Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

TTD

Featured Replies

  • Replies 270
  • Views 11.6k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

  • Author

కల్తీ నెయ్యి కేసులో కొనుగోళ్ల విభాగం జీఎం అరెస్టు

 

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 28 Nov 2025 04:23 IST
Ee
Font size
 
 
 
 
3 min read
 
 

రూ.లక్షల్లో లంచం ముట్టినట్లు ఆరోపణలు
వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్నకూ సహకారం
డిసెంబరు 10 వరకు రిమాండ్‌ విధించిన నెల్లూరు ఏసీబీ కోర్టు

ap271125main17a.webp

సుబ్రహ్మణ్యానికి వైద్యపరీక్షలు చేస్తున్న రుయా సిబ్బంది 

ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే, తిరుపతి (నేరవిభాగం): తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో తొలిసారి తితిదే అధికారిని అరెస్టు చేశారు. నకిలీ నెయ్యి తిరుమలకు వచ్చినప్పుడు కొనుగోళ్ల విభాగం జనరల్‌ మేనేజర్‌గా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌వీఆర్‌ సుబ్రహ్మణ్యాన్ని సిట్‌ అధికారులు గురువారం అరెస్టు చేశారు. రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశాక నెల్లూరులోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి డిసెంబరు 10 వరకు రిమాండ్‌ విధించారు. కేసులో ఈయన 29వ నిందితుడు. తితిదే మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్న (ఏ24)కు సుబ్రహ్మణ్యం సహకరించారని సిట్‌ ఇప్పటికే తేల్చింది. నెయ్యి సరఫరా చేసే డెయిరీలు, ప్రతినిధుల వివరాలు ఈయనే అందజేశారు. వీటి ఆధారంగా అప్పన్న.. ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌ సంస్థకు టెండర్‌ దక్కేలా చక్రం తిప్పారు. ప్రతిఫలంగా హవాలా మార్గంలో రూ.50 లక్షల లంచం తీసుకున్నారు. తిరుమలకు కల్తీ నెయ్యి వస్తోందని తెలిసినా చర్యలు తీసుకోకుండా సుబ్రహ్మణ్యం ఊరుకోవడం వల్లే వైకాపా పాలనలో తిరుమలకు  68 లక్షల కిలోల కల్తీనెయ్యి సరఫరా అయ్యింది. కల్తీనెయ్యి అనుమతించినందుకు సుబ్రహ్మణ్యానికి పెద్ద మొత్తంలోనే నగదు ముట్టిందని తెలుస్తోంది. ఈ అభియోగాల నేపథ్యంలోనే ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం.

మైసూరు ల్యాబ్‌ నివేదిక ఇచ్చినా

2022 మే 16న భోలేబాబా ఓరోగానిక్‌ డెయిరీ కల్తీ నెయ్యి సరఫరా చేస్తోందని వైవీ సుబ్బారెడ్డికి ఫిర్యాదు రాగా విచారించి నివేదిక ఇవ్వాలని ఆయన నాటి జీఎం సుబ్రహ్మణ్యాన్ని ఆదేశించారు. అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన పిటిషన్‌పై విచారించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ఫిర్యాదు వైవీ చేతికి ఇచ్చింది ఆయన మాజీ పీఏ చిన్నఅప్పన్నే. మే 20న తిరుమలలోని క్యాంప్‌ ఆఫీస్‌లో సుబ్బారెడ్డిని సుబ్రహ్మణ్యం కలవగా ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్, వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్, భోలేబాబా ఓరోగానిక్‌ డెయిరీ ట్యాంకర్లు, టిన్నుల ద్వారా పంపే నెయ్యి నమూనాలను మైసూరులోని సీఎఫ్‌టీఆర్‌ఐ ల్యాబ్‌లో పరీక్షించాలని ఆదేశించారు. జూన్‌లో పంపగా నాలుగింటిలోనూ కల్తీ జరిగిందని ఆగస్టులో నివేదిక వచ్చింది. అయినా సుబ్బారెడ్డి చర్యలు తీసుకోలేదు. బాధ్యులను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాల్సి ఉన్నా సుబ్రహ్మణ్యం యథావిధిగా నెయ్యి సరఫరాకు అనుమతించారు. భోలేబాబా డెయిరీ 2022 అక్టోబరు వరకు, మిగతా సంస్థలు 2024 వరకు నకిలీ నెయ్యిని తితిదేకు పంపినట్లు సిట్‌ తేల్చింది. 

