Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Horticulture Hub

Featured Replies

  • 2 weeks later...
  • 4 weeks later...

ఉద్యాన హబ్‌కు ప్రపంచబ్యాంకు ఓకే!

ABN , Publish Date - Sep 16 , 2026 | 05:00 AM

రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం ప్రాంతాలను ఉద్యానవన హబ్‌గా అభివృద్ధి చేసే రూ.లక్ష కోట్ల సమీకృత ఉద్యానవన అభివృద్ధి ప్రణాళికకు ప్రపంచబ్యాంకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.

ఉద్యాన హబ్‌కు ప్రపంచబ్యాంకు ఓకే!

World Bank Andhra Pradesh project

  • ఆర్థిక సాయానికి సూత్రప్రాయంగా అంగీకారం

  • ఆర్థిక, జలవనరులు, వ్యవసాయం, పంచాయతీరాజ్‌ ఉన్నతాధికారులతో కీలక భేటీ

  • ప్రాజెక్టు పర్యవేక్షక ఏజెన్సీ ఏర్పాటు చేయండి

  • ‘హబ్‌’ బాధ్యత ఎవరిదో స్పష్టం చేయండి

అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరువుపీడి రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాలను ఉద్యానవన హబ్‌గా ఏర్పాటుచేసే దిశగా కీలక ముందడుగు పడింది. ఉద్యావన పంటల ఉత్పత్తులకు విలువను జోడించి.. రైతాంగానికి ఆర్థిక ప్రయోజనం కల్పించేందుకు సీఎం చంద్రబాబు ‘సమీకృత ఉద్యానవన అభివృద్ధి ప్రణాళిక (ఐహెచ్‌డీపీ)’ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ ప్రణాళిక, దానికి ఆర్థిక సాయంపై చర్చించేందుకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం రాష్ట్ర ఉన్నతాధికారులతో మంగళవారం సమావేశమైంది.

ABN Whatsapp


ఢిల్లీలోని ప్రపంచబ్యాంకు కార్యాలయంలో సీనియర్‌ వ్యవసాయ స్పెషలి్‌స్టగా ఉన్న రంజన్‌ సామంతరాయ్‌ ఈ బృందానికి నేతృత్వం వహించగా.. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూ్‌షకుమార్‌, వ్యవసాయం, జలవనరుల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు బుడితి రాజశేఖర్‌, శశిభూషణ్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ ఈఎన్‌సీ బాలూనాయక్‌ తదితరులు హాజరయ్యారు. రాష్ట్రప్రభుత్వం రూ.లక్ష కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన రాయలసీమ ఉద్యానవన హబ్‌ పథకానికి వరల్డ్‌ బ్యాంకు సూత్రప్రాయంగా సమ్మతి తెలిపింది. అయితే.. ఆర్థిక, ఉద్యానవనం, వ్యవసాయం, జలవనరుల శాఖ, పంచాయతీరాజ్‌ శాఖ సంయుక్తంగా ఈ పథకాన్ని చేపడుతున్నందున దీని బాధ్యతను ఎవరు తీసుకుంటారో స్పష్టం చేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది.


ముందుగా ప్రాజెక్టు మానిటరింగ్‌ ఏజెన్సీ(పీఎంఏ)ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని.. ఉద్యానవన శాఖ వ్యవసాయ శాఖ పరిధిలో ఉన్నందున.. ఉద్యానవన శాఖ నేతృత్వంలోనే దీనిని ఏర్పాటు చేయాలని సూచించింది. అదేవిధంగా ఉద్యాన, జల వనరులు, పంచాయతీరాజ్‌ శాఖలు ‘లైన్‌ డిపార్ట్‌మెంట్లు’గా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని తెలిపింది. పీఎంఏ ఏర్పాటయ్యాక ఉద్యానవన హబ్‌కు సంబంధించిన సమగ్ర ప్రణాళికతో నివేదిక పంపాలని ప్రభుత్వానికి సూచించింది. ఆ రిపోర్టు అందాక.. తాము స్వయంగా ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించి.. ఆమోదం తెలుపుతామని ప్రపంచబ్యాంకు వెల్లడించింది.


