Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

AP Irrigation projects

Featured Replies

  • Replies 341
  • Views 17.5k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

అడుగు దూరాన.. ఏళ్ల కల..

By Andhra Pradesh Dist. Desk Updated : 03 Sep 2026 06:39 IST

2 min read

తుది దశకు చేరిన వంశధార జలాశయ ప్రాజెక్టు పనులు

జలాశయం వద్ద రెగ్యులేటర్‌ నిర్మాణ పనులు

ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, న్యూస్‌టుడే హిరమండలం: వంశధార జలాశయాన్ని రూ.419.23 కోట్లతో ప్రారంభించారు. ఇప్పటి వరకు రూ.414.69 కోట్లు ఖర్చు చేశారు. గడిచిన కాలంలో జలాశయం 7 కిలోమీటర్ల పొడవునా ఎర్త్‌ బండ్‌ పూర్తి చేశారు. హైలెవెల్‌ కెనాల్‌ స్లూయిజ్, లింక్‌ కెనాల్‌ హెడ్‌ స్లూయిజ్, మట్టి, కాలువ పనులు, రెగ్యులేటరు పూర్తి చేశారు. 2019లో ప్రభుత్వం మారడంతో అప్పట్లో పనులు నిలిచిపోయాయి.

ఐదేళ్లు గాలికొదిలేశారు..

2014-19 సంవత్సరంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయి. వైకాపా హయాంలో పూర్తిగా పక్కన పెట్టేశారు. గుత్తేదారు సంస్థకు బిల్లులు చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.26 కోట్లు బకాయిలు చెల్లించి పనులు ప్రారంభించేలా చేశారు. రెండేళ్లలో తొమ్మిది శాతం పనులు పూర్తి చేసింది.

చేయాల్సినవి ఇవే

సబ్సిడరీ బండ్‌ 1.6 కి.మీ, స్పిల్‌వే గేట్ల నిర్మాణ పనులు 30 శాతం జరగాలి. జలాశయం పైభాగంలో పారాపెట్‌ వాల్‌ నిర్మాణం 10 శాతం చేయాలి. వీటిని పూర్తి చేస్తే పనులు పూర్తయినట్లే. ప్రస్తుతం 12 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. సైడ్‌వియర్‌ ద్వారా ఎనిమిది టీఎంసీల వరకూ నీరందించవచ్చు.

చేకూరే ప్రయోజనాలు...

లక్షల ఎకరాలకు సాగునీరు: వంశధార కు సిక్కోలు జీవనాడి.. వంశధార ప్రాజెక్టు మరో అడుగు దూరంలో నిలిచింది.. గత వైకాపా సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల పాటు నత్తనడకన సాగిన పనులు కూటమి ప్రభుత్వం రాకతో ఊపందుకున్నాయి. పాలకుల ప్రత్యేక చొరవతో ముగింపు దశకు చేరుకున్నాయి. దాదాపు 99 శాతం పూర్తయ్యాయి. మిగిలిన ఒక్క శాతమూ చకచకా జరుగుతున్నాయి.త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభించి జాతికి అంకితం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ప్రధాన కాలువ, ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌ ద్వారా జిల్లాలోని 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. రబీ, ఖరీఫ్‌ రెండు సీజన్‌లకు సాగునీరు అందించవచ్చు.

తాగునీరు: ఉద్దానం ప్రాంతానికి 1.12 టీఎంసీల తాగునీరు, జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు ఇంటింటికీ తాగునీరు ఇవ్వొచ్చు.

నీటి నిల్వలు: జలాశయంలో 19 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉండటం వల్ల కరవు పరిస్థితులకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

వృథాకాకుండా వినియోగం: ఏటా వర్షాకాలంలో వంశధార నది నుంచి వేల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలోకి వెళుతుంది. ఇప్పుడు దీనిని ఒడిసిపట్టి జలాశయంలో నిల్వ చేయడం వల్ల అవసరమైన సమయంలో నీటిని వినియోగించుకోవచ్చు.

త్వరగా ప్రారంభిస్తాం...

సాగునీటి ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వంలో ఊపిరిపోస్తున్నాం. గత ఐదేళ్లు వైకాపా సర్కారు వీటిని నిర్వీర్యం చేసింది. సాగునీటి వ్యవస్థలను భ్రష్టు పట్టించింది. వంశధార జలాశయం పనులు వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి పూర్తి చేయాలనుకున్నాం. కానీ గడువుకంటే ముందుగానే జాతికి అంకితం చేస్తాం.

కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర మంత్రి

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.