February 7Feb 7 Author కొరియా టూ తిరుమల వయా భోలే బాబా By Andhra Pradesh News DeskPublished : 07 Feb 2026 05:44 IST Ee Font size 3 min read వెజిటబుల్ ఆయిల్ లేదా జంతుకొవ్వులతో మోనోగ్లిజరైడ్స్ తయారీ ఎన్‌డీడీబీ- సీఏఎల్‌ఎఫ్ నివేదికతో సరిపోల్చినా అదే స్పష్టం ఈనాడు - అమరావతి: వైకాపా హయాంలో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డెయిరీ దాని తయారీలో మోనోగ్లిజరైడ్స్ అనే రసాయనాన్ని పెద్ద ఎత్తున వినియోగించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. దిల్లీలోని రఘుబీర్ శరణ్ ఓవర్‌సీస్ సంస్థ కొరియా నుంచి వీటిని దిగుమతి చేసుకుంది. వారి నుంచి సుగంధ్ ఆయిల్ సంస్థ కొని భోలేబాబా డెయిరీకి సరఫరా చేసినట్లు నిగ్గుతేలింది. సిట్ అధికారులు గతేడాది ఏప్రిల్ 23న సుగంధ ఆయిల్స్ కంపెనీలో సోదాలు చేపట్టగా 200 కిలోల సామర్థ్యం కలిగిన డ్రమ్ముల్లో వీనస్ బ్రాండ్ లేబుల్‌తో ఉన్న మోనోగ్లిజరైడ్స్ పెద్ద ఎత్తున కనిపించాయి. కొరియాలోని ‘ఐఎల్ షిన్ వెల్స్ కో లిమిటెడ్’ కంపెనీ వీటిని ఉత్పత్తి చేసినట్లు ఆ లేబుళ్లపై ఉంది. కొద్ది రోజుల తర్వాత సిట్ అధికారులు ఉత్తరాఖండ్ భగవాన్‌పుర్‌లోని భోలేబాబా డెయిరీలో తనిఖీలు చేసినప్పుడు అక్కడ కూడా సుగంధ ఆయిల్స్‌లో కనిపించిన మోనోగ్లిజరైడ్స్ లభించాయి. వాటిని వినియోగించి కల్తీ నెయ్యి తయారు చేసి, తిరుమలకు సరఫరా చేసినట్లు సిట్ అభియోగపత్రంలో వెల్లడించింది. ఏమిటీ మోనోగ్లిజరైడ్స్? సాధారణంగా వెజిటబుల్ ఆయిల్స్ లేదా జంతుకొవ్వులతో మోనోగ్లిజరైడ్స్ తయారు చేస్తారు. వెజిటబుల్స్‌తో తయారుచేసినవి ధర ఎక్కువ, జంతుకొవ్వులతో తయారైనవి ధర తక్కువగా ఉంటాయి. ధర తక్కువ కాబట్టి జంతుకొవ్వులతో తయారైన మోనోగ్లిజరైడ్స్‌నే కల్తీ నెయ్యి తయారీ కోసం వాడి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తితిదే 2024 జులైలో పంపించిన నెయ్యి నమూనాల్లో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఉండొచ్చని ఎన్‌డీడీబీ-సీఏఎల్‌ఎఫ్ ప్రయోగశాల నివేదికల్లో పేర్కొనటాన్ని చూస్తే జంతుకొవ్వులతో తయారైన మోనోగ్లిజరైడ్స్‌నే కల్తీ నెయ్యి తయారీలో వాడి ఉండే అవకాశాలు దండిగా ఉన్నాయి. కానీ సిట్ దీనిపై లోతుగా దర్యాప్తు చేయలేదు. ఏఆర్ డెయిరీ ముసుగులో భోలేబాబా సంస్థ తిరుమలకు పంపించిన నెయ్యి ట్యాంకర్లలో నుంచి సేకరించిన నమూనాల్లో నాలుగింటిని 2024 జులైలో తితిదే గుజరాత్‌లోని ఎన్‌డీడీబీ-సీఏఎల్‌ఎఫ్ ప్రయోగశాలకు పంపింది. అక్కడ నాణ్యత పరీక్షలు చేయించగా ఆ నమూనాల్లో గొడ్డు కొవ్వు, పందికొవ్వు ఉండొచ్చని వెల్లడైంది. ఈ పరీక్షల్లో ఓ సమీకరణం ప్రకారం 95.90- 104.10 మధ్య ఉండాల్సిన ‘ఎస్ విలువ’ 23.22గా వచ్చింది. దీన్ని బట్టి అందులో గొడ్డు కొవ్వు ఉండొచ్చని ఎన్‌డీడీబీ నివేదికలో స్పష్టం చేసింది. మరో సమీకరణం ప్రకారం 97.96- 102.04 మధ్య ఉండాల్సిన ‘ఎస్-విలువ’ 116.09గా వచ్చింది. దీన్ని బట్టి పందికొవ్వు ఉండొచ్చని పేర్కొంది. జంతుకొవ్వులతో మోనోగ్లిజరైడ్స్ తయారీ కోసం ఎక్కువగా చౌకధరకు దొరికే పంది