Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Investments Andhra Pradesh

Featured Replies

  • Replies 163
  • Views 7.9k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

ఇథనాల్‌ తయారీకి ప్రత్యేక పాలసీ

Eenadu icon

By Andhra Pradesh News DeskPublished : 08 Jul 2026 04:59 IST

Ee

Font size

4 min read

gg-pref.gif

సంపద సృష్టి.. సర్క్యులర్‌ ఎకానమీ.. ప్రభుత్వ విధానం
ఎస్‌ఐపీబీ సమావేశంలో సీఎం చంద్రబాబు 
రూ.9,076 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
తద్వారా 10,531 మందికి ఉపాధి 

AP070726MAIN-5a_1.webp

ఎస్‌ఐపీబీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో మంత్రులు అచ్చెన్నాయుడు, పి.నారాయణ, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, సీఎస్‌ సాయిప్రసాద్‌ తదితరులు

ఈనాడు, అమరావతి: పెట్రోల్, డీజిల్‌లో కలిపేందుకు భారీగా ఇథనాల్‌ అవసరమని.. ఇథనాల్, మీథేన్, ఏవియేషన్‌ ఫ్యూయల్‌ పాలసీని సిద్ధం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సంపద సృష్టి, సర్క్యులర్‌ ఎకానమీ అనేది ప్రభుత్వ విధానమని అన్నారు. సచివాలయంలో 19వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్‌ఐపీబీ) సమావేశం సీఎం అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. సమావేశంలో రూ.9,076.11 కోట్ల పెట్టుబడులను బోర్డు ఆమోదించింది. తద్వారా 10,531 మందికి ఉపాధి లభించనుంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘భవిష్యత్తులో పెరిగే ఇథనాల్‌ డిమాండ్‌ను అందిపుచ్చుకోవాలి. ఇథనాల్‌ బ్లెండింగ్‌ను 40% పెంచితే.. మొక్కజొన్న రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఇథనాల్‌ తయారీ రంగంలో వచ్చే అన్ని పెట్టుబడులనూ ప్రోత్సహించాలి’ అని సూచించారు. రెండేళ్లలో 339 ప్రాజెక్టులను ఆమోదించామని.. రూ.11,86,271 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, 10,41,821 మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థలు ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. 

100 ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్ల ఏర్పాటు లక్ష్యం

పర్యాటక రంగంలో అపార అవకాశాలున్నాయని సీఎం పేర్కొన్నారు. ‘తిమ్మమ్మ మర్రిమాను సహా రాష్ట్రవ్యాప్తంగా 100 పర్యాటక ప్రాంతాల దగ్గర ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలి. పోలవరం, దిండి, గండికోట, కంభం చెరువు, లంబసింగి తదితర ప్రాంతాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి. లంబసింగి, అరకు సమీపంలో రిసార్టుల ఏర్పాటుకు జిందాల్‌ సంస్థ ఆసక్తి వ్యక్తంచేస్తోంది. ఏటికొప్పాక, కొండపల్లి, ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడ, పొందూరు కళారూపాల్ని తీర్చిదిద్దాలి. సూర్యలంక బీచ్‌ మాస్టర్‌ ప్లాన్‌ను త్వరగా రూపొందించాలి. కుప్పంలో కంగుంది కోట, చిత్తూరు జిల్లాలో ఎలిఫెంట్‌ సఫారీలను అభివృద్ధి చేయాలి. పర్యాటక రంగం నుంచి జీఎస్‌డీపీ వాటా పెరిగేలా చూడాలి’ అని చంద్రబాబు ఆదేశించారు. పర్యాటక అభివృద్ధికి అనుగుణంగా హోటల్‌ గదులు పెద్దఎత్తున అందుబాటులోకి వస్తున్నాయని.. 2024లో 4,390 గదులు ఉంటే.. రెండేళ్లలో 9,364 గదుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. పునరుత్పాదక విద్యుత్‌ రంగానికి సంబంధించి సోలార్‌ సెల్స్‌ తయారీ పరిశ్రమలను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ‘రైల్వే టెర్మినళ్లను ఎంఎస్‌ఎంఈ పార్కులతో అనుసంధానించాలి. కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమలు.. హరిత విద్యుత్‌ను వినియోగించేలా చూడాలి. బీపీసీఎల్, యుద్ధ విమానాల ప్రాజెక్టులను త్వరగా గ్రౌండింగ్‌ చేయాలి’ అని సూచించారు. 


