చక చకా..చెక్‌ డ్యామ్‌లు 25-04-2018 01:18:34   ఉద్యమ వేగంతో జల సంరక్షణ పనులు అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): జల సంరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో చెక్‌ డ్యామ్‌లు, పంట కుంటల నిర్మాణం ఉద్యమ వేగంతో సాగుతోంది. 116 రోజుల్లో 4,209 చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని జల వనరుల శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు ఏప్రిల్‌ 23 నాటికి 2,724 చెక్‌డ్యామ్‌లు నిర్మించాల్సి ఉండగా.. దీనిని అధిగమించి 3,141 చెక్‌డ్యామ్‌లు నిర్మించారు. పంట కుంటల తవ్వకంలోనూ జల వనరు