అధికారులకే తెలుసన్న వైవీ

కల్తీ నెయ్యి కేసులో ఈ నెల 20న సుబ్బారెడ్డిని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ప్రశ్నించారు. ఈ సందర్భంగా నెయ్యి కొనుగోలు, టెండర్ల ఖరారు బాధ్యతను అధికారులే చూసుకుంటారని ఆయన సమాధానమిచ్చారు. వారికే ఈ వ్యవహారాలు తెలుసని బదులిచ్చారు. కేసు కీలక దశకు చేరుకోవడం, విచారణకు సహకరించకపోవడం కూడా సుబ్రహ్మణ్యం అరెస్టుకు కారణమని తెలుస్తోంది. కల్తీనెయ్యి కేసులో ఇప్పటివరకు నిందితుల సంఖ్య 24గా ఉంది. సుబ్రహ్మణ్యం అరెస్టుతో 29కి పెరిగింది. ఏ25 నుంచి ఏ28 వరకు ఎవరున్నారో తెలియాలి. వచ్చే నెలలో దాఖలు చేసే మలి ఛార్జ్‌షీట్‌లో మరికొందరిని నిందితులుగా చేర్చే అవకాశముంది. తొలి ఛార్జ్‌షీట్‌లో తితిదే కొనుగోళ్ల విభాగంలో విధులు నిర్వర్తించిన యడం నాగేంద్రప్రసాద్‌ (ఏ9), కరమల శేఖర్‌ (ఏ10) నిందితులుగా ఉన్నారు. వీరిని గతంలోనే సిట్‌ అధికారులు ప్రశ్నించారు. 

రవికుమార్‌ బ్యాంకు లావాదేవీలపై దర్యాప్తు

పరకామణిలో చోరీ కేసు నిందితుడు రవికుమార్, ఇతర కుటుంబసభ్యుల బ్యాంకు లావాదేవీలపై సీఐడీ ప్రత్యేక బృందం గురువారం దర్యాప్తు చేపట్టింది. రెండురోజుల కిందట బ్యాంకు లావాదేవీల గురించి వెల్లడించాలని సీఐడీ కొన్ని బ్యాంకులకు నోటీసులిచ్చింది. వారిచ్చిన వివరాల మేరకు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి, బెంగళూరు, తమిళనాడులోని బ్యాంకుల లావాదేవీలను వారు పరిశీలించినట్లు సమాచారం.

  • Author

వెండి ప్లేటుకు, సెల్‌ ఫోన్‌కు లొంగిపోయారు!

 

Eenadu icon
By Andhra Pradesh News DeskUpdated : 29 Nov 2025 04:11 IST
Ee
Font size
 
 
 
 
4 min read
 
 

కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని తేలినా నివేదిక తొక్కిపెట్టేశారు..  
సంబంధిత డెయిరీల ప్రతినిధులతో కలిసి నేరపూరిత కుట్ర 
ప్రతిఫలంగా రూ.3.50 లక్షల నగదు, వెండిప్లేటు, ఫోన్‌ లంచం 
తితిదే అధికారి సుబ్రహ్మణ్యం రిమాండ్‌ రిపోర్టులో ప్రస్తావించిన సిట్‌ 