సంయుక్త కార్యాచరణ..

యూపీ, మహారాష్ట్ర తరహాలో పండ్లతోటలకు ప్రత్యేకంగా విలువను జోడించడం ద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రానికీ సంపదను సృష్టించవచ్చన్న సీఎం ఆలోచనకు అనుగుణంగా.. జల వనరులు, వ్యవసాయం, హార్టీకల్చర్‌, పంచాయతీరాజ్‌ (గ్రామీణ రోడ్లు) శాఖలు సంయుక్తంగా కార్యాచరణ సిద్ధం చేశాయి. రూ.లక్ష కోట్ల వ్యయంతో సమీకృత ఉద్యానవన అభివృద్ధి ప్రణాళిక (ఐహెచ్‌డీపీ) అమలుకు ఈ ఏడాది మే 19వ తేదీన ప్రభుత్వం జీవో 416 జారీ చేసింది. ఈ ఉత్తర్వు మేరకు ఈ శాఖలన్నీ కలిసి ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్‌ ఏజెన్సీ (పీఐఏ)గా సమగ్ర కార్యాచరణ రూపొందించాయి. ఇందులో ప్రైవేటు భాగస్వామ్యం కింద రూ.60,000 కోట్లు, ప్రపంచ బ్యాంకు రుణం కింద రూ.40,352 కోట్లను సమీకరించాలన్నది లక్ష్యం.


రానున్న మూడేళ్లలో 291 హర్టీకల్చర్‌ క్లస్టర్లను ప్రతిపాదించారు. ఐహెచ్‌డీపీతో అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కడప, కర్నూలు మార్కాపురం, నంద్యాల, ప్రకాశం, శ్రీ సత్యసాయి, తిరుపతి.. మొత్తం 10 జిల్లాలను అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఈ జిల్లాల్లో రూ.20,884 కోట్లతో 32 మేజర్‌ ప్రాజెక్టులు, 1011 మైనర్‌ ఇరిగేషన్‌ చెరువులు, 21 చెక్‌డ్యాములను అభివృద్ధి చేస్తారు. ఇవి పూర్తయితే దాదాపు 9 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరివ్వొచ్చు. 4.3 లక్షల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ జరుగుతుందని పేర్కొన్నారు.


ఈ ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్‌ పరిధిలో వెలిగొండ తొలిదశ (ఇప్పటికే పూర్తయింది), రెండోదఽశ (2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం), కొరశపాడు ఎత్తిపోతల, పాలార్‌ రిజర్వాయరు, మల్లెమడుగు ఎత్తిపోతల/రిజర్వాయరు, బాలాజీ రిజర్వాయరు, కుప్పం యామిగానిపల్లి రిజార్వయరు, కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌, కల్యాణి డ్యాం, హంద్రీ-నీవా రెండో దశ కాలువల నిర్మాణం, అల్లూరుపాడు ఎత్తిపోతల/రిజర్వాయరు, అప్పర్‌ పెన్నా, భైరవానితిప్ప, కమ్యూనిటీ మైక్రో ఇరిగేషన్‌, అన్నమయ్య ప్రాజెక్టు పునరుద్ధరణ మొదలైనవి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.


This will be Game changer project for Rayalaseema, Nellore and Prakasam. CBN added Prakasam and Markapuram district also in this HUB

Edited by TDP_2019

విదేశాలకూ సీమ వ్యవసాయ ఉత్పత్తులు

Eenadu icon

By Andhra Pradesh News DeskPublished : 03 Oct 2026 06:06 IST

Ee

Font size

3 min read

gg-pref.gif

ప్రపంచ స్థాయి సంస్థగా ఐఎస్‌ఏ ఎదుగుతుంది : మంత్రి లోకేశ్‌ 

021026APMAIN-7a_1.webp

‘‘గొడ్డలి పార్టీకి మూడు ప్రశ్నలు వేస్తున్నా.. రాయలసీమ రైతులకు వరంగా ఉన్న బిందు సేద్యం రాయితీలు ఎత్తేసింది ఎవరు? పట్టిసీమ దండగ అన్నది ఎవరు? పోలవరం ఏంటో మాకే అర్థం కావడం లేదు, ఇక ప్రజలకేం అర్థమవుతుంది అన్నదెవరు? మీ గొడ్డలి పార్టీ నాయకులు కాదా?’’

