August 25, 2025Aug 25 Author : కుప్పంలోకి ప్రవేశించిన కృష్ణా జలాలు By Andhra Pradesh News DeskPublished : 25 Aug 2025 03:43 IST Ee Font size 2 min read పండుగ వాతావరణంలో రైతుల నీరాజనం 30న సీఎం చేతుల మీదుగా జలహారతి హంద్రీ-నీవా కాలువలో పసుపుమయమైన కృష్ణా జలాలు కుప్పం పట్టణం, శాంతిపురం, న్యూస్‌టుడే: పాతకాలం నాటి చెరువులు అడుగంటి పోయాయి. ఏళ్లుగా నీరు చేరక అనవాళ్లు కోల్పోయాయి. కొత్తగా ఎలాంటి సాగునీటి ప్రాజెక్టులూ రాలేదు. వ్యవసాయమంతా వర్షాధారమే. పంట వేయాలంటే వరుణుడి కరుణ తప్ప, మరో మార్గం లేదు. ఈ క్షామ పరిస్థితుల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం ప్రాంతానికి రెండు దశాబ్దాల క్రితం బిందు, తుంపర సేద్యాన్ని పరిచయం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. వ్యవసాయంలో కొత్త పంథాకు శ్రీకారం చుట్టారు. సాగును మరింత విస్తరించే క్రమంలో కృష్ణా జలాలను హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ద్వారా కుప్పానికి తీసుకువచ్చే బృహత్తర ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. కృష్ణా జలాలు ఆదివారం కుప్పం నియోజకవర్గానికి చేరుకున్నాయి. శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లె వద్ద ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం, పీఎంకే ఉడా ఛైర్మన్ డాక్టర్ బీఆర్ సురేశ్‌బాబు తదితరులు హంద్రీ-నీవా కాలవలోకి దిగి కృష్ణమ్మకు సారెను సమర్పించారు. నవంబరు నాటికి కుప్పానికి కృష్ణమ్మ నీటిని తరలిస్తామని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి.. మూణ్నెల్ల ముందే హామీ నెరవేర్చారని తెలిపారు. కరవు తీరేలా.. కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా 554 చెరువులున్నాయి. దశాబ్దాలుగా తీవ్ర వర్షాభావంతో అధిక శాతం చెరువులు నీరు లేకుండా పోయాయి. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు సైతం వట్టిపోయాయి. గుడుపల్లె మండలంలో 1,300 అడుగుల లోతుకు బోరు వేస్తే తప్ప, నీరు లభించని పరిస్థితి. ఈ దఫా కర్ణాటక సరిహద్దుల్లోనూ వర్షాలు అంతగా కురవక పోవడంతో కరవు ఛాయలు కమ్ముకుంటున్నాయి. ఈ తరుణంలో హంద్రీ-నీవా జలాలు తరలించడంపై రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 30న ముఖ్యమంత్రి కుప్పం పర్యటనలో భాగంగా పట్టణంలోని పరమసముద్రం చెరువులోకి హంద్రీ-నీవా జలాలు విడుదల చేస్తారని కుప్పం ప్రాంతీయాభివృద్ధి సంస్థ పీడీ వికాస్ మర్మత్ తెలిపారు. జలహారతి కార్యక్రమాన్ని చరిత్రాత్మక వేడుకగా నిర్వహిస్తామని చెప్పారు.
September 9, 2025Sep 9 On 9/3/2025 at 8:35 AM, sonykongara said: Inka enni rojulu chestaro, free schemes delay chesi small projects ani complete cheyyali
Create an account or sign in to comment