291125brk125219831a.webp

ఈనాడు, తిరుపతి, అమరావతి, న్యూస్‌టుడే, తిరుపతి (నేరవిభాగం): ‘తితిదేకు వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్, భోలేబాబా ఆర్గానిక్‌ డెయిరీ మిల్క్, ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌ సంస్థలు సరఫరా చేస్తున్న నెయ్యి కల్తీది. అందులో వెజిటబుల్‌ అయిల్స్‌ కలిశాయి. అందుకే బీటా సిటోస్టెరోల్‌ పాజిటివ్‌ వచ్చింది’ అంటూ మైసూరులోని సీఎఫ్‌టీఆర్‌ఐ ఇచ్చిన నివేదికను తితిదే ప్రొక్యూర్‌మెంట్‌ విభాగం నాటి జనరల్‌ మేనేజర్‌ సుబ్రహ్మణ్యం (ఏ-29) తొక్కిపెట్టారని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్‌ తేల్చింది. ఆయా సంస్థలు కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నట్లు 2022 ఆగస్టులో నివేదిక అందగా.. చర్యలు తీసుకోవాల్సింది పోయి.. 2022 అక్టోబరు వరకూ నెయ్యి సరఫరా చేసేలా భోలేబాబా డెయిరీకి మరిన్ని ఆర్డర్లు ఇచ్చారని వెల్లడించింది. ఆయన ప్రొక్యూర్‌మెంట్‌ జీఎంగా ఉన్నంతకాలం ప్రీమియర్, వైష్ణవి డెయిరీలు నెయ్యి సరఫరా కొనసాగేలా చేశారని వివరించింది. తితిదేకు కల్తీ నెయ్యి సరఫరా కేసులో సుబ్రహ్మణ్యంను గురువారం అరెస్టు చేసిన సిట్‌ అధికారులు కోర్టులో సమర్పించిన రిమాండ్‌ రిపోర్టు శుక్రవారం వెలుగుచూసింది. అందులోని ప్రధానాంశాలివి.. 

ఆ డెయిరీలతో కలిసి నేరపూరిత కుట్ర 

తితిదేకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన వైష్ణవి, భోలేబాబా, మాల్‌గంగ డెయిరీలు, ఇతర సంస్థల ప్రతినిధులతో కలిసి సుబ్రమణ్యం ఈ కుట్రకు పాల్పడ్డారు. ఆయా డెయిరీల ప్లాంట్లలో తితిదే తరఫున తనిఖీలు చేపట్టి, వాటికి టెండర్లలో పాల్గొనే అర్హత ఉందో లేదో తేల్చాల్సిన సాంకేతిక బృందంలో సభ్యుడిగా ఉన్న ఆయన.. సమగ్ర తనిఖీలు చేయకుండా ఆయా సంస్థలకు అనుకూలంగా తప్పుడు నివేదికలు సమర్పించారు. తద్వారా అర్హత లేని సంస్థలు తితిదే నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొని వాటిని దక్కించుకునేలా చేశారు. 

అనుచిత లబ్ధి కలిగించినందుకు ప్రతిఫలంగా ఆయా డెయిరీల ప్రతినిధుల నుంచి వివిధ సందర్భాల్లో రూ.3.50 లక్షల నగదు, రూ.50 వేల విలువ చేసే మొబైల్‌ ఫోన్, రూ.16,700 విలువ చేసే వెండి ప్లేటు, రూ.5 వేల విలువ చేసే 50 గ్రాముల వెండినాణెం వంటివి లంచంగా తీసుకున్నారు. 


సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న నుంచి ఆదేశాలు 

తితిదేకు నెయ్యి సరఫరా టెండర్లలో భోలేబాబా డెయిరీ పాల్గొనగా.. 2022 జూన్‌ 6న ఆ డెయిరీ ప్లాంటును తనిఖీ చేయడానికి సుబ్రహ్మణ్యం సభ్యుడిగా ఉన్న సాంకేతిక కమిటీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతేఫూర్‌ వెళ్లింది. ఆ సమయంలో వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న.. సుబ్రహ్మణ్యానికి పదే పదే ఫోన్‌ చేసి ఆదేశాలిచ్చారు. భోలేబాబా డెయిరీకి టెండర్లలో పాల్గొనే సాంకేతిక అర్హత లేదని, నెయ్యి తయారీకి నిర్దేశించిన సరైన ప్రమాణాలు పాటించడంలేదని ఈ కమిటీ నివేదిక ఇచ్చింది. అయినా సరే ఆ సంస్థకు సుబ్రహ్మణ్యం నెయ్యి సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. తితిదేకు నెయ్యి సరఫరా చేసే డెయిరీల ప్రతినిధుల నంబర్లను వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్నకు సుబ్రహ్మణ్యం అందజేసి అక్రమాలకు అస్కారం కల్పించారు. 