మంత్రి నారా లోకేశ్‌


ఈనాడు, అన్నమయ్య: రాయలసీమ పౌరుషమే ఇప్పటి వరకూ అందరికీ తెలుసని.. ఇకపై ఇక్కడి రైతుల సత్తా కూడా ప్రపంచం చూడబోతోందని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌ (జీహెచ్‌హెచ్‌), ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ (ఐఎస్‌ఏ) ద్వారా రాయలసీమ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం చంద్రబాబు హయాంలో స్థాపించిన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) తరహాలోనే మదనపల్లెలో ఏర్పాటు కానున్న ఐఎస్‌ఏ కూడా ప్రపంచస్థాయి సంస్థగా ఎదుగుతుందని తెలిపారు. దేశవిదేశాలకు కావాల్సిన పంటలను రాయలసీమలో పండించనున్నట్టు వెల్లడించారు. 

యువగళంలో డిక్లరేషన్‌ ప్రకటించా

‘వైకాపా ప్రభుత్వంలో నేను చేసిన యువగళం పాదయాత్రలో గొడ్డలి పార్టీ వారు నా మైక్‌ లాక్కున్నారు. బాటిళ్లు, కోడిగుడ్లు, రాళ్లు వేశారు. కానీ రాయలసీమ ప్రజల ఆశీస్సులతో 1,587 కి.మీ ఈ ప్రాంతంలో పాదయాత్ర చేశాను. రైతుల కష్టాలు చూశాను. రాయలసీమను ఉద్యానహబ్‌గా మార్చే బాధ్యత తీసుకుంటానని అప్పుడే చెప్పాను. కడపలో ‘మిషన్‌ రాయలసీమ’ పేరుతో డిక్లరేషన్‌ ఇచ్చాను. రైతుల ఆదాయం పెంచడమే దాని లక్ష్యం’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. ‘త్యాగం, పోరాటానికి మదనపల్లె గడ్డ మరో పేరు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన బీటీ కళాశాల విద్యార్థులు లాఠీదెబ్బలు తిన్నారు’ అని మదనపల్లె ఘనతను లోకేశ్‌ కొనియాడారు.

‘తెలుగు గంగ, ఎస్‌ఆర్‌బీసీ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ, పోలవరం ప్రాజెక్టులు మన ట్రేడ్‌ మార్కులు. వీటితోనే రాయలసీమ అరటి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతోంది. వీటితోనే కరవు ప్రాంతానికి కియా మోటర్స్‌ వచ్చింది. అందుకే చంద్రబాబును వాటర్‌ మ్యాన్‌ అంటున్నారు. నీటిని దేవుడిగా, సాగునీటి ప్రాజెక్టుల్ని దేవాలయాలుగా భావించే వ్యక్తి చంద్రబాబు. అప్పట్లో ప్రముఖ పారిశ్రామికవేత్తలంతా కలిసి  ఒక బిజినెస్‌ స్కూల్‌ పెట్టాలనుకున్నారు. వారు ముంబయి, చెన్నై, బెంగళూరు నగరాలను పరిశీలిస్తున్న సంగతి తెలిసి,  ధీరూబాయ్‌ అంబానీతో చంద్రబాబు మాట్లాడారు. వారిని ఒప్పించి, స్వయంగా చంద్రబాబే ప్రజంటేషన్‌ ఇవ్వడంతో హైదరాబాద్‌లో ఐఎస్‌బీ ఏర్పాటయ్యింది. అదే మ్యాజిక్‌ ఇప్పుడు సీమలో జరగనుంది’ అని లోకేశ్‌ తెలిపారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ గురించి  ముకేశ్‌ అంబానీని ముంబయిలో చంద్రబాబు కలిసి వివరించగా.. ఏపీలో పెట్టడానికి సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. 

