Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Investments Andhra Pradesh

Featured Replies

  • Replies 225
  • Views 11.4k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

On 11/11/2026 at 3:38 AM, Yaswanth526 said:

andhaega mari 2004 lo pettubadulu thaeledha ? 2029 lo thaeledha ?

assala pettubadulaki, ennikallo gelevataaniki samabnadham ledhu, unte 2004 taruvaatha kaneesam inko 10 aellu TDP ae nae undaali.

Seema lo baagnae anti ayyindhi, utharandra, matham bidallo.

25 రకాల పార్కులు.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు

Eenadu icon

By Andhra Pradesh News DeskUpdated : 16 Nov 2026 05:29 IST

Ee

Font size

6 min read

gg-pref.gif

4.47 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
పారిశ్రామికాభివృద్ధికి సర్కారు కసరత్తు

151126APMAIN-4A.webp

ఈనాడు- అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు 25 సెక్టోరియల్‌ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిద్వారా సుమారు రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని భావిస్తోంది. కొన్ని పార్కుల ఏర్పాటుకు ఇప్పటికే చర్యలు చేపట్టగా.. మిగిలిన వాటి స్థాపనకు అవసరమైన భూములను సేకరిస్తోంది.

శ్రీకాకుళం జిల్లాలో కెమికల్‌ పార్కు

మూలపేటలో నిర్మాణంలో ఉన్న పోర్టుకు అనుసంధానంగా రూ.6,200 కోట్లతో 2,050 ఎకరాల్లో కెమికల్‌ పార్కు ఏర్పాటుచేయనుంది. కెమికల్, ప్రాసెస్‌ ఇంజినీర్లు, ప్లాంటు ఆపరేటర్లు, షిఫ్ట్‌ టెక్నీషియన్లు, ల్యాబ్‌ కెమిస్ట్‌లు, క్వాలిటీ కంట్రోల్‌ అనలిస్ట్‌లు, ఫైర్‌ సేఫ్టీ ఆఫీసర్లు, ఎలక్ట్రీషియన్లు సుమారు 21,500 మందికి ఉపాధి లభించనుంది.

విశాఖపట్నంలో మెడ్‌టెక్‌ తయారీ పార్కు

నడుపూరు వద్ద రూ.3 వేల కోట్లతో 405 ఎకరాల్లో మెడ్‌టెక్‌ పార్కును నిర్మించనుంది. బయోమెడికల్‌ ఇంజినీర్లు, ఎలక్ట్రానిక్‌ ఇంజినీర్లు, క్లీన్‌ రూమ్‌ అసెంబ్లింగ్‌ టెక్నీషియన్లు, మెడికల్‌ డివైజ్‌ మెషీన్‌ ఆపరేటర్లు, టెస్టింగ్, స్టెరిలైజేషన్‌ టెక్నీషియన్లు సుమారు 9 వేల మందికి ఉపాధి దొరకనుంది. 

కాకినాడలో ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ తయారీ పార్కు

కాకినాడ సెజ్‌లో రూ.25 వేల కోట్లతో 1,000 ఎకరాల్లో ఈ పార్కు ఏర్పాటుచేయనుంది.  ప్రాసెస్, కెమికల్‌ ఇంజినీర్లు, మెకానికల్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీర్లు, వెల్డర్లు, పైప్‌ ఫిట్టర్లు, హెచ్‌ఎస్‌ఈ ఆఫీసర్లు, టర్మినల్, లాజిస్టిక్‌ ఆపరేటర్లు 11,800 మందికి ఉపాధికి లభించనుంది.

పల్నాడులో క్వాంటమ్‌ కంప్యూటింగ్, టెక్స్‌టైల్‌ పార్కులు

లింగాపురం వద్ద రూ.2,417 కోట్లతో 252 ఎకరాల్లో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ పార్కును నిర్మించనుంది. దక్షిణాసియాలో మొదటి ఐబీఎం క్వాంటమ్‌ సిస్టమ్‌ ఇదే కానుంది. క్వాంటమ్‌ అల్గారిథమ్స్‌/సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ అండ్‌ ప్రాసెసర్‌ ఇంజినీర్లు, క్రయోజెనిక్స్, ఫొటోనిక్స్, పోస్ట్‌-క్వాంటమ్‌ క్రిప్టోగ్రఫీ రంగాల్లో 3,198 మందికి ఉపాధి దొరకనుంది.