వైష్ణవి, మాల్‌గంగ డెయిరీలతో భోలేబాబా డైరెక్టర్లే 2021, 2022ల్లో నెయ్యి సరఫరా టెండర్లు వేయించారు. సుబ్రహ్మణ్యం సభ్యుడిగా ఉన్న సాంకేతిక కమిటీ ఆ డెయిరీల ప్లాంట్లను పరిశీలించకుండానే వాటికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయని నివేదిక ఇచ్చింది. దాంతో ఫైనాన్షియల్‌ బిడ్‌కు అనుమతి లభించింది. ఎల్‌1, ఎల్‌2గా నిలిచిన డెయిరీలకు కాంట్రాక్టు దక్కింది. టెండరు దాఖలు సమయంలో మూడు డెయిరీలు తప్పుడు పత్రాలు సమర్పించాయి. వాటిని పక్కన పెట్టకుండా సుబ్రహ్మణ్యం ధ్రువీకరించారు. ఫలితంగా తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా అయి కోట్లమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. తితిదేకు భారీగా నష్టం వాటిల్లింది. ఆయా డెయిరీలకు కోట్ల రూపాయల్లో అనుచిత లబ్ధి కలిగింది.


డెయిరీ నిపుణుడి సిఫార్సులూ ఉల్లంఘన 

నెయ్యి టెండరు సరఫరా నిబంధనల్లో బీటా సిటోస్టెరాల్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఆర్‌ (ఆహార భద్రత, ప్రమాణాల నియంత్రణ) ప్రమాణాలు ఎంత ఉండాలో చేర్చాలని డెయిరీ నిపుణుడైన బి.సురేంద్రనాథ్‌ తితిదే ఈవోకు మెయిల్‌ పంపారు. భవిష్యత్తులో పిలిచే టెండర్లతోపాటు 2022 మే 10, 11న జరిగిన నెయ్యి సరఫరాకు సాంకేతికంగా అర్హత పొందిన సంస్థలకూ వీటిని వర్తింపజేయాలని సిఫార్సు చేయగా నాటి ఈవో అందుకు అనుమతించారు. ఈ టెండర్లలో ఎల్‌1, ఎల్‌2గా నిలిచిన ఆల్ఫా డెయిరీ, ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌ సంస్థలు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఆర్‌ ప్రమాణాల నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని కోరగా సుబ్రహ్మణ్యం అందుకు సిఫార్సు చేస్తూ ఈవోకు ఓ నోట్‌ పంపారు. 

  • Author

కల్తీ నెయ్యి కేసులో నిందితులుగా మరో 12 మంది

 

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 30 Nov 2025 05:41 IST
Ee
Font size
 
 
 
 
5 min read
 
 

వారిలో ఏడుగురు తితిదే ఉద్యోగులు, ఐదుగురు డెయిరీల తనిఖీ బృందం సభ్యులు
ఫిర్యాదుదారు మురళీకృష్ణ పేరూ నిందితుల జాబితాలో
వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనలో బాధ్యుడు, వైకాపాతో అంటకాగిన హరినాథరెడ్డి కూడా.. 
నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్‌ మెమో
మొత్తం 36కు చేరిన నిందితుల సంఖ్య
ఈనాడు - తిరుపతి, అమరావతి

AP291125main-6a.webp

న్యూస్‌టుడే-తిరుపతి (నేరవిభాగం): తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిట్‌ మరో 12 మందిని నిందితులుగా చేర్చింది. వీరిలో ఏడుగురు తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు కాగా, మరో ఐదుగురు డెయిరీ ప్లాంట్లు తనిఖీ చేయాల్సిన సాంకేతిక బృందంలోని సభ్యులు. కల్తీ నెయ్యి సరఫరాలో వీరందరి ప్రమేయం ఉన్నట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. వీరిలో కొంతమంది డెయిరీల ప్రతినిధుల నుంచి లంచాలు తీసుకుని వాటికి అనుకూలంగా నివేదికలిచ్చారని, నిర్ణయాలు  తీసుకున్నారని సిట్‌ గుర్తించింది. ఆ వివరాలతో ఈ నెల 23న నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన మెమో శనివారం వెలుగుచూసింది. ఈ కేసులో ఫిర్యాదుదారైన తితిదే కొనుగోళ్ల విభాగం జీఎం ప్రళయకావేరి మురళీకృష్ణను కూడా సిట్‌ నిందితుడిగా చేర్చింది. వైకుంఠ ద్వారదర్శనం టోకెన్ల పంపిణీ సందర్భంగా ఈ ఏడాది జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు బాధ్యుడు, గత ప్రభుత్వ హయాంలో వైకాపాతో అంటకాగిన ఎస్వీ గోశాల డైరెక్టర్‌ హరినాథ్‌రెడ్డిని కూడా కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితుడిగా పేర్కొంది. డెయిరీ ప్లాంట్లు తనిఖీ చేయాల్సిన సాంకేతిక బృందంలో సభ్యుడైన ఆయన.. విధులు సక్రమంగా నిర్వహించలేదని పేర్కొంది. ముగ్గురు తితిదే మాజీ జీఎంలు, గోశాల పూర్వ డైరెక్టర్, ఓ డిప్యూటీ ఈవో, సీనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ అసిస్టెంట్లకూ కల్తీ నెయ్యి సరఫరాలో పాత్ర ఉందని సిట్‌ పేర్కొంది. నిందితుల జాబితాలో ఉన్న తితిదే డిప్యూటీ ఈవో నటేశ్‌బాబు, జీఎం మురళీకృష్ణ ఇప్పటికే రిటైరయ్యారు. భోలేబాబా, వైష్ణవి, మాల్‌గంగ, ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌ డెయిరీలకు వీరు సహకరించారని సిట్‌ పేర్కొంది.