కొవ్వు, గొడ్డు కొవ్వే వాడుతారు. ఎన్‌డీడీబీ నివేదికలో అంశాల్ని, సిట్ దర్యాప్తులో వెల్లడైన విషయాల్ని సరిపోల్చి చూస్తే జంతుకొవ్వుతో తయారు చేసిన మోనోగ్లిజరైడ్స్‌నే వాడి ఉంటారనే వాదన బలంగా వినిపిస్తోంది. కల్తీ నెయ్యి తయారీలో మోనోగ్లిజరైడ్స్ వాడారని అభియోగపత్రంలో పేర్కొన్న సిట్.. అది వెజిటబుల్ ఆయిల్స్‌తో తయారైందా? జంతుకొవ్వులతో తయారైందా అనేదానిపై లోతుగా దర్యాప్తు చేయకుండా వదిలేసింది. వంట నూనెల పేరిట నకిలీ ఇన్‌వాయిస్‌లతో కొనుగోలు భోలేబాబా డెయిరీ వంట నూనెల (ఎడిబుల్ ఆయిల్స్) పేరిట నకిలీ ఇన్‌వాయిస్‌లతో సుగంధ ఆయిల్స్ నుంచి మోనోగ్లిజరైడ్స్ కొన్నట్లు సిట్ తేల్చింది. జంతుకొవ్వులతో తయారైనది కాకపోతే మోనోగ్లిజరైడ్స్‌ను ఎడిబుల్ ఆయిల్స్ ముసుగులో కొనాల్సిన అవసరం ఆ సంస్థకు ఏమొచ్చింది? పామాయిల్, పామ్‌కెర్నెల్ ఆయిల్‌లో మోనోగ్లిజరైడ్స్‌తో పాటు బీటాకెరటిన్, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్, లాక్టిక్ యాసిడ్ ఫుడ్ గ్రేడ్ వంటివి కలిపి భోలేబాబా డెయిరీలో కల్తీ నెయ్యి తయారు చేసినట్లు సిట్ తేల్చింది. ల్యాబ్‌లో పరీక్షిస్తే నెయ్యే అని ఫలితాలు వచ్చేలా చేసేందుకు ఈ రసాయనాలు కలిపినట్లు వెల్లడించింది. ఆ రసాయన మిశ్రమాన్ని నిజమైన నెయ్యిలా మభ్యపెట్టేందుకు, నిల్వ కాలం పెంచటానికి మోనోగ్లిజరైడ్స్ వాడతారు.
February 8Feb 8 Author కల్తీ నిజమే.. కానీ నేరం నాది కాదు By Andhra Pradesh News DeskUpdated : 08 Feb 2026 06:08 IST Ee Font size 6 min read సీఎఫ్‌టీఆర్‌ఐకి నెయ్యి శాంపిళ్లు పంపాలన్నది నేనే రిపోర్టు వచ్చిన విషయం మాత్రం నాకు తెలియదు తితిదే మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చిలకపలుకులు ఈనాడు - అమరావతి నెయ్యి కల్తీ జరిగింది. పామాయిల్, పామ్‌కెర్నల్ ఆయిల్, కొన్ని ఇతర పదార్థాలతో నెయ్యి కల్తీ చేశారని సిట్ నివేదికలో తెలిపింది. కల్తీ నెయ్యి సరఫరాలో చాలా మంది వ్యక్తులు, కొందరు అధికారుల ప్రమేయం ఉందని, బయటి వ్యక్తుల (థర్డ్ పర్సన్స్) పాత్ర ఉందని చెప్పింది. వారి పేర్లు ఛార్జిషీట్‌లో ప్రస్తావించింది. దిల్లీలో విలేకర్లతో, ఒక ఇంగ్లిష్ ఛానల్‌తోనూ మాట్లాడుతూ తితిదే మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలివి. ఏం చెప్పారు సుబ్బారెడ్డీ! కల్తీ నెయ్యి సరఫరా వాస్తవమేనట! దానిలో చాలా మంది వ్యక్తులు, కొందరు అధికారుల ప్రమేయం ఉందట! కల్తీ నెయ్యి సరఫరా జరిగినప్పుడు తితిదే పాలక మండలి ఛైర్మన్‌గా ఉన్న ఆయన ప్రమేయం మాత్రం లేదట! నాలుగేళ్లపాటు తితిదే ఛైర్మన్‌గా ఉన్నా కల్తీ నెయ్యి విషయం ఒక్కసారి కూడా ఆయన దృష్టికి రానేలేదట! కల్తీ నెయ్యి వ్యవహారంలో తానేదో పులుకడిగిన ముత్యం అన్నట్టుగా సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. తితిదేకి సరఫరా చేసిన నెయ్యిని రసాయనాలు, పామాయిల్ వంటి వాటితో కల్తీ చేసినట్టు సిట్ చెప్పిందే తప్ప, జంతు కొవ్వులు, చేప నూనె వంటివి కలిసినట్టు ఎక్కడా చెప్పలేదని సుబ్బారెడ్డి అడ్డగోలుగా బుకాయిస్తారు. ఆయన వాదన