Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

🦁 #HappyBirthdayNBK #GodOfMassesNBK 🦁

Featured Replies

  • Replies 147
  • Views 3.5k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • chanu@ntrfan
    chanu@ntrfan

    Happy Birthday Bala…Ee stage of career lo fans ki nuvvu isthunna kickuu inkevaru ivvaleru…Zindabad Balayya Babu…🥳🥳

  • Husker
    Husker

  • Vinod NKR
    Vinod NKR

Posted Images

బాలయ్య @66

ఇది ఎవరిని నొప్పించడానికి కాదు..నిజానికి నాకు ఈ నలుగురు హీరోల్లో లీస్ట్ గా నచ్చేది బాలయ్యా ఒక్కడే మొన్నటిదాకా..(2021 )

నా వరకూ బాలయ్య సినిమాలు వరుసగా చూడడం మొదలయ్యింది పెద్దన్నయ్య నుండి లేదా సమరసింహారెడ్డి...

ఇక ప్రస్తుతం మాట్లాడుకుంటే బాలయ్య ఎన్నడూ లేని అత్యున్నత దశలో ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే తన కెరీర్లోనే అత్యున్నత దశ అంటాను.ఇతరుల గూర్చి ప్రస్తావించను ఒకరకంగా ఇది బాలయ్య సమయం నడుస్తోంది...

2004 నుండి ఇంటర్ నెట్ అందుబాటులోకి వచ్చాక కొన్ని శక్తులు ఆస్ట్రేలియా కేంద్రంగా బాలయ్య మీద హీనమైన మార్ఫింగులతో చెలరేగిపోయాయి..ఒక రకంగా తెలుగు సినిమా హీరోల్లో అత్యంత ట్రాలింగ్ కి గురైన హీరో అంటే బాలయ్య మాత్రమే..ఆయన మంచితనం భోళాతనం నా లాంటి వారికి కూడా తెలియని రోజులవి‌.ఒకరకంగా నా వరకూ నేను బాలయ్యనే తప్పుపడతాను ఈ. విషయంలో.మార్కెటింగ్ అనేది కూడా ఒక కళ అది ఆయనకి లేదు.ఒకటి రెండు హిట్లు పడగానే బౌంసర్లతో చెలరేగిపోతున్నారు నేటి తరం హీరోలు అలాంటిది ఇప్పటికి ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళ్తాడు...ఇకపై ఆయన మీద ఉన్న అభియోగం కొడతాడని మరి మీద పడితే కొట్టక ముద్దెట్టుకుంటారా? పవన్ కళ్యాణ్ సభల్లో పవన్ ఎన్ని ఇబ్బందులకి గురయ్యాడని..నా వరకూ ఆ స్ధానంలో నేనున్నా అలానే పీకుతా అనిపిస్తుంది ఒక్కోసారి..

ప్రస్తుతం బాలయ్య సమయం నడుస్తోంది. రానున్న మూడు నాలుగు చిత్రాలు కూడా బాలయ్య హవా నూటికి తొంభై శాతం ఊపుతాయని నా నమ్మకం..ఇక ఆహా ప్రోగ్రాం ద్వారా బాలయ్య అందరికి దగ్గర అయ్యాడు..ఇలాంటివి ముందే ఎప్పుడో‌ చేయాల్సింది..బాలయ్య మీద నేడు ఒకరకమైన పాజిటివిటీ వచ్చేసింది.దానిని ఆయన అభిమానులు కాపాడుకోవాల్సిన అవసరం బాలయ్య కన్నా ఆయన అభిమానులకే ఎక్కువ ఉంది అంటాను...ప్రస్తుతం బాలయ్య లుక్కుని అందరికి నచ్చేలా తీర్చి దిద్దగలిగే వారైన దర్శకుల చేతిలో ఆయన సినిమాలు ఉన్నాయ్..నా వరకూ బాలయ్య‌ లుక్ సరిగ్గా ఉంటే చాలు బొమ్మ బొనోంజానే...2007 నుండి అనుకునేవాడిని ఇక అయిపోయారు అగ్రహీరోలంతా అని..ఒక్క నాగార్జున మాత్రం మరో పదేళ్జ్లు లాక్కొస్తాడు అనుకున్నా..కానీ నేడు 2022 లో నాగార్జున పని అయిపోయింది..వెంకటేష్ మార్కెట్ కి భయపడుతున్నాడు నిజానికి వెంకటేష్ ని ఇంకా బాగా వాడుకోవచ్చు మొన్న F3లో నటన చూసాక కానీ వెంకీ మార్కెట్ ఫ్రెండ్లీ తనంతట తానూ కొన్ని విషయాల్లో ధైర్యం చేయడు...ఇక చిరంజీవి అసలు ఈ నలుగురి అగ్రహీరోల కన్నా ఎక్కువ మార్కెట్ మెగా సొంతం కానీ రిమేకుల మీద అధారపడుతున్నాడు. సేఫ్ గేం ఆడాలని .అది దెబ్బకొడతోంది..ఒక్క బాలయ్య మాత్రమే మార్కెట్ తో ట్రెండ్ తో సంబంధం లేకుండా ముందుకు వెళ్తున్నాడు..మరో పదేళ్ళు నడపపగలడు బాలయ్య....దీనికి ఆయన ఎంచుకున్న పంధా తక్కువ బడ్జెట్ తక్కువ రెమ్యునరేన్ ఇలా తన పరిమితికి లోబడి ఆకాశానికి నిచ్చెన వేయకుండా ఉన్నంతలో తగ్గి సినిమాలు తీయమంటాడు..సమరసింహా రెడ్డి నరసింహ నాయుడు ఇలా ఎన్ని హిట్లు వచ్చినా ఆయన తన రెమ్యునరేషణ్ రెండున్నర కోట్లు దాటలేదు..సింహ లిజెండ్ తరువాత కూడా ఆరేడు కోట్లు కూడా తీసుకోలేదు.

