Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

TTD

Featured Replies

  • Replies 270
  • Views 11.6k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

3 minutes ago, Mobile GOM said:

 

ardham kaanidi enti ante... veedi paapalaki koduku (<30yrs) poyina inka realization ledu .. vellani manushulu ani koda anakodadu... jantuvulu chaala melu veella kanna pillali medaki evadanna vaste eduru tirugutaayi.

  • Author

వైవీ సుబ్బారెడ్డి పీఏ ఖాతాలో రూ.4.69 కోట్లు

 

Eenadu icon
By Andhra Pradesh News DeskUpdated : 12 Nov 2025 06:48 IST
Ee
Font size
 
 
 
 
3 min read
 
 

అందులో రూ.4.65 కోట్లు వేర్వేరు ఖాతాల్లోకి మళ్లింపు
2019-24 మధ్య చిన్న అప్పన్న ఆదాయం రూ.65 లక్షలే
కానీ ఆయన ఖాతాలో రూ.కోట్లలో డబ్బు జమ
కల్తీ నెయ్యిపై చర్యలు తీసుకోని నాటి తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి
పీఏ ఖాతాలో జమైంది లంచాల సొమ్మేనని భావిస్తున్న సిట్‌
దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి

AP111125main-4a.webp

ఈనాడు, అమరావతి: ‘వైకాపా హయాంలో తితిదే ఛైర్మన్‌గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి పీఏ, కల్తీనెయ్యి సరఫరా కేసులో నిందితుడు కె.చిన్న అప్పన్నకు 2019-24 మధ్య వేతనం ద్వారా సమకూరిన ఆదాయం రూ.65 లక్షలు. కానీ దిల్లీలోని ఏపీ భవన్‌ యూనియన్‌ బ్యాంకు బ్రాంచ్‌లో అతని పేరిట ఉన్న ఖాతాలో ఆ ఐదేళ్లలో ఏకంగా రూ.4.69 కోట్లు జమైంది. అందులో రూ.4.64 కోట్లు వివిధ ఖాతాలకు మళ్లించేసుకున్నారు. ప్రస్తుతం చిన్న అప్పన్న ఖాతాలో క్లోజింగ్‌ బ్యాలెన్స్‌ రూ.4.98 లక్షలే మిగిలింది’ అని సిట్‌ గుర్తించింది. అతని ఖాతాల్లో రూ.4.69 కోట్లు ఎక్కడినుంచి జమయ్యాయి? అంత భారీ మొత్తాలు ఎందుకు వచ్చినట్లు? ఆ సొమ్మును ఏ ఖాతాలకు బదిలీ చేశారనే కోణంలో కీలక వివరాలు రాబట్టిన సిట్‌.. ఇదంతా కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి అందిన లంచాల సొమ్మేనని, చిన్న అప్పన్న ఖాతా నుంచి ‘అంతిమ లబ్ధిదారుకు’ చేరిందని గుర్తించింది. ఎస్‌బీఐ విజయవాడ బ్రాంచ్‌లో బవిరెడ్డి శ్రీదేవి పేరిట చిన్న అప్పన్నకు ఓ ఖాతా ఉంది. అందులోనూ అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు సిట్‌ తేల్చింది. 2021-24 మధ్య చిన్న అప్పన్న తగరపువలసలో ఒక్కోటి 160 గజాల విస్తీర్ణం కలిగిన 5 ప్లాట్లు, లంకెలపాలెంలో 240 గజాల చొప్పున 8 ప్లాట్లు, రుషికొండలో ఓ ఫ్లాటు కొన్నట్లు గుర్తించింది. ఇందుకు డబ్బు ఎక్కడినుంచి వచ్చిందనేదానిపై సిట్‌ ఆరాతీస్తోంది. తితిదేకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిట్‌ దర్యాప్తులో తాజాగా ఈ అంశాలన్నీ వెలుగులోకి వచ్చాయి. 

