Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

AP Irrigation projects

Featured Replies

  • Replies 376
  • Views 19k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

‘చింతలపూడి ఎత్తిపోతల’కు శుభవార్త

ఈనాడు, అమరావతి: గోదావరి వరద జలాలతో ఐదు జిల్లాల పరిధిలోని రెండు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, 2.80 లక్షల ఎకరాల స్థిరీకరణకు ఉపకరించే చింతలపూడి ఎత్తిపోతల పథకానికి శుభవార్త. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ బుధవారం ఇచ్చిన ఉత్తర్వులతో ఈ పథకానికి సంబంధించి ముందడుగు పడనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం రూ.4,120 కోట్లు ఖర్చు చేశారు. గతంలో పర్యావరణ అనుమతులు తెచ్చుకోని కారణంగా.. ఆగిపోయిన ఈ ఎత్తిపోతల పథకానికి బుధవారం నాటి ఉత్తర్వులు ఊపిరినిచ్చాయి. 2026 జులై 29 నాటి సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించి, పర్యావరణ అనుమతుల కోసం పెండింగులో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ బుధవారం ఓ మెమో జారీ చేసింది. 2017 నోటిఫికేషన్‌ లేదా 2022లో ఇచ్చిన మెమో ప్రకారం పర్వేష్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుని, పర్యావరణ అనుమతుల కోసం ఎదురుచూస్తున్న ప్రాజెక్టులకు హేతుబద్ధమైన ముగింపు ఇవ్వాలని ఆ మెమోలో పేర్కొంది. ఇప్పటికే టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్సు (టీఓఆర్‌) అనుమతి పొందిన ప్రాజెక్టులను పర్యావరణ అనుమతులిచ్చేందుకు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. దీంతో చింతలపూడి ఎత్తిపోతలకు రాష్ట్ర సియా (రాష్ట్ర పర్యావరణ మదింపు సంస్థ) పరిధిలో ఇప్పటికే టీఓఆర్‌ వచ్చింది. ఇన్నాళ్లూ సుప్రీంకోర్టులో నలుగుతున్న వివాదం వల్ల పర్యావరణ అనుమతుల కోసం ముందడుగు వేసే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుత ఆదేశాలతో చిక్కుముడి వీడనుంది. 

తాజా మెమోతో పరిష్కారం..

ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల కోసం 2017లో కేంద్రం.. అటవీ పర్యావరణ ప్రభావ మదింపు కోసం నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఆ నిబంధనలు కఠినంగా ఉన్నాయన్న అభ్యంతరాల నేపథ్యంలో 2021లో మళ్లీ కొత్త మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మెమో చెల్లదంటూ వనశక్తి సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2025 మే నెలలో సుప్రీంకోర్టు 2021లో ఇచ్చిన మెమోను కొట్టివేసింది. దీంతో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలో చింతలపూడి, రాయలసీమ ఎత్తిపోతల వంటి వాటి అనుమతులకు సమస్యలు ఏర్పడ్డాయి. 2025 నవంబరులో సుప్రీంకోర్టు తన తీర్పును ఉపసంహరించుకుంది. కొన్ని అంశాలను వేరే ధర్మాసనానికి బదిలీ చేసింది. తీర్పు ఉపసంహరణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సియా ద్వారా చింతలపూడి అనుమతుల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ మేరకు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో ఈ పథకం ప్రభావం ఉండే ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిచేసింది. 2026 జులై 29న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2017లో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ రూపొందించిన పర్యావరణ మదింపు ప్రభావ నోటిఫికేషన్‌ను పరిమితంగా అనుమతిస్తూ.. 2021లో అందుకు సవరణలు చేస్తూ ఇచ్చిన మెమో చెల్లుబాటు కాదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ శాసనాల ద్వారా నిర్ణయం తీసుకుని అమలు చేయాలని పేర్కొంది. జులై 29 నాటి తీర్పును కేంద్ర అటవీ పర్యావరణ శాఖ పరిశీలించి, న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకుని బుధవారం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేసినందున చింతలపూడి పర్యావరణ అనుమతులు సియా నుంచి పొందే వెసులుబాటు దక్కింది.

