JVC Posted February 21, 2021 Share Posted February 21, 2021 మీకు తెలుసా అధ్యక్షా... అశోక్ అనే వ్యక్తి వైఎస్సార్ దగ్గరకు వ్యాపారం కోసం స్థలం అడగటానికి వచ్చి కళ్ళు తిరిగి పడిపోతే... వైఎస్సార్ మొహం మీద నీళ్ళు జల్లి "అశోక్ లే లాండ్ తీసుకో” అనీ అన్నాడు అప్పుడు వైఎస్సార్ అన్న మాటలకు గుర్తుగా తన కంపెనీకి Ashok Leyland అని పేరు పెట్టాడు అధ్యక్షా. 😂😂😂 అధ్యక్షా। గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారిని ఆ రోజు కలవడానికి వచ్చింది ఎవరు అధ్యక్షా... ఒకటి కియా కంపెనీ ఛైర్మన్ , రెండు ఒక సెల్ ఫోన్ కంపెనీ పెడదామనుకుంటున్న విదేశీ పెట్టుబడిదారు అధ్యక్షా। వారు లాబీ లో ఎదురుచూస్తుండగా... ఆఫీసు లోకి అడుగుపెడుతున్న గౌరవ సీఎం గారితో పీఏ మాట్లాడుతూ కియా వాళ్లని పంపించమంటారా లోపలకి మీతో అని పి.ఎ., అడిగాడధ్యక్షా. ‘నో ..కియా ‘అని రాజశేఖర్ రెడ్డి గారు సెల్ ఫోన్ కంపెనీ వారి వైపు చేయి చూపించారు అధ్యక్షా। దైవంలా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారి నోటి నుంచి వెలువడిన ఆ మాటలు నో కియా నే తమ కంపెనీ పేరు గా పెట్టుకున్నారు అధ్యక్షా... అలా పుట్టింది అధ్యక్షా ‘నోకియ‘ కంపెనీ. 😂😂😂 Link to comment Share on other sites More sharing options...
JVC Posted February 22, 2021 Author Share Posted February 22, 2021 అధ్యక్షా.... గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉండగా దక్షిణ కొరియా నుంచి వచ్చిన బృందం వారి దర్శనం కోసం ప్రదక్షిణలు చేసింది అధ్యక్షా। చివరకు ఒకరోజు అపాయింట్మెంట్ ఇచ్చారధ్యక్షా గౌరవ సీఎంగారు. ఎవరకి అధ్యక్షా? ఆ కొరియా వాళ్లకధ్యక్షా... ఆ రోజు మీటింగులో గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు వారికి చెమటలు పట్టి ఒళ్లంతా తడిచిపోయింది... రెస్ట్ రూమ్ కోసం వారు అటూ ఇటూ వెదుకుతూ చూస్తుంటే... అదిగో అటు పోయి అక్కడ పోస్కో అన్నారు అధ్యక్షా గౌరవ నేత. ఎంతో గొప్ప రిలీఫ్ ఇచ్చిన ఆ మాటనే వారి కంపెనీ పేరు గా పెట్టుకున్నారు అధ్యక్షా... అంతే అధ్యక్షా అప్పటినుంచి వారికంపెనీ POSCO వ్యాపారం మొదలుపెట్టారు. #POSCO Link to comment Share on other sites More sharing options...
SingaporeFan Posted February 22, 2021 Share Posted February 22, 2021 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.