ను అత్యాధునిక వసతులతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పేద ప్రజలకు ఇది వరంగా మారనుంది. జిల్లాలోని రోగులందరూ ఈ కేంద్రానికి వచ్చే అవకాశం ఉంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...