  • Author

నేరడి బ్యారేజీ నిర్మాణానికి అడుగులు

Eenadu icon

By Andhra Pradesh News DeskPublished : 04 Oct 2026 05:44 IST

Ee

Font size

2 min read

gg-pref.gif

కీలకమైన భూసేకరణపై దృష్టి
7, 8, 9 తేదీల్లో  పర్యవేక్షక కమిటీ రాక
ఒడిశా నుంచి 106 ఎకరాల  భూమి అవసరం
సర్వే, సంప్రదింపులకు సానుకూలం

ఈనాడు, అమరావతి: వంశధార ట్రైబ్యునల్‌ తుది తీర్పులో భాగంగా ఏర్పాటు చేసిన పర్యవేక్షక కమిటీ.. నేరడి బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వంశధార నదీ జలాల వివాదం సుదీర్ఘ కాలం కొనసాగింది. 2023 జూన్‌లో ట్రైబ్యునల్‌ తుది తీర్పు ఇచ్చినా.. 2024లో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే దాన్ని గెజిట్‌లో నోటిఫై చేశారు. ఈ పరిణామం ఉత్తరాంధ్రలో నేరడి బ్యారేజీ నిర్మాణానికి కీలక అడుగు. ట్రైబ్యునల్‌ తీర్పు అమలుకు కేంద్ర జలసంఘం చీఫ్‌ ఇంజినీర్‌ నాగమోహన్‌ ఛైర్మన్‌గా పర్యవేక్షక కమిటీని ఏర్పాటైంది. ఇందులో కేంద్ర జలసంఘం ఎస్‌ఈ ఆదిత్యశర్మ, ఏపీ నుంచి ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజినీర్, ఒడిశా నుంచి అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం ఉన్నతాధికారి సభ్యులుగా ఉన్నారు. 

ఈ కమిటీ తొలిసారి ఈ నెల 7, 8, 9 తేదీల్లో బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శిస్తోంది. అక్కడ భూ సర్వేకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ ఈ బ్యారేజీ నిర్మించాలంటే ఒడిశాలో ఉన్న 106 ఎకరాల భూమి కీలకం. ఆ భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించి ఇవ్వాలి. ఇందుకు అవసరమయ్యే నిధులను ఏపీ ఒడిశాకు చెల్లించాలి. దీనిపై ఆ రాష్ట్రం నుంచి సందేహాలు లేవనెత్తగా, ఏపీ అధికారులు సమాధానాలిచ్చారు. ప్రస్తుతం కమిటీ శ్రీకాకుళంలో సమావేశం కానుంది. ఇందులో భూ సేకరణకు రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేస్తారు. అవసరమైతే కమిటీ సభ్యులే ఒడిశా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బందులు తలెత్తితే కొలిక్కి తీసుకొస్తారు.

మరోవైపు తాజా పరిస్థితులకు అనుగుణంగా డీపీఆర్‌ రూపకల్పనకు టెండర్లు పిలుస్తున్నారు. కొత్త డీపీఆర్‌ సిద్ధమైతే నేరడి బ్యారేజీ నిర్మాణానికి పూర్తిస్థాయి అంచనాలు సిద్ధమవుతాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే తొలిదశలో 1,48,000 ఎకరాలు, రెండో దశలో 1,07,280 ఎకరాలకు నీళ్లందుతాయి. వంశధార-నాగావళి అనుసంధాన ఫలాలు దక్కుతాయి. శ్రీకాకుళం జిల్లాలో మరో 75 వేల ఎకరాలకు కొత్తగా సాగునీరు ఇవ్వవచ్చు. తాగునీటి సమస్య కూడా తీరుతుంది.


Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.