ఎవరి పాత్ర ఏంటంటే?

1. పల్లి ఈశ్వరరెడ్డి (ఏ25): గోదాముల విభాగం జూనియర్‌ అసిస్టెంట్‌. భోలేబాబా, వైష్ణవి, మాల్‌గంగ, ఏఆర్‌ డెయిరీల నుంచి రూ.23,600 లంచం తీసుకున్నారు. కల్తీ నెయ్యి ట్యాంకర్ల అన్‌లోడింగ్‌కు సహకరించారు. వాటి ఇన్వాయిస్‌లను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కొనుగోలు విభాగం జీఎంకు పంపించారు. ఆయా డెయిరీలు సరఫరా చేస్తున్నది కల్తీ నెయ్యేనని సీఎఫ్‌టీఆర్‌ఐ ఇచ్చిన నివేదికను ఉన్నతాధికారులకు పంపకుండా తొక్కిపెట్టారు. 

2. ముద్దు వెంకట అనిల్‌కుమార్‌ (ఏ26): కొనుగోళ్ల విభాగంలో సీనియర్‌ అసిస్టెంట్‌. కల్తీ నెయ్యి సరఫరా చేసిన డెయిరీల తరఫు కమీషన్‌ ఏజెంట్‌ శ్రీనివాసన్‌ నుంచి రూ.59,600 లంచం తీసుకున్నారు. భోలేబాబా, వైష్ణవి డెయిరీలకు అనుకూలంగా ఉన్నతాధికారులకు దస్త్రాలు పంపారు. భోలేబాబా డెయిరీకి సాంకేతిక అర్హత లేదని ప్లాంట్‌ తనిఖీ చేసిన కమిటీ నివేదిక ఇచ్చాక కూడా.. ఆ సంస్థలకు 15 శాతం ఆర్డర్లు ఇప్పించారు. 

3. పోలేపల్లి వెంకట నటేశ్‌బాబు (ఏ27): డిప్యూటీ ఈవోగా పనిచేసి రిటైరయ్యారు. కమీషన్‌ ఏజెంట్‌ శ్రీనివాసన్‌ నుంచి రూ.20,000 లంచం తీసుకున్నారు. వారికి త్వరగా బిల్లులు చెల్లింపులు జరిగేలా చూశారు. నాణ్యత పరీక్షల నివేదిక రాకముందే కల్తీ నెయ్యి ట్యాంకర్ల అన్‌లోడింగ్‌కు అనుమతించారు.

4. పేరూరు జగదీశ్వర్‌రెడ్డి (ఏ28): కొనుగోళ్ల విభాగంలో జనరల్‌ మేనేజర్‌గా పని చేశారు. మాల్‌గంగ, భోలేబాబా, వైష్ణవి డెయిరీలకు సహకరించారు. వారి నుంచి 50 గ్రాముల వెండి నాణేన్ని లంచంగా తీసుకున్నారు. 

