Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

TTD

Featured Replies

  • Replies 270
  • Views 11.6k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

  • Author

: పెద్ద చేపల్ని వదిలేశారా?

 

Eenadu icon
By Andhra Pradesh News DeskUpdated : 03 Feb 2026 03:45 IST
Ee
Font size
 
 
 
 
3 min read
 
 

నిబంధనలు మార్చేసి.. కల్తీ నెయ్యికి గేట్లెత్తడం నేరం కాదా?
దాన్ని ఆమోదించి అమలుకు సహకరించిన ఛైర్మన్, అధికారులు నిందితులు కాదా?
అయినా పట్టించుకోని సిట్‌
చర్యలు తీసుకోవాలంటూ నామమాత్రపు సిఫార్సు
ఈనాడు - అమరావతి 

ap020226main3a.webp

తితిదేలో ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో ఎంతో కీలకం.. వారికి తెలియకుండా, ఆమోదం లేకుండా ఎలాంటి నిర్ణయాలూ జరగవు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరాకూ వారు తీసుకున్న నిర్ణయాలే కారణం. ఇవి కుట్రపూరితంగా కనిపిస్తున్నా.. సిట్‌ వారిని నిందితులుగా చేర్చలేదు. అప్పటి ఈవో, అదనపు ఈవోలపై చర్యలు తీసుకోమంటూ కేవలం కంటితుడుపుగా సిఫారసు చేసింది. తెదేపా హయాంలో పకడ్బందీగా రూపొందించిన నెయ్యి సరఫరా నిబంధనల్ని మార్చేసి కల్తీ నెయ్యికి ద్వారాలు తెరిచినప్పుడే నేరానికి అంకురార్పణ జరిగింది. ఈ కేసులో వారే కీలకమనడానికి సిట్‌ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లోనే బోలెడు సాక్ష్యాలున్నాయి. నెయ్యి కల్తీ జరిగిందని 2022లోనే సీఎఫ్‌టీఆర్‌ఐ నివేదిక ఇచ్చింది. లంచం అడుగుతున్నారనే ఫిర్యాదూ అందింది. దానికి కింది స్థాయిలోని వారిని బాధ్యుల్ని చేస్తే సరిపోతుందా? నిబంధనలు సడలించడమే అన్నింటికీ మూలం. కుట్రకు బీజం పడిందక్కడే. అంత పెద్ద నిర్ణయం తీసుకుని అమలు చేసిన వారిని నిందితుల జాబితాలో చేర్చకుండా వదిలేయడంలో ఆంతర్యమేంటి, కుట్ర ఎలా జరిగిందో, ఎవరు సూత్రధారులో చెప్పడంలో సిట్‌ విఫలమైనట్లు కాదా?

కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు.. అయినా ఛైర్మన్‌ బాధ్యుడు కాదా? 

తితిదే వార్షిక బడ్జెట్‌ రూ.5 వేల కోట్లకు పైనే. దానిలో లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే దినుసుల కొనుగోలుకు రూ.750 కోట్లకు పైగా వెచ్చిస్తారు. అందులో సగం నెయ్యి కొనుగోలుకే ఖర్చు పెడతారు. అంత భారీ మొత్తం వెచ్చించి, అదీ కోట్లమంది భక్తుల మనోభావాలతో ముడిపడిన లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యి కొనేటప్పుడు నిబంధనలు సడలించి కల్తీకి అవకాశం కల్పించారు. ఐదేళ్లలో ఏకంగా 59.71 లక్షల కిలోల కల్తీ నెయ్యి కళ్లుమూసుకుని కొనేశారు. దానితో 20.01 కోట్ల లడ్డూల్ని తయారు చేసి, రూ.234.51 కోట్ల తితిదే నిధుల్ని దుర్వినియోగం చేశారు. అయినా ఈ వ్యవహారంలో అప్పటి ఛైర్మన్, ఈవోలు నిందితులు కాకపోవడమేంటి? 

పెద్దల అండ లేకుండా దిల్లీ పిలిచి కమీషన్‌ డిమాండ్‌ చేయగలరా? 

