Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

TTD

Featured Replies

  • Replies 270
  • Views 11.6k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

ayodhya ki pampina laddoos lo quality ghee use chesaaru.

modi, amit shah, central ministers, other vips tirumala visit chesinappudu vaallaki ichina laddoos lo quality ghee use chesaarani aasisthunnaamu.

Edited by ravindras

On 11/14/2025 at 10:13 PM, Eswar09 said:

Lepesaru ga ..

vaallanu touch chesthe jarigedhi adhe.

evadu elaanti case lo vaallaku against gaa statement ivvaru. isthe paiki pampisthaarani telusu.

cbn term lo investigation court orders follow avuthaaru. accused  ni vaadi lawyer ki kanapadelaa(visible distance lo vunchi) question chesthaaru. vaadu teliyadhu, gurthu ledhu, marchipoyaa antaadu. few questions ki silent gaa vuntaadu. 

accussed ki pette food, shelter, travelling ki money waste.

 

  • Author

వైకాపా నేత కారుమూరు వెంకట్‌రెడ్డి అరెస్ట్‌

 

Eenadu icon
By Andhra Pradesh News TeamUpdated : 18 Nov 2025 11:06 IST
Ee
Font size
 
 
 
 
1 min read
 
 

125212297_181125karumuru1a.webp

హైదరాబాద్‌: వైకాపా (YSRCP) అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి (Karumuru Venkat Reddy)ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తాడిపత్రి పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. వెంకట్‌రెడ్డిపై ఏపీలో పలు కేసులు నమోదయ్యాయి.

తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారు సతీశ్‌కుమార్‌ ఈనెల 14న తాడిపత్రి సమీపంలో రైల్వేట్రాక్‌ పక్కన హత్యకు గురయ్యారు. దీనిపై ఏపీ పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించడంతో పాటు సీఎం చంద్రబాబుపై వెంకట్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కర్నూలు బస్సు ప్రమాద ఘటన తర్వాత ఓ టీవీ ఛానల్‌ డిబేట్‌లో రాష్ట్ర ప్రభుత్వం, సీఎంపై వెంకట్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో తాడిపత్రి తెదేపా నేత ప్రసాదనాయుడు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా తాడిపత్రి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా కూకట్‌పల్లిలోని మెరీనా స్కైస్‌ అపార్ట్‌మెంట్‌లో కారుమూరు వెంకట్‌రెడ్డి ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం ఉదయం అక్కడికి వెళ్లి అరెస్ట్‌ చేశారు.

సతీష్ కుమార్ రైలు ఎక్కలేదా?

టికెట్ తీసుకుని రెండు గంటల ముందే రైల్వే స్టేషన్ వెళ్లి, వాహనం పార్క్ చేయడం వరకు నిజం. సీసీ కెమెరాల దృశ్యాలు అంతవరకు ఉన్నాయి.

తరువాత ఆయన మాయమయ్యారు. ఈ రుజువులు లేవు. కిడ్నాప్ చేసి హత్య చేశారా?

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి లేఖ తరహాలో డ్రైవర్‌పై అనుమానం వచ్చేలా...

సతీష్ కుమార్ మొబైల్ నుండి 'ఒంట్లో బాగోలేదని' ఆయన భార్యకు మెసేజ్ చేశారా?

ఆయన లగేజ్ కూడా వేరే బర్త్ దగ్గర పెట్టి, ట్రైన్ లో ఉన్నట్లుగా నమ్మించడానికి ట్రై చేశారా?

ఆత్మహత్య చేసుకోవడానికి రైలు నుండి దూకి పడిపోయినట్లుగా... తల వెనుక రాయి తగిలి చనిపోయినట్లుగా... అక్కడికి ఏ వాహనం వచ్చిన ఆనవాళ్లు లేవని, కాబట్టి ఇది ఆత్మహత్యే, హత్య కాదు అని పోస్టుమార్టం రిపోర్ట్ కూడా రాకముందే సాక్షి పత్రిక రాసినప్పుడే అనుకున్నా. ఇది పక్కాగా హత్య అని.

వంద కోట్లకు పైగా ఆస్తులను ఒక్క లావాదేవీలో...
కేవలం ఒక పరకామణి దొంగతో రాజీ చేసి...
కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి తమ బినామీల పేర్లతో...
రవికుమార్ ఆస్తులు కొట్టేశారు.

శ్రీవారి కేసునే లోక్ అదాలత్‌లో సెటిల్మెంట్ చేశారు.

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో... టీటీడీ నుండి మింటుకు తరలించే సమయంలో కేజీల కొద్దీ బంగారం దొంగిలించారు.

