Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

AP Irrigation projects

Featured Replies

  • Replies 255
  • Views 13.8k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

2 hours ago, sonykongara said:

Image

ee veligonda, dasaabdhaalu tharabadi nadusthindhi, eppudu poorthi chestharo, assala chestharo ledho mari.

Paapam, Prakaasam jilla kia edho cheyyaru aento.... aa asian pulp and paper ani oka 25 vaela kotla company thaestha nnaru 2018 /2019 lo, noukaasrayam katti adhanna thestha baagundu

Edited by AndhraBullodu

  • Author

హంద్రీ నీవా నుంచి సాగునీరు

 

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 17 Jul 2025 05:15 IST
Ee
Font size
 
 
 
 
1 min read
 
 

తొలిసారి వినియోగంలోకి రానున్న 12 పంపులు
నేడు నీరు విడుదల చేయనున్న సీఎం

AP160725main-10a.webp

మల్యాల ఎత్తిపోతల పథకం

ఈనాడు, కర్నూలు; న్యూస్‌టుడే, నందికొట్కూరు: రాయలసీమ జిల్లాలోని 6.02 లక్షల ఎకరాలకు సాగు నీరు, 33 లక్షల జనాభాకు తాగు నీరు ఇవ్వాలన్న లక్ష్యంతో నిర్మించిన హంద్రీ నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) ప్రాజెక్టు నుంచి పుష్కలంగా జలాలు రానున్నాయి. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కాలువకు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం నీటిని విడుదల చేయనున్నారు. తదనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. కాలువలనూ సిద్ధం చేశారు. నంద్యాల జిల్లా మల్యాల గ్రామం దగ్గర కృష్ణా నది నుంచి నీటిని ఎత్తిపోసి రాయలసీమ నీటి అవసరాలు తీర్చేలా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ రూపొందించారు. ఇందుకు 554 కి.మీ.ల దూరం కాలువ తవ్వారు. మల్యాల ఎత్తిపోతల పథకానికి 12 పంపులు ఉన్నా ఇప్పటి వరకు 6 పంపులే వినియోగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ను లక్ష్యం నెరవేరేలా వంద రోజుల్లోనే రూ.696 కోట్లతో విస్తరణ పనులు చేపట్టింది. 93% పనులు చేసింది. ఎత్తిపోతల పథకం పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు 12 భారీ మోటార్లు, పంపులను ఏర్పాటు చేసింది. దశల వారీగా అన్ని పంపుల నుంచి నీటిని విడుదల చేయాలని అధికారులు ప్రణాళిక వేశారు. గురువారం ప్రాజెక్టులోని 9వ నంబరు పంపు నుంచి సీఎం నీటిని విడుదల చేస్తారు. తర్వాత మరో పంపు నుంచి వదులుతారు. 19వ తేదీ నాటికి 12 పంపులు పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయి. అప్పటి నుంచి కాలువలో రోజుకు 3,850 క్యూసెక్కుల నీరు ప్రవహించనుంది.

  • 2 weeks later...
  • Author

హంద్రీనీవా కాలువ రెండో దశ నీటి విడుదలకు సర్వం సిద్ధమవుతోంది. తొలి దశలో..... హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు పూర్తవడంతో... జూలై 17న సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా మల్యాల వద్ద నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ నీరు కర్నూలు జిల్లా మీదుగా జీడిపల్లి రిజర్వాయర్ కు చేరుతోంది. రెండో దశలో జీడిపల్లి నుంచి... 400వ కిలోమీటర్ వరకూ కాలువ లైనింగ్ పనులు పూర్తవడంతో.. 2 రోజుల్లో చిత్తూరు జిల్లాకు నీటి విడుదల చేయనున్నారు.

  • Author

irri.jpg

పుష్కర.. ఆయకట్టుకు ఆసరా

 

Eenadu icon
By Andhra Pradesh Dist. DeskPublished : 22 Aug 2025 03:53 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

రూ.52 కోట్లతో మరమ్మతులకు మంత్రివర్గం ఆమోదం

22825eag-7a.webp

తాళ్లూరులోని పుష్కర ఎత్తిపోతల పథకం..

ఈనాడు, కాకినాడ, న్యూస్‌టుడే, గండేపల్లి: జిల్లాలో మెట్ట ఆయకట్టుకు కీలకమైన పుష్కర ఎత్తిపోతల పథకానికి సంబంధించి రైతులకు తీపి కబురు అందింది. గత వైకాపా పాలకుల నిర్లక్ష్యంతో మూలకు చేరిన ఈ పథకాన్ని పట్టాలెక్కించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 31 వేల ఎకరాలకు మేలు జరిగేలా అడుగులు వేసింది. రూ.52 కోట్ల అంచనాతో చేపట్టే కొత్త పైప్‌లైన్‌కు రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. త్వరలో కార్యరూపంలోకి తెచ్చి ఆయకట్టు రైతులకు సాగునీటి భద్రతను కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. గండేపల్లి మండలం తాళ్లూరు శివారు పోలవరం కాలువ గట్టుపై తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం ఉంది. దీని పైపులైన్లు పాడైపోవడంతో గత మూడు ఖరీఫ్‌ సీజన్లలో ఆయకట్టు రైతులకు నీరు అందించలేకపోయారు. గండేపల్లి, జగ్గంపేట మండలాల పరిధిలో సుమారు 3.56 కి.మీ మేర మూడు వరుసల్లో సిమెంటు పైపులున్నాయి. పథకం నుంచి నీటిని విడిచిపెట్టేటప్పుడు ఒత్తిడికి ఈ పైపులు ఎక్కడికక్కడ పగుళ్లు ఏర్పడి లీకేజితో నీరంతా వృథాగా పోతుంది. శివారు భూములకు చేరడం గగనంగా మారేది. కొన్నాళ్ల నుంచి ఈ పైపులైన్ల స్థానంలో ఇనుప పైపులు వేయాలని ప్రతిపాదనలు పంపిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. వైకాపా హయాంలో సీఎస్సార్‌ నిధులతో కొంతమేర మరమ్మతులు చేసినా అవి మూన్నాళ్ల ముచ్చటగానే మారిపోయాయి. నాలుగు మండలాల పరిధిలో 31 వేల ఎకరాలకు సాగు ప్రశ్నార్థకమైంది. 

ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి..

పుష్కర ఎత్తిపోతల పథకాన్ని పునరుద్ధరించాలని ఇటీవల జడ్పీ సర్వసభ్య సమావేశంలో జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూ అధికారులను కోరారు. ప్రాజెక్టు దుస్థితిని, రైతుల అవస్థలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో నిధులు సాకారమయ్యాయి. ఈ నెలలోనే టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పగించి పనులు త్వరితగతంగా అయ్యేలా చూస్తామని నెహ్రూ చెబుతున్నారు.

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.