Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

TTD

Featured Replies

  • Replies 270
  • Views 11.6k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

  • Author

Tirupati: గోవిందా.. 50 కిలోల బంగారం మాయం!

 

Eenadu icon
By Andhra Pradesh News DeskUpdated : 23 Dec 2025 04:20 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో మాయాజాలం
30 విగ్రహాలు ధ్వంసం 
వైకాపా పాలనలో మరో కుంభకోణంపై విజిలెన్స్‌ విచారణ

ap221225main3a.webp

విమాన గోపుర పనులు చేస్తున్నప్పటి చిత్రం

తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: తిరుమల కొండపైనే కాదు.. కొండ కిందా వైకాపా హయాంలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఒక వైపు తిరుమలలో పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోళ్లలో అవినీతి అంశాలపై విచారణ జరుగుతుండగా.. తాజాగా తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్‌ విభాగం లోతుగా విచారణ జరుపుతోంది. 30 విగ్రహాలు ధ్వంసమైన విషయం కూడా తెరపైకి వచ్చింది.

బంగారు తాపడం పనుల పేరుతో..

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. వైకాపా హయాంలో 2022-23 మధ్యకాలంలో ఈ ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వంద కిలోల బంగారం కేటాయించింది. ఇందులో భాగంగా తొమ్మిది పొరల (9 లేయర్లు)తో తాపడం చేయాల్సి ఉండగా, రెండు పొరలతో సరిపెట్టి దాదాపు సగం బంగారాన్ని మాయం చేసినట్లు ఆరోపణలున్నాయి. విమాన గోపురంపై 30 విగ్రహాలు ధ్వంసం చేసి, ఆపై బంగారు తాపడం పనులు చేసినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని బయటకు రాకుండా నాటి తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవోగా ఉన్న ధర్మారెడ్డి జాగ్రత్త పడినట్లు సమాచారం. విమాన గోపురం పనులకు అసలు కాంట్రాక్టర్‌ను కాదని సబ్‌ లీజు కింద వేరే ఇద్దరికి పనులు అప్పజెప్పినట్లు దేవస్థానానికి ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం ఈ అంశాలన్నింటిపై దేవస్థానం విజిలెన్స్‌ విభాగం విచారణ చేపట్టింది. అప్పటి ఫిర్యాదుదారుల నుంచి వివరాలు సేకరించడంలో నిమగ్నమైంది. దీంతోపాటు బంగారు తాపడం పనులు చేసిన కార్మికులను కూడా విచారించి, ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు? బంగారం ఎంత వాడారు? అనే అంశంపై ఆరా తీస్తోంది.

 
  • 1 month later...
5 minutes ago, sonykongara said:

ttd-gh66.jpgttd-ghee6.jpg

Web lo emo Jagan fans sit clean chit ichindi ani posting. :D antha hallucinations lo unaru eellu :D 

2 hours ago, KING007 said:

Clean chit ani tegga yegurutunnaru, counter videos emaina unnaya?

Adega. Anyways opposition lo Una party social medias activity after two years increases. 
Clean chit ani miss leading posts vesina valani aythe arrest cheyali

  • Author

Adulterated Ghee: చిన్నప్పన్న వెనుక ఉన్న ‘పెద్దప్ప’ ఎవరు?

 

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 30 Jan 2026 06:20 IST
Ee
Font size
 
 
 
 
4 min read
 
 

కల్తీ నెయ్యి కేసులో కీలక సూత్రధారులను వదిలేశారా?
లంచాలను ధ్రువీకరించి, అంతిమ లబ్ధిదారును తేల్చని సిట్‌
ఈనాడు - అమరావతి 

