August 29Aug 29 Author గ్యాసిఫికేషన్‌తో కాసులుBy Andhra Pradesh News DeskUpdated : 29 Aug 2026 06:22 ISTEeFont size3 min readరిలయన్స్ ప్రాజెక్ట్‌తో గనులశాఖకు రూ.65 వేల కోట్ల రాబడిప్రత్యక్షంగా 5 వేలు, పరోక్షంగా 35వేల మందికి ఉపాధిఅనుబంధ పరిశ్రమలతో ప్రభుత్వానికి మరింత ఆదాయంప్రాజెక్ట్ సాకారమయ్యేలా వివిధ శాఖలతో కమిటీఈనాడు, అమరావతి: ఏలూరు జిల్లా చింతలపూడి, రేచెర్లలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ (యూసీజీ) ప్రాజెక్ట్‌తో పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు, ప్రభుత్వ ఖజానాకూ భారీ రాబడి రానుంది. అనుబంధ పరిశ్రమలతో మరింతమందికి ఉపాధి లభిస్తుంది. దాదాపు రూ.2.73 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటయ్యే ప్రాజెక్టు త్వరగా పట్టాలెక్కేందుకు వీలుగా ప్రభుత్వం వివిధ శాఖల ఉన్నతాధికారుల ద్వారా తగిన సహకారం అందించేలా చూస్తోంది.రాయల్టీ ద్వారానే రూ.50 వేల కోట్లుచింతలపూడిలో 1,200 హెక్టార్లు, రేచెర్లలో 2,225 హెక్టార్ల బొగ్గు గనులను రిలయన్స్ సంస్థ వేలంలో దక్కించుకోగా, అక్కడ ఈ ఏడాది ఖనిజాన్వేషణ చేసి, వచ్చే ఏడాది పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తారు.అన్ని అనుమతులూ తీసుకొని 2028-30 మధ్య కమర్షియల్ గ్యాసిఫెర్ బావుల డ్రిల్లింగ్, ప్రాజెక్ట్‌కు అవసరమైన పరిశ్రమలు నిర్మిస్తారు. 2030 నాటికి పూర్తిస్థాయి ప్రాజెక్ట్ అందుబాటులోకి తీసుకొస్తారు.ప్రాజెక్ట్‌లో భూగర్భంలోనే బొగ్గును మండించి, సింగ్యాస్‌ను పైకి తెస్తారు. దీంతో హైడ్రోజన్, మెథనాల్, అమ్మోనియా, సింథటిక్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ), సింథటిక్ ఇంధనాలు తయారుచేయొచ్చు. 2030 నాటికి.. రోజుకు 20-50 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ (ఎంఎంఎస్‌సీఎండీ) సింగ్యాస్ ఉత్పత్తిచేసే ప్రధాన ప్లాంట్ అందుబాటులోకి వస్తుంది.ఈ రెండు బ్లాక్స్‌లో కలిపి 1.5 బిలియన్ టన్నుల బొగ్గునిల్వలున్నాయి. 30 ఏళ్లపాటు వీటిని వినియోగించుకున్నందుకు 14% రాయల్టీ రూపంలో గనులశాఖకు రూ.50వేల కోట్ల రాబడి వస్తుంది.బొగ్గు ధరలో 2.75% రెవెన్యూ వాటా కింద మరో రూ.10వేల కోట్లు గనులశాఖకు దక్కుతుంది.జిల్లా ఖనిజ ఫౌండేషన్ (డీఎంఎఫ్) కింద రూ.5వేల కోట్లు వస్తుంది.అనుబంధ పరిశ్రమలు ఏర్పాటై, వాటి ఉత్పత్తుల ద్వారా ఎస్జీఎస్టీ రూపంలో రూ.లక్ష కోట్ల వరకు వస్తుందని అంచనా.మెండుగా ఉపాధి అవకాశాలుఈ ప్రాజెక్ట్ ద్వారా 3,500 నుంచి 5వేల మంది వరకు ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. అనుబంధ పరిశ్రమలతో మరో 20-35 వేల మంది వరకు పరోక్షంగా ఉపాధి దక్కుతుంది.అవసరమైన అనుమతులు ఇచ్చేలా..రిలయన్స్ ప్రాజెక్ట్ లక్ష్యం మేరకు అమల్లోకి వచ్చేలా.. చూసేందుకు ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా సహకారం అందించేలా చూస్తోంది. ఇటీవల సచివాలయంలో రెవెన్యూ, గనులశాఖ, అటవీ, పర్యావరణ, జలవనరుల, పరిశ్రమలు, ఏపీఐఐసీ, ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి అధికారులతో.. రిలయన్స్ ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఆయా శాఖల పరంగా ఎటువంటి సహకారం కావాలో తెలిపారు. ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. అనుమతులు, భూసేకరణ కోసం నోడల్ అధికారిగా ఏలూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌ను నోడల్ అధికారిగా నియమించారు.దేశంలో తొలి ప్రాజెక్ట్దేశవ్యాప్తంగా 360 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. వీటిలో 160 బిలియన్ టన్నుల వరకు తవ్వి బయటకు తీసేందుకు అవకాశం లేదు. వీటిని భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ (యూసీజీ) ద్వారానే వినియోగించుకోవచ్చు. ఇందులో భాగంగానే చింతలపూడి, రేచెర్లలో తొలి ఇంటిగ్రేటెడ్ యూజీసీ ప్రాజెక్ట్‌ను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. వీటికి చాలాకాలంగా కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ వేలాలు నిర్వహిస్తూ ఉండేది. ఎవరూ బిడ్లు వేసేవారు కారు. భూమి నుంచి 600 మీటర్ల దిగువన బొగ్గునిల్వలు ఉండటంతో, వాటిని వినియోగించుకోలేమనే ఉద్దేశంతో ఎవరూ ముందుకు రాలేదు. తాజాగా యూసీజీకి కేంద్రం ప్రాధాన్యం ఇవ్వడంతో, రిలయన్స్ సంస్థ ఇక్కడ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ముందుకొచ్చి, ఈ రెండు బ్లాక్‌లను దక్కించు
Create an account or sign in to comment