Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Nara Lokesh SouthKorea Tour

Featured Replies

  • Author

ఏపీలో డిస్‌ప్లే ఫ్యాబ్‌ ఏర్పాటు చేయాలి: లోకేశ్‌

Eenadu icon

By Andhra Pradesh News TeamPublished : 07 Jul 2026 17:39 IST

Ee

Font size

1 min read

gg-pref.gif

126119446_070726lokeshnara1a.webp

సియోల్‌: దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేశ్‌ హ్యుందాయ్ మోబిస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, అపాక్ట్, ఎల్జీ కెమ్, శాంసంగ్‌ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థల అధినేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. సియోల్ నగరంలో ప్రధాన పరిశోధన, అభివృద్ధి ఆవిష్కరణల కేంద్రమైన ప్రతిష్ఠాత్మక మాగోక్ (MAGOK) సైన్స్ పార్క్‌ను సందర్శించారు. శాంసంగ్‌ సీనియర్‌ డైరెక్టర్‌ హెలెనా పార్క్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఐఎస్‌ఎం 2.0, ప్రత్యేక సెమీకండక్టర్‌, డిస్‌ప్లే ఫ్యాబ్‌ పాలసీ ద్వారా మద్దతిస్తామన్నారు. ఫుల్‌ ఏఐ-కంప్యూట్‌ స్టాక్‌ కోసం ఏపీని శాంసంగ్‌ కేంద్రంగా మార్చాలని కోరారు.

‘‘ఏపీలో ఏఐ-రెడీ హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్లు అభివృద్ధి చేయాలి. ఏఐ-సర్వర్‌ తయారీని స్థానికీకరించి, లోకల్‌ సర్వర్‌ సర్వీసింగ్‌ హబ్‌ పెట్టాలి. విశాఖలోని క్లస్టర్‌ కేంద్రంగా కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ ఏర్పాటు చేయాలి. మొబైల్స్‌ కోసం ఓఎస్‌ఏటీ కేంద్రం ఏర్పాటును పరిశీలించాలి. ఏపీలో మొబైల్‌, డివైసెస్‌ బ్యాటరీ కేంద్రం ఏర్పాటు చేయాలి. శాంసంగ్‌ ఆర్‌అండ్‌డీ విభాగాన్ని అమరావతి క్వాంటం వ్యాలీలోకి తీసుకురావాలి’’ అని మంత్రి లోకేశ్‌ కోరారు. డెడికేటెడ్‌ శాంసంగ్‌ సిటీని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

  • Author

ఏపీలో పెట్టుబడులకు బూ యంగ్‌ గ్రూప్‌ ఆసక్తి.. సంస్థ ప్రతినిధులతో మంత్రి లోకేశ్‌ భేటీ

Eenadu icon

By Andhra Pradesh News TeamPublished : 08 Jul 2026 11:57 IST

Ee

Font size

1 min read

gg-pref.gif

126120026_08072026lokesh-1a.webp

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏపీ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) దక్షిణకొరియా పర్యటన నాలుగో రోజు కొనసాగుతోంది. పాదరక్షలు, షూ లేసులు, మెటల్ హార్డ్‌వేర్, అనుబంధ పరికరాల తయారీలో పేరెన్నికగన్న బూ యంగ్ గ్రూప్ (Boo Young Group) సీఈవో, ప్రెసిడెంట్ డైరెక్టర్ ర్యాన్ కాంగ్ (Mr. Ryan Kang), బిజినెస్ స్ట్రాటజీ, ప్లానింగ్ మేనేజర్ మిల్లీ రిచర్డ్‌సన్‌లతో మంత్రి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో బూ యంగ్ గ్రూప్ పాదరక్షలు, విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటుచేయాలని లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. బూ యంగ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌కి వస్తే సింగిల్ విండో విధానంలో అనుమతులతో పాటు రాష్ట్రంలో ప్రధాన పారిశ్రామిక జోన్లలో కంపెనీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కనెక్టివిటీ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఏపీలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను అమలు చేస్తున్నామన్నారు. ఏపీలో బూ యంగ్ పాదరక్షల తయారీ, విడిభాగాల యూనిట్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తూ, రెడీ బిల్ట్ షెడ్ల కోసం అన్వేషిస్తున్నట్లు బూ యంగ్ గ్రూప్ సీఈవో ర్యాన్ కాంగ్ చెప్పారు. తమకున్న గ్లోబల్ నెట్ వర్క్ భారతీయ తయారీ రంగాన్ని ప్రపంచ పంపిణీ వ్యవస్థతో అనుసంధానిస్తుందని పేర్కొన్నారు.