ఆహా ప్రోగ్రాం కి బాలయ్య తీసుకుంది కేవలం నాలుగు కోట్లు అది కూడా బసవతారకం ట్రస్జ్తుకే తప్ప ఆయనకి కాదు...ఇదె బాలయ్య స్ధాయి లేదా ఓ మాదిరి పేరున్న హీరోయిన్లైతే తక్కువలో తక్కువ పది కోట్లు అడిగేవారు.‌. .అది బాలయ్య అంటే...

దయచేసి వీరాభిమానులు వాస్తవం అర్ధం చేసుకోండి తప్ప ఉలికిపాటుకి గురవ్వకండి..

బాలయ్య జన్మదిన సందర్భంగా ఆయన మరో ఇరవై ఏళ్ళు అద్భుతమైన వయసుకి తగ్గ పాత్రలు పోషించాలని మరింత అత్యున్నత స్ధానానికి చేరాలని కోరుకుంటున్నాను...

దైవం మానుష్య రూపేణా అన్నట్టు బసవతారకం ట్రస్స్త్ కి సేవలు అందిస్తున్న బాలయ్యకి జన్మదిన శుభాకాంక్షలు

జై బాలయ్య..

.FB post

పరమవీరచక్ర తీశాడని దాసరిని,
పాండురంగడు ఫ్లాప్ అని రాఘవేంద్ర రావు నీ నిందించలేదు..

వీరభద్ర ఫ్లాప్ అయింది అని రవికుమార్ చౌదరి కెరీర్ అంతం చెయ్యలేదు..
విజయేంద్ర వర్మ తీసినందుకు స్వర్ణ సుబ్బారావుని బలిపశువు ని నీ చెయ్యలేదు..
ఒక్క మగాడు పోయిందని వైవీఎస్ చౌదరి నీ దూరం పెట్టలేదు..

చెప్పుకుంటూ పోతే ఫ్లాప్ లిస్ట్ లో ఉన్న పీ.వాసు, కే ఎస్ రవికుమార్, క్రిష్ , జయంత్ సీ పరాన్జి వంటి డైరెక్టర్ ల గురించి బహిరంగంగా ఏనాడూ ఒక్క చిన్న మాట తూలలేదు..

పై పెచ్చు ఆ సినిమాల అపజయాన్ని అందరి కన్నా ఎక్కువ తానే మోశాడు.. Paid PR టీముల ని పెట్టుకుని, రివ్యూవర్లను మ్యానేజ్ చేసి పోయిన సినిమా క్రెడిట్ అంతా డైరెక్టర్ల ఖాతాలో, హిట్లని తన సొంత విజయంగా ఏనాడూ ప్రదర్శించుకోలేదు..

