Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Veligonda Project

Featured Replies

  • Author

కరవు నేలపై కొత్త చరిత్ర

Eenadu icon

By Andhra Pradesh News DeskUpdated : 01 Sep 2026 05:05 IST

Ee

Font size

7 min read

gg-pref.gif

వెలిగొండ తొలిదశ పూర్తి చేశాం
రెండో దశనూ సాకారం చేస్తాం
ఇళ్లు, ఊళ్లు, భూములు త్యాగం చేసిన ప్రజలకు పాదాభివందనం
ఇక మార్కాపురం జిల్లా అభివృద్ధి అన్‌స్టాపబుల్‌ 
ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ఈనాడు - ఒంగోలు

ap310826main1a.webp

ఫీడర్‌ కాలువలో పారుతున్న కృష్ణా జలాలు


వెలిగొండ మొదటి దశ ప్రారంభించాం. తరతరాలుగా ఇక్కడి వారు ఎంతో నష్టపోయారు. నష్టపోయిన ప్రాంతాన్ని ఆదుకొనే అవకాశం రావడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. ఇక్కడితో ఆగిపోం.. ఇదే వేగంతో వెలిగొండ ఫేజ్‌-2 కూడా 2028 నాటికి పూర్తి చేసే బాధ్యత మాదే. కృష్ణా పుష్కరాలు కూడా మార్కాపురంలోనే వైభవంగా నిర్వహించుకుందాం. 

చంద్రబాబు


రాజకీయం అంటే నాకు ఎన్నికలు కాదు.. ప్రజల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావడం. నేను ఓట్లు ఆశించి కాదు, మార్పు ఆశించి పనిచేస్తాను. వచ్చే ఎన్నికల కోసం కాదు, భవిష్యత్తు తరాల కోసం పనిచేస్తా... వెలిగొండలో రెండు సొరంగాల పనులు పూర్తి చేసి మొత్తం తిరిగానని మాజీ సీఎం జగన్‌ టీవీలో చూపించుకుంటున్నారు.. అయినా ఎందుకు ప్రాజెక్టు ప్రారంభించలేదని మమ్మల్ని అడుగుతున్నారు. టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ మధ్యలో ఇరుక్కుపోయింది. కాంట్రాక్టర్‌ కోర్టుకు పోయారు. నేను రంగంలోకి దిగి.. స్టే వెకేట్‌ చేయించి.. మిషన్‌ను ఊడదీసి విడిభాగాలన్నీ బయటకు తెచ్చాం. ఎంతో పని మిగిలి ఉంటే.. జాతికి అంకితం చేశామని చెప్పిన ఫేక్‌ పార్టీని ఏమనాలి?. 

చంద్రబాబు


ap310826main1d.webp

రైతులు రావెళ్ల సత్యనారాయణ, తుమ్మ కాశమ్మలతో కలిసి వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తున్న సీఎం

రవు నేలపై కృష్ణమ్మ రాసిన కొత్త చరిత్ర వెలిగొండ. ఇక పశ్చిమ ప్రాంతంలో ఫ్లోరైడ్‌ అనే పదం గత చరిత్రే. నల్లమల సాగర్‌ ద్వారా ప్రతి ఇంటికీ కుళాయి నీరిచ్చే బాధ్యత మాదే. దుర్భిక్షంతో పోరాడిన రైతన్నకు, ఫ్లోరైడ్‌ బాధలు భరించిన కుటుంబాలకు, నీటి కోసం ఎదురుచూసి అలసిన తరాలకు.. కృష్ణా జలాలతో స్వాగతం పలుకుతున్నా. ప్రాజెక్టు కోసం ఇళ్లు, ఊళ్లు, భూములు త్యాగం చేసిన 11 గ్రామాల ప్రజలకు పాదాభివందనం చేస్తున్నా. వారి త్యాగం ఫలితంగానే లక్షల మంది జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లెలో సోమవారం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేశారు. కొల్లం వాగు జలాశయం నుంచి జంట సొరంగాల ద్వారా ఫీడర్‌ ఛానల్‌ వద్దకు చేరుకున్న కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. 

ap310826main1b.webp

కృష్ణా జలాలకు సీఎం సాష్టాంగ నమస్కారం

‘చంద్రబాబు అనే నేను.. 1996 మార్చి 5న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వెలిగొండ ప్రాజెక్టుకు భూమిపూజ చేశాను. చంద్రబాబు అనే నేను.. 2026 ఆగస్టు 31వ తేదీన వెలిగొండ మొదటి దశ ప్రారంభించి జాతికి అంకితం చేశాను. ఇది నా అదృష్టం. మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశాం. రూ.లక్ష కోట్లతో సెప్టెంబరులో ప్రారంభించే గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌లో మార్కాపురం జిల్లాను భాగం చేశాం. పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. మీ టైం మొదలైంది. ఇక మార్కాపురం జిల్లా అన్‌స్టాపబుల్‌. వెలిగొండ ప్రాజెక్టు కోసం ఇళ్లు, భూములు త్యాగం చేసిన వారు సంతోషంగా ఉండాలనేదే మా ఆలోచన. 48 రోజుల్లోనే 6,206 నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్లు జమ చేశాం. మరికొన్ని నిర్వాసిత కుటుంబాలకు రూ.165 కోట్లు ఇస్తున్నాం. కటాఫ్‌ డేట్‌ పెంచి ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం చేస్తాం.  ప్రధాని మోదీ సహాయం, మిత్రుడు పవన్‌ కల్యాణ్‌ సహకారం ఫలితంగానే వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభించాం.

ap310826main1e.webp

ప్రజలకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

గుండెల్లో పెట్టుకుంటామన్నారు.. గుర్తుందా?

నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి వస్తే.. తాగేందుకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. అందుకే వెలిగొండ ప్రాజెక్టు 1996 మార్చి 5న శంకుస్థాపన చేశాను. నీళ్లిస్తే గుండెల్లో పెట్టుకుంటామని ఇక్కడి వారు చెప్పారు. ఎన్నో సమస్యలు, సవాళ్లు అధిగమించి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నాను. ఇక ఈ ప్రాంతంలో సంపద సృష్టిస్తాం.

ap310826main1f.webp

పూల సుబ్బయ్య కుమార్తెలు విలాసిని, సునందినిలను సత్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. చిత్రంలో కూటమి నేతలు

అరకొర చెల్లింపులతో మోసం చేసిన గొడ్డలి పార్టీ 

గొడ్డలి పార్టీ రాకతో 2019లో వెలిగొండ ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. గత ప్రభుత్వ హయాంలో 2.77% పనులు మాత్రమే చేశారు. నిర్వాసితుల కోసం జీవో తెచ్చి అరకొర చెల్లింపులతో మోసం చేశారు. ఎన్నికలకు నెలరోజుల ముందు వెలిగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేశామని డ్రామాలాడారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులకు 11 ఏళ్లపాటు ముఖ్యమంత్రులుగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఖర్చు చేసింది రూ.2,175 కోట్లే. నేను ముఖ్యమంత్రి అయ్యాకే రూ.3,256 కోట్లు ఖర్చు పెట్టి మొదటి దశ పూర్తి చేశాం. 

ap310826main1c_1.webp

వెలిగొండ ప్రాజెక్టు వద్ద ప్రజల సందడి

అమిత్‌షా సుముఖంగా ఉన్నారు

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నదుల అనుసంధానంపై మాట్లాడాం. ఆయన సుముఖంగా ఉన్నారు. దక్షిణ భారతదేశంలో గోదావరి-కావేరి అనుసంధానం కావాలి. గోదావరి నీరు నల్లమల సాగర్‌కు రావాలి. గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి, తుంగభద్ర అనుసంధానమైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో నీటి యుద్ధాలు పోతాయి. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో 36 ప్రాజెక్టులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సెప్టెంబరు 2న గోదావరి జలాలను అనకాపల్లి వరకు మళ్లిస్తున్నాం. తరువాత విశాఖ, వంశధార వరకు పంపి నదుల అనుసంధానం చేస్తాం.

10.70 టీఎంసీలు ఇస్తున్నాం

వెలిగొండ ప్రాజెక్టు వ్యయం రూ.10,200 కోట్లు.. మొత్తం ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో మొత్తం 4.47లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుంది. మొదటి విడతలోనే నాలుగు లక్షల మందికి తాగునీరు అందిస్తున్నాం. ప్రతి ఇంటికీ కృష్ణమ్మ నీళ్లు వస్తాయి. ఇప్పటివరకు రూ.7,983 కోట్లు ఖర్చు చేసి మొదటి దశ పూర్తి చేసి నల్లమలసాగర్‌కు 10.70 టీఎంసీల నీటిని ఇస్తున్నాం. ఈ నీటితో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 


నా జీవితంలో చూస్తాననుకోలేదు...

ap310826main1j.webp

నా జీవితంలో వెలిగొండ జలాలు చూస్తాననుకోలేదు. 30 ఏళ్ల క్రితం శిలాఫలకం వేశారు. తరువాత ప్రభుత్వాలు మారినా ప్రాజెక్టులో పురోగతి కనిపించక నైరాశ్యం ఏర్పడింది. కూటమి సర్కారు కొలువుదీరాక పనులను వేగవంతం చేయడంతో ఆశలు చిగురించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలతో ప్రాజెక్టును పూర్తి చేశారు. ఆయన కృషితోనే వెలిగొండకు జలాలు వచ్చాయి. ఆ నీటిని కళ్లారా చూసేందుకు మా గ్రామం నుంచి వందల సంఖ్యలో తరలివచ్చాం. 

షేక్‌ కరీముల్లా, దోర్నాల


మూడు పంటలకు వీలు..

ap310826main1k.webp

వెలిగొండతో మా ప్రాంతం రూపురేఖలు మారతాయి. ఇప్పటి వరకు ఏడాదికి ఒక పంటే వేస్తున్నాం. ఇకపై మూడు పంటలు పండించే వీలు కలుగుతుంది. కూలీలకు నిత్యం పని దొరుకుతుంది. భూముల ధరలూ పెరుగుతాయి. భావితరాల భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది.

కోటిలింగమయ్య, కొనకనమిట్ల 

ap310826main1h.webp

వెలిగొండ ప్రాజెక్టు శిలాఫలకం ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు, అధికారులు

ap310826main1g.webp

 వెలుగొండ వేడుకలో ‘డ్రోన్‌’ పూల వర్షం

ap310826main1i.webp

it’s right and high time to focus on building sustainable local economy. Amaravati to Bangalore highway, Ee veligonda project, new train route via Kanigiri chala help avtayi.

local businesses and entrepreneurs ni kuda encourage cheyali, only corporate companies chuttu ne tiragakunda. oka 10 local companies next range ki velthe overall state development kuda baga avtundi.

American tier 2, tier 3 cities growth model India lo kuda organic ga start ayipoyindi.

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.