ఆయన హయాంలో పెరిగిన ఈ శక్తిమంతమైన వ్యక్తులు, ఒక పరకామణి నేరాన్ని వదిలేస్తారా?

సెటిల్మెంట్ చేసి, ఆస్తులు కొట్టేసి, ప్రాణాలు తీసేయడానికి కూడా వెనుకాడలేదు.

ఈ నేపథ్యంలో.. 
పరకామణి కేసులో ఫిర్యాదు చేసిన సతీష్ కుమార్ హత్యను చూసిన తరువాత, నిందితుడు రవికుమార్ తో పాటు సాక్షులకు కూడా రక్షణ కల్పించాలి అని ఏపీ హైకోర్టు తాజాగా సీఐడీ డీజీకి ఆదేశాలు ఇచ్చింది."

  • Author

Parakamani Case: కేసు రాజీ జరుగుతుంటే.. మీరేం చేశారు?

 

Eenadu icon
By Andhra Pradesh News DeskUpdated : 25 Nov 2025 04:38 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

తితిదే పూర్వ వీజీవో గిరిధర్‌పై సీఐడీ బృందం ప్రశ్నల వర్షం
‘పరకామణి’ కేసు దర్యాప్తు వేగవంతం

251125brk125217004a.webp

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: ‘‘పరకామణిలో కానుకల చోరీకి పాల్పడ్డ రవికుమార్‌ ఎన్ని విదేశీ కరెన్సీ నోట్లు మీకు అప్పగించారు? ఎక్కడో ఉన్న అప్పటి ఏవీఎస్‌వో సతీష్‌కుమార్‌ను పిలిచి ఫిర్యాదు ఇమ్మని చెప్పడం వెనక ఎవరున్నారు? దర్యాప్తు గురించి మీకు ఏమి తెలుసు? ప్రభుత్వ ఉద్యోగైన సతీష్‌కుమార్‌ పరకామణి కేసును లోక్‌ అదాలత్‌లో రాజీ చేసుకుంటుంటే మీరేం చేశారు?’’ అని సీఐడీ బృందం అప్పటి తితిదే వీజీవో గిరిధర్‌ను ప్రశ్నించింది. సోమవారం తిరుపతి పద్మావతి అతిథిగృహంలో సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ దర్యాప్తు బృందంతో కలిసి విచారించారు. హైకోర్టు ఆదేశాల మేరకు పరకామణిలో కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ బృందం డిసెంబరు 2వ తేదీలోగా నివేదిక ఇచ్చేందుకు విచారణ చేపట్టింది. అదే సమయంలో విచారణ నిమిత్తం వస్తున్న ఏవీఎస్‌వో సతీష్‌కుమార్‌ మృతి చెందారు. దీంతో దర్యాప్తులో జాప్యం చోటుచేసుకుంది.

సోమవారం తిరుపతికి చేరుకున్న సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ స్వయంగా విచారణ చేపట్టారు. అప్పటి తితిదే వీజీవో గిరిధర్‌ను విచారించారు. పరకామణి అధికారులు మొదట మీకు సమాచారమిచ్చారా అని ఆరా తీశారు. చోరీపై తితిదే విజిలెన్స్‌ విభాగం ఎలాంటి విచారణ చేపట్టింది, సంబంధిత దస్త్రాలు, ఇతర వివరాలు ఎవరికి సమర్పించారని ఆడిగినట్లు సమాచారం. తాము సేకరించిన విషయాలు అప్పటి సీవీఎస్‌వో నరసింహకిశోర్‌కు తెలియజేసినట్లు గిరిధర్‌ చెప్పినట్లు తెలిసింది. అలాగే కేసు రాజీలో సతీష్‌కుమార్‌కు ఏమైనా సలహాలు ఇచ్చారా? ఆయనపై ఎవరిదైనా ఒత్తిడి ఉన్నట్లు గుర్తించారా? అని ప్రశ్నించినట్లు సమాచారం. దానికి.. సరిగ్గా గుర్తించలేదని గిరిధర్‌ చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత అప్పటి ఏవీఎస్‌వో పద్మనాభంను ప్రశ్నించారు. కేసు గురించి ఏమి తెలుసని ఆరా తీశారు.