చూస్తుంటే మర్డర్ చేసిన హంతకుడు.. ‘హత్య జరగడం వాస్తవమే. నేను కత్తితో పొడిచి చంపితే తుపాకీతో కాల్చానంటారేంటి? అలా అనడం తప్పు కదా’ అని దబాయించినట్లుగా ఉంది. నాణ్యత పెంచాలంటే నిబంధనలు నీరుగార్చాలా? తితిదేకి అవసరమైనంత నెయ్యి సరఫరా జరగకపోవడంతో అధికారులు నిపుణుల కమిటీని వేసి, వారి సిఫారసు మేరకు నిబంధనలు సడలించారు. ఎందుకు సడలించారని తర్వాత మేం అడిగితే ఎక్కువ మంది పాల్గొనేందుకు అవకాశమిస్తే పోటీ పెరుగుతుందని, తక్కువ ధరలకు కోట్ చేస్తారని చెప్పారు. నెయ్యి నాణ్యతపై రాజీ పడకుండానే టెండర్ నిబంధనల్ని సడలించాం. సుబ్బారెడ్డి నుంచి వచ్చిన మరో సుభాషితమిది. నిబంధనలు సడలించి నాణ్యత పెంచారా? అంతకంటే హాస్యాస్పదం ఉంటుందా?భోలేబాబా డెయిరీ లక్షల కిలోల నకిలీ నెయ్యిని సరఫరా చేసింది మీరు నిబంధనలు సడలించాకే కదా! నాణ్యత పెంచడమంటే నెయ్యే కాని రసాయన మిశ్రమాన్ని కొనడమా? అసలు ఎవరైనా నాణ్యత పెంచడానికి నిబంధనలు సడలిస్తారా? అన్నట్టు నిబంధనల సవరణకు కమిటీ వేసిందీ, సవరణకు ఆమోదం తెలిపిందీ మీరు ఛైర్మన్‌గా ఉన్న పాలకమండలే కదూ! సీఎఫ్‌టీఆర్‌ఐ నివేదిక తొక్కిపెట్టడంలో దురుద్దేశం లేదా? ‘సీఎఫ్‌టీఆర్‌ఐ నివేదికను నేను తొక్కిపెట్టానని ఘోరమైన అభియోగం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫిర్యాదు చేస్తే నెయ్యి శాంపిళ్లను సీఎఫ్‌టీఆర్‌ఐకి పంపాలని రాసిందే నేను. రిపోర్టు వచ్చాక చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులది. నివేదికలోని అంశాల్ని వారు మా దృష్టికి తేలేదు’ సుబ్బారెడ్డి చేస్తున్న మరో వింత వాదన. అధికారులు తాత్సారం చేస్తారేమోనని మీరే సంతకం చేసి, శాంపిళ్లను సీఎఫ్‌టీఆర్‌ఐకి పంపాలని ఆదేశాలు జారీ చేసినట్టు చెబుతున్నారు. సంతోషం! నెయ్యి నాణ్యతపై నిజంగా మీకంత శ్రద్ధే ఉన్నప్పుడు సీఎఫ్‌టీఆర్‌ఐకి పంపిన శాంపిళ్ల పరిస్థితేంటని అధికారుల్ని అడగాలి కదా? అధికారులు మీ దృష్టికి తేలేదనడం అడ్డగోలు బుకాయింపు కాదా? సీఎఫ్‌టీఆర్‌ఐ నివేదికనూ తొక్కిపెట్టిన మీకు ఎలాంటి దురుద్దేశాలు లేవంటే నమ్మాలా? కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని పరీక్షల్లో నిర్ధారణైన తర్వాత కూడా భోలేబాబా డెయిరీకి 1.07 లక్షల కిలోల సరఫరాకు 2022 ఆగస్టు 29న ఆర్డరు ఇవ్వటం, అక్టోబరు 28 వరకూ ఆ డెయిరీ నెయ్యి సరఫరా చేయటం వాస్తవం కాదా? ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డెయిరీలు 2024 వరకూ సరఫరాదారులుగా కొనసాగటానికి కారకులెవరు? ల్యాబ్ రిపోర్టు చూపించి, ఆ డెయిరీల నుంచి ఎక్కువ కమీషన్లు దండుకోవడానికే ఆ పరీక్షలు చేయించారన్న ఆరోపణలకు మీ సమాధానమేంటి? చిన్నప్పన్న మీ పీఏ కానప్పుడు ఫిర్యాదులు వచ్చినా ఎందుకు పట్టించుకోలేదు? ‘నేను తితిదే ఛైర్మన్‌గా ఉన్నప్పుడు చిన్నప్పన్న నా పీఏ కాదు. అంతకుముందు 2014 నుంచి 2018 వరకు నాకు పీఏగా ఉన్నాడు. 