Jump to content

రాజ్యసభ సీట్లకు..టీడీపీలో గట్టి పోటీ


koushik_k

Recommended Posts

  • ఆశావహుల చిట్టా పెద్దదే
  • జాబితాలో సీఎం రమేశ్‌, కంభంపాటి
  • మస్తాన్‌రావు, శ్రీనివాసరెడ్డి, మూర్తి కూడా
  • రేసులో స్వామిదాస్‌ దంపతులు, పద్మజ
  • ఉత్కంఠ కొనసాగిస్తున్న చంద్రబాబు
  • సమర్థ రాజకీయవేత్త కోసం అన్వేషణ?
అమరావతి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సీట్లకు గట్టి పోటీ ఏర్పడింది. పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు ఈ పదవులను ఆశిస్తుండడంతో అధిష్ఠానం ఎంపిక ఎలా ఉంటుందన్నది ఆ పార్టీ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. ఇంతవరకూ ఏ సంకేతాలు ఇవ్వకుండా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉత్కంఠ కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఈసారి మూడు రాజ్యసభ సీట్లకు అభ్యర్థులను ఎన్నుకోవలసి ఉంది. ఇందులో ఒక సీటుకు తాము అభ్యర్థిని నిలుపుతున్నట్లు ప్రతిపక్షం వైసీపీ ప్రకటించింది. ఆ పార్టీ తరపున నెల్లూరు జిల్లాకు చెందిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పోటీ చేస్తున్నారు. వైసీపీ వరుసగా రెండోసారి కూడా అదే జిల్లాకు చెందిన అదే సామాజిక వర్గం నేతను నిలుపుతుండడం విశేషం. పోయినసారి ఆ పార్టీ తరపున విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీగా గెలిచారు. సామాజిక కోణాలకు పెద్దపీట వేసే టీడీపీ ఈసారి కూడా అటువంటి లెక్కలతోనే అభ్యర్థుల ఎంపిక చేపట్టే అవకాశముందని అంటున్నారు.
 
ఆ పార్టీ రెండు సీట్లకు పోటీచేస్తుందా.. మూడు స్థానాలకా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. రెండు స్థానాలకు పోటీచేస్తే ఎన్నికలు ఏకగ్రీవమవుతాయి. ముగ్గురు పోటీచేస్తే పోలింగ్‌ తప్పనిసరి. రాష్ట్రం నుంచి ప్రస్తుతం టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ రిటైరవుతున్నారు. మరోసారి అవకాశం కోసం ఆయన గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. రెండు దశాబ్దాలుగా పార్టీని అంటి పెట్టుకుని.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆర్థికంగా అండదండలు ఇచ్చినందువల్ల అధిష్ఠానం తనకు రెండో చాన్సు ఇస్తుందని ఆయన ఆశాభావంతో ఉన్నారు.
 
మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. తనకు ఇదివరకు రాజ్యసభ పదవి కొనసాగించకపోయినా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న అతి కొద్ది మంది నేతల్లో తానూ ఒకడినని, తనకు అవకాశం ఇస్తే ఢిల్లీలో రాష్ట ప్రభుత్వ వాణిని మరింత మెరుగ్గా వినిపిస్తానని ఆయన చెబుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు ఇప్పటికే ముఖ్యమంత్రిని కలిసి తన ఆసక్తి వ్యక్తం చేశారు. బీసీ వర్గాలకు చెందిన తనకు అవకాశం ఇవ్వాలని, దీనివల్ల ఆ వర్గాలకు పార్టీ ప్రాధాన్యం ఇస్తోందన్న సంకేతం వెళ్తుందని ఆయన అంటున్నారు.
 
కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఈసారి రేసులో ఉన్నారు. ఆయన పోయినసారి కడప లోక్‌సభ స్థానానికి పోటీచేశారు. తనను రాజ్యసభకు పంపి.. తన బదులు పార్టీ నేతలు ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల్లో ఒకరిని కడప ఎంపీ అభ్యర్థిగా నిలిపితే జమ్మలమడుగు నియోజకవర్గంలో సమస్య పరిష్కారమవుతుందని ఆయన పేర్కొంటున్నారు. కృష్ణా జిల్లా తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు, ఆయన సతీమణి సుధారాణి కూడా ఆశావహుల్లో ఉన్నారు. దళిత వర్గాలకు చెందిన తాము ప్రభుత్వ ఉద్యోగాలు వదులుకుని వచ్చి పార్టీలో పనిచేస్తున్నామని, అంకిత భావం కలిగిన తమ దంపతుల్లో ఒకరికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ మసాల పద్మజ కూడా రేసులో ఉన్నారు. మెడిసిన్‌లో గోల్డ్‌ మెడలిస్టును అయిన తాను పార్లమెంటులో పార్టీ వైఖరిని సమర్థంగా వినిపించగలనని, రాయలసీమ నుంచి తనకు అవకాశమివ్వాలని ఆమె కోరుతున్నారు. ఉత్తరాంధ్ర నుంచి మాజీ ఎంపీ ఎంవీవీఎస్‌ మూర్తి కూడా రాజ్యసభ సభ్యత్వం ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
 
ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. చంద్రబాబు మాత్రం ఇంతవరకూ తన మనసులో ఏముందో బహిర్గతం చేయలేదు. కానీ రాజ్యసభలో పార్టీ వాణిని వినిపించగలిగిన రాజకీయవేత్తను ఆయన అన్వేషిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పూర్తి స్థాయి రాజకీయ నాయకులైతే ఢిల్లీలో పార్టీ వాదన మరింత బలంగా వినిపిస్తారని, అటువంటి వారు లేని లోటు ప్రస్తుతం అక్కడ కనిపిస్తోందని కొందరు సీనియర్‌ నేతలు భావిస్తున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలు తొంగిచూస్తున్న తరుణంలో ప్రాంతాలు, సామాజిక కోణాలు, రాజకీయపరంగా సర్దుబాట్ల వంటివి కూడా ఉంటాయని, వీటినీ సీఎం పరిగణనలోకి తీసుకుంటారని అంటున్నారు.
Link to comment
Share on other sites

 

  • జాబితాలో సీఎం రమేశ్‌, కంభంపాటి  - Worth
  • మస్తాన్‌రావు, శ్రీనివాసరెడ్డి, మూర్తి కూడా  - Not worth 
  • రేసులో స్వామిదాస్‌ దంపతులు, పద్మజ -  Couple - Disaster , Lady - No idea 
  • ఉత్కంఠ కొనసాగిస్తున్న చంద్రబాబు
  • సమర్థ రాజకీయవేత్త కోసం అన్వేషణ? - Better 
Link to comment
Share on other sites

3 hours ago, koushik_k said:

 

  • జాబితాలో సీఎం రమేశ్‌, కంభంపాటి  - Worth
  • మస్తాన్‌రావు, శ్రీనివాసరెడ్డి, మూర్తి కూడా  - Not worth 
  • రేసులో స్వామిదాస్‌ దంపతులు, పద్మజ -  Couple - Disaster , Lady - No idea 
  • ఉత్కంఠ కొనసాగిస్తున్న చంద్రబాబు
  • సమర్థ రాజకీయవేత్త కోసం అన్వేషణ? - Better 

Demanding puran aunty

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...