  • Author

ఏపీలో శాంసంగ్‌ సిటీని ఏర్పాటు చేయండి

Eenadu icon

By Andhra Pradesh News DeskPublished : 08 Jul 2026 05:03 IST

Ee

Font size

4 min read

gg-pref.gif

ఎల్‌జీ, శాంసంగ్, హ్యుందయ్, అపాక్ట్‌ సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేశ్‌ భేటీ

AP070726MAIN-16a.webp

శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ హెలెనా పార్క్, బి2బి బిజినెస్‌ డైరెక్టర్‌ హీసూ యాంగ్‌ తదితరులతో లోకేశ్‌

ఈనాడు, అమరావతి: దక్షిణకొరియా పర్యటనలో భాగంగా మూడోరోజు ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, ఎల్‌జీ కెమ్‌ గ్లోబల్‌ స్ట్రాటజీ, శాంసంగ్, హ్యుందయ్‌ మోబిస్, అపాక్ట్‌ కంపెనీల ప్రతినిధులతో మంత్రి లోకేశ్‌ మంగళవారం వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వారితో చర్చించారు. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ విస్తరణలో భాగంగా విశాఖపట్నంలో ఒక ఇంజినీరింగ్‌ సెంటర్‌/జీసీసీ ఏర్పాటుచేయాలని సంస్థ ప్రతినిధులను లోకేశ్‌ కోరారు. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌(గ్లోబల్‌) సీఈవో ల్యూ జె చెయాల్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌(ఇండియా) సీఈవో హాంగ్‌ జు జియోన్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. ‘శ్రీసిటీ, పరిసర ప్రాంతాల్లో డిస్‌ప్లే మాడ్యూళ్లు, సెన్సర్లు, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించండి. వాణిజ్య ప్రయోజనాల కోసం చిల్లర్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయండి’ అని కోరారు. ఈ ఏడాది చివరికి శ్రీసిటీలో రూ.5,000 కోట్లతో ఏర్పాటుచేసే మూడో యూనిట్‌ ద్వారా వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నామని.. తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని హాంగ్‌ జు జియోన్‌ తెలిపారు. 

కాకినాడ పోర్టు సమీపంలో పాలీస్టెరిన్‌ తయారీ కేంద్రం ఏర్పాటుచేయాలని ఎల్‌జీ కెమ్‌ గ్లోబల్‌ స్ట్రాటజీ సెంటర్‌ ప్రతినిధులను మంత్రి లోకేశ్‌ కోరారు. ఆ సంస్థ ప్రెసిడెంట్‌ అండ్‌ ఎల్‌జీ ఓవర్సీస్‌ హోల్డింగ్‌ కంపెనీస్‌ హెడ్‌ యున్‌-జు కోహ్‌తో భేటీ అయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. ‘మూలపేటలో ప్రపంచస్థాయి నాఫ్తా క్రాకర్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించండి. ఎస్‌ఏఎఫ్‌ బయో ఇథనాల్, జీవ ఇంధనాల తయారీ కేంద్రం ఏర్పాటుచేయండి’ అని కోరారు. 

AP070726MAIN-16b.webp

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి లోకేశ్‌

డేటాసెంటర్లు ఏర్పాటుచేయండి

రాష్ట్రంలో డేటాసెంటర్లు, సర్వర్‌ తయారీ, సర్వీసింగ్‌తో కూడిన ఫుల్‌ ఏఐ-కంప్యూట్‌ స్టాక్‌గా తీర్చిదిద్దే అంశాన్ని పరిశీలించాలని శాంసంగ్‌ ప్రతినిధులను లోకేశ్‌ కోరారు. డెడికేటెడ్‌ శాంసంగ్‌ సిటీని ఏపీలో నిర్మించాలని ప్రతిపాదించారు. శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌(దక్షిణ కొరియా) సీనియర్‌ డైరెక్టర్, అపాక్‌ ఎంఎక్స్‌ బిజినెస్‌ హెడ్‌ హెలెనా పార్క్, బి2బి బిజినెస్‌ డైరెక్టర్‌ హీసూ యాంగ్, ఎంటర్‌ప్రైజెస్‌ బిజినెస్‌ గ్లోబల్‌ సేల్స్‌ హెడ్‌ వీపీ జున్‌లతో మంత్రి భేటీ ఆయ్యారు. ‘ఏపీలో ఏఐ-రెడీ హైపర్‌స్కేల్‌ డేటాసెంటర్లను అభివృద్ధి చేయండి. విశాఖపట్నంలోని ఓఎస్‌ఏటీ క్లస్టర్‌ కేంద్రంగా కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్, మొబైల్స్‌ కోసం ఒక ఓఎస్‌ఏటీ కేంద్రాన్ని ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలి. అమరావతి క్వాంటమ్‌ వ్యాలీలో 133 క్యూబిట్‌ ఐబీఎం క్వాంటమ్‌ సిస్టమ్‌-2పై పరిశోధనకు శాంసంగ్‌ ఆర్‌అండ్‌డీ విభాగాన్ని ఏర్పాటుచేయండి. అమరావతిలో శాంసంగ్‌ హెవీ ఇంజినీరింగ్, దుగరాజపట్నంలో నౌకానిర్మాణ క్లస్టర్‌ అభివృద్ధికి శాంసంగ్‌ హెవీ ఇండస్ట్రీస్‌ నిపుణులను నియమించండి’ అని కోరారు. 

