April 7Apr 7 రూ.39,436 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదంBy Andhra Pradesh News TeamPublished : 07 Apr 2026 16:34 ISTEeFont size1 min readఅమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన 16వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 1,11,278 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. అమరావతి క్వాంటం వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహక బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీపై ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు.సాగు వ్యర్థాల సద్వినియోగం కోసం యూనిట్ల ఏర్పాటుకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఆధునిక భద్రతా ప్రమాణాలతో పారిశ్రామిక ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాయలసీమను సౌరవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 325 గిగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రానున్న రోజుల్లో సౌరవిద్యుత్ ఉత్పత్తి మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని, సౌరవిద్యుత్ సామర్థ్యానికి అనుగుణంగా పెట్టుబడులు ఆకర్షించాలని సీఎం సూచించారు.
Create an account or sign in to comment