చెన్నై నుంచి రవికుమార్‌ బంధువులు

నిందితుడు రవికుమార్‌ సమీప బంధువులనూ దర్యాప్తు అధికారులు విచారించారు. చెన్నైకి చెందిన దంపతులు సోమవారం సిట్ కార్యాలయానికి వచ్చారు. నిందితుడికి చెన్నైలో ఉన్న ఆస్తులు, గిఫ్ట్‌డీడ్‌గా ఇచ్చిన ఆస్తుల రిజిస్ట్రేషన్‌ గురించి ఆరా తీసినట్లు సమాచారం. రవికుమార్‌ ఆస్తులు కూడబెట్టే సమయంలో ఏం చెప్పేవారని అడిగినట్లు తెలిసింది. 

12 మంది డ్రైవర్ల విచారణ

అప్పటి తితిదే అధికారులు, పరకామణి డిప్యూటీ ఈవో, పోలీసు అధికారుల డ్రైవర్లను విచారణకు పిలిచి వేర్వేరుగా విచారించారు. పరకామణిలో చోరీ కేసు గురించి ఏం తెలుసని వారిని అడిగినట్లు తెలిసింది. నిందితుడు రవికుమార్‌ ఆస్తులు గుర్తించడం కోసం వెళ్లిన అధికారులు ఎవరు? వారు ఎక్కడెక్కడ తిరిగారని ఆరా తీసినట్లు సమాచారం. కేసు రాజీ సమయంలో మీ అధికారుల పాత్రేమిటని ప్రశ్నించినట్లు తెలిసింది.  

ఆర్థిక లావాదేవీలపై బ్యాంకులకు నోటీసులు

నిందితుడు రవికుమార్‌తోపాటు పరకామణిలో చోరీ కేసులో కీలక వ్యక్తుల బ్యాంకు లావాదేవీలపై సీఐడీ అధికారులు నిఘా పెట్టారు. సోమవారం తిరుపతిలోని కొన్ని బ్యాంకులకు నోటీసులు అందజేశారు. సంబంధిత పేర్లతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరిగాయో తెలియజేయాలని బ్యాంకులను కోరారు.  

 
  • Author

Bhumana: పరకామణి చోరీ కేసులో భూమన కరుణాకర్‌రెడ్డికి నోటీసులు

 

Eenadu icon
By Andhra Pradesh News TeamUpdated : 25 Nov 2025 11:41 IST
Ee
Font size
 
 
 
 
1 min read
 
 

25112025bhumana-1a.webp

తిరుపతి: తిరుమల పరకామణి చోరీ కేసులో వైకాపా నేత, తితిదే మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy)కి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. తిరుమల శ్రీవారి పరకామణిలో 920 అమెరికన్‌ డాలర్లను చోరీ చేస్తూ పట్టుబడిన పకరామణి ఉద్యోగి రవిపై 2023 ఏప్రిల్‌ 7న కేసు నమోదైంది.  అప్పట్లో తితిదే ఏవీఎస్‌వోగా పనిచేసిన సతీశ్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు తిరుమల ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇవాళ సాయంత్రం 4గంటలకు తిరుపతి పద్మావతి అతిథిగృహంలోని కార్యాలయంలో.. భూమన విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు.

సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ స్వయంగా ఈ కేసు విచారణ చేపట్టారు.  హైకోర్టు ఆదేశాల మేరకు పరకామణిలో కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ బృందం డిసెంబరు 2వ తేదీలోగా నివేదిక ఇచ్చేందుకు విచారణ చేపట్టింది. అదే సమయంలో విచారణ నిమిత్తం వస్తున్న ఏవీఎస్‌వో సతీష్‌కుమార్‌ మృతి చెందారు. దీంతో దర్యాప్తులో కొంత జాప్యం చోటుచేసుకుంది. సోమవారం తిరుపతి పద్మావతి అతిథిగృహంలో అప్పటి తితిదే వీజీవో గిరిధర్‌ను విచారించారు. పరకామణి అధికారులు మొదట మీకు సమాచారమిచ్చారా అని ఆరా తీశారు. చోరీపై తితిదే విజిలెన్స్‌ విభాగం ఎలాంటి విచారణ చేపట్టింది, సంబంధిత దస్త్రాలు, ఇతర వివరాలు ఎవరికి సమర్పించారని ఆడిగినట్లు సమాచారం. తాము సేకరించిన విషయాలు అప్పటి సీవీఎస్‌వో నరసింహకిశోర్‌కు తెలియజేసినట్లు గిరిధర్‌ చెప్పినట్లు తెలిసింది. అలాగే కేసు రాజీలో సతీష్‌కుమార్‌కు ఏమైనా సలహాలు ఇచ్చారా? ఆయనపై ఎవరిదైనా ఒత్తిడి ఉన్నట్లు గుర్తించారా? అని ప్రశ్నించినట్లు సమాచారం. దానికి.. సరిగ్గా గుర్తించలేదని గిరిధర్‌ చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత అప్పటి ఏవీఎస్‌వో పద్మనాభంను ప్రశ్నించారు. కేసు గురించి ఏమి తెలుసని ఆరా తీశారు.