2019 నుంచి ఏపీ భవన్‌లో పనిచేశాడు’ సుబ్బారెడ్డి ఉవాచ చిన్నప్పన్న అప్పుడు మీ పీఏ కాకపోవచ్చు. కానీ మీ అండ లేకపోతే చిన్నప్పన్న లాంటి ఒక సాధారణ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి తితిదే ఇన్‌స్పెక్షన్ కమిటీని భోలేబాబా డెయిరీకి తనిఖీకి పంపించగలడా? బ్లాక్‌లిస్ట్‌లో పెట్టించగలడా? ఆ డెయిరీ ప్రతినిధుల్ని దిల్లీ పిలిపించి కిలోకి రూ.25 చొప్పున లంచం అడగ్గలడా? ప్రీమియర్ డెయిరీ నుంచి రూ.50 లక్షలు లంచం తీసుకోగలడా? అతని ఖాతాలోకి రూ.4.69 కోట్లు ఎలా వచ్చాయి? చిన్నప్పన్న మీ పీఏ కాకపోతే అతను లంచం అడిగాడని భోలేబాబా డెయిరీ ప్రతినిధులు మీకే ఎందుకు ఫిర్యాదు చేశారు? దాన్ని మీరెందుకు తొక్కిపెట్టారు? చిన్నప్పన్న ఒక అనామక ఫిర్యాదును మీకు అందజేస్తే దాని ఆధారంగా నెయ్యి శాంపిళ్లను సీఎఫ్‌టీఆర్‌ఐకి పంపాలని ఎందుకు ఆదేశించారు? కల్తీ జరిగిందని నివేదిక వచ్చాక ఎందుకు చర్యలు తీసుకోలేదు? జంతువుల కొవ్వు కలవలేదని సిట్ ఎక్కడ చెప్పింది? ‘నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని, వేరే పదార్థాలతో కల్తీ చేశారని సిట్ చెప్పింది. నెయ్యిలో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసేందుకు అవకాశాలున్నాయని మాత్రమే ఎన్‌డీడీబీ నివేదికలో ప్రస్తావించారు’ సుబ్బారెడ్డి మరో అడ్డగోలు వాదన. ఆ నెయ్యి శాంపిళ్లలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ ఎక్కడా నిర్ధారించలేదు. ఎన్‌డీడీబీ రిపోర్టులో వెజిటబుల్ ఆయిల్స్‌తో పాటు, పంది కొవ్వు (లార్డ్), గొడ్డు కొవ్వు (బీఫ్ టాలో), చేపనూనె (ఫిష్ ఆయిల్) కలిసేందుకు అవకాశాలున్నాయని స్పష్టంగా పేర్కొంది. కర్నాల్‌లోని ఎన్‌డీఆర్‌ఐ ల్యాబ్ తాము చేసిన పీసీఆర్ పరీక్షా విధానంలో.. నెయ్యిలో పందికొవ్వు పది శాతం కంటే తక్కువుంటే గుర్తించలేమని చెప్పింది. గొడ్డుకొవ్వు, చేపనూనె కల్తీని నిర్ధారించే పరీక్షల తమ వద్ద లేవని స్పష్టం చేసింది. ల్యాబ్ రిపోర్టులు అంత స్పష్టంగా ఉంటే జంతువుల కొవ్వు కలవలేదని సిట్ క్లీన్‌చిట్ ఇచ్చినట్టుగా అడ్డగోలు వాదనేంటి సుబ్బారెడ్డీ? ఆర్జిత సేవల్ని చేపల మార్కెట్‌లా వేలం వేసినప్పుడే మీ నైజం తెలిసింది ‘సుప్రభాతం టికెట్ ధర రూ.400 నుంచి రూ.800కి పెంచావు కదా! వై ఎనిమిది వందలు.. రెండు వేలు చెయ్! విచక్షణ కోటాలోని అన్ని సేవల ధరలూ పెంచేయ్. తోమాల సేవ టికెట్ ధర రూ.2 వేలు చేశావు కదా.. రూ.5 వేలు చెయ్. అర్చన కూడా రూ.5 వేలు చెయ్యండి. కల్యాణోత్సవం రూ.2 వేలు చేద్దామా. రూ.2,500 లేదా రూ.3 వేలు చేయండి’ తితిదే బోర్డు సమావేశంలో సాక్షాత్తూ ఛైర్మన్ హోదాలో సుబ్బారెడ్డి వ్యాఖ్యలివి.. మీరు తితిదే పాలకమండలిని చేపల మార్కెట్‌లా మార్చేసి, స్వామివారి ఆర్జిత సేవల టికెట్ ధరల పెంపు ప్రతిపాదనను వేలం పాటలా మార్చేసిన తీరును లైవ్‌లో చూసిన జనం ఛీత్కరించుకున్నారు! ఇలాంటి ఘనకార్యాల్ని ప్రజలు చూస్తే బండారం బయట పడుతుందనుకున్నారో ఏమో ఆ తర్వాత ఇంకెప్పుడూ సమావేశాల ప్రత్యక్షప్రసారం చేయలేదు. పాలకమండలి ఎజెండాను, నిర్ణయాల్ని తితిదే వెబ్‌సైట్‌లోనూ పెట్టడం మానేశారు. లైవ్ కొనసాగించి ఉంటే కల్తీ నెయ్యి సరఫరాకు రాచబాట పరిచిన మీ నిర్వాకాన్ని ప్రజలు అప్పుడే గుర్తించేవారేమో!