హనా మైక్రాన్‌ పెట్టుబడులు పెట్టేలా..  

హనా మైక్రాన్, ఇతర ఏఎస్‌ఏటీ (అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్‌) సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని అపాక్ట్‌ కంపెనీ సీఈఓ సియాంగ్‌ డాంగ్‌ లీతో భేటీలో లోకేశ్‌ కోరారు. ‘ఏఐఎస్‌పీ భాగస్వామ్యంతో ఏపీలో అపాక్ట్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నందుకు ధన్యవాదాలు. ఏఎస్‌ఏటీ సెమీకండక్టర్‌కు సంబంధించి యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడానికి ఏపీ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోండి’ అని ప్రతిపాదించారు. విశాఖపట్నంలోని ఏఎస్‌ఐపీ జాయింట్‌ వెంచర్‌ పనులు త్వరలో ప్రారంభిస్తామని, ఏపీ ప్రభుత్వ ప్రతిపాదలను పరిశీలిస్తామని డాంగ్‌ లీ తెలిపారు.

AP070726MAIN-16c.webp

అపాక్ట్‌ సీఈఓ సియాంగ్‌ డాంగ్‌ లీతో లోకేశ్‌ 

ఈవీ సెమీకండక్టర్ల హబ్‌..

రాష్ట్రంలో ఈవీ సెమీకండక్టర్ల హబ్‌ ఏర్పాటు ప్రతిపాదన పరిశీలించాలని మంత్రి లోకేశ్‌ హ్యుందయ్‌ మోబిస్‌ సంస్థను కోరారు. సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ యంగ్‌ బిన్‌ కిమ్, వైస్‌ప్రెసిడెంట్‌ హన్ఫోక్‌ పార్క్‌లతో మంత్రి భేటీ అయ్యారు. ‘తిరుపతి/అనంతపురం సమీపంలో ఈవీ కాంపొనెంట్‌ అండ్‌ బ్యాటరీ సిస్టమ్స్‌ తయారీ కేంద్రం, విశాఖపట్నంలో హ్యుందయ్‌ మోబిస్‌ ఆర్‌ అండ్‌ డి/ఇంజినీరింగ్‌ విభాగాన్ని ఏర్పాటుచేయాలి’ అని కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని యంగ్‌ బిన్‌ కిమ్‌ తెలిపారు.


పరిశోధన, ఆవిష్కరణల కేంద్రం.. మాగోక్‌ సైన్స్‌ పార్క్‌!

AP070726MAIN-16d_1.webp

మాగోక్‌ సైన్స్‌ పార్క్‌లో హ్యూమనాయిడ్‌ రోబోతో మంత్రి లోకేశ్‌

ఈనాడు, అమరావతి: సియోల్‌లో ప్రధాన పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల కేంద్రం మాగోక్‌ సైన్స్‌ పార్క్‌ను మంత్రి లోకేశ్‌ సందర్శించారు. సియోల్‌ గాంగ్‌సియో-గు ప్రాంతంలో మిలియన్‌ చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న పార్కు దక్షిణకొరియాలో అతిపెద్ద సాంకేతిక అనుసంధాన ప్రాంతం. పరిశోధన కేంద్రాలు, స్టార్టప్‌లు, సియోల్‌ బొటానికల్‌ పార్కు, టడావో ఆండో రూపొందించిన ఎల్‌జీ ఆర్ట్‌ సెంటర్‌ ఉన్నాయి. 8 ఎల్‌జీ అనుబంధ సంస్థల నుంచి 20వేల మంది పరిశోధకులు, భాగస్వామ్య సంస్థలు, స్టార్టప్‌లు ఇందులో ఉన్నాయి. మాగోక్‌ సైన్స్‌పార్క్‌ కొరియా సిలికాన్‌ వ్యాలీగా గుర్తింపు పొందింది. రోబో జోన్, ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే జోన్, మొబిలిటీ, మెటీరియల్స్‌ ప్రదర్శనలను మంత్రి తిలకించారు. సియోల్‌ బొటానికల్‌ పార్క్, మాగోక్‌ కల్చరల్‌ హాల్, హాన్‌ నది పార్క్‌లనూ సందర్శించారు.

