Monday at 05:13 AM3 days Author తుది దశకు వెలిగొండBy Andhra Pradesh News DeskPublished : 10 Aug 2026 04:14 ISTEeFont size3 min readప్రాజెక్టు తొలి దశ పనులన్నీ కొలిక్కిఉమ్మడి ప్రకాశంలో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేందుకు మార్గం సుగమంరెండో దశలోనూ చాలా వరకు పూర్తి వెలిగొండ ప్రాజెక్టు టన్నెళ్లు ఈనాడు, అమరావతి: కరవు ప్రాంతాల కలల ప్రాజెక్టు అయిన వెలిగొండ నిర్మాణం తుది దశకు చేరింది. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల జనాభాకు తాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తొలి దశలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 1,19,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిస్తారు. నల్లమల కొండల్లో తవ్విన రెండు భారీ సొరంగాల ద్వారా 43.58 టీఎంసీల వరద జలాలను గ్రావిటీ ద్వారా మళ్లిస్తారు. నల్లమలసాగర్ జలాశయంలో 53.85 టీఎంసీల నీరు నింపి, కాలువల ద్వారా పొలాలకు అందిస్తారు. తొలిదశకు సంబంధించిన పనులన్నీ కొలిక్కి వచ్చాయి. రెండో దశలో కాలువలు, డిస్ట్రిబ్యూటరీలు, చిన్న జలాశయాల నిర్మాణ పనులే మిగిలి ఉంటాయి.కొలిక్కి వచ్చిన టన్నెల్-2 పనులు టన్నెళ్లు తవ్వారు.. లైనింగ్ కొలిక్కి..వెలిగొండ ప్రాజెక్టులో రెండు టన్నెళ్ల తవ్వకం పనులూ పూర్తయ్యాయి. మొదటి టన్నెల్‌లో 15 మీటర్ల మేర లైనింగ్ పని మిగిలి ఉంది. రెండో టన్నెల్‌లో 6,940 మీటర్ల లైనింగ్ పనికి 6,639 మీటర్ల మేర పూర్తయింది. ఐదు గ్యాంట్రీలతో 301 మీటర్ల లైనింగ్ చేస్తున్నారు. అక్కడ పూర్తయిన వెంటనే ఆ గ్యాంట్రీలతో మొదటి టన్నెల్ లైనింగ్ ముగించనున్నారు. ఈ నెల 20 నాటికి ఈ పనులన్నీ పూర్తవుతాయని అధికారుల అంచనా. టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)తో కాకుండా సాధారణ పద్ధతిలో టన్నెల్ తవ్వినందున ఆ మట్టి బయటకు తీసుకొచ్చేందుకు మొదటి టన్నెల్‌లో నిర్మించిన రోడ్డును తొలగిస్తున్నారు. మరో 7.55 కి.మీ. మేర రోడ్డు తొలగించాల్సి ఉంది. రెండో టన్నెల్‌లో టీబీఎం ఉండిపోయింది. దాన్ని అక్కడే ధ్వంసం చేసి, విడిభాగాలు బయటకు తీసుకువస్తున్నారు. 15వ తేదీకల్లా ఈ పని పూర్తవుతుందని పేర్కొంటున్నారు.టన్నెళ్లలోకి నీటిని వదిలేచోట హెడ్ రెగ్యులేటర్లు, రిటెయినింగ్ వాల్, రిటర్న్‌ల నిర్మాణం పూర్తయింది. శ్రీశైలంలోకి నీటి ప్రవాహం రావడంతో.. అప్రోచ్ ఛానల్‌లో చేస్తున్న మక్కు తొలగింపు పనులు నిలిచిపోయాయి.రెండు టన్నెళ్ల నుంచి వచ్చే నీరు ఫీడర్ కాలువ ద్వారా నల్లమలసాగర్ జలాశయానికి వెళ్లాలి. ఫీడర్ కాలువ గతంలో చేసిన పనులు దెబ్బతినడంతో రిటెయినింగ్ వాల్ నిర్మాణం అవసరమైంది. అక్కడ ఉన్న గట్టి రాయిని తవ్వి అండర్ టన్నెల్, రిటెయినింగ్ వాల్ నిర్మించారు. ఫీడర్ కాలువకు లైనింగ్ చేస్తున్నారు. ఎస్కేప్ రెగ్యులేటర్ నిర్మాణమూ పూర్తయింది. ఎలక్ట్రో మెకానికల్ భాగాల అమరిక చేపట్టారు.తీగలేరు కాలువకు నీరందించే హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం పూర్తయింది. గేట్లు అమరుస్తున్నారు. తూర్పు ప్రధాన కాలువ హెడ్ రెగ్యులేటర్‌లో శ్లాబు పనులు జరుగుతున్నాయి. ఇంకా మూడు వేల క్యూబిక్ మీటర్ల పని చేయాల్సి ఉంది. గేట్ల తయారీ 20% మిగిలి ఉంది. నెలాఖరుకల్లా కొలిక్కి రావొచ్చని అంచనా.ఈ నెలాఖరులోగా మరో రూ.600 కోట్ల విడుదలనల్లమలసాగర్ జలాశయం పరిధిలో ఉన్న గ్రామాలను ఖాళీ చేయించేందుకు 2,560 కుటుంబాలకు ఇప్పటికే పరిహారం చెల్లించారు. మరో 4,761 కుటుంబాలకు రెండు విడతల్లో ఈ నెలాఖరులోపు రూ.600 కోట్ల విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నామని జలవనరులశాఖ అధికారులు పేర్కొన్నారు.
1 hour ago1 hr jaffa gadu entha neglected ga unnadu ante, polavaram pandabettadu, danito batu chinthalapudi irrigation projects ki kanisam environmental clearances kooda renewal cheyinchaledhu. supreme court new rule edo pass cheyamani center ki cheppindi adi ayyedaka e projects munduku vellavu. vadu entha neglected ga unnadu ante veligonda ni and some other krishna projects ni apex board lo kooda cheyinchaledhu. tdp vallu velli representive isthe add chesaru. brastu pattinchadu irrigation ni. pani cheyakapoyina parvaledhu clearnaces kooda renewal/tekapothe ela.
Create an account or sign in to comment