February 10Feb 10 Author మచిలీపట్నంలో నౌకా నిర్మాణ కేంద్రం ఏర్పాటుకు ఆర్‌ఎఫ్‌పీ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఈనాడు, అమరావతి: మచిలీపట్నంలో నౌకా నిర్మాణం, మరమ్మతు కేంద్రం ఏర్పాటుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్-ఆర్‌ఎఫ్‌పీ) జారీ చేసేందుకు ఏపీ మారిటైం బోర్డుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేటింగ్ అండ్ ట్రాన్స్‌ఫర్ (డీబీఎఫ్‌వోటీ) విధానంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఆర్‌ఎఫ్‌పీ జారీ చేసేందుకు అనుమతించాలని మారిటైం బోర్డు సీఈవో ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మచిలీపట్నంలో గోవా షిప్‌యార్డు లిమిటెడ్ సుమారు రూ.1,500 కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు సుమారు 200 ఎకరాల భూమి కేటాయించాలని కోరింది. యునైటెడ్ పెట్రో గ్రూప్ కూడా రూ.7,600 కోట్లతో ప్రాజెక్టు చేపట్టేందుకు అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ః ఇప్పటికే రూ.4,735.18 కోట్ల వ్యయంతో మచిలీపట్నంలో పోర్టు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వాటిలో రూ.1,761 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. 2026 డిసెంబరు నాటికి పోర్టు కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.
July 3Jul 3 Author తెలుగు రాష్ట్రాలకు మరింత వేగంగా డేటాBy Business News DeskUpdated : 03 Jul 2026 05:15 ISTEeFont size2 min readసింగపూర్‌తో అనుసంధానానికి భారీ సముద్ర గర్భ కేబుల్‌ఏర్పాటు చేయనున్న లైట్స్టార్మ్దేశంలో కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్ అవసరాలు శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, భారతదేశ తూర్పు తీరాన్ని ఆగ్నేయాసియాతో అనుసంధానించేందుకు భారీ సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థ సిద్ధమవుతోంది. సింగపూర్‌కు చెందిన లైట్‌స్టార్మ్ సంస్థ నేతృత్వంలో మైక్రోసాఫ్ట్, సింగ్‌టెల్, టాటా కమ్యూనికేషన్స్ వంటి దిగ్గజ సంస్థలతో కూడిన కన్సార్షియం ఈ ‘ఐ-2సీ’ ప్రాజెక్టును చేపట్టింది. సుమారు 3,600 కిలోమీటర్ల పొడవున్న ఈ కేబుల్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం, తమిళనాడులోని దక్షిణ చెన్నైలను నేరుగా సింగపూర్, మలేషియాలతో కలుపుతుంది.ఏఐ అవసరాల కోసంప్రస్తుతం అందుబాటులో ఉన్న కేబుల్ వ్యవస్థలు పాతవై పోవడం, ఏఐ శిక్షణ, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వంటి పనులకు భారీ డేటా వేగం అవసరం కావడంతో ఈ సరికొత్త వ్యవస్థను రూపొందించినట్లు లైట్‌స్టార్మ్ సీఈఓ అమజిత్ గుప్తా వెల్లడించారు. ఈ కేబుల్ ద్వారా సింగపూర్-హైదరాబాద్ మధ్య అత్యంత తక్కువ బదిలీ జాప్యంతో డేటా కనెక్టివిటీ లభిస్తుందని వెల్లడించారు. ముంబయి నుంచి సింగపూర్‌కూ ప్రస్తుత వేగం కంటే 10-15% మెరుగైన వేగం లభిస్తుందని పేర్కొన్నారు. కీలకంగా మచిలీపట్నం సాధారణంగా అంతర్జాతీయ సముద్ర గర్భ కేబుళ్లన్నీ ముంబయి వంటి పశ్చిమ తీర నగరాల్లో ల్యాండ్ అవుతుంటాయి. ఎర్ర సముద్రం, హర్మూజ్ జలసంధిలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల డేటా వ్యవస్థలపైనా ఆందోళన నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రత్యామ్నాయ మార్గం కోసం తూర్పు తీరంలోని మచిలీపట్నంను ప్రధాన ల్యాండింగ్ ప్రాంతంగా ఎంచుకున్నారు. ఈ పథకంలో భాగంగా మచిలీపట్నం నుంచి హైదరాబాద్‌కు, అక్కడి నుంచి ముంబయికి కొత్త భూగర్భ ఫైబర్ మార్గాలను ఏర్పాటు చేయనున్నారు. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్‌కు హైదరాబాద్‌లో తన డేటా సెంటర్ కార్యకలాపాలను విస్తరిస్తున్న మైక్రోసాఫ్ట్ సంస్థ, ఈ కేబుల్ వ్యవస్థను ప్రధానంగా ఉపయోగించుకోనుంది. మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇతర హైపర్ స్కేలర్లు, పెద్ద సంస్థలు ఇప్పటికే కొత్త వ్యవస్థ సేవలను పొందేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. లైట్‌స్టార్మ్‌కు చెందిన 30,000 కిలోమీటర్ల భూగర్భ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా ఉన్న 80కి పైగా డేటా సెంటర్లతో అనుసంధానమై ఉంది. 2029 నాలుగో త్రైమాసికం నాటికి కొత్త కేబుల్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, వచ్చే ఏడాది ఐపీఓ ప్రణాళికల్లో ఉన్న లైట్‌స్టార్మ్ వెల్లడించింది
Create an account or sign in to comment