Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

AP Local body Elections

Featured Replies

  • Replies 773
  • Views 28.8k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

విశాఖ:

గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ కూటమి మేయర్ అభ్యర్థిగా ముక్కా శ్రావణి ఖరారు

అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన టీడీపీ అధిష్టానం

విశాఖ మేయర్ అభ్యర్థిగా ముక్కా స్రవణి.. రాజకీయ ప్రస్థానంలో మరో కీలక అడుగు

కార్పొరేటర్‌గా ఐదేళ్ల అనుభవం, స్థానిక ప్రజలతో అనుబంధం, పార్టీ పట్ల నిబద్ధతను తన రాజకీయ బలంగా ఆమె భావిస్తున్నారు. వైద్య రంగంలో విద్యాభ్యాసం చేసిన ఆమె ప్రజాసేవను రాజకీయాలతో మేళవిస్తూ ముందుకు సాగుతున్నారు.

వైద్య విద్య నుంచి రాజకీయాల వైపు..

ముక్కా స్రవణి వయస్సు 32 సంవత్సరాలు. ఆమె ఫిజియోథెరపీ డాక్టర్‌గా విద్యార్హత పొందారు. విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన ఆమె తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు.

2021–2026 వరకు కార్పొరేటర్‌గా సేవలు

2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో అక్కయ్యపాలెం 26వ వార్డు నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఉత్తర నియోజకవర్గ పరిధిలోని 17 వార్డుల్లో టీడీపీ తరఫున విజయం సాధించిన ఏకైక అభ్యర్థిగా నిలిచినట్లు ఆమె వివరాల్లో పేర్కొన్నారు.

కార్పొరేటర్‌గా పనిచేసిన ఐదేళ్ల కాలంలో వార్డు అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆమె చెబుతున్నారు. పార్కుల అభివృద్ధి, ఓపెన్ జిమ్ ఏర్పాటు, రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, వీధి దీపాల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయడంతో పాటు జీవీఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు.

పార్టీ పట్ల నిబద్ధత.. నాయకత్వ బాధ్యతలు

ప్రస్తుతం టీడీపీలో క్లస్టర్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ముక్కా స్రవణి పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తన రాజకీయ ప్రస్థాన వివరాల్లో వెల్లడించారు. ఆమె తండ్రి ముక్కా ముత్యాల నాయుడు కూడా గతంలో కార్పొరేటర్‌గా పనిచేశారు. 1983 నుంచి టీడీపీతో అనుబంధం కొనసాగిస్తున్న ఆయన రాజకీయ నేపథ్యం స్రవణికి ప్రేరణగా నిలిచింది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 40 ఓట్లు సాధించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఫలితం పార్టీ వర్గాల్లో తనకు ఉన్న మద్దతును సూచిస్తోందని ఆమె అనుచరులు భావిస్తున్నారు.

వార్డు అభివృద్ధే ప్రధాన లక్ష్యం

తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, ఆరోగ్య శిబిరాలు, ప్రజారోగ్యం, సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి చేరువ చేయడం తన ప్రధాన లక్ష్యాలని ముక్కా స్రవణి పేర్కొంటున్నారు. ఫిజియోథెరపీ వైద్యురాలిగా ప్రజలకు సేవలందించే అనుభవాన్ని కూడా ప్రజారోగ్య కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలనే అభిప్రాయంతో ఉన్నారు.

మేయర్ అభ్యర్థిత్వంతో పెరిగిన ప్రాధాన్యం

విశాఖ నగర పాలనలో కీలకమైన మేయర్ పదవికి ఆమె పేరు ఖరారైనట్లు వచ్చిన సమాచారం నేపథ్యంలో నగర రాజకీయాల్లో ముక్కా స్రవణి ప్రాధాన్యం పెరిగింది. కార్పొరేటర్‌గా సంపాదించిన అనుభవం, పార్టీ సంస్థాగత బాధ్యతలు, స్థానిక ప్రజలతో అనుబంధం ఆమెకు ప్రధాన బలాలుగా నిలవనున్నాయి.

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని హత్య చేసేందుకు కుట్ర!

రాయచోటిలో మారణాయుధాలతో 10 మంది అరెస్టు.. ఎన్నికల వేళ గొడ్డలి పార్టీ నేతల కుట్రలపై సమగ్ర విచారణ జరపాలి

3రోజులుగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారి కదలికలపై నిఘా పెట్టి, కాపు కాసిన అంతర్రాష్ట్ర ముఠా!

రాయచోటిలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మంత్రి గారి కదలికలను గమనిస్తూ మూడు రోజులుగా కాపు కాసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అంతర్రాష్ట్ర ముఠా, మారణాయుధాలతో పట్టుబడటం ఈ ఘటన తీవ్రతను తెలియజేస్తోంది. రివాల్వర్లు, పిస్టళ్లు, బుల్లెట్లతో సహా ఆయుధాలు స్వాధీనం చేసుకుని 10 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.

స్థానిక ఎన్నికల ప్రశాంతతను దెబ్బతీసి, రాజకీయ ప్రత్యర్థిని లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నానికి కుట్ర చేసినట్లు వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలి. ఢిల్లీ, హైదరాబాద్, పంజాబ్ వంటి ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చినట్లు చెబుతున్న ఈ ముఠా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో పోలీసులు నిగ్గు తేల్చాలి.

గొడ్డలి పార్టీ అధినేత జగన్ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి రాజకీయ వర్గాల పాత్రపై వచ్చిన ఆరోపణలను కూడా పోలీసులు నిష్పక్షపాతంగా విచారించి, వాస్తవాలను వెలికితీయాలి. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా ఏ ఉద్దేశంతో కాపు కాసింది, మారణాయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరగాలి.

పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి 10 మందిని అరెస్టు చేయడం అభినందనీయం. అక్రమ ఆయుధాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలను ఉపేక్షించకూడదు. ఈ ఘటనలో బాధ్యులుగా తేలిన వారందరిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.

ప్రజాస్వామ్యంలో రాజకీయ పోరాటం ప్రజల మద్దతుతో జరగాలి తప్ప, మారణాయుధాలు, హింసాత్మక కుట్రలతో కాదు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి భద్రతతో పాటు ప్రజల రక్షణకు, ఎన్నికల ప్రశాంతతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ఘటన వెనుక ఉన్న వాస్తవాలను ప్రజల ముందుంచాలి.

హింసకు తావులేదు.. కుట్రదారులకు ఉపేక్ష లేదు.. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం!

  • Author

అప్డేట్: ఉమ్మడి కడప జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ హవా.. పదింట ఏడు చోట్ల టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం

ఎర్రగుంట్ల, రాజంపేట, బద్వేల్, మైదుకూరు, జమ్మలమడుగు, రాయచోటి, కమలాపురం నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లే వేయలేదు

వైసీపీ నుంచి కడప మేయర్ అభ్యర్థిగా బండి దీప్తి, పులివెందులలో వైఎస్ ప్రమిళాదేవి, ప్రొద్దుటూరు చైర్మన్ అభ్యర్థిగా నరసింహారెడ్డి మాత్రమే బరిలో నిలిచారు

IMG_1970.jpeg

Edited by rajanani

  • The title was changed to AP Local body Elections

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.