5. ఆర్‌ఎస్‌ఎస్‌వీఆర్‌ సుబ్రహ్మణ్యం (ఏ29): కొనుగోళ్ల విభాగం జనరల్‌ మేనేజర్‌గా పని చేశారు. భోలేబాబా, వైష్ణవి, మాల్‌గంగ డెయిరీలు సరఫరా చేస్తున్న నెయ్యి కల్తీదని పరీక్షల్లో తేలినా ఆ నివేదిక దాచిపెట్టారు. ఆ సంస్థల ప్రతినిధుల నుంచి రూ.3.50 లక్షల నగదు, సెల్‌ఫోన్, వెండి కంచం, నాణెం లంచంగా తీసుకున్నారు. 

6. ప్రళయకావేరి మురళీకృష్ణ (ఏ30): కొనుగోళ్ల విభాగం జనరల్‌ మేనేజర్‌గా పని చేశారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన డెయిరీల ప్రతినిధుల నుంచి రూ.5 వేల విలువైన వెండి నాణెం లంచంగా తీసుకున్నారు. 

7. డాక్టర్‌ కె.హరినాథరెడ్డి (ఏ31): ఎస్వీ గోశాల డైరెక్టర్‌. డెయిరీ ప్లాంట్లు తనిఖీ చేయాల్సిన సాంకేతిక బృందంలో సభ్యుడిగా తన విధులు సక్రమంగా నిర్వహించలేదు. 

8. డా.మల్లం మహేందర్‌ (ఏ32): డెయిరీ నిపుణుడు. డెయిరీ ప్లాంట్లు తనిఖీ చేయాల్సిన సాంకేతిక బృందంలో సభ్యుడిగా తన విధులు సక్రమంగా నిర్వహించలేదు. 

9. డా.వి.వెంకట సుబ్రమణియన్‌ (ఏ33): డెయిరీ నిపుణుడు. డెయిరీ ప్లాంట్లు తనిఖీ చేయాల్సిన సాంకేతిక బృందంలో సభ్యుడిగా తన విధులు సక్రమంగా నిర్వహించలేదు. 

10. విజయభాస్కరరెడ్డి (ఏ34): డెయిరీ నిపుణుడు. ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌ ఎండీ నుంచి రూ.2.50 లక్షలు లంచం తీసుకుని ఆ డెయిరీకి అనుకూలంగా నివేదిక ఇచ్చారు. టెండరు నిబంధనల్లో నాణ్యత పరీక్షించడానికి అనుసరించే బీటాసిటోస్టెరాల్‌ పద్ధతి మినహాయించొచ్చని అభిప్రాయపడ్డారు. 

11: డాక్టర్‌ బత్తుల సురేంద్రనాథ్‌ (ఏ35): డెయిరీ నిపుణుడు. డెయిరీ ప్లాంట్ల తనిఖీ బృందంలో సాంకేతిక సభ్యుడు. భోలేబాబా డెయిరీ ప్లాంట్‌ తనిఖీకి వెళ్లినప్పుడు వారి నుంచి రూ.50 వేల విలువైన ఫోన్లు లంచంగా తీసుకున్నారు. మైసూరులోని సీఎఫ్‌టీఆర్‌ఐ ల్యాబ్‌ నుంచి వచ్చిన నెయ్యి నమూనాల పరీక్ష నివేదికలను పరిశీలించి, బీటాసిటోస్టెరాల్‌ మినహా మిగతా ప్రమాణాలన్నీ సరిగ్గానే ఉన్నాయంటూ తప్పుడు నివేదిక ఇచ్చారు. నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనేది ఉన్నతాధికారులకు చెప్పకుండా డెయిరీలకు మేలు చేశారు. బీటాసిటోస్టెరాల్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఆర్‌ ప్రమాణాలు పాటించేలా టెండరు నిబంధనల్లో మార్పు చేయాలని తితిదేకు సూచించారు. ఆల్ఫా డెయిరీ, ప్రీమియర్‌ సంస్థలు బీటాసిటోస్టెరాల్‌ పరీక్షలు మినహాయించాలని కోరగా వారికి అనుకూలంగా సిఫార్సు చేశారు. ఆయనతోపాటు విజయభాస్కరరెడ్డి కూడా ఇదే మాట చెప్పడంతో కల్తీ నెయ్యి సరఫరాకు మార్గం సుగమమైంది. 

12: డా.కె.జయరాజ్‌రావు: (ఏ36): డెయిరీ నిపుణుడు. భోలేబాబా డెయిరీ ప్లాంట్‌ తనిఖీకి వెళ్లినప్పుడు రూ.50 వేల విలువైన ఫోన్‌ లంచంగా తీసుకున్నారు.