February 9Feb 9 Author ఆ ఫోన్ నంబర్ వైవీ సుబ్బారెడ్డిదే! By Andhra Pradesh News DeskPublished : 09 Feb 2026 04:24 IST Ee Font size 9 min read కల్తీ నెయ్యి నేరం కోసం చిన్నప్పన్న వాడిన నంబర్ అదే సుబ్బారెడ్డి లోక్‌సభ సభ్యుడిగా ఉన్నప్పుడు అధికారిక లెటర్‌హెడ్‌లో 95424 19999 నంబర్ ఆ నంబర్ కదురు చిన్నప్పన్నదిగా అభియోగపత్రంలో సిట్ వెల్లడి సుబ్బారెడ్డి, చిన్నప్పన్నల మధ్య గాఢానుబంధానికి ఇదే తార్కాణం కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి ఆ నంబరు ద్వారానే లంచాల వసూళ్లు లంచాల వసూలుకు కాల్స్ చేసింది చిన్నప్పన్నే.. చేయించిందెవరో సిట్‌కు తెలియలేదా? సీడీఆర్, టవర్ డంప్, గూగుల్ టేకవుట్ వంటి వాటిని విశ్లేషిస్తే అసలు ‘సూత్రధారి’ వెలుగులోకి ఈనాడు - అమరావతి చిన్నప్పన్న 2014-18 వరకే తన దగ్గర పీఏగా ఉన్నారని, ఆ తర్వాత ఏపీ భవన్‌లో లైజన్ ఆఫీసర్‌గానూ, మరికొందరు ఎంపీల దగ్గర పీఏగా పనిచేశారంటూ సుబ్బారెడ్డి గత కొన్నాళ్లుగా బుకాయిస్తూ వస్తున్నారు. 2018 తర్వాత చిన్నప్పన్నకు తనకు ఎలాంటి సంబంధమూ లేదన్న తరహాలో మాట్లాడుతూ వస్తున్నారు. కల్తీ నెయ్యి కేసులో చిన్నప్పన్న పాత్రను సిట్ గుర్తించినప్పటి నుంచి సుబ్బారెడ్డి ఇదే పాట పాడుతున్నారు. అతన్ని నిందితుడిగా చేర్చినప్పుడు, అరెస్టయినప్పుడూ ఇదే తరహాలో మాట్లాడారు. ఆయన చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనని తేటతెల్లమైపోయింది. 95424 19999 నంబర్ చిన్నప్పన్నదిగా సిట్ అభియోగపత్రంలో పేర్కొంది. దీన్నిబట్టి చిన్నప్పన్న సుబ్బారెడ్డికి పీఏ మాత్రమే కాదు.. వారిద్దరి మధ్య అంతకుమించిన బంధం ఉందని అర్థమవుతుంది. సిట్ అభియోగపత్రాన్ని విశ్లేషిస్తే.. కల్తీనెయ్యి నేరంలో ఈ నంబరే వినియోగించారని స్పష్టమైంది. నెయ్యి సరఫరాదారులను తమ దగ్గరకు రప్పించుకోవడానికి, వారినుంచి లంచాలు తీసుకోవటానికి ఈ నంబరే వాడారని అర్థమవుతోంది. సుబ్బారెడ్డి నంబర్ చిన్నప్పన్న దగ్గర ఎందుకుంటుంది? సుబ్బారెడ్డికి, చిన్నప్పన్న మధ్య ఎంతో అనుబంధం లేకపోతే.. ఆయన తితిదే ఛైర్మన్‌గా ఉన్న సమయంలో అతని ఫోన్ నంబర్ చిన్నప్పన్న దగ్గర ఎందుకుంటుంది? ఎలా ఉంటుంది? దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు అప్పటి తితిదే ప్రొక్యూర్‌మెంట్ విభాగం జీఎం సుబ్రహ్మణ్యం మొబైల్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించగా అందులో 95424 19999 ఫోన్ నంబర్‌ను ‘పీఎస్ టూ ఛైర్మన్’ అని సేవ్ చేసుకుని ఉన్నట్లు తేలింది. ఆ నంబర్‌తోనే రెగ్యులర్‌గా కాల్స్ చేసి మాట్లాడినట్లు వెల్లడైంది. సుబ్బారెడ్డి నంబర్‌తో చిన్నప్పన్న రెగ్యులర్‌గా కాల్స్ చేస్తుండటం వల్ల అందరూ దాన్ని చిన్నప్పన్న నంబర్‌గా సేవ్ చేసుకున్నట్లు, ఆ నంబర్‌తోనే చిన్నప్పన్న అక్రమ కార్యకలాపాలు నడిపించినట్లు దీన్నిబట్టి అర్థమవుతోంది. తితిదేలో నెయ్యి, ఇతర సరకులకు సంబంధించిన టెండర్లపై కొనుగోలు కమిటీ సిఫార్సులు కూడా బోర్డు మీటింగ్‌ల కంటే ముందు ప్రొక్యూర్‌మెంట్ జీఎం అధికారిక మెయిల్ నుంచి చిన్నప్పన్నకే వెళ్లేవని సిట్ అభియోగపత్రంలో పేర్కొంది. 