  • కల్తీ నెయ్యిలో ఇంత భారీ కుంభకోణం ‘పెద్దలకు’ తెలియకుండానే జరుగుతుందా? కింది స్థాయి అధికారులే కీలక నిర్ణయాలు తీసుకోగలరా? అప్పటి తితిదే ఛైర్మన్‌కు పీఏగా వ్యవహరించిన చిన్నప్పన్న అనే సాధారణ ఉద్యోగి ఏటా రూ.వందల కోట్లలో టర్నోవర్‌ చేస్తున్న నకిలీ నెయ్యి సరఫరా సంస్థ భోలేబాబా యాజమాన్యాన్ని ఎవరి అండా లేకుండానే దిల్లీ పిలిచి మరీ కమీషన్‌ డిమాండ్‌ చేయగలడా? ‘పెద్దల’ ప్రమేయం లేకుండానే డెయిరీ ప్రతినిధుల్ని దిల్లీ పిలిపించుకోగలిగాడా? 
  • చిన్నప్పన్న వంటి ఒక సాధారణ కాంట్రాక్ట్‌ ఉద్యోగి, తితిదేలోని కొందరు కిందిస్థాయి అధికారులు, ఇన్‌స్పెక్షన్‌ కమిటీల సభ్యులు డెయిరీలతో కుమ్మక్కయితే అంత పెద్ద కుంభకోణానికి పాల్పడగలరా? ఏదో ఒకటి రెండు ట్యాంకర్లలో కల్తీకి పాల్పడ్డారంటే అర్థముంది. అసలు నెయ్యి అనేదే లేకున్నా ఏళ్ల తరబడి కల్తీ జరుగుతున్నా తితిదే వంటి వ్యవస్థలో కనిపెట్టలేకపోవడమేంటి?
  • పెద్దల అండ లేకుండానే అంత పెద్ద కుంభకోణం జరుగుతుందా? మరి వారిని నిందితులుగా చేర్చకపోవడంలోని మతలబేంటి? దర్యాప్తు సంస్థలు పెద్ద తలకాయల జోలికి వెళ్లకుండా, కేవలం కిందిస్థాయి అధికారుల్నే బాధ్యులుగా చేయడంలోని ఆంతర్యమేంటి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

లంచం అడిగారని చెప్పినా.. ఛైర్మన్‌ ఎందుకు పట్టించుకోలేదు?

2022లో నెయ్యి నమూనాలను మైసూరులోని సీఎఫ్‌టీఆర్‌ఐకి పంపాలని ఆదేశించిన ఛైర్మన్‌.. నెయ్యిలో కల్తీ జరిగిందని రిపోర్టు వచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ నెయ్యి సరఫరా చేసిన డెయిరీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టకపోవడం నేరం కాదా?కల్తీ జరిగిందని నివేదిక వచ్చినా తొక్కిపెట్టిన ఛైర్మన్‌ నిందితుడు కాదా? నేరానికి ఆయన సహకరించినట్లు కాదా?

  • Author

CM Chandrababu: వెంకన్నకు మకిలి అంటించే మహాకుట్ర

 

Eenadu icon
By Andhra Pradesh News DeskUpdated : 06 Feb 2026 03:52 IST
Ee
Font size
 
 
 
 
5 min read
 
 

సొంత మనిషి ధర్మారెడ్డి ద్వారా జగన్‌ అమలు చేశారు 
తితిదేకి కల్తీ నెయ్యి సరఫరా దానిలో భాగమే  
సీఎం చంద్రబాబు ధ్వజం 
మహాపచారానికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షిస్తామని వెల్లడి

ap050226main1a.webp

సమావేశంలో మాట్లాడుతున్న చంద్రబాబు. చిత్రంలో పీవీఎన్‌ మాధవ్, పవన్‌ కల్యాణ్, లోకేశ్, సత్యకుమార్, రామనారాయణరెడ్డి, పార్థసారథి

దేవదేవుడైన వెంకన్న సన్నిధిలో వైకాపా నాయకులు ఘోరమైన అపచారాలు చేశారు. చేసిన దుర్మార్గాలన్నీ బయటపడే సరికి వాటిని అడ్డ గోలుగా సమర్థించు కోవడమే కాకుండా, బూతులతో ఎదురుదాడి చేస్తున్నారు.