ap290126main2a.webp

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన, కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిన కల్తీనెయ్యి కుంభకోణంలో సిట్‌ జరిపిన దర్యాప్తుపై ఎన్నో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. భక్తుల మనోభావాలను గాయపరిచిన ఆ కుంభకోణానికి అప్పటి తితిదే పాలకమండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి పీఏగా పనిచేసిన చిన్నప్పన్నతో పాటు తితిదే కిందిస్థాయి అధికారులు కొందరు, కల్తీ నెయ్యి సరఫరా చేసిన డెయిరీల యజమానులను బాధ్యులుగా సిట్‌ పేర్కొంది. కానీ, ఈ మొత్తం వ్యవహారం వెనకున్న అసలు సూత్రధారులు, అంతిమ లబ్ధిదారులెవరో నిగ్గు తేల్చలేదని, దర్యాప్తు అసంపూర్తిగా ముగించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చిన్నప్పన్న వెనుక ఉండి నడిపించిన ‘పెద్దప్ప’ ఎవరు? కేవలం ఛైర్మన్‌ పీఏ హోదాలో లంచం అడిగితే ఏ డెయిరీ యజమానైనా ఎందుకిస్తారు? అతను నెయ్యి సరఫరా ఆర్డర్లు ఇప్పించగలడన్న ఆశయినా ఉండాలి. లేదా అనర్హత వేటు వేయించగలడన్న భయమైనా ఉండాలి. పెద్దల అండ లేకుండా ఛైర్మన్‌ పీఏ అవన్నీ చేయగలడంటే డెయిరీ యజమానులు నమ్మి, లంచాలిస్తారా? నకిలీ నెయ్యి కుంభకోణంలో ‘పెద్దప్ప’ పాత్రపై సిట్‌ లోతుగా దృష్టి సారించకపోవడం విస్మయం కలిగిస్తోంది. నకిలీ నెయ్యి కుంభకోణంలో చిన్నప్పన్న ఒక పావు మాత్రమేనని ఎవరికైనా అర్థమవుతుంది. మరి సిట్‌కు ఆ విషయం తెలియదా అన్నది ప్రశ్న. సిట్‌ దర్యాప్తు కొండనుతవ్వి ఎలుకను పట్టినట్టు ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 


ఈ ప్రశ్నలకు బదులేది?