  • Author

కొరియన్ పెట్టుబడులకు ఏపీ స్వాగతం: మంత్రి లోకేశ్‌

Eenadu icon

By Andhra Pradesh News TeamPublished : 09 Jul 2026 10:38 IST

Ee

Font size

1 min read

gg-pref.gif

126120686_09072026lokesh-1a.webp

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణకొరియా రాజకీయ వ్యవహారాలు, విదేశాంగశాఖ ఉపమంత్రి యుయ్-హే సిసిలియా చుంగ్‌తో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) సియోల్ లో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేస్తున్న 3S (స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్) విధానం కొరియా పెట్టుబడిదారులకు రక్షణ కవచంలా నిలుస్తుందని లోకేష్‌ తెలిపారు. భారత్‌లో ఆంధ్రప్రదేశ్ ను అత్యంత స్థిరమైన, నమ్మకమైన కేంద్రంగా చేసుకునేలా పరిశ్రమదారులను ప్రోత్సహించాలని కోరారు. ఏపీలో అందించే పన్నురాయితీలు, తక్కువధరకే భూమి, సబ్సిడీలు పరిశ్రమదారులకు మద్దతుగా నిలుస్తాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తూర్పుతీరంలో సురక్షితమైన, నమ్మకమైన, స్నేహపూర్వక ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్నారు. దీనివల్ల ప్రపంచ సప్లయ్ చైన్ నష్టాలను కూడా తగ్గించడానికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు. కేవలం భారీ పరిశ్రమలేకాకుండా గ్రీన్ ఎనర్జీ, వినియోగ వస్తువులు, మోడరన్ రిటైల్, టూరిజం, అడ్వాన్స్‌డ్‌ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కొరియన్ పెట్టుబడులకు ఏపీ స్వాగతం పలుకుతోందన్నారు.

  • Author

కియా ఈవీ, హైబ్రిడ్‌ వాహనాల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుచేయండి

Eenadu icon

By Andhra Pradesh News DeskUpdated : 10 Jul 2026 05:14 IST

Ee

Font size

3 min read

gg-pref.gif

ఏపీలో పెట్టుబడులు పెట్టేలా కొరియా కంపెనీలను ప్రోత్సహించండి
కొరియా రాజకీయ వ్యవహారాలు, ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ శాఖల 
మంత్రులకు లోకేశ్‌ విజ్ఞప్తి

AP090726MAIN-4a.webp

కియా కర్మాగారంలో రోబో డాగ్‌ను పరిశీలిస్తున్న లోకేశ్
కొరియా రాజకీయ వ్యవహారాలు, విదేశాంగ శాఖ ఉపమంత్రి యుయ్‌-హే సిసిలియా చుంగ్‌కు జ్ఞాపిక అందిస్తున్న మంత్రి లోకేశ్‌

ఈనాడు, అమరావతి: దక్షిణకొరియా పర్యటనలో భాగంగా ఐదోరోజు కియా మోటార్స్, సునిక్‌ సిస్టమ్స్‌ ప్రతినిధులతో మంత్రి లోకేశ్‌ సియోల్‌లో గురువారం భేటీ అయ్యారు. కియా పరిశ్రమను విస్తరించాలని ప్రతిపాదించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా కొరియా కంపెనీలను ప్రోత్సహించాలని కొరియా రాజకీయ వ్యవహారాలు, ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ శాఖల మంత్రులను కోరారు.