  • Author

ttd: పరకామణిలో చోరీకేసు రాజీకి మీరే ఆదేశాలిచ్చారా?

 

Eenadu icon
By Andhra Pradesh News DeskUpdated : 27 Nov 2025 06:30 IST
Ee
Font size
 
 
 
 
4 min read
 
 

శిక్ష పడేలా చేయాల్సింది పోయి రాజీకి ఎలా అంగీకరించారు?
రవికుమార్‌ నుంచి ఆస్తుల్ని గిఫ్ట్‌డీడ్‌గా తీసుకోవటం వెనక ఎవరి ఒత్తిడి ఉంది?
నాటి తితిదే ఈవో ధర్మారెడ్డిని విచారించిన సీఐడీ 
5 గంటల పాటు 50కు పైగా  ప్రశ్నలడిగిన అధికారులు
మీకు తెలియకుండా ఏవీఎస్‌వో రాజీ చేసుకోగలరా?
నాటి సీవీఎస్‌వో, ప్రస్తుత తూర్పుగోదావరి ఎస్పీ నరసింహ కిషోర్‌కు ప్రశ్నలు

AP261125main-10a.webp

పరకామణి కేసులో విజయవాడ సీఐడీ రీజినల్‌  కార్యాలయంలో విచారణకు హాజరై వెళ్తున్న
తితిదే మాజీ ఈఓ ధర్మారెడ్డి అప్పటి సీవీఎస్‌ఓ నరసింహ కిషోర్‌ 

ఈనాడు-అమరావతి, ఈనాడు డిజిటల్‌-తిరుపతి: ‘తితిదే పరకామణిలో చోరీ కేసులో రాజీకి మీరే ఆదేశాలిచ్చారా? న్యాయస్థానంలో శిక్షపడేలా చేయాల్సింది పోయి నిందితుడితో రాజీకి ఎందుకు, ఎలా అంగీకరించారు? అతని ఆస్తుల్ని గిఫ్ట్‌డీడ్‌గా తీసుకునేందుకు తితిదే పాలకమండలి సమావేశంలో టేబుల్‌ ఎజెండాగా ఎందుకు పెట్టారు? దీని వెనక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయి?’ అంటూ అప్పటి తితిదే ఈవో ధర్మారెడ్డిపై సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. తితిదే పరకామణిలో చోరీ, రాజీ కేసుల్లో ధర్మారెడ్డి.. విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం విచారణకు హాజరయ్యారు. సీఐడీ విభాగాధిపతి రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలోని దర్యాప్తు అధికారుల బృందం ఉదయం 10 నుంచి సాయంత్రం 3 వరకూ దాదాపు 5 గంటల పాటు ఆయన్ను విచారించింది. దాదాపు 50కు పైగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ‘పరకామణిలో చోరీకి ముందు, తర్వాత కూడా మీరే తితిదే ఈవో కదా.. ఆ వ్యవహారంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు? నిందితుడు రవికుమార్‌ ఎన్నాళ్ల నుంచి పరకామణిలో చోరీ చేస్తున్నారు? ఆ సొత్తుతో ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు? అనే అంశంపై తితిదే విజిలెన్స్‌తో దర్యాప్తు ఎందుకు చేయించలేదు?’ అని అడిగినట్లు తెలిసింది. 


నిర్ణయాల దస్త్రాలు ముందుపెట్టి ప్రశ్నల పరంపర

ర్యాప్తు అధికారులు ఏ ప్రశ్న అడిగినా.. తాను నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించానంటూ తప్పించుకునే ధోరణిలో ధర్మారెడ్డి సమాధానాలిచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన తీసుకున్న నిర్ణయాలపై దస్త్రాలు చూపించి వాటి ఆధారంగా దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు.