  • తితిదే నెయ్యి కొనుగోళ్ల టెండర్‌ నిబంధనల్ని 2019 ఆగస్టులో పటిష్ఠం చేస్తూ అప్పటి ఈవో ఉత్తర్వులిస్తే, ప్రైవేటు డెయిరీలకు మేలు చేసేందుకు నాలుగు నెలల్లోనే 2019 డిసెంబర్‌లో వాటిని సడలిస్తూ అప్పటి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తితిదే పాలకమండలి ఎందుకు నిర్ణయం తీసుకుంది? డెయిరీ సంస్థల వార్షిక టర్నోవర్, పాల సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించడం వెనుక మర్మమేంటి? తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ, ఇతర అవసరాలకు ప్రైవేటు డెయిరీలు కల్తీనెయ్యి సరఫరా చేసింది ఆ నిర్ణయం వల్లే కదా? తద్వారా సహకార డెయిరీలకు దారులు మూసేసి, ప్రైవేటు డెయిరీలకు రాచబాట పరిచారని చెప్పిన సిట్‌.. దానికి సూత్రధారి ఎవరో ఎందుకు తేల్చలేదు?
  • కల్తీ నెయ్యి కుంభకోణంలో అప్పటి తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సహాయకుడు చిన్నప్పన్న కీలక పాత్ర పోషించినట్టు నిర్ధారించిన సిట్‌.. అతని వెనుక ఉన్న ‘పెద్దప్ప’ ఎవరో, ప్రైవేటు డెయిరీల నుంచి లంచాల రూపంలో చిన్నప్పన్న తీసుకున్న డబ్బు ఏ ‘అంతిమ లబ్ధిదారు’కి చేరిందో ఎందుకు తేల్చలేదు?
  • పెద్దల అండ, ప్రమేయం లేకుండానే ఛైర్మన్‌ పీఏ.. ఒక డెయిరీ యజమానిని దిల్లీ పిలిపించుకుని పంచాయితీ పెట్టగలడా? రూ.50 లక్షల కమీషన్‌ డిమాండ్‌ చేయగలడా? 
  • చిన్నప్పన్న వంటి ఒక సాధారణ కాంట్రాక్ట్‌ ఉద్యోగి, ఛైర్మన్‌ పీఏ.. తన ఇష్టానుసారం తితిదే అధికారుల్ని ప్రభావితం చేయగలడా? తనకు లంచం ఇచ్చేందుకు నిరాకరించిన ప్రైవేటు డెయిరీల్లో తనిఖీలు చేయించి, టెండర్లలో పాల్గొనకుండా అనర్హత వేటు వేయించగలడా? తనకు లంచం ఇచ్చిన డెయిరీకి టెండర్‌ దక్కేలా చేయగలడా? ఏ ‘పెద్దప్ప’ అండతో చిన్నప్పన్న అవన్నీ చేయగలిగాడు? దీనిపై సిట్‌ లోతుగా దర్యాప్తు జరిపిందా? 
  • ఒకవేళ ఎవరి అండా లేకుండానే చిన్నప్పన్న ఆ అరాచకాలన్నీ చేస్తే.. మరి తితిదే ఏం చేస్తోంది? ఛైర్మన్, బోర్డు సభ్యులు, ఈవో, అదనపు ఈవో, కొనుగోలు కమిటీ సభ్యులు, అధికారులు పట్టించుకోరా? అంత పెద్ద వ్యవస్థను కాదని, కనీసం తితిదే ఉద్యోగి కూడా కాని సామాన్యుడు చక్రం తిప్పగలిగితే... అక్కడ పర్యవేక్షణ గాలికొదిలేసినట్టే కదా? దీనిపై సిట్‌ ఎందుకు దృష్టి పెట్టలేదు? 
  • చిన్నప్పన్న తమను కిలో నెయ్యికి రూ.25 చొప్పున లంచం అడిగాడని సుబ్బారెడ్డికి భోలేబాబా డెయిరీ డైరెక్టర్‌ పొమిల్‌ జైన్‌ ఫిర్యాదు చేసినట్టు చిన్నప్పన్న రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న సిట్‌.. ఆ విషయాన్ని ఛార్జ్‌షీట్‌లో ఎందుకు ప్రస్తావించలేదు? ఆ  ఫిర్యాదుపై సుబ్బారెడ్డి ఏం చేశారు? ఎలాంటి చర్యలు తీసుకున్నారో సిట్‌ నిగ్గుతేల్చాలి కదా? ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌కు 35 శాతం నెయ్యి సరఫరా ఆర్డర్లు దక్కేలా చేసి, ఆ సంస్థ ఎండీ జగన్‌మోహన్‌గుప్తా నుంచి చిన్నప్పన్న రూ.50 లక్షలు లంచం తీసుకున్నాడని సిట్‌ గుర్తించింది. అది ఎవరికి చేరిందో ఛార్జ్‌షీట్‌లో ఎందుకు ప్రస్తావించలేదు?
  • చిన్నప్పన్న బ్యాంకు ఖాతాలో రూ.కోట్లలో డబ్బు వచ్చి పడిందని, దాన్ని వేరే ఖాతాలకు మళ్లించారని, ఆయన విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీగా స్థిరాస్తులు కొన్నారని, అవి ఆయనకు ఎలా వచ్చాయో లోతైన దర్యాప్తు చేసి నిగ్గు తేల్చాలని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న సిట్‌.. దాన్ని అక్కడితో వదిలేసింది. ‘చిన్నప్పన్నకు 2019-24 మధ్య వేతనం ద్వారా రూ.65 లక్షలు ఆదాయం వచ్చింది. కానీ దిల్లీలోని ఏపీ భవన్‌ యూనియన్‌ బ్యాంకు బ్రాంచ్‌లోని అతని ఖాతాలోకి ఆ ఐదేళ్లలో రూ.4.69 కోట్లు జమయ్యాయి. దానిలో రూ.4.64 కోట్లు వివిధ ఖాతాలకు మళ్లించారు. సిట్‌ దర్యాప్తు చేసేనాటికి చిన్నప్పన్న ఖాతాలో క్లోజింగ్‌ బ్యాలెన్స్‌ రూ.4.98 లక్షలే మిగిలింది. చిన్నప్పన్న ఆదాయానికి, అతని ఆర్థిక లావాదేవీలకు, కొన్న ఆస్తులకు పొంతన లేదని, దీని వెనుక ఉన్న భారీ కుట్రను బయట పెట్టేందుకు లోతైన దర్యాప్తు జరపాల్సి ఉందని పేర్కొంది. కానీ ఛార్జ్‌షీట్‌లో ఆ వివరాలేమీ లేవు.
 

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.