  • Author

 శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలు: సీఎం చంద్రబాబు

 

Eenadu icon
By Andhra Pradesh News TeamUpdated : 06 Dec 2025 19:14 IST
Ee
Font size
 
 
 
 
3 min read
 
 

06122025b-1a.webp

అమరావతి: బాబాయ్ హత్యే వాళ్లకి చిన్న విషయమైనప్పుడు.. ఇక పరకామణి చోరీ కేసు వాళ్లకి పెద్ద విషయం ఎలా అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఏమాత్రం నైతికత లేని వాళ్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో మీడియాతో సీఎం ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తిరుమల పరకామణిలో రూ.70వేల చోరీకి రూ.14కోట్ల ఆస్తి రాసిచ్చేందుకు సిద్ధపడ్డారంటే ఇంకెంత సంపాదించి ఉంటారని ప్రశ్నించారు. తితిదేలో దోపిడీ ఏ స్థాయిలో చేశారో దీనిబట్టే అర్థమవుతోందన్నారు.

శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు.  జగన్‌కు దేవుడన్నా, ఏడుకొండల వాడి భక్తుల మనోభావాలు అన్నా, ఆలయాలు పవిత్రత అన్నా లెక్కలేదని దుయ్యబట్టారు. బాబాయి హత్యనే సెటిల్ చేసుకుందాం అని చూసిన జగన్, పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల పరకామణి చోరీని కూడా సెటిల్ చేయాలని చూడటం ఘోరమని ఆగ్రహం వ్యక్తంచేశారు. దొంగతనాన్ని కూడా తప్పు కాదు అని చెప్పే వాళ్లను ఏమనాలని ప్రశ్నించారు. సెంటిమెంట్ విషయాల్లో కూడా సెటిల్మెంట్ అంటూ వ్యాఖ్యాలా అని ఆక్షేపించారు.  నేరస్తుల్ని వెనకేసుకొస్తాను అంటూ సమాజానికి ఏం చెప్తూన్నారని నిలదీశారు. దొంగతనం చేసిన వ్యక్తి డబ్బులు వెనక్కి కట్టాడు కదా, తప్పేముంది అని జగన్ అత్యంత అనైతికంగా వాదిస్తున్నాడని మండిపడ్డారు. భక్తులు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని గుర్తుచేశారు.

దొంగలతో సెటిల్మెంట్ ఏంటి?

శ్రీవారి ఆలయంలో ప్రతి అంశంలోను భక్తుల సెంటిమెంట్ ముడిపడి ఉంటుందన్న చంద్రబాబు.. అలాంటి సున్నిత అంశాలను కూడా సెటిల్ చేశాం అని తేలిగ్గా మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు ఇచ్చిన కానుకలు, ముడుపులను కొట్టేసిన దొంగలతో సెటిల్మెంట్ ఏంటి అని ప్రశ్నించారు. శ్రీవారి హుండీలో చోరీపై జగన్ వ్యాఖ్యలపై అన్ని వర్గాల ప్రజల్లోను తీవ్ర ఆవేదన కనిపిస్తోందన్నారు. వర్గాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ఆ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. దేవుడి హుండీలో చోరీని సెటిల్ చేయటానికి జగన్ ఎవరని నిలదీశారు. కోట్ల మంది భక్తులు విశ్వాసాలు దెబ్బతీసేలా పరకామణి విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఘోర పాపం కాదా అని మండిపడ్డారు.

చుక్క పాలు లేకుండానే నెయ్యి..

‘‘చుక్క పాలు లేకుండానే నెయ్యి తయారు చేసి దేవుడి ప్రసాదానికి సరఫరా చేసిన ఘనులా వీళ్లు అని సర్వత్రా చర్చ జరుగుతోంది. గతంలో నెల్లూరు, విజయనగరం జిల్లాలు ఎంతో ప్రశాంతంగా ఉండేవి..  వైకాపా హయాంలో నెల్లూరులో కూడా చాపకింద నీరులా మాఫియాను విస్తరింపజేశారు. లేడీడాన్స్ తయారవటం చూసి నాకే ఆశ్చర్యం కలిగింది. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ ప్రసక్తే లేదని స్పష్టం చేశా. శాంతి భద్రతలు అదుపు చేస్తున్నాం. అధికారం చేపట్టిన నాటికీ ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. రాజధానిలో సమస్యలన్నీ పరిష్కారమై అభివృద్ధి జరుగుతుంటే రైతులు, ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఇది రాజకీయంగా కొందరు తట్టుకోలేక బాధపడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన హైదరాబాద్ అభివృద్ధిని... నేటి అక్కడి పాలకులూ గుర్తిస్తున్నారు. ఆనాడు వేసిన అభివృద్ధి బీజం ఫలితంగానే కోకాపేటలో ఎకరం భూమి రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది’’ అని సీఎం  గుర్తుచేశారు.