వెల్దుర్తి వద్ద రూ.2,500 కోట్లతో 500 ఎకరాల్లో మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుచేయనుంది. వీవింగ్‌ టెక్నీషియన్లు, డైయింగ్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ కెమిస్ట్‌లు, కుట్టుమిషన్‌ ఆపరేటర్లు, టెక్స్‌టైల్‌ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ మర్చంటైజర్లు 28,700 మందికి ఉపాధి లభించనుంది.

ప్రకాశంలో సోలార్‌ పీవీ మాడ్యూల్‌ తయారీ పార్కు

కుందూరు వద్ద రూ.8 వేల కోట్లతో 1,037 ఎకరాల్లో పీవీ మాడ్యూల్‌ తయారీ పార్కును నిర్మించనుంది. ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్లు, సోలార్‌ మాడ్యూల్స్‌ అండ్‌ సెల్‌ లైన్‌ టెక్నీషియన్లు, బ్యాటరీ అసెబ్లింగ్‌ ఆపరేటర్లు తదితర రంగాల్లో 12 వేల మందికి ఉపాధి దొరకనుంది.

కర్నూలులో డ్రోన్‌ సిటీ

ఓర్వకల్లులో రూ.2,540 కోట్లతో 600 ఎకరాల్లో డ్రోన్‌ సిటీని నిర్మించనుంది. ఏరోనాటికల్‌ ఇంజినీర్లు, ఎంబెడెడ్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్లు, డీజీసీఏ ధ్రువీకరించిన డ్రోన్‌ పైలెట్లు, అసెంబ్లీ టెక్నీషియన్లు, సాఫ్ట్‌వేర్‌ అండ్‌ ఏఐ డెవలపర్లు 7,640 మందికి ఉపాధి లభించనుంది.


అనకాపల్లిలో ఆరు పార్కులు

  • కె.కోటపాడు సమీపంలో రూ.7,660 కోట్లతో 1,000 ఎకరాల్లో స్టీల్‌ డౌన్‌స్ట్రీమ్‌ ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుచేయనుంది. వెల్డర్లు, ఫ్యాబ్రికేటర్లు, ఫిట్టర్, మెషినిస్ట్‌లు, మెకానికల్, మెటలర్జికల్‌ ఇంజినీర్లు, సీఎన్‌సీ, ప్రెస్‌లైన్‌ ఆపరేటర్స్, క్రేన్‌ ఆపరేటర్లు 19,150 మందికి ఉపాధి లభించనుంది.

  • రూ.2.15 లక్షల కోట్ల పెట్టుబడులతో 1,150 ఎకరాల్లో ఏఐ డేటా పార్కును నిర్మించనుంది. దీనిద్వారా డేటా సెంటర్‌/క్లౌడ్, పవర్‌ సిస్టమ్స్, హెచ్‌వీఏసీ/కూలింగ్, నెట్‌వర్క్‌/సైబర్‌ సెక్యూరిటీ, ఆపరేటర్స్‌ టెక్నీషియన్లు 6,240 మందికి ఉపాధి దొరకనుంది.

  • నక్కపల్లి వద్ద రూ.11,542 కోట్లతో 2,002 ఎకరాల్లో బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటుచేయనుంది. ఫార్మా కెమిసిస్ట్స్, కెమికల్‌ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్, రెగ్యులేటరీ ఎఫైర్స్, ఇతర టెక్నీషియన్లు 24,367 మందికి ఉపాధి లభించనుంది.

  • మాకవరపాలెంలో రూ.2,250 కోట్లతో 500 ఎకరాల్లో ఆర్గానిక్‌ ఫుడ్‌ పార్కు నిర్మించనుంది. ఫుడ్‌ టెక్నాలజిస్ట్‌లు, క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ ల్యాబ్‌ ఎనలిస్టులు, ప్రాసెసింగ్‌ లైన్‌ ఆపరేటర్లు, కోల్డ్‌ చైన్‌ టెక్నీషియన్లు, ప్యాకింగ్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ సిబ్బంది 15,666 మందికి ఉపాధి దొరకనుంది. 

  • నక్కపల్లిలో రూ.1,500 కోట్లతో 581 ఎకరాల్లో టాయ్‌ పార్కు ఏర్పాటుచేయనుంది. కుట్టుమిషన్లు, ఆపరేటర్లు, టాయ్‌ అండ్‌ ప్రొడక్ట్‌ డిజైనర్లు, మౌల్డ్, టూల్‌ మేకర్స్, టెస్టింగ్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌ టెక్నీషియన్లు, ప్యాకింగ్, ఎక్స్‌పోర్ట్‌ లాజిస్టిక్‌ రంగాల్లో 30 వేల మందికి ఉపాధి లభించనుంది.