ఎస్‌ఐపీబీ ఆమోదించిన పెట్టుబడులివీ.. 

  • వెల్‌కమ్‌ హోటల్స్‌(ఐటీసీ గ్రూప్‌) నెల్లూరు జిల్లాలో డీఎస్‌ఆర్‌ హాస్పిటాలిటీ సర్వీసెస్‌ ఫోర్‌ స్టార్‌ హోటల్‌ ఏర్పాటుకు ప్రతిపాదన. రూ.139.92 కోట్ల పెట్టుబడి.. 180 మందికి ఉపాధి.

  • వైఎస్సార్‌ కడప జిల్లాలో రూ.52.10 కోట్ల పెట్టుబడితో మాధవి లీజర్‌ అండ్‌ స్టేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ త్రీ స్టార్‌ హోటల్‌ ఏర్పాటుకు ప్రతిపాదన. 400 మందికి ఉపాధి.

  • వైఎస్సార్‌ కడప జిల్లాలో శ్రీనివాసం ఎమ్యూజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.68.69 కోట్ల పెట్టుబడితో ఎమ్యూజ్‌మెంట్‌ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదన. 690 మందికి ఉపాధి.

  • విజయవాడలో వజ్ర హాస్పిటాలిటీ ఎల్‌ఎల్‌పీ రూ.62.40 కోట్ల పెట్టుబడితో హోటల్, ఎగ్జిబిషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రతిపాదన. తద్వారా 450 మందికి ఉపాధి.

  • తిరుపతి జిల్లా సత్యవేడు మండలం చిన్నఎట్టిపాకంలో రూ.255 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్స్‌ పార్కు ఏర్పాటు.. 400 మందికి ఉపాధి.  

  • అనకాపల్లి జిల్లా పరవాడ ఇండస్ట్రియల్‌ పార్కులో అక్షల్‌ గ్రీన్‌టెడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.1,600 కోట్ల పెట్టుబడితో సోలార్‌ సెల్‌ అండ్‌ మాడ్యూల్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ప్రతిపాదన. 750 మందికి ఉపాధి. 

  • బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌లో బెర్రి అల్లాయీస్‌ లిమిటెడ్‌ రూ.1,200 కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్‌ మాంగనీస్‌ సెంటర్, డీఆర్‌ఐ అండ్‌ కార్బన్‌ పేస్ట్‌ ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదన. 831 మందికి ఉపాధి. 

  • కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, ఎర్రగుడి గ్రామాల్లో స్వర్ణగిరి గోల్డ్‌మైన్‌ ప్రాజెక్టు ఏర్పాటు కోసం జియో మైసూర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.689 కోట్ల పెట్టుబడి. తద్వారా 1,750 మందికి ఉపాధి. 

  • విశాఖపట్నం జిల్లా ఆనందపురంలో రూ.1,008 కోట్ల పెట్టుబడితో ఈకోబాక్స్‌ ఇండస్ట్రియల్‌ ఎసెట్‌-4 ప్రైవేట్‌ లిమిటెడ్‌(గూగుల్‌ వేర్‌హౌస్‌ పార్ట్‌నర్‌) లాజిస్టిక్స్‌ అడ్‌ లైట్‌ ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదన. 5,000 మందికి ఉపాధి. 

  • విశాఖపట్నంలోని కాపులుప్పాడ దగ్గర అదానీ ఫౌండేషన్‌ రూ.2,200 కోట్ల పెట్టుబడితో ప్రీమియర్‌ స్కిల్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్‌ అండ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఎకో సిస్టం ఏర్పాటు.

  • తిరుపతి జిల్లా శ్రీసిటీలో మొండెలేజ్‌ ఇండియా ఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.1,801 కోట్ల పెట్టుబడితో ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ప్రతిపాదన.

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.