నా తమ్ముడు అనంత్‌ ఇకపై ఏపీ బిడ్డ 

‘అంబానీ కుటుంబంతో చంద్రబాబుది మూడు తరాల అనుబంధం. ధీరూభాయ్‌ అంబానీ మొదలు అనంత్‌ అంబానీ వరకూ ఆ కుటుంబంతో అనుబంధం కొనసాగుతోంది. నా తమ్ముడు అనంత్‌ అంబానీకి చెబుతున్నా.. ఇకపై మీరు ఆంధ్రప్రదేశ్‌ బిడ్డ. మనం కలిసి పనిచేద్దాం’ అని లోకేశ్‌ అన్నారు.

రాబోయే మూడేళ్లలో రాయలసీమలో ప్రభుత్వం రూ.40,352 కోట్లు, ప్రైవేటు రంగం నుంచి రూ.60 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు శుక్రవారం మంత్రి లోకేశ్‌ కార్యాలయం ఓ ప్రకటనలో తెలియజేసింది.


ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఏర్పాటుకు ఎంవోయూ

ఈనాడు, అన్నమయ్య: రాష్ట్రంలో‘ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌’ (ఐఎస్‌ఏ)ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌తో శుక్రవారం ఎంవోయూ చేసుకుంది. మదనపల్లెలో జరిగిన కార్యక్రమంలో వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ పి.ఎం.ఎస్‌.ప్రసాద్‌ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. మదనపల్లె సమీపంలో 100 ఎకరాల్లో ఇది ఏర్పాటు కానుంది.


నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి

Eenadu icon

By Andhra Pradesh News DeskUpdated : 03 Oct 2026 07:13 IST

Ee

Font size

4 min read

gg-pref.gif

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈడీ అనంత్‌ అంబానీ
రాష్ట్రానికి ఎలా సేవ చేయాలో చెప్పాలని సీఎంకు విజ్ఞప్తి

021026APMAIN-6a.webp

మదనపల్లె సభలో చిరునవ్వులు చిందిస్తున్న సీఎం చంద్రబాబు, రిలయన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనంత్‌ అంబానీ

ఈనాడు, అన్నమయ్య: ‘నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రానికి ఏ విధంగా సహాయపడగలనో మార్గదర్శనం చేయండి. ఈ రాష్ట్రానికి సేవ చేసే భాగ్యం కలిగించండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) అనంత్‌ అంబానీ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, రైతులతో కలసి ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ (ఐఎస్‌ఏ) ఏర్పాటు చేయడం రిలయన్స్‌కు గర్వకారణమన్నారు. తమపై ఎంతో నమ్మకం ఉంచి ఈ చారిత్రక ప్రాజెక్ట్‌లో భాగస్వాముల్ని చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శుక్రవారం హార్టికల్చర్‌ హబ్, ఐఎస్‌ఏల శంకుస్థాపన కార్యక్రమంలో అనంత్‌ అంబానీ ప్రసంగించారు.

ఈ రోజు మనం ఉద్యాన హబ్‌కు, ఐఎస్‌ఏలకు మాత్రమే పునాదిరాళ్లు వేయడం లేదు. గ్రామీణ వ్యాపారవేత్తల్ని తయారుచేయడానికి, బలమైన గ్రామాల్ని, మరింత సుస్థిర భారతదేశాన్ని నిర్మించేందుకు పునాదిరాళ్లు వేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు పాతికేళ్ల క్రితం హైదరాబాద్‌కు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)ను తీసుకొచ్చారు. ఈ రోజు ఐఎస్‌ఏ రూపంలో రైతులకు వారి సొంత ఐఎస్‌బీని ఇస్తున్నారు. ఐఎస్‌ఏని ప్రపంచంలోనే మొదటి హైటెక్, ఆధునిక, ప్రపంచస్థాయి అగ్రికల్చర్‌ స్కూల్‌గా అభివృద్ధి చేస్తాం. వ్యూహాత్మక పెట్టుబడులు, డిజిటల్‌ సామర్థ్యాల పెంపు, సాంకేతిక అనుభవం, పారిశ్రామిక భాగస్వామ్యాలు నెలకొల్పడంలో ఆ సంస్థకు రిలయన్స్‌ పూర్తిగా సహకరిస్తుంది. 