  • ‘పరకామణిలో చోరీ చేసిన సొత్తుతో నిందితుడు రవికుమార్‌ ఎక్కడెక్కడ? ఎన్నెన్ని ఆస్తులు కొన్నారు? వాటి విలువ ఎంతనేది గుర్తించి వాటిని రికవరీ చేయకుండా అతను రూ.14.43 కోట్ల ఆస్తిని గిఫ్ట్‌డీడ్‌గా ఇస్తానని ప్రతిపాదిస్తే.. ఎలా అంగీకరించారు? చోరీ సొత్తుతో అతను కూడబెట్టిన మిగతా ఆస్తులు ఏమయ్యాయో ఎందుకు తేల్చలేదు?’ అంటూ అడగ్గా... ధర్మారెడ్డి పొంతనలేని సమాధానాలిచ్చినట్లు తెలిసింది. శ్రీవారికి విరాళాలు, గిఫ్ట్‌డీడ్‌లు ఇవ్వటానికి ఎవరైనా ముందుకొస్తే.. వారి నేపథ్యం పరిశీలించాకే వాటిని స్వీకరించాలనే నిబంధనలేమీ లేవని ధర్మారెడ్డి జవాబిచ్చినట్లు సమాచారం.
  • ‘గిఫ్ట్‌డీడ్‌ స్వీకరణ అంశాన్ని మీ ఆదేశాలతోనే టేబుల్‌ ఎజెండాగా చేర్చినట్లు మా దర్యాప్తులో తేలింది. ఎందుకు ఒత్తిడి తెచ్చారు?’ అని అడగ్గా ధర్మారెడ్డి మౌనం వహించినట్లు సమాచారం. 

మీ ఆదేశాలు లేకుండా ఏవీఎస్‌వో రాజీ చేసుకోగలరా?

‘తితిదే పరకామణిలో చోరీ, తర్వాత కేసు రాజీ అంతా మీరు సీవీఎస్‌వోగా ఉన్నప్పుడే జరిగింది. మీ ఆదేశాలు లేకుండా, మీకు తెలియకుండా మీ నాయకత్వంలో పనిచేసే ఏవీఎస్‌వో స్థాయి అధికారి రాజీ చేసుకోగలరా?’ అంటూ నాటి తితిదే సీవీఎస్‌వో, ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్‌ను సీఐడీ విభాగాధిపతి రవిశంకర్‌ అయ్యన్నార్‌ ప్రశ్నించినట్లు సమాచారం. తితిదే పరకామణిలో చోరీ, రాజీ కేసుల్లో ఆయన విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకూ దాదాపు 2 గంటల పాటు దర్యాప్తు బృందం ఆయన్ను విచారించింది. ప్రధానంగా చోరీకేసు రాజీ వెనక ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయనే కోణంలో వివరాలు రాబట్టినట్లు సమాచారం.

  • ‘లోక్‌ అదాలత్‌లో కేసు రాజీ చేసుకునేలా అప్పటి ఏవీఎస్‌వో సతీష్‌కుమార్‌పై మీరు ఒత్తిడి తీసుకొచ్చారా? ఎవరి ఆదేశాల మేరకు సతీష్‌పై ఒత్తిడి తెచ్చారు?’ అని అడిగినట్లు తెలిసింది. 
  • పరకామణిలో చోరీ జరిగిన రోజు ఎవరెవరు డ్యూటీలో ఉన్నారు? వారిలో ఎంతమందిని విచారించారు? నాటి విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఏం తేల్చారు.. మీ దర్యాప్తులో ఏం తేలింది? నిందితుడి వద్ద ఎన్ని ఆస్తులున్నాయి? అవి ఎవరెవరి పేరిట ఉన్నాయి?  కేసు ఎలా అంత త్వరగా క్లోజ్‌ చేయగలిగారు’ అని సీఐడీ ఆరా తీసినట్లు సమాచారం.

తెరవెనక ఏం జరిగింది?

తితిదే పరకామణిలో విధులు నిర్వహిస్తున్న సీవీ రవికుమార్‌ పెద్ద ఎత్తున డాలర్లు, బంగారం అపహరించారంటూ అప్పట్లో ఏవీఎస్‌వోగా పనిచేసిన సతీష్‌కుమార్‌ 2023 ఏప్రిల్‌ 29న తిరుమల ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆ కేసులో మే 30న అభియోగపత్రం దాఖలు చేశారు. అనంతరం మూడున్నర నెలలకే సెప్టెంబరు 9న రవికుమార్‌తో లోక్‌ అదాలత్‌లో చోరీ కేసు రాజీ చేసుకున్నారు. ఈ క్రమంలో రవికుమార్‌ తన ఆస్తుల్లో ఏడు ఆస్తులను తితిదేకు గిఫ్ట్‌డీడ్‌గా ఇవ్వగా.. వైవీ సుబ్బారెడ్డి ఛైర్మన్‌గా, ధర్మారెడ్డి ఈవోగా ఉన్నప్పుడు పాలకమండలి వాటిని తీసుకుంది. దీనికి తెరవెనక ఏం జరిగిందనే కోణంలో సీఐడీ అధికారులు ప్రధానంగా విచారించారు.

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.