2019-2023 వరకూ సుబ్బారెడ్డి తితిదే ఛైర్మన్‌గా ఉన్న సమయంలో చిన్నప్పన్న అతని పీఏగా పనిచేసినట్లు సిట్ వెల్లడించింది. కాల్స్ చేసింది చిన్నప్పన్నే.. చేయించింది ఎవరో తెలీదా? తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ హోదాలో చిన్నప్పన్న తితిదే వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని, నెయ్యి సరఫరాదారుల నుంచి లంచం డిమాండ్ చేసి మరీ తీసుకున్నారని సిట్ అభియోగపత్రంలో వెల్లడించింది. భోలేబాబా డెయిరీ డైరెక్టర్ పొమిల్ జైన్‌కు కాల్ చేసి దిల్లీ రప్పించి, తిరుమలకు నెయ్యి సరఫరా చేయాలంటే కిలోకు రూ.25 చొప్పున లంచమివ్వాలని డిమాండ్ చేసినట్లు సిట్ పేర్కొంది. ‘తితిదే నెయ్యి సరఫరా టెండర్ల వ్యవహారంలో మాట్లాడేందుకు దిల్లీకి రావాలని ప్రీమియర్ అగ్రిఫుడ్స్ ఎండీ జగ్‌మోహన్ గుప్తాకు 2022 మే నెలలో చిన్నప్పన్న కాల్ చేయగా.. దిల్లీ నార్త్ ఎవెన్యూలోని ఎంపీ నివాస్‌లో చిన్నప్పన్నను జగ్‌మోహన్ గుప్తా కలిశారు. తితిదేకు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టు కావాలంటే తమకు కిలోకు రూ.7 చొప్పున లంచమివ్వాలని చిన్నప్పన్న డిమాండ్ చేయగా అందుకు జగ్‌మోహన్ గుప్తా అంగీకరించారు. ఆ తర్వాత ప్రీమియర్ అగ్రిఫుడ్స్‌కు తితిదేకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు లభించింది. లంచం సొమ్ము రాబట్టుకోవటం కోసం చిన్నప్పన్న జగ్‌మోహన్ గుప్తాతో నిరంతరం ఫోన్లో టచ్‌లో ఉండేవారు. 2022 నుంచి 2023 మధ్య జగ్‌మోహన్ గుప్తా నుంచి హవాలా మార్గాల్లో చిన్నప్పన్న రూ.50 లక్షలు లంచంగా తీసుకున్నారు’ అని సిట్ తేల్చింది. తితిదే అప్పటి ప్రొక్యూర్‌మెంట్ జీఎం సుబ్రహ్మణ్యానికి కాల్ చేసి తితిదేకు నెయ్యి సరఫరా చేసే వారి ఫోన్ నంబర్లు, వివరాలను చిన్నప్పన్నే తీసుకున్నారని సిట్ గుర్తించింది. అంతేకాదు.. 2022 ఏప్రిల్/మే మధ్యలో కమీషన్ ఏజెంట్ పీపీ శ్రీనివాసన్‌తోనూ చిన్నప్పన్న ఇదే నంబర్‌తో మాట్లాడేవారని తేలింది. 95424 19999 నంబర్ చిన్నప్పన్నదిగా సిట్ అభియోగపత్రంలో పేర్కొంది. అంటే కల్తీ నెయ్యికి సంబంధించిన నేరంలో ఆయన ఈ నంబరే వినియోగించారని అర్థం. అంటే నెయ్యి సరఫరాదారులను తమ దగ్గరకు రప్పించుకోవటానికి, వారి నుంచి లంచాలు తీసుకోవటానికి చిన్నప్పన్న సుబ్బారెడ్డి ఫోన్ నంబరే వాడారనేది తేటతెల్లమవుతోంది. సుబ్బారెడ్డి నంబర్‌తో కల్తీ నెయ్యి వ్యవహారంలో అక్రమాలకు పాల్పడేందుకు, లంచాలు వసూలు చేసేందుకు కాల్స్ చేసింది చిన్నప్పన్నే కావచ్చు.. చేయించింది ఎవరో సిట్‌కు అర్థం కాలేదా? వైఎస్ వివేకా హత్య కేసు తరహాలో దర్యాప్తును అర్ధంతరంగా ముగించేయకుండా.. ఈ అంశాలన్నీ వెలికితీయాలి. లంచం అడుగుతున్నారని చెప్పినప్పుడే కేసు ఎందుకు నమోదు చేయించలేదు? ‘మీ పీఏ చిన్నప్పన్న కిలోకు రూ.25 చొప్పున లంచం అడుగుతున్నారు’ అని భోలేబాబా డెయిరీ డైరెక్టర్ పొమిల్ జైన్ 2022 మే 25న వైవీ సుబ్బారెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినట్లు సిట్ గుర్తించింది. నిజంగా అప్పటికి చిన్నప్పన్న తన పీఏ కాకపోతే సుబ్బారెడ్డి ఆ విషయాన్ని పొమిల్ జైన్‌కు ఎందుకు చెప్పలేదు? తన పేరు దుర్వినియోగం చేస్తూ లంచం అడుగుతున్నందుకు చిన్నప్పన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించకుండా ఎందుకు ఊరుకున్నారు? దీన్నిబట్టే సుబ్బారెడ్డి, చిన్నప్పన్నల మధ్య ఎంతటి గాఢానుబంధం పెనవేసుకుందో అర్థమవుతుంది. భోలేబాబా డెయిరీపై చిన్నప్పన్న 2022 మే 16న వైవీ సుబ్బారెడ్డికి ఓ ఫిర్యాదివ్వగా.. దాన్ని ఆయన అప్పటికప్పుడు ప్రొక్యూర్‌మెంట్ జీఎం సుబ్రహ్మణ్యానికి అందజేసి విచారించాలని ఆదేశించారు. అంతకు ఒకరోజు ముందే చిన్నప్పన్న భోలేబాబా డైరెక్టర్ పొమిల్‌జైన్‌ను కిలోకు రూ.25 చొప్పున లంచం అడిగారు. దానికి నిరాకరించినందుకే మర్నాడు ఫిర్యాదిచ్చారు. నిజంగా చిన్నప్పన్నతో సుబ్బారెడ్డికి ఎంతటి అనుబంధముందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. సుబ్బారెడ్డి లెటర్‌హెడ్‌ను ట్వీట్ చేసిన జగన్.. ‘కేంద్ర ప్రభుత్వంపై వైకాపా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఏపీ ప్రజల హక్కుల కోసం ప్రత్యేక హోదా సాధించే పోరాటాన్ని మేము నిరంతరం కొనసాగిస్తాం’ అని పేర్కొంటూ వైకాపా అధినేత జగన్ 2018 మార్చి 15న ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌తో పాటు అప్పట్లో లోక్‌సభ సభ్యుడిగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి లెటర్ హెడ్‌పై ఇచ్చిన నోటీసును తన ట్వీట్‌కు జతపరిచారు. ఆ లెటర్‌హెడ్‌పై సుబ్బారెడ్డి పేర్కొన్న నంబర్లలో.. 