చంద్రబాబు


ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వ హయాంలో తితిదేకి కల్తీ నెయ్యి సరఫరా వేంకటేశ్వరస్వామిని అపవిత్రం చేసేందుకు పన్నిన భారీ కుట్రలో భాగమని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. అది ఉద్దేశపూర్వకంగా మీరు పంపించిన ఈవో (ధర్మారెడ్డి) ద్వారా అమలు చేసిన మహాకుట్ర.. అని మాజీ సీఎం జగన్‌ను ఉద్దేశించి మండిపడ్డారు. ‘అది కేవలం డబ్బు కక్కుర్తితో చేసింది కాదు. ఏదో ఒకసారి తప్పు జరిగితేనో, కిందిస్థాయి ఉద్యోగులెవరైనా చేస్తేనో క్షమించొచ్చు. కానీ కల్తీ నెయ్యి వ్యవహారం తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఆయన (జగన్‌) మనుషుల ద్వారా అమలు చేసిన పన్నాగం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీనెయ్యి కుంభకోణం తితిదే అప్పటి ఛైర్మన్‌ (వైవీ సుబ్బారెడ్డి)కి తెలిసే జరిగిందన్నారు. అప్పట్లో ఛైర్మన్, బోర్డు సభ్యులు కూర్చుని టెండర్‌ నిబంధనల్ని అడ్డగోలుగా మార్చేశారని, కొనుగోళ్ల కమిటీలో వాళ్ల మనుషుల్ని పెట్టుకుని అరాచకాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

కల్తీ నెయ్యి సరఫరా చేసిన డెయిరీలు అప్పటి ఛైర్మన్‌ పీఏకి రూ.4.68 కోట్లు కమీషన్‌ ముట్టజెప్పాయని సిట్‌ తేల్చిందన్నారు. కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించిన అన్ని పత్రాలు, ఆధారాలు, సిట్‌ ఛార్జిషీట్‌ ప్రజల ముందు పెడతామని, వారు దానిపై చర్చించాలన్నారు. గురువారం ఉండవల్లిలోని నివాసంలో ఎన్డీయే మిత్రపక్షాల నేతలతో సమావేశం అనంతరం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణరెడ్డి, పార్థసారథి, సత్యకుమార్‌ యాదవ్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులతో కలసి విలేకర్లతో మాట్లాడారు. ‘వైకాపా నాయకులకు దేవుడిపై నమ్మకం లేకపోతే ఆ జోలికి రాకూడదు. అంతే తప్ప భక్తుల మనోభావాల్ని, దేవుడి పవిత్రతను దెబ్బతీయాలనుకోవడం దుర్మార్గం. దేవదేవుడైన వెంకన్న సన్నిధిలో వైకాపా నాయకులు ఘోరమైన అపచారాలు చేశారు. పరకామణిలో దొంగతనం జరిగితే దొంగను శిక్షించకుండా సెటిల్మెంట్‌ చేశారు. చేసిన దుర్మార్గాలన్నీ బయటపడేసరికి వాటిని అడ్డగోలుగా సమర్థించుకోవడమే కాకుండా, బూతులతో ఎదురుదాడి చేస్తున్నారు. ఇంత మహాపాపానికి ఒడిగట్టినవారికి ఎలాంటి శిక్ష వేయాలో దేవుడే నిర్ణయిస్తాడు’ అని పేర్కొన్నారు. 

ap050226main1b.webp

సీఎం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. చిత్రంలో పయ్యావుల కేశవ్, పల్లా శ్రీనివాసరావు, పీవీఎన్‌ మాధవ్, పవన్‌ కల్యాణ్, లోకేశ్, సత్యకుమార్, ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథి 

జంతుకొవ్వు కలిసే అవకాశాలు ఉన్నాయని ఎన్‌డీడీబీ చెప్పింది

తితిదేకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్‌ తేల్చేసిందని జగన్‌ అంటున్నారు కదా? అన్న ప్రశ్నకు ‘జంతువుల కొవ్వు లేదని ఎక్కడుంది? ఆయనకెవరైనా రహస్యంగా చెప్పారా? రాత్రి ఏమైనా కలొచ్చిందా’ అని సీఎం మండిపడ్డారు. నెయ్యిలో కల్తీ జరగలేదని సిట్‌ రిపోర్టులో ఎక్కడా చెప్పలేదన్నారు. జంతువుల కొవ్వు కలిసేందుకు అవకాశముందని ఎన్‌డీడీబీ నివేదిక చాలా స్పష్టంగా పేర్కొందని తెలిపారు. కర్నాల్‌లోని ఎన్‌డీఆర్‌ఐ ల్యాబ్‌ కూడా ఆ నెయ్యిలో జంతుకొవ్వులు కలిసేందుకు ఉన్న అవకాశాన్ని తోసిపుచ్చలేమని, ఆ పరీక్షలు చేసే టెక్నాలజీ తమ దగ్గర లేదని చెప్పిందని గుర్తుచేశారు.