  • పైడిపాల సమీపంలో రూ.15 వేల కోట్లతో 1,000 ఎకరాల్లో రేర్‌ ఎర్త్‌ అండ్‌ క్రిటికల్‌ మినరల్‌ పార్కు నిర్మించనుంది. మెటలర్జిస్ట్‌లు, కెమికల్‌ ఇంజినీర్లు, సాల్వెంట్‌-ఎక్స్‌ట్రాక్షన్‌ ప్లాంట్‌ ఆపరేటర్లు, రేడియేషన్‌-సేఫ్టీ ఆఫీసర్లు, ల్యాబ్‌ అనలిస్టులు, మ్యాగ్నెట్‌ ప్రాసెస్‌ టెక్నీషియన్లు 10 వేల మందికి ఉపాధి దొరకనుంది.


శ్రీసత్యసాయి జిల్లాలో రోబోటిక్స్, ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ పార్కులు

ఈనాడు- అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు 25 సెక్టోరియల్‌ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లిలో రూ.3,536 కోట్లతో 300 ఎకరాల్లో రోబోటిక్స్‌ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ పార్కు ఏర్పాటుచేయనుంది. మెకట్రానిక్స్‌ అండ్‌ రోబోటిక్స్‌ ఇంజినీర్లు, ఎంబెడెడ్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు, సీఎన్‌జీ మెకానిక్‌లు, ఎలక్ట్రానిక్స్‌ అసెంబ్లీ టెక్నీషియన్లు, టెస్ట్‌ అండ్‌ ఇంటిగ్రేషన్‌ ఇంజినీర్లు 18,750 మందికి ఉపాధి దొరకనుంది.

ఇదే జిల్లా టేకులోడు వద్ద రూ.1,550 కోట్లతో 500 ఎకరాల్లో ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ పార్కును నిర్మించనుంది. ఏరోస్పేస్‌ ఇంజినీర్లు, ప్రెసిషన్‌ మెకానిక్‌లు, ఏవియానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్లు, క్వాలిటీ అండ్‌ సర్టిఫికేషన్, ఎంఆర్‌ఓ (మెయిన్‌టెనెన్స్, రిపేర్లు, ఓవర్‌హాలింగ్‌) టెక్నీషియన్లు 3,720 మందికి ఉపాధి లభించనుంది.

కడపలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ క్లస్టర్‌ (వైఎస్‌ఆర్‌ ఈఎంసీ)

కొప్పర్తిలో రూ.10వేల కోట్లతో 801 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్‌ తయారీ క్లస్టర్‌ (వైఎస్‌ఆర్‌ ఈఎంసీ)ని ఏర్పాటుచేయనుంది. ఎస్‌ఎంటీ లైన్‌ ఆపరేటర్లు, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్లు, అసెంబ్లీ టెక్నీషియన్లు, టెస్టింగ్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌ సిబ్బంది, సప్లయ్‌ చైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌ మేనేజర్‌ రంగాల్లో లక్ష మందికి ఉపాధి దొరకనుంది.

తిరుపతిలో నాలుగు పార్కులు

  • రౌతుసురమాలలో రూ.11,065 కోట్లతో 4,918 ఎకరాల్లో స్పేస్‌ సిటీని నిర్మించనుంది. ఏరోస్పేస్, మెకానికల్‌ ఇంజినీర్లు, ప్రొపల్షన్‌ స్పెషలిస్ట్‌లు, కాంపోజిట్‌ అండ్‌ ప్రెసిషన్‌ మెషినిస్ట్‌లు, ఎవియానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్లు, టెస్ట్‌ అండ్‌ క్యూఏ ఇంజినీర్లు 8,300 మందికి ఉపాధి లభించనుంది.

  • కడూరు వద్ద రూ.13,287 కోట్లతో 357 ఎకరాల్లో కొరియన్‌ ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుచేయనుంది. ఆటోమోటివ్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీర్లు, ఎలక్ట్రానిక్స్‌ టెక్నీషియన్లు, ఇంజక్షన్‌-మౌల్డింగ్‌ ఆపరేటర్లు, క్వాలిటీ ఇంజినీర్లు, కొరియన్‌ భాష సంధానకర్తలు 33,231 మంది ఉపాధి దొరకనుంది.