ఆ బాధ్యత రిలయన్స్‌ తీసుకుంటుంది

రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 1919లో ఇదే మదనపల్లెలో జాతీయ గీతాన్ని బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి ‘ద మార్నింగ్‌ సాంగ్‌ ఆఫ్‌ ఇండియా’గా అనువదించారు. ఈ రోజు అదే మదనపల్లె.. దేశ రైతుల కోసం ఒక కొత్త ప్రభాత గీతాన్ని ఆలపిస్తోంది. మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రిల జయంతి రోజున ఐఎస్‌ఏకి అంకురార్పణ జరిగింది. శాస్త్రి ‘జై జవాన్, జై కిసాన్‌’ నినాదం ఇస్తే.. వాజ్‌పేయీ దానికి ‘జై విజ్ఞాన్‌’, నరేంద్ర మోదీ ‘జై అనుసంధాన్‌’ జోడించారు. ఐఎస్‌ఏ ఆ నాలుగింటి సమ్మేళనంగా నిలుస్తుంది. ఈ సంస్థను రైతుల గడపల వద్దకు తీసుకెళ్లే బాధ్యతను రిలయన్స్‌ జియో తీసుకుంటుంది. ఐఎస్‌ఏ శిక్షణ మాడ్యూళ్లను గ్రామాల్లో ఏర్పాటు చేసిన వర్చువల్‌ క్లాస్‌రూమ్‌ల ద్వారా వివిధ భాషల్లో, ఇంటరాక్టివ్‌ విధానంలో దేశంలోని లక్షల మంది రైతులకు చేరవేస్తుంది. చదువుకున్న గ్రామీణ యువత వ్యవసాయ విస్తరణ వర్కర్స్‌గా మారి ఈ విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో రైతులకు సహకరిస్తారు. 

ప్రత్యేక ప్లాట్‌ఫాం ‘జియో కృషి’ ద్వారా జామ్‌నగర్‌లో రైతులకు ఉపయోగపడే అనేక వినూత్న సాధనాలు అందుబాటులోకి తెచ్చాం. బయో ఇంధన అభివృద్ధికి అత్యంత అధునాతన పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పాం. వాటిని ఐఎస్‌ఏతో అనుసంధానిస్తాం. మన అన్నదాతల్ని విద్యుత్‌ దాతలుగా మార్చేలా రిలయన్స్‌ గ్రీన్‌ ఎనర్జీ విభాగం ద్వారా కృషి చేస్తాం. భారతీయ యువత వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించడాన్ని సగర్వంగా భావించేలా ఐఎస్‌ఏ చేస్తుంది. ఆధునిక సాంకేతికత రైతుల ఆదాయాన్ని పెంచుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అర్థం చేసుకున్నారు. ఆయన లక్ష్యానికి అనుగుణంగా ఐఎస్‌ఏ పనిచేస్తుంది. 

021026APMAIN-6b.webp

ముఖ్యమంత్రి చంద్రబాబుకు పాదాభివందనం చేస్తున్నఅనంత్‌ అంబానీ

మొదట జంతు ప్రేమికుడిని

మొదట నేను జంతు ప్రేమికుడిని. ఆ తర్వాతే పారిశ్రామికవేత్తను. అత్యాధునిక విధానాల్లో పశుపోషణ మన గ్రామాల్లో నూతన సంపదను సృష్టిస్తుందని నమ్ముతాను. జామ్‌నగర్‌లోని వంతారాలో వన్యప్రాణుల సంరక్షణ, వెటర్నరీ సైన్సెస్‌కి సంబంధించి ప్రపంచంలోనే మొదటి గ్లోబల్‌ యూనివర్సిటీకి పునాదులు వేశాం. దానికీ, ఐఎస్‌ఏకి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేస్తాం. 

ఏపీలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు 

ఆంధ్రప్రదేశ్‌లో రూ.లక్ష కోట్ల పెట్టుబడితో కంప్రెస్డ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ల ఏర్పాటుకు అవకాశమిచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. వాటితో 3 లక్షల ఉద్యోగాలు, రాష్ట్రానికి రూ.60 వేల కోట్ల ఆదాయం వస్తాయి. రైతుల్ని ధనవంతులుగా చేయడమే మా లక్ష్యం. దాన్ని సాకారం చేసేందుకు రిలయన్స్‌ శక్తి సామర్థ్యాలన్నీ వినియోగిస్తాం. చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానం రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చింది. 2024 జూన్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు సంబంధించిన 388 మెగా ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వాటితో 11 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఏపీ స్వర్ణాంధ్ర-2047 ప్రయాణంలో రిలయన్స్‌ భాగస్వామి కావడాన్ని గర్వకారణంగా భావిస్తున్నాం’ అని అనంత్‌ అంబానీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.


అందరికీ నమస్కారం అని తెలుగులో ప్రసంగం  ప్రారంభించిన అనంత్‌ అంబానీ.. ‘నన్ను ఆంధ్ర బిడ్డగా   భావించండి’ అని తెలుగులోనే అనడం, ‘అందరికీ ధన్యవాదాలు’ అని చెబుతూ ప్రసంగం ముగించడం సభకు ఆకర్షణగా నిలిచింది. సభ ఆసాంతం మంత్రి లోకేశ్‌తో చనువుగా  సంభాషిస్తూ సరదాగా గడిపారు. ఆయన ప్రసంగం తర్వాత  చంద్రబాబు ఆలింగనం  చేసుకుని అభినందనలు తెలిపారు. కార్యక్రమం ముగిశాక నిర్మలా సీతారామన్,  చంద్రబాబులకు అనంత్‌ అంబానీ పాదాభివందనం చేసి వీడ్కోలు తీసుకున్నారు.

అద్భుత ప్రస్థానానికి నాంది

Eenadu icon

By Andhra Pradesh News DeskPublished : 03 Oct 2026 06:03 IST

Ee

Font size

5 min read

gg-pref.gif

రాయలసీమ తలరాత మార్చే ఉద్యానహబ్‌
త్వరలో ప్రపంచంలో ప్రతి మూలకూ మన ఉద్యాన ఉత్పత్తులు
కేంద్ర సహకారంతోనే రూ.లక్ష కోట్ల ప్రాజెక్టు సాధ్యమైంది
రాయలసీమ బిడ్డగా ఇందుకు సంతోషిస్తున్నా 
అనంత్‌ అంబానీ.. ఇక ఆంధ్రప్రదేశ్‌ ముద్దుబిడ్డ 
ఆయన ఐఎస్‌ఏ ఏర్పాటుకు ముందుకు రావడం ఆనందదాయకం
గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్, ఐఎస్‌ఏ శంకుస్థాపన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు

021026APMAIN-1a.webp

ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఏర్పాటుకు డిజిటల్‌ విధానంలో శ్రీకారం చుడుతున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో రిలయన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పీఎంఎస్‌ ప్రసాద్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, రిలయన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనంత్‌ అంబానీ, మంత్రులు లోకేశ్, జనార్దన్‌రెడ్డి, రామానాయుడు

  • మదనపల్లెలో ఉత్పత్తి చేసే విద్యుత్తును కశ్మీర్‌లోనూ వాడుకునేలా పవర్‌గ్రిడ్‌ వచ్చింది. 4, 6, 8 లేన్లతో రోడ్‌ గ్రిడ్లూ వచ్చాయి. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, డిజిటల్‌ కనెక్టివిటీ వచ్చాయి. వాటర్‌గ్రిడ్‌ మాత్రమే లేదు. గంగా-కావేరి అనుసంధానంలో భాగంగా ముందు గోదావరిని రాయలసీమ ద్వారా కావేరికి అనుసంధానించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరుతున్నా. ఆమె ప్రధాని మోదీతో మాట్లాడి సాధించగలిగితే దక్షిణాదిలో నీటి గొడవలు ఉండవు. ఐదు నదులు అనుసంధానమై నాలుగు రాష్ట్రాల నీటి సమస్యలు పరిష్కారమవుతాయి. రాయలసీమ కరవు తీరుతుంది. 