Since 15 years Ravi Kumar not drawn single paise from his salary account anta...

There are around 200 crores of assets he accumulated by theft of US dollars in parakamani....

Chronological events sine 2 days...

1. Jagan press meet and defending Ravi Kumar did small crime.....

2. Jagan got lot of negative feedback with his statements on parakamani theft

3. To counter Jagan, Anam said that govt has list of properties of Ravi Kumar who assigned to ysrcp leaders... Anam said ysrcp leaders took 90% of Ravi Kumar properties 

4. After Annam press meet, Ravi Kumar first time preset before media for damage control

  • Author

కేజీ కల్తీ నెయ్యికి రూ.25 కమీషన్‌ డిమాండ్‌ చేశారు

 

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 13 Dec 2025 05:09 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

ఎవరి ప్రోద్బలంతో కమీషన్‌ వసూలు చేశారో దర్యాప్తులో తేలాలి
హవాలా మార్గంలో చిన్న అప్పన్నకు సొమ్ము
బెయిలు పిటిషన్ను కొట్టేయండి
హైకోర్టులో సిట్‌ తరఫున సీబీఐ వాదనలు

ఈనాడు, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా తదితర డెయిరీల నుంచి చిన్న అప్పన్న కేజీకి రూ.25 చొప్పున కమీషన్‌ డిమాండ్‌ చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని సిట్‌ తరఫున సీబీఐ స్టాండింగ్‌ కౌన్సెల్‌ పీఎస్‌పీ సురేశ్‌కుమార్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు. చిన్న అప్పన్నకు కమీషన్‌ ఇచ్చినట్లు నెయ్యి సరఫరా చేసిన కంపెనీ యజమానులు వాంగ్మూలాలు ఇచ్చారన్నారు. ఎవరి ప్రోద్భలంతో కమీషన్‌ వసూలు చేశారో దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు. హవాలా మార్గంలో చిన్న అప్పన్నకు సొమ్ము చేరిందన్నారు. రూ.కోట్లలో బ్యాంక్‌ లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. విశాఖపట్నంలో ఆయనకు 14 ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. తితిదే అప్పటి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి చిన్న అప్పన్న పీఏగా వ్యవహరించారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ సమయంలో వినియోగించిన ఫోన్లను ఇచ్చేందుకు అప్పన్న నిరాకరిస్తున్నారని తెలిపారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని బెయిలు పిటిషన్ను కొట్టేయాలని కోరారు. 

  • శుక్రవారం జరిగిన విచారణలో ఇరుపక్షాల వాదనలూ ముగిశాయి. దీంతో సోమవారం నిర్ణయాన్ని ప్రకటిస్తామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ వై.లక్ష్మణరావు ప్రకటించారు.
  • కల్తీ నెయ్యి సరఫరా కేసులో బెయిలు కోసం అప్పటి తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. ‘వివరాలు వెల్లడించడం లేదని, దర్యాప్తునకు సహకరించడం లేదని పిటిషనర్‌ను అరెస్టు చేశారు. కల్తీనెయ్యి సరఫరా కేసులో పిటిషనర్‌కు సంబంధంలేదు. తితిదే పాలక వ్యవహారాల్లో తలదూర్చారనేది పిటిషనర్‌పై ప్రధాన ఆరోపణ. నకిలీ నెయ్యి సరఫరా చేసిన కంపెనీ యజమానులు ఇప్పటికే బెయిలు పొందారు. కోర్టు విధించే ఏ షరతులకైనా పిటిషనర్‌ కట్టుబడి ఉంటారు. బెయిలు మంజూరు చేయండి’ అని కోరారు.

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.