Jump to content

కీలక ప్రాంతంలో మూడు వర్గాలుగా విడిపోయిన టీడీపీ నేతలు


koushik_k

Recommended Posts

  • చినరాజప్ప, కొండబాబు, మేయర్‌ వర్గాల మధ్య వార్‌
  • సమన్వయం చేయలేక జిల్లా అధ్యక్షుడు సతమతం
కాకినాడ: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీలో వర్గపోరు ఎక్కువవుతోంది. జిల్లా కేంద్రమైన కాకినాడలో అధికార పార్టీలో రాజకీయాలు మూడు గ్రూపులుగా సాగుతున్నాయి. హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మధ్య ఇటీవల ఏడాదిన్నరగా పొసగడం లేదు. కాకినాడ రాజకీయాల్లో రాజప్ప ప్రమేయం ఏమిటం టూ కొండబాబు ఇంత క్రితమే పార్టీ అధిష్ఠానం వద్ద పంచాయతీ పెట్టారు. తాత్కాలికంగా సర్దుబాటు అయినా.. గ్రూపుల వైరం లోలోన నివురుగప్పిన నిప్పులా ఉండిపోయింది. ఇదిలా ఉండగా... కాకినాడ మేయర్‌ సుంకర పావని తనను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ సిటీ ఎమ్మెల్యే వనమాడి గుర్రుగా ఉన్నారు. మేయర్‌ భర్త తిరుమలకుమార్‌ ఎమ్మెల్యేని ఖాతరు చేయట్లేదని, ప్రత్యర్ధి పార్టీల నేతలతో సఖ్యతగా ఉంటున్నారని కొండబాబు వర్గీయులు ఆరోపిస్తున్నారు. కాగా మూడు గ్రూపుల పొలిటికల్‌ వార్‌తో పార్టీకి నష్టం జరుగుతుందంటూ అసలు, సిసలు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
 
 
రాజప్ప వర్సెస్‌ కొండబాబు
డిప్యూటీ సీఎం, హోం మంత్రి రాజప్ప కాకినాడలో టీడీపీకి వ్యతిరేకంగా పని చేసిన కాంట్రాక్టర్లతో కుమ్మక్కవుతున్నారని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గతంలోనే పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారట. కాకినాడ జీజీహెచ్‌లో పారిశుధ్య కాంట్రాక్టు వ్యవహారంలో తనను కాదని రాజప్ప సొంత మనుషులకు కాంట్రాక్టు ఇప్పించారని, కనీసం మాటైనా తనతో చెప్పలేదని కొండబాబు అక్కసుతో ఉన్నారు. నెలకి రూ.36 లక్షల విలువైన పారిశుధ్య కాంట్రాక్టు వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలే రాజప్ప, కొండబాబు మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు.
 
దీంతో పాటు పెద్దాపురం కాకపోయినా తాను కాకినాడైనా, ఇంకోచోటైనా పోటీచేయడానికి సిద్ధమేనంటూ ఇటీవల రాజప్ప చెప్తుండటం కొండబాబు ఆగ్ర హానికి మరో కారణంగా తెలుస్తోంది. పావని పదవిలోకి వచ్చాక ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే, ఇతర ముఖ్య నేతలను ఏమాత్రం ఖాతరు చేయట్లేదని టీడీపీలో ఓ వర్గం ప్రచారం చేస్తోంది. ఇందుకు ప్రతిగాతిరుమలకుమార్‌ని పార్టీ నగర అధ్యక్ష పదవి నుంచి తప్పించినట్టు చెప్తున్నారు.
 
మేయర్‌ వర్సెస్‌ కొండబాబు
మేయర్‌ పావని భర్త ఇంత క్రితం టీడీపీ నగర అధ్యక్షుడిగా ఉన్నారు. ఎమ్మెల్యే కొండబాబు వర్గంగానే ఉండే వారు. పావని మేయర్‌ అయిన తర్వాత ఎమ్మెల్యేని కాదని, సొంత పెత్తనం చేస్తున్నారంటూ పార్టీలోనే ప్రచారం మొదలయ్యింది. తిరుమలకుమార్‌ స్థానంలో నున్న దొరబాబుని నగర అధ్యక్షుడిగా నియమించారు. దీంతో ఇంతక్రితం రాజప్ప వర్గంలో ఉన్న దొరబాబు.. కొండబాబు వర్గంలోకి వచ్చారు.
 
సమన్వయం చేయలేక కొండబాబు సతమతం..
కాకినాడ సిటీలో పార్టీని ఏకతాటిపై నడిపించడంలో ఎమ్మెల్యే కొండబాబు ఫెయిలయ్యారనే చెప్పాలి. వర్గ విభేదాలను చక్కబెట్టలేకపోవడం, ఇతనే వర్గాలను ప్రోత్సహించడం, తన అన్న చేస్తున్న పనులకు చెక్‌ పెట్టలేకపోవడం.. ఇలా కొండబాబు స్వయంకృతాపరాధం అతనికి మైనస్‌ అయ్యే ప్రమాదం ఉంది. కొండబాబు శ్రేయోభిలాషులు, పార్టీ పెద్దలు ఇవన్నీ చెపున్నా.. తానంటే గిట్టకపోవడం వల్లే ఇలా చెప్తున్నారంటూ కొండబాబు ఫీల్‌గుడ్‌ ఫ్యాక్టర్‌లో ఉన్నారంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.
 
గ్రూపులకు నామన దూరం
కాకినాడ నగర టీడీపీలో నెలకొన్న గ్రూపు వైరాలను పరిష్కరించేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు చొరవచూపలేకపోతున్నారు. గతంలో జడ్పీ చైర్మన్‌ పదవి ఇచ్చి.. తర్వాత వైసీపీ నుంచి వచ్చిన వాళ్లని పెట్టి తనను తప్పించారని, ఇపుడు జిల్లా పార్టీ పదవి నుంచీ తప్పిస్తారన్న భయంతో నామన గ్రూపుల జోలికి వెళ్లడం లేదు. మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్పలను కాదని పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవడానికి నామన సాహసించరన్నది అందరికీ తెలిసిన విషయమే. హోం మంత్రి రాజప్ప, ఎమ్మెల్యే కొండబాబు, మేయర్‌ సుంకర పావని గ్రూపుల మధ్య ఏర్పడిన వివాదాలను పరిష్కరించేందుకు సీనియర్‌ మంత్రి యనమల రామకృష్ణుడు చొరవ తీసుకుని సమన్వయం చేయాలని పార్టీ జిల్లా నేతలు కోరుతున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...