నెయ్యి కాని నెయ్యి సరఫరా

నెయ్యి అంటే ఎవరైనా పాలతో తయారుచేస్తారు. కానీ పామాయిల్, పామ్‌ కర్నెల్‌ ఆయిల్‌తో ఓ పదార్థాన్ని సిద్ధం చేసి... దానికి కృత్రిమంగా నెయ్యి సువాసన వచ్చేలా చేసేందుకు బీటా-కెరోటిన్‌ లాంటి రసాయనాలను కలిపితే అది నెయ్యి అవుతుందా? కానే కాదు కదా.. కానీ వైకాపా హయాంలో ఇలా నెయ్యే కానిదాన్ని నెయ్యి పేరిట తితిదేకు సరఫరా చేశారు. ఏకంగా రూ.251.53 కోట్ల విలువైన 68.17 లక్షల కిలోల నకిలీ నెయ్యిని తయారుచేసిన భోలేబాబా డెయిరీ మిల్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ అందులో రూ.137 కోట్ల విలువైన 37.38 లక్షల కిలోలను వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్‌ ద్వారా తితిదేకు సరఫరా చేసింది. ఈ కల్తీ నెయ్యినే లడ్డూ, ఇతర ప్రసాదాల తయారీలో వినియోగించినట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. తద్వారా భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయని వెల్లడైంది. 

కల్తీ ఉందని తేలినా కొనసాగింపు

వైవీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు తిరుమలకు సరఫరా అవుతున్న నెయ్యి నమూనాలను నాణ్యత పరీక్షల కోసం మైసూరులోని సీఎఫ్‌టీఆర్‌ఐ ల్యాబ్‌కు పంపగా ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, వైష్ణవి డెయిరీ, భోలేబాబా డెయిరీలు సరఫరా చేసిన నెయ్యిలో వెజిటబుల్‌ ఆయిల్స్‌ కలిసి ఉన్నాయని, అది కల్తీ నెయ్యి అని తేలింది. ఈ విషయాన్ని తితిదే ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం సుబ్రహ్మణ్యం 2022 మేలో సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. కల్తీ నెయ్యి వస్తోందని తెలిసినా సుబ్బారెడ్డి ఏ ఒక్క సరఫరాదారుపైనా చర్యలు తీసుకోలేదు. ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, వైష్ణవి డెయిరీలను 2024 వరకూ, భోలేబాబాను 2022 అక్టోబరు వరకూ నెయ్యి సరఫరాదారులుగా కొనసాగించారు. ఈ కొనసాగింపుతోనే ఆ లంచాల బంధం ఎంత గాఢంగా పెనవేసుకుందో స్పష్టమవుతోంది.


లంచాల కోసం మహాపాపం

వైకాపా హయాంలో తిరుమలలో లడ్డూ తిన్నవారు అంతకు ముందున్నట్లు లడ్డూ నాణ్యత, రుచి లేదని, ఎక్కువ రోజులు నిల్వ ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేసేవారు. దానికి కారణమేంటనేది సిట్‌ తాజా దర్యాప్తులో తేటతెల్లమైపోయింది. తితిదేలోని నాటి పెద్దలే లంచాల కోసం దగ్గరుండి మరీ ఈ కల్తీ నెయ్యి సరఫరా సంస్థలకు గేట్లెత్తినట్లు నిగ్గు తేలింది. అప్పటి తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న (ఏ-24) కిలోకు రూ.25 చొప్పున లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేసినట్లు వెల్లడైంది. తర్వాత వారినుంచి పలు విడతలుగా డబ్బు అందుకున్నట్లు తేలింది. లంచాల కోసమే వైకాపా ముఠా ఈ మహాపాపానికి ఒడిగట్టింది.

 
3 hours ago, bezawadaking said:

ardham kaanidi enti ante... veedi paapalaki koduku (<30yrs) poyina inka realization ledu .. vellani manushulu ani koda anakodadu... jantuvulu chaala melu veella kanna pillali medaki evadanna vaste eduru tirugutaayi.

Nindaa muniginodiki there was no chali....

  • Author

ల్తీ నెయ్యి వ్యవహారం.. రెండో రోజు సిట్‌ విచారణకు హాజరైన తితిదే మాజీ ఈవో ధర్మారెడ్డి

 

Eenadu icon
By Andhra Pradesh News TeamPublished : 12 Nov 2025 11:05 IST
Ee
Font size
 
 
 
 
1 min read
 
 

125208091_121125dharmareddy1a.webp

తిరుమల: తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ కొనసాగుతోంది. వైకాపా హయాంలో తితిదే ఈవోగా పనిచేసిన ఏవీ ధర్మారెడ్డి వరుసగా రెండో రోజూ విచారణకు హాజరయ్యారు. మంగళవారం జరిగిన విచారణలో పలు ఆసక్తికర విషయాలను ఆయన వెల్లడించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరింత సమాచారం రాబట్టేందుకు రెండో రోజూ ధర్మారెడ్డిని సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. 