95424 19999 ఫోన్ నంబరు ఉండటం గమనార్హం. సీడీఆర్, టవర్ డంప్ లొకేషన్లు, గూగుల్ టేకవుట్ తీస్తే.. గుట్టు రట్టు కల్తీ నెయ్యి కేసులో అక్రమాల కోసం సుబ్బారెడ్డి నంబర్‌నే చిన్నప్పన్న వినియోగించారనేది స్పష్టమైపోయింది. అయితే అక్రమాలకు పాల్పడేందుకు, లంచాలు వసూలు చేసేందుకు కాల్స్ చేసింది చిన్నప్పన్నే కావొచ్చు.. తెరవెనక నుంచి చేయించింది ఎవరో తేలాలంటే సిట్.. సీడీఆర్ (కాల్ డిటెయిల్ రికార్డ్స్), టవర్ డంప్, గూగుల్ టేకవుట్ వంటివి వెలికితీసి విశ్లేషిస్తే అసలు ‘కుట్రదారు’ బయటపడతారు. చిన్నప్పన్న ఏయే సమయాల్లో ఎవరెవరికి కాల్స్ చేశారు? ఆ సమయంలో ఆయన ఏ టవర్ లొకేషన్‌లో ఉంటూ కాల్స్ చేశారు? ఆ ప్రాంతం ఎవరి చిరునామా? ఆ సమయంలో అతనితో అదే లొకేషన్‌లో ఇంకా ఏయే నంబర్లు ఉన్నాయి? అవి ఎవరివి? ఇలాంటివన్నీ సిట్ లోతుగా దర్యాప్తు చేస్తేనే అసలు దొంగలు బయటపడతారు. ట్రూ కాలర్‌లో చూస్తే ఇప్పటికీ చిన్నప్పన్న పేరుతోనే.. 95424 19999 నంబరుకు ట్రూ కాలర్‌లో డయల్ చేస్తే కనిపిస్తున్న చిన్నప్పన్న పేరు 95424 19999 నంబర్‌ను ట్రూ కాలర్‌లో నమోదు చేసి చూస్తే ఇప్పటికీ కదురు చిన్నప్పన్న అనే పేరుతోనే వస్తోంది. ఆ నంబర్‌కు కాల్ చేస్తే.. ‘మీరు డయల్ చేసిన నంబర్ పనిచేయట్లేదు. దయచేసి నంబర్‌ను చెక్ చేసుకోండి’ అని వస్తోంది. 95424 19999 నంబర్ ఎవరి పేరుతో ఉంది? చిన్నప్పన్న పేరుతోనా? సుబ్బారెడ్డి పేరుతోనా? ఆ నంబర్ చిన్నప్పన్న పేరుతో ఉంటే సుబ్బారెడ్డి తన అధికారిక లెటర్‌హెడ్‌పై ఆ నంబర్ ఎందుకు వేశారు? అంటే పీఏల నంబర్లు అధికారిక లెటర్ హెడ్‌పై ముద్రిస్తారా? సుబ్బారెడ్డి పేరుతోనే ఉంటే.. ఆయన తితిదే ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ఆ నంబరు చిన్నప్పన్న దగ్గర ఎందుకుంది? ఆయన ఎలా వాడారు? ఆ నంబరుతో అక్రమ వ్యవహరాలన్నీ ఎలా నడిపారు? దీన్ని బట్టే వారిద్దరి మధ్య బంధం ఎలాంటిదో అర్థమైపోతుంది. అయితే సిట్ మాత్రం ఎవర్ని కాపాడటానికో, ఏమో కానీ ఇలాంటి వాటిపై కనీస దర్యాప్తు కూడా చేయలేదు. ఆ నంబరు గుట్టు రట్టు చేయకుండా వదిలేసింది. 2018 మార్చి 15 వైవీ సుబ్బారెడ్డి లోక్‌సభ సభ్యుడిగా ఉన్న సమయంలో అధికారిక లెటర్ హెడ్‌లో తన చిరునామాలతో పాటు పేర్కొన్న 95424 19999 ఫోన్ నంబర్ అప్పట్లో లోక్‌సభ సభ్యుడిగా ఉన్న వైకాపా నేత వైవీ సుబ్బారెడ్డి తన అధికారిక లెటర్‌హెడ్‌పై లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవకు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నామని.. 16.03.2018న నాటి రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ బిజినెస్‌లో ఈ తీర్మానాన్ని చేర్చాలని అందులో పేర్కొన్నారు. ఆ లెటర్ ప్యాడ్‌లో దిల్లీ, ఒంగోలు, హైదరాబాద్‌లలోని సుబ్బారెడ్డి నివాసాల చిరునామాలతో పాటు ఆయన ఫోన్ నంబర్లూ ఉన్నాయి. వాటిల్లో 95424 19999 ఫోన్ నంబరు ఒకటి. 2018 మార్చి 15న వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఈ లేఖను తన ట్విటర్ (ప్రస్తుత ఎక్స్) ఖాతాలో పోస్టుచేశారు. 