దర్శకుల పని లో వేలెట్టి కెలికేసి సొంత ఇన్ పుట్ లు, వెకిలి సలహాలు ఇచ్చేసి ఏనాడూ ఎవరితో మాట పడలేదు.. దర్శకుడే అన్నిటికీ ఆద్యుడు, he is the captain of the ship అని నమ్మే సమర సింహా రెడ్డి, నరసింహ నాయుడు లో థియేటర్ ల తాపు లేపిన ట్రైన్ సీన్ ల ను "బీ గోపాల్ గారు నా నుండి బెస్ట్ ఔట్ పుట్ తీసుకురాగలరు" అన్నా, అదే బీ గోపాల్ గారు దర్శకత్వం వహించిన పలనాటి బ్రహ్మనాయుడు లో ట్రాల్ అయిన ట్రైన్ సీన్ లను ప్రస్తావిస్తూ "ఎందుకు చేశానో నాకే తెలీదు, అసలు తొడ గొడిటే ట్రైన్ వెళ్లిపోవడం ఏమిటి, చూస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది" అని నవ్వుతూ వదిలేసినా బాలయ్య కే చెల్లింది..

అందుకే అంత స్వచ్ఛంగా తన మీద సోషల్ మీడియా లో వెకిలి కామెడీ లు చేసుకుని బతికే ఎందరికో పరోక్షంగా తిండి పెడుతూ, కుల మత ప్రాంతాల కతీతంగా క్యాన్సర్ కారణంగా అంధకారం నింపుకున్న ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతూ సినీ వినీలాకాశంలో ధృవ తారగా , రాజకీయ రణరంగం లో ఓటమి ఎరుగని యోధునిగా నిలిచిపోయాడు..

అందుకే మరొక్కసారి మనస్ఫూర్తిగా
మా ముద్దులకృష్ణయ్య బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు "జై బాలయ్య"..🌹🌹🌹🌹🌹🌹🌹
🥳🥳🥳🥳🥳🥳🥳🏇🏇🏇🏇🏇 -Srinivas Yalamanchili

నీకు 66 యేళ్లు వచ్చాయి నాకు 40 యేళ్లు దాదాపు అంటే దాదాపు 30 ఏళ్ళ నుంచీ నీ సినిమాలు నా పెర్సనల్ లైఫ్ లో ఒక భాగం.

నీ సినిమా చూడటానికి
చదువుకునేటప్పుడు కాలేజీ లు ఎగ్గొట్టి వెళ్ళా..
job చేసేటప్పుడు ఆఫీస్ ఎగ్గొట్టి వెళ్ళా
కాలి నడకన వెళ్ళా...
సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళా..
బస్ ఎక్కి వెళ్ళా.. లోకల్ ట్రైన్లో వెళ్ళా, ఆటో ఎక్కి వెళ్ళా... ఆఖరికి BMW car లో వెళ్ళా...

5 రూపాయి ల బెంచి టికెట్ దగ్గర నుండి 35$ వరకు నీ సినిమాలు అన్నీ రకాల లైఫ్ చూసా..

నిన్ను చూడటానికి హైదరాబాద్ లో పార్టీ ఆఫీస్ పక్కన ఎల్వి ప్రసాద్ ల్యాబ్స్ ముందు గంటలు గంటలు ఎదురు చూసిన రోజులు ఇంకా నా కళ్లముందు తిరుగుతూనే ఉన్నాయి...

Personal గా నీ పిల్లల పెంపకంలో ఉన్న నీ గొప్పతనం నాకు inspiration...

నాకు ఊహతెలిసాక చూసిన మొట్ట మొదటి ఆల్ రౌండర్ వి నువ్వే...

హ్యాపీ బర్త్ డే హ్యాట్రిక్ MLA నందమూరి బాలయ్య 🎂💐💐💐💐💐

నాకు ఉహ తెలిసినప్పటినుంచి......
నా బలం...
నా బలహినిత...
నా పొగరు...
నా గర్వం.....
నా లొ ని బలపు అన్ని బాలయ్యే....

బాలయ్యబాబు ని చూస్తూ పెరిగా....
ఓపిక ఉనంతవరకు కాదు,ఊపిరి ఉనంతవరకు బాలయ్యా బాబు తోనే...
నా గుండే ఆగేతంవరకు బాలయ్యబాబుకే అభిమానిని...... ఒక్క బాలయ్యబాబు కి మాత్రమే....అభిమానిని...
Advance Happy Birthday 2 My God....
Jai Balayya💪
Nandamuri Balakrishna
#nbkfansadoni #adoninbkfans #adoniitdp #itdpadoni #ఆదోని #adoni

నిండైన తెలుగుదనం..అభిమానం.. భోళాతనానికి ప్రతిరూపం మా బాలా మావయ్యకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. అభిమానుల పాలిట గాడ్ ఆఫ్ మాసెస్, క్యాన్సర్ బాధితులకు సాంత్వన చేకూర్చే ఆపన్న హస్తం, హిందూపురం ప్రజా విజేత బాలా మావయ్య ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.

#HappyBirthdayNBK

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.