మరోవైపు తిరుమల పరకామణి చోరీ ఘటనపై సిట్‌ విచారణ కొనసాగుతోంది. సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ నేతృత్వంలో అధికారులు విచారిస్తున్నారు. రెండోసారి విచారణకు సీఐ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. పరకామణి చోరీ సమయంలో తిరుమల వన్‌టౌన్‌ పీఎస్‌లో ఆయన పనిచేశారు. విచారణకు పలువురు తితిదే అధికారులు కూడా హాజరయ్యారు.

  • Author

కల్తీ నెయ్యి కేసు.. ధర్మారెడ్డిని రెండోరోజు 8 గంటలు విచారించిన సిట్‌

 

Eenadu icon
By Andhra Pradesh News TeamPublished : 12 Nov 2025 20:31 IST
Ee
Font size
 
 
 
 
1 min read
 
 

125208254_12112025dmr-1a.webp

తిరుపతి: తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దూకుడు పెంచింది. వైకాపా హయాంలో తితిదే ఈవోగా పని చేసిన ఏవీ ధర్మారెడ్డిని రెండో రోజు కూడా 8 గంటలు విచారించింది. తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌ వద్ద సిట్‌ తాత్కాలిక కార్యాలయంలో డీఐజీ మురళీ రాంబా, అధికారుల బృందం ప్రశ్నల వర్షం కురిపించింది. భోలేబాబా డెయిరీ ద్వారా కల్తీ నెయ్యి సరఫరాపై ప్రశ్నించినట్టు సమాచారం.

ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీ నిర్ణయంతో నెయ్యి కొన్నామని ధర్మారెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. కొన్నింటికి ముక్తసరిగా సమాధానాలు ఇవ్వగా, మరికొన్నింటికి మౌనం వహించినట్టు సమాచారం. ఇప్పటికే కల్తీ నెయ్యి కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పొమిల్‌ జైన్, విపిన్‌ జైన్‌లనూ సిట్‌ అధికారులు విచారించారు.

3 hours ago, Mobile GOM said:

Maa redse first class students anukunna. Party vallu antha kuda first class students ithe 

first class students aithe ne join chesukuntaaru ga... koncham ekkuva/takkuva chadivithe anna alochanalu ardham kaavu ga mari

  • Author

: నేను చేసింది తప్పయితే...ఆమోదించిన వారిదీ తప్పేగా

 

Eenadu icon
By Andhra Pradesh News DeskUpdated : 13 Nov 2025 06:22 IST
Ee
Font size
 
 
 
 
5 min read
 
 

నెయ్యి టెండరు నిబంధనల మార్పుపై.. అప్పటి ఛైర్మన్, ఈవో కూడా సంతకాలు చేశారు
సిట్‌ విచారణలో తితిదే మాజీ ఈవో ధర్మారెడ్డి 
రెండోరోజు ఏడున్నర గంటలపాటు సాగిన విచారణ 

AP121125main-3a.webp

ఈనాడు- తిరుపతి, న్యూస్‌టుడే, తిరుపతి (నేరవిభాగం): శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో తితిదే మాజీ ఈవో ఏవీ ధర్మారెడ్డిని రెండోరోజు బుధవారమూ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) ప్రశ్నించింది. ఉదయం 8.55 గంటలకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లోని సిట్‌ కార్యాలయానికి చేరుకున్న ధర్మారెడ్డి మధ్యాహ్న భోజనానికీ బయటకు రాలేదు. హోటల్‌ నుంచి ఆహారం తెప్పించుకున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు విచారణ సాగింది. దాదాపు ఏడున్నర గంటల పాటు ధర్మారెడ్డిని అధికారులు విచారించారు. అవసరమైతే మరోసారి పిలుస్తామని... రావాలని  చెప్పారు.