కియా ప్లాంటును విస్తరించండి

కియా మోటార్స్‌ డిజైన్‌ చేసిన పీబీవీలు సహా ఇంటిగ్రేటెడ్‌ ఈవీ, హైబ్రిడ్‌ వాహనాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుచేసి ఏపీలో కార్యకలాపాలను విస్తరించాలని సంస్థ ప్రతినిధులను మంత్రి లోకేశ్‌ కోరారు. కియా మోటార్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌(గ్లోబల్‌ ఆపరేషన్స్‌) టే హన్‌ లీ తదితరులతో సమావేశమయ్యారు. ‘విశాఖపట్నం పోర్టు సమీపంలో సీకేడీ అసెంబ్లింగ్, ఎక్స్‌పోర్ట్‌ సెంటర్‌ ఏర్పాటుచేయండి. ఈ-జీఎంపీ ప్లాట్‌ఫాం కాంపొనెంట్లు, బ్యాటరీ సిస్టమ్‌లు, ఈవీ ఛార్జింగ్‌ కోసం ఒక ఈవీ కాంపొనెంట్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయండి. ఈవీ పవర్‌ ట్రెయిన్‌ టెస్టింగ్‌ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలి’ అని లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. 

శ్రీసిటీలో డిస్‌ప్లే తయారీ యూనిట్‌ పెట్టండి

సునిక్‌ సిస్టమ్స్‌ డిస్‌ప్లే పరికరాల తయారీ యూనిట్‌ను శ్రీసిటీలో ఏర్పాటుచేయాలని సునిక్‌ సిస్టమ్‌ కో లిమిటెడ్‌ను లోకేశ్‌ కోరారు. ఆ సంస్థ సీఈవో ఎస్‌.డబ్ల్యూ.చుంగ్, సంస్థ ఉన్నతస్థాయి బృందంతో మాట్లాడుతూ.. ‘ఏపీలో యూనిట్‌ ఏర్పాటుకు జాయింట్‌ వెంచర్‌ కోసం సహకారం అందిస్తాం. సెమీకాన్‌ టెక్‌పై నైపుణ్యాభివృద్ధికి శిక్షణ అందించండి’ అని కోరారు. 

కొరియా పెట్టుబడులకు ఏపీ సురక్షితం

ఏపీ అందించే పన్ను రాయితీలు, తక్కువ ధరకు భూమి, రాయితీలు పారిశ్రామికవేత్తలకు మద్దతుగా నిలుస్తాయని కొరియా రాజకీయ వ్యవహారాలు, విదేశాంగ శాఖ ఉపమంత్రి యుయ్‌-హే సిసిలియా చుంగ్‌కు లోకేశ్‌ తెలిపారు. ‘ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో సురక్షితమైన, నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ఏపీ నిలుస్తుంది. కొరియన్‌ వృత్తిప్రమాణాలు, భాష, సంస్కృతిపై స్థానిక యువతను సిద్ధం చేసేందుకు కొరియాతో కలిసి శిక్షణ అకాడమీల ఏర్పాటుకు మేం సిద్ధం.  విశాఖపట్నం-బూసాన్‌/ఇంచియాన్‌ మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఏపీలోని విశ్వవిద్యాలయాల్లో కొరియన్‌ లాంగ్వేజ్‌ సెంటర్లు ఏర్పాటుచేయాలి’ అని లోకేశ్‌ కోరారు. 


పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయండి

AP090726MAIN-4b.webp

దక్షిణ కొరియా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఉపమంత్రి కామ్చాన్‌ కాంగ్‌తో చర్చిస్తున్న లోకేశ్‌

ఏపీలోని కొరియా కంపెనీల కోసం ప్రత్యేకంగా కొరియా పారిశ్రామిక పార్కు ఏర్పాటుచేయాలని దక్షిణ కొరియా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఉపమంత్రి కామ్చాన్‌ కాంగ్‌ను మంత్రి లోకేశ్‌ కోరారు. ‘ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, పాదరక్షల తయారీ, నౌకా నిర్మాణరంగాల్లో కొరియా నైపుణ్య సహకారం అందించాలి. ఏపీలో ఏర్పాటయ్యే 10 గిగావాట్ల డేటాసెంటర్‌ ప్రాజెక్టులకు ఇంధన మౌలిక సదుపాయాల ప్రణాళికల రూపకల్పనలో కొరియా ప్రభుత్వ భాగస్వామ్యాన్ని కోరుతున్నాం. సౌర, పవన, గ్రీన్‌ హైడ్రోజన్, పంప్డ్‌ స్టోరేజీ, బ్యాటరీ విద్యుత్‌ రంగాల్లో పెట్టుబడులకు ఎస్‌కే ఎనర్జీ, ఎల్‌జీ ఎనర్జీ, హన్వా వంటి కొరియన్‌ సంస్థలను ఆహ్వానిస్తున్నాం’ అని పేర్కొన్నారు.


Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.