  • గొడ్డలి పార్టీ ఎంత అడ్డుపడినా పట్టిసీమ ఎత్తిపోతల పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీరందించాం. అక్కడ కృష్ణా జలాల్ని పొదుపు చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకు తీసుకొచ్చాం. అందుకే ఇప్పుడు రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌గా మారుతోంది. పట్టిసీమ పూర్తి చేయకపోతే రాయలసీమ పరిస్థితి ఏమయ్యేదో ప్రజలు ఆలోచించాలి.

  • 2024 ఎన్నికల్లో ఎన్డీయేపై నమ్మకంతో అత్యధిక సీట్లలో గెలిపించారు. అప్పటి నుంచి ప్రధాని మోదీ, నేను, పవన్‌ కల్యాణ్‌ ప్రజల కోసమే ఆలోచిస్తున్నాం. రూ.లక్ష కోట్లతో గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్, ఐఎస్‌ఏ ఏర్పాటు సాకారమయ్యాయి. ఇందుకు రాయలసీమ బిడ్డగా ఆనందిస్తున్నా. 

ఈనాడు, అన్నమయ్య: కరవు సీమను సిరుల సీమగా తీర్చిదిద్దేలా.. రాయలసీమ తలరాత మార్చేలా రూ.లక్ష కోట్లతో ఉద్యానహబ్‌కు శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ రోజు (2026 అక్టోబరు 2) సీమ ప్రజల జీవితాలు మార్చే అద్భుతమైన ప్రస్థానానికి నాంది పలుకుతుందని చెప్పారు. గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌ ద్వారా రాయలసీమను ఫ్రూట్‌ బౌల్‌ ఆఫ్‌ వరల్డ్‌గా తయారు చేస్తామన్నారు. ఏ పంట అయినా పండించే సత్తా రాయలసీమ రైతుకు ఉందని గుర్తుచేశారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా అది రాయలసీమలో ఫలానా రైతు పండించిన పండు అని చెప్పే రోజు త్వరలోనే రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చేతుల మీదుగా రాయలసీమ హార్టికల్చర్‌ హబ్, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ (ఐఎస్‌ఏ)లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ‘సీమలో యాపిల్‌ నుంచి స్ట్రాబెర్రీ వరకు, అరటి నుంచి అవకాడో వరకు, కివి నుంచి ఖర్జూరం వరకు.. 20 రకాల పంటలు సాగుచేస్తున్నారు. ఇలా ఒకే ప్రాంతంలో ఎన్నో రకాల పండ్లు, కూరగాయలు, పూలు పండించే ప్రాంతం రాయలసీమ తప్ప మరేదీ లేదు. రాబోయే రోజుల్లో రాయలసీమ గ్లోబల్‌ హబ్‌గా తయారవుతుంది.

నిర్మలా సీతారామన్‌ సహకారంతోనే సాకారం: దేశాన్ని శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా తయారు చేయాలని అనునిత్యం పనిచేసే వ్యక్తి నిర్మలా సీతారామన్‌. ఆమెను ఎప్పుడు కలిసినా రాయలసీమ రైతులు, కష్టాలు, కరవు, వలసల గురించి చెబుతుంటాను. ఆమె అర్థం చేసుకుని సమస్యకు పరిష్కారం చూపారు. రూ.లక్ష కోట్లతో గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌కు శ్రీకారం చుట్టామంటే.. నిర్మలా సీతారామన్‌ సహకారమే కారణం. కేంద్రం రూ.40 వేల కోట్లు పెట్టుబడిగా పెడుతోంది. ప్రైవేటు పెట్టుబడులు రూ.60 వేల కోట్లు వస్తాయి. 10 లక్షల మంది రైతు కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. అదనంగా రూ.లక్ష కోట్ల జీవీఏ లభిస్తుంది. 