ధర్మారెడ్డి సాయంత్రం 6.02 గంటలకు కారు ఎక్కి కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. అదనపు ఈవోగా కొనుగోళ్ల కమిటీలో కీలకంగా వ్యవహరించిన మీరు టెండరు నిబంధనల్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందని రెండోరోజు విచారణలో భాగంగా ధర్మారెడ్డిని మరోసారి సిట్‌ అధికారులు ప్రశ్నించారు. ‘అందులోని సభ్యుల అంగీకారంతోనే ఇది జరిగింది. అనంతరం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఆమోదించారు. ఒకవేళ నేను చేసింది తప్పయితే వారూ తప్పు చేసినట్టేగా’ అని ధర్మారెడ్డి అన్నట్లు సమాచారం. ఇందులో మీకు ముడుపులు ముట్టాయా? అని అధికారులు ప్రశ్నించగా... లేదంటూ అడ్డంగా తలూపినట్లు... ఈ మొత్తం వ్యవహారంలో తన పాత్ర నామమాత్రమేనని చెప్పినట్లు తెలిసింది. అంత తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి రాదన్న విషయం అప్పటి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితోపాటు మీకు తెలియదా? తెలిసీ ఎందుకు నిర్ణయం తీసుకున్నారని అధికారులు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా... నిబంధనల మేరకు ఎల్‌1గా వచ్చిన వారికి టెండర్లు అప్పగించినట్లు ధర్మారెడ్డి చెప్పారు. గతేడాది జనవరిలో నిర్వహించిన అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి తిరుమల నుంచి లక్ష లడ్డూలు పంపారని.. వాటికి మాత్రం ప్రత్యేకంగా నాణ్యమైన నెయ్యిని ఎందుకు కొనుగోలు చేశారు? ఇది మీ సొంత నిర్ణయమా? లేక అప్పటి తితిదే ఛైర్మన్, ఇతర వ్యక్తులు ఎవరైనా ఆదేశించారా? అని ఆరా తీయగా ఆ వ్యవహారం గురించి తనకు సమాచారం లేదని, అయోధ్యకు లడ్డూలు పంపించడం వరకు మాత్రమే గుర్తుందని చెప్పినట్లు తెలిసింది.  

AP121125main-3b.webp

విచారణ అనంతరం కారులో వెళ్తున్న ధర్మారెడ్డి

అవన్నీ అధికారులు చూసుకున్నారు: ‘ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా ఓరోగానిక్‌ డెయిరీకి భగవాన్‌పుర్‌లో ఉన్న డెయిరీ విస్తీర్ణం సిట్‌ కార్యాలయంలో సగమైనా లేదు. కనీసం వే బ్రిడ్జి కూడా లేదు. అలాంటి సంస్థకు నెయ్యిని ట్యాంకర్లు, టిన్నుల్లో సరఫరా చేసే కాంట్రాక్టు ఎలా ఇచ్చారు? దాదాపు మూడేళ్లు అక్కడి నుంచి నెయ్యి వచ్చింది. ఆ ప్లాంటును తనిఖీ బృందం చూసిన విషయం వాస్తవమేనా? వారు మీకు అక్కడి పరిస్థితిని నివేదించారా? లేదంటే ఆ సంస్థ ప్రతినిధులు ఇంకెక్కడి డెయిరీనైనా చూపి టెండర్‌ దక్కించుకున్నారా?’ అని అడగ్గా అవన్నీ అధికారులు చూసుకున్నారని ధర్మారెడ్డి బదులిచ్చారు.  

చిన్న అప్పన్న కమీషన్‌ విషయం తెలుసా?

కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి ఏమైనా ఒత్తిడి చేశారా? అని అడగ్గా ధర్మారెడ్డి ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదని సమాచారం. వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్నను దిల్లీలోని ఏపీ భవన్‌లో ఓఎస్డీగా నియమించినప్పుడు అతనికి తిరుమలలో ఏం పని? ఎప్పుడైనా అతను మిమ్మల్ని సంప్రదించారా? భోలేబాబా డెయిరీ ప్రతినిధి పీపీ శ్రీనివాస్‌ను చిన్న అప్పన్న కిలోకు రూ.25 చొప్పున కమీషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేసిన విషయమైనా తెలుసా? అని అడగ్గా లేదని ధర్మారెడ్డి సమాధానమిచ్చారు. ‘కమీషన్‌ ఇవ్వనందునే చిన్న అప్పన్న.. భోలేబాబా డెయిరీ సరఫరా చేస్తున్న నెయ్యి నాణ్యతపై వైవీ సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేయడంతో పాటు ఇతరులతోనూ చేయించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా భోలేబాబా డెయిరీలో తనిఖీలు చేయించారని విచారణలో బహిర్గతమైంది. దీని గురించి సంబంధిత అధికారులు మీకు చెప్పారా?’ అని సిట్‌ అని అడగ్గా గుర్తులేదని ధర్మారెడ్డి బదులిచ్చారు. 