2026 జనవరి 28 వైకాపా హయాంలో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో అభియోగపత్రం దాఖలు చేసిన సిట్ నిందితుడు కదురు చిన్నప్పన్నపై పలు అభియోగాలు మోపింది. తితిదే అప్పటి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ హోదాలో కె.చిన్నప్పన్న తితిదే వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని, నెయ్యి సరఫరాదారులకు కాల్స్ చేసి పిలిపించుకుని వారినుంచి హవాలా మార్గాల్లో లంచాలు తీసుకున్నారని వివరించింది. 95424 19999 నంబర్ చిన్నప్పన్నదిగా పేర్కొంది. వైకాపా హయాంలో తిరుమలకు లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక నిందితుడైన కదురు చిన్నప్పన్న, తితిదే పాలకమండలి నాటి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిల మధ్య ఎంతటి గాఢమైన బంధం పెనవేసుకుందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. ప్రొక్యూర్‌మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం మొబైల్‌లో చిన్నప్పన్న ఫోన్ నంబర్‌ను ‘పీఎస్ టూ ఛైర్మన్’ అని సేవ్ చేసుకున్నట్లు ఫోరెన్సిక్ విశ్లేషణలో వెల్లడైందని పేర్కొన్న సిట్ రిపోర్టు
February 9Feb 9 59 minutes ago, KING007 said: Daily TDP nunchi call vastundi, kalthi jarigindhi ani CBN recorded voice tho idhe agenda avvali next elections daaaka... hinduvu anevadu vaadiki vote veyyakodadu.
February 10Feb 10 On 2/7/2026 at 2:56 AM, krish2015 said: Why doesn’t TTD accept ghee from the general public as donations with minimum lots of 100 kg or 1,000 kg? Such lots can be tested in the newly established TTD laboratory, and only those lots that pass the tests can be accepted. You cannnot do from general public, it’s a lot more complicated process. Better to go with Nandini dairy
February 10Feb 10 48 minutes ago, aditya369 said: You cannnot do from general public, it’s a lot more complicated process. Better to go with Nandini dairy General public daggara ghee Ekkada undi brother …. Okappudu almost prathi intlo paadi undedi….then rural collection centers made sense. Ippudu alanti collection centers run cheyyatam chaala Kashtam…. And most importantly this is the job of dairies .. expecting TTD to act like a diary is unnecessary… procurement from Nandini is best .
February 10Feb 10 1 hour ago, krishna_a said: General public daggara ghee Ekkada undi brother …. Okappudu almost prathi intlo paadi undedi….then rural collection centers made sense. Ippudu alanti collection centers run cheyyatam chaala Kashtam…. And most importantly this is the job of dairies .. expecting TTD to act like a diary is unnecessary… procurement from Nandini is best . Nandini TTD ki wlanti ghee supply chesthundhi teliyadhu kaani public ki supply chesedhi full of adulteration Chalikalam lo koosa gadda kattadhu... looks like mix with veg oil
February 10Feb 10 47 minutes ago, NatuGadu said: Nandini TTD ki wlanti ghee supply chesthundhi teliyadhu kaani public ki supply chesedhi full of adulteration Chalikalam lo koosa gadda kattadhu... looks like mix with veg oil Yeah possible … India lo quality is a myth anyways
Create an account or sign in to comment