021026APMAIN-b.webp

రాయలసీమలో పండించిన ఉద్యాన ఉత్పత్తుల ప్రదర్శన

వంతారాలా ఐఎస్‌ఏను అభివృద్ధి చేయాలి

రిలయన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనంత్‌ అంబానీ ఇకపై మనలో ఒకరు. మన ఆంధ్రప్రదేశ్‌ ముద్దుబిడ్డ. ఆయన గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3,500 ఎకరాల్లో ‘వంతారా’ పేరుతో ప్రపంచ ప్రసిద్ధ వన్యప్రాణి సంరక్షణ, పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి మూగజీవాలకు నిస్వార్థ సేవ చేస్తున్నారు. తిరుమలలో ఉచితంగా విద్యుత్తు బస్సులు సమకూర్చారు. హైదరాబాద్‌లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) ఏర్పాటు చేసినప్పుడు ధీరూబాయ్‌ అంబానీకి ఫోన్‌ చేసి అడిగాను. ఇప్పుడు అనంత్‌ అంబానీ ముందుకొచ్చి ఐఎస్‌ఏ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. అసాధారణ సహకారం అందిస్తున్న ముకేశ్‌ అంబానీ, అనంత్‌ అంబానీలకు ధన్యవాదాలు. ఐఎస్‌ఏ ఏర్పాటు ద్వారా రాయలసీమ ప్రజల తలసరి ఆదాయం దేశంలోనే అగ్రస్థానానికి చేరాలి. ఉద్యాన ఉత్పత్తుల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి. వ్యవసాయ సాంకేతికతను రైతుకు చేరువ చేయాలి. వంతారాలో ఎలాంటి అద్భుతం నిర్మించారో.. అదే స్థాయిలో ఇక్కడా వనరులు వెచ్చించి సాకారం చేయాలి. 

రాయలసీమ నీటి కష్టాలు తీరుస్తాం

రాయలసీమకు 30 ఏళ్ల క్రితమే ఇజ్రాయెల్‌ డ్రిప్‌ ఇరిగేషన్‌ టెక్నాలజీ తీసుకొచ్చాం. పంట కుంటలు, వాటర్‌షెడ్లు, చెక్‌ డ్యామ్‌లు, కాంటూరు కందకాలు నిర్మించాం. ఉద్యాన పంటల్ని ప్రోత్సహించాం. సీమ నీటి కష్టాలు తీర్చేందుకు ఎన్టీఆర్‌ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకెళ్తున్నాం. హంద్రీ-నీవా ద్వారా మదనపల్లెకు నీరందించాం. కుప్పంలో పరమసముద్రం వరకు తీసుకెళ్లాం. హంద్రీ-నీవా ఫేజ్‌-2, గాలేరు-నగరి, వెలిగొండ ఫేజ్‌-2, పేరూరు లిఫ్ట్, మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ విస్తరణ, వేదవతి లిఫ్ట్, భైరవానితిప్ప, అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టు, మల్లెమడుగు, బాలాజీ సాగర్‌ ప్రాజెక్టుల్ని వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తాం.


మన లక్ష్యం ‘రాయలసీమ రైజింగ్‌’

వరల్డ్‌ క్లాస్‌ లాజిస్టిక్స్‌తో రాయలసీమను ప్రపంచానికి అనుసంధానిస్తాం. ప్రతి ఇంటికీ సోలార్, ప్రతి పొలంలో పంట, ప్రతి పంటకూ ధర, ప్రతి రైతు ఇంట్లో సంపద, ప్రతి గ్రామంలో సంతోషం, రాయలసీమ యువత భవిష్యత్తుకు తిరుగులేని అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలి. ఇదే మన రాయలసీమ రైజింగ్‌.

► Read latest Andhra pradesh News and Telugu News

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.