వైకాపా హయాంలో శ్రీశైలంలో కూడా ప్రసాదాలకు కల్తీ నెయ్యి వాడారని వార్తలొస్తున్నాయి కదా అని విలేకర్లు ప్రశ్నించగా.. వైకాపా హయాంలో 10 దేవాలయాల్లో ఇలా అపవిత్రం చేశారన్నారు. కరడుగట్టిన నేరస్థుల మాదిరిగా జగన్‌ అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రసాయనాలతోనే నెయ్యి తయారుచేశారని, అందులో నెయ్యే లేదని సిట్‌ తేల్చింది కదా, ఈ మహాపాపానికి మీరు  లెంపలేసుకుని దేవుడికి క్షమాపణ చెప్పక్కర్లేదా అని ప్రశ్నించారు.

నివేదికను ఎందుకు తొక్కిపెట్టారు?

‘నెయ్యిలో కల్తీ జరిగిందని 2022లో వైకాపా ప్రభుత్వ హయాంలోనే మైసూరులోని సీఎఫ్‌టీఆర్‌ఐ ల్యాబ్‌ నిర్ధారించింది. ఆ రోజే కల్తీ నివారణకు చర్యలు తీసుకుని ఉండొచ్చు. కానీ వారు కల్తీ నెయ్యితో ప్రసాదాలు తయారు చేయాలనుకున్నారు కాబట్టే ఆ నివేదికను తొక్కిపెట్టారు. రాబోయే రోజుల్లో సిట్‌ రిపోర్టుల్లో మరిన్ని విషయాలు బయటకు వస్తాయి’ అని సీఎం పేర్కొన్నారు. 

వేంకటేశ్వరస్వామే మాకీ బాధ్యత అప్పగించారు 

తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఆ వేంకటేశ్వరస్వామే తమకు అప్పగించారని, ఈ విషయమై ఈ రోజు తాను, పవన్‌ కల్యాణ్, మాధవ్‌ కూర్చుని భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించామని చంద్రబాబు చెప్పారు. కల్తీ నెయ్యిపై భాజపా ఎందుకు గట్టిగా మాట్లాడటం లేదని విలేకర్ల ప్రశ్నకు మాట్లాడకపోవడం ఏమీ లేదని.. మిగతా మంత్రులతో కలసి మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ విలేకర్ల సమావేశంలో మాట్లాడారని సీఎం తెలిపారు.


ఏకసభ్య కమిటీ సిఫారసుల ఆధారంగా చర్యలు 

‘తాము దేవుడి పవిత్రతను కూడా కాపాడలేని అసమర్థులం కాదని, వైకాపా దాడి చేసినా దులిపేసుకోవడానికో, పారిపోవడానికో సిద్ధంగా లేమని చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమలలో మరోసారి అలాంటి అపచారం జరగకుండా అన్ని చర్యలూ తీసుకుంటామన్నారు. కల్తీ నెయ్యి కుంభకోణంలో దోషుల్ని శిక్షిస్తామన్నారు. ‘బాధ్యులైన అధికారులపై పాలనాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిట్‌ నివేదిక పంపింది. ఏకసభ్య కమిటీని నియమించి, ఎక్కడెక్కడ లోపాలు జరిగాయో విశ్లేషించి, చర్యలు ప్రారంభిస్తాం’ అని తెలిపారు. అసలు సూత్రధారులెవరో సిట్‌ నిగ్గు తేల్చలేదు కదా అన్న ప్రశ్నకు.. ‘దర్యాప్తు సంస్థలు కొన్ని విషయాలు బయటపెడతాయి. కోర్టులో అదనపు సమాచారం ఫైల్‌ చేయొచ్చు. అవసరమైన అన్ని మార్గాలూ పరిశీలిస్తాం. దోషులు తప్పించుకోకుండా చూస్తాం’ అని తెలిపారు.

Why doesn’t TTD accept ghee from the general public as donations with minimum lots of 100 kg or 1,000 kg? Such lots can be tested in the newly established TTD laboratory, and only those lots that pass the tests can be accepted.

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.