  • రెడ్డిపల్లెలో రూ.20వేల కోట్లతో 495 ఎకరాల్లో సెమీకండక్టర్‌ తయారీ పార్కును నిర్మించనుంది. వీఎల్‌ఎస్‌ఐ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్స్, క్లీన్‌రూమ్‌ టెక్నీషియన్స్, ప్రాసెస్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజినీర్స్, ఎక్విప్‌మెంట్‌ మెయిన్‌టెనెన్స్‌ టెక్నీషియన్స్, టెస్ట్‌ అండ్‌ ప్యాకింగ్‌ ఆపరేటర్లు 12,500 మందికి ఉపాధి లభించనుంది.

  • మనవల్లిలో రూ.1,500 కోట్లతో 500 ఎకరాల్లో నిర్మాణ రంగానికి చెందిన ఎక్విప్‌మెంట్‌ పార్కు ఏర్పాటుచేయనుంది. వెల్డర్లు, ఫ్యాబ్రికేటర్లు, హైడ్రాలిక్స్‌ టెక్నీషియన్లు, మెకానికల్‌ ఇంజినీర్లు, అసెంబ్లీ ఫిట్టర్స్, ఫౌండ్రీ అండ్‌ క్యాస్టింగ్‌ వర్కర్స్‌ 6 వేల మందికి ఉపాధి దొరకనుంది.

నెల్లూరులోనూ నాలుగు పార్కులు

  • క్రిస్‌ సిటీలో రూ.4వేల కోట్లతో 200 ఎకరాల్లో స్పోర్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ పార్కు నిర్మించనుంది. ఫుట్‌వేర్‌ స్టిచ్చింగ్‌ అండ్‌ లాస్టింగ్‌ ఆపరేటర్స్, స్పోర్ట్స్‌ దుస్తులు కుట్టే టైలర్లు, ప్రొడక్ట్‌ డిజైనర్లు, ఫినిషింగ్‌ అండ్‌ పాలిషింగ్‌ టెక్నీషియన్లు, ఎక్స్‌పోర్ట్‌ ప్యాకర్స్‌ 20 వేల మందికి ఉపాధి లభించనుంది. 

  • కొండగుంటలో రూ.4,700 కోట్లతో 1,006 ఎకరాల్లో ఫర్నిచర్‌ పార్కు ఏర్పాటుచేయనుంది. కార్పెంటర్లు, సీఎన్‌సీ ఆపరేటర్లు, ఫర్నిచర్‌ డిజైనర్లు, ఫినిషింగ్‌ అండ్‌ పాలిషింగ్‌ టెక్నీషియన్స్, ఎక్స్‌పోర్ట్‌ ప్యాకర్స్‌ 15 వేల మందికి ఉపాధి దొరకనుంది. 

  • ఆనేమడుగులో రూ.20వేల కోట్లతో 907 ఎకరాల్లో పెట్రోకెమికల్‌ పార్కు నిర్మించనుంది. పాలిమర్‌ అండ్‌ కెమికల్‌ ఇంజినీర్లు, ల్యాబ్‌ కెమిస్ట్‌లు, ఇనుస్ట్రుమెంటేషన్‌ టెక్నీషియన్స్, హెచ్‌ఎస్‌ఈ అధికారులు

18 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి.

దుత్తలూరులో రూ.3 వేల కోట్లతో 2,350 ఎకరాల్లో అమ్యునేషన్‌ పార్కు ఏర్పాటుచేయనుంది. కెమికల్‌ అండ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ ఇంజినీర్లు, మెకానికల్‌ అండ్‌ మెటలర్జికల్‌ ఇంజినీర్లు, ఫిల్లింగ్‌ అండ్‌ అసెంబ్లీ ఆపరేటర్స్, క్వాలిటీ అండ్‌ పీఈఎస్‌ఓ స్పెషలిస్ట్‌లు 3,300 మందికి ఉపాధి దొరకనుంది. 


ఐదు జిల్లాల్లో ఉద్యాన పంటల పార్కులు

అనంతపురం, శ్రీసత్యసాయి, మార్కాపురం, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో రూ.2,500 కోట్లతో 500 చొప్పున ఎకరాల్లో ఉద్యాన పంటల పార్కులు ఏర్పాటుచేయనున్నారు. ఫుడ్‌ టెక్నాలజిస్ట్స్, హార్టికల్చరిస్ట్స్, టిష్యూ కల్చర్‌ టెక్నీషియన్స్, కోల్డ్‌ చైన్‌ ఆపరేటర్స్, పార్క్‌ హౌస్‌ వర్కర్స్, క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్‌ ఎనలిస్ట్‌లు 8,750 మందికి ఉపాధి లభించనుంది.


Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.