AP121125main-3c.webp

భోజనం విరామ సమయంలో బయటకు వస్తున్న విపిన్‌ జైన్, పొమిల్‌ జైన్‌ 

సంతకాలు చేసినప్పుడు బాధ్యత ఉంటుంది కదా?: తితిదే ధర్మకర్తల మండలి, అధికారులు, కొనుగోళ్ల కమిటీ ఇచ్చిన సిఫారసులను మీరు గుడ్డిగా ఆమోదించాల్సిన అవసరం లేదు కదా? వాటిపై సంతకాలు చేసినప్పుడు మీకు బాధ్యత ఉంటుంది కదా? భక్తుల మనోభావాలు దృష్టిలో ఉంచుకుని వాటిపై చర్చించే అధికారం మీకు ఉంది కదా? అని సిట్‌ అధికారులు గుర్తుచేశారు. ఇందులో మిగతా వారి పాత్ర ఎంత ఉందో తనదీ అంతేనని ధర్మారెడ్డి తెలిపారు. 

పొమిల్‌ జైన్, విపిన్‌ జైన్‌లనూ..: భోలేబాబా డెయిరీ, శ్రీవైష్ణవి డెయిరీల్లో డైరెక్టర్లుగా ఉన్న పొమిల్‌ జైన్, విపిన్‌ జైన్‌లనూ రెండోరోజు ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించింది. కల్తీ నెయ్యి బాగోతం బయటపడిన వెంటనే భగవాన్‌పుర్‌లోని డెయిరీని ఎందుకు మూసేశారని అడిగారు. కొద్దిరోజులకే శ్రీవైష్ణవి డెయిరీలో డైరెక్టర్లుగా రాజీనామా చేసి డ్రైవర్లైన సురేంద్ర సింగ్, సౌరభ్‌ కశ్యప్‌లను ఎందుకు నియమించారన్నారు. వరుసగా విచారణ జరుగుతున్న నేపథ్యంలో కొంతకాలం డెయిరీని మూసేశామని వారు జవాబిచ్చారు. మధ్యాహ్నం 1.35 గంటలకు భోజన విరామం తీసుకున్నారు. తర్వాత పొమిల్‌ జైన్, విపిన్‌ జైన్‌లతో కలిపి ధర్మారెడ్డిని విచారించారని తెలిసింది. కొనుగోళ్ల కమిటీ సభ్యులతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ధర్మారెడ్డి మీకు సహకరించారా? డబ్బులు ఏమైనా డిమాండ్‌ చేశారా? అని అడగ్గా వారు బదులివ్వలేదు. వారితో తాను ఎప్పుడూ మాట్లాడలేదని ధర్మారెడ్డి పేర్కొన్నారు.  

ప్రభుత్వం మారాక టెండరు విధి విధానాల్లో మార్పు సహజం: రాత్రికి కారులో ఇంటికి వెళ్తూ ధర్మారెడ్డి.. ‘ఈటీవీ’ ప్రతినిధితో మాట్లాడారు. ‘సిట్‌ విచారణలో భాగంగా... గతంలో తితిదేలో పనిచేసిన అధికారులను పిలిచారు. ఆ క్రమంలోనే నన్నూ రమ్మన్నారు. వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పా. విచారణకు సహకరించా. ప్రభుత్వం మారాక టెండరు విధివిధానాల్లో మార్పులు జరగడం సహజం. ఇప్పుడూ మార్చారు. నెయ్యి కొనుగోలులో అవినీతి చేయాల్సిన అవసరం లేదు. భోలేబాబా డెయిరీ ఎల్‌-1గా రావడంతో నెయ్యి సరఫరా కాంట్రాక్టును అప్పగించాం. అప్రూవర్‌గా మారినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవం. భక్తుల మనోభావాలు దెబ్బతీయవద్దు’ అని ఆయన చెప్పారు.


పోటు కార్మికుల ఫిర్యాదును ఎందుకు పట్టించుకోలేదు?

‘లడ్డూ నాణ్యతపై అప్పట్లోనే భక్తులు అసంతృప్తి వ్యక్తంచేశారు. సరఫరా అవుతోన్న నెయ్యి నాణ్యంగా లేదని పోటు కార్మికులూ పలుమార్లు మీకు ఫిర్యాదు చేశారు కదా? అయినా నాణ్యత లేని నెయ్యి సరఫరా కొనసాగింది. ఐదేళ్లపాటు ఇలానే జరిగినా దీనిపై ఎందుకు దృష్టి సారించలేదు?’ అని ధర్మారెడ్డిని సిట్‌ అధికారులు అడిగారు. పోటు కార్మికులు కొన్నిసార్లు విన్నవించిన విషయం వాస్తవమేనని.. హైకమాండ్‌ (ఉన్నతస్థాయి) ఒత్తిళ్ల కారణంగా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేకపోయానని ఆయన